ఇవాళే వెళ్ళి స్కూలులో UKG ఫీజు కట్టి text booksతీసుకుని వచ్చాను.అట్టలు వేసి,లేబిల్స్ అతికించాము.ఇంక ఎల్లుండి నుంచీ స్కూల్!!"ఎన్నళ్ళో వేచిన ఉదయం.." అని పాడుకోవాలని ఉంది. 41/2 ఏళ్ళనుంచీ ఎదురు చూసిన ఉదయం.అది చంటిపిల్లప్పుడు దాన్ని చూసుకోవటంతో బిజీ ,అది పెద్దయ్యాకా దాని స్కూలుతో బిజీ ; nurseryలో ,LKGలో మధ్యహ్న్నం వచ్చేసేది.దింపటం తీసుకురావటం కలుపుకుంటే అసలు స్కూలుకి వెళ్ళినట్టే ఉందేది కాదు.నా హాబీలన్నీ మూలపడి ఇన్నాళ్ళూ బూజుపట్టేసాయి.నా రంగులు ,కుంచలూ చూస్తే మా పిల్లకి యెనలేని హుషారు.ఎప్పుడన్నా నే పెయింటింగు మొదలెడితే దాని రూపాన్నే మార్చేసి ఇంకో కొత్త బొమ్మ తయారు చేయగల సమర్ధురాలవటంతో నేనిన్నాళ్ళూ ఏమీ చెయ్యటానికి లేకపోయింది.ఇప్పుడింక సాయంత్రం3.30 దాకా స్కూలే.అది ఏమి తింటుందో,క్యారేజీ తెచ్చేస్తుందో అన్న దిగులు కన్నా నాకు ఖాళీ ఎక్కువ దొరుకుతుంది ,నేనింక నా చేతుల దురదంతా తీర్చేసుకోవచ్చు అన్న సంతోషం యెక్కువగా ఉంది.ఎంత స్వార్ధపరురాలినో కదా !
ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే, నేనిప్పుడు UKG?!ఎందుకంటే ఇది తల్లితండ్రులకు కు 2nd ఇన్నింగ్సే కదా మరి!పిల్లలతో పాటూ మనమూ స్లిప్ టెస్టులకి,యూనిట్ టేస్టులకి,క్వార్టర్లీలకి,పెద్ద పరీక్షలకి,అన్నింటికీ వాళ్ళతో మనం కూడా కుస్తీలు పడుతూ ఉంటాము కాబట్టి ఇది మన 2nd ఇన్నింగ్సే ! నేను చిన్నప్పుడు ఏమి చదివానో నాకు గుర్తు లేదు.ఇప్పటి పిల్లలకి ఉన్న జ్ఞానం కూడా ఎందుకో అప్పుడు మనకు లేదు. కానీ ఇప్పుడు పాపతో చదువుతూంటే ఇవన్నీ అసలు చదివానా చిన్నప్పుడు అనిపిస్తుంది.నరసరీలు మనము ఎరుగము.సరే అదీ పాపతో చదివాను.తరువాత ఎల్.కే.జీ . ఎల్కేజీ లొ 5,6 వాక్యాల కధని బట్టి పట్టమనేవారు.చిన్న పాప ఏమి చదువుతుంది అనుకున్నాను.నేను పెద్దగా చదివించలేదు కూడా దానికి కష్టం అవుతుందేమో అని.LKG అయ్యే సరికీ అలాంటి కధలు ఓ 4,5 వచ్చేసాయి దానికి.(నాకింకా రానేలేదు)నోరువెళ్ళబెట్టడం నా వంతైంది.ఇప్పుడు UKGలో మొదటి లాంగ్వేజీ తెలుగుట!తెలుగు వాచకం చూసి మర్చిపోయిన అక్షరాలూ ,హల్లులూ మళ్ళీ నేర్చుకోవచ్చు కదా అని సరదా వేసింది.(తెలుగువాళ్ళము అయిఉండీ ఎ ,బి,సి,డిలు ముందర నేర్పటం ఏమిటి అని పాపకి అ,ఆ లు క్రితం ఏటనే నేర్పించేసాను.)ఇంకా ఏవో ఏడు రకాల టెక్ష్ట్ బుక్కులు,10 రకాల నొటుబుక్కులు ఇచ్చారు.యేమి చదివిస్తారో ఏమో!ఇక ఎల్లుండి నుంచి ready for school !!

12 comments:
computerల ముందు కూర్చునే నేటితరం తల్లులు, తమ పిల్లల స్కూలు పుస్తకాల అట్టలు వేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పిల్లలు అన్నిరకములగా ఎదగటానికి తల్లిదండ్రుల సహకారము ఎంతో అవసరము. మీరు మీ బిడ్డపట్ల తీసుకుంటున్న శ్రధ్ద వలన, ఆమెను ఒక మహోన్నత స్థాయికి చేరుస్తుందని ఆశిస్తున్నను.
ప్రవీణ్ గారూ,ఆధునిక యుగంతో సమకాలీనంగా ఉంటూ తెలుగు సాంప్రదాయాల్ని,తెలుగుతనాన్ని పిల్లలకి తెలపాలనే తపన ఉన్న తల్లితండ్రులము మేమిద్దరం.చందమామ రావే,చిట్టి చిలకమ్మా,లాంటి చిన్నప్పటి పద్యాలు,అమ్మమ్మలు చెప్పిన బుర్రుపిట్ట,రాజుగరు-ఏడుగురుకొడుకులూ మొదలైన కధలు,తెలుగు నెలల పేర్లు అన్నీ పాపకి నేర్పించాము.మా పాప సినిమా పాటలని యెంత ఇష్టంగా వింటుందో అంతే ఇష్టంగా అన్నమాచార్య కృతులు,హనుమాన్ చాలీసా,మహిషాసురమర్దిని స్తోత్రం పాడుతుంది.
మీరు చెప్పింది నిజమండీ..ఈ రోజుల్లో పిల్లతో పాటు మనం కూడా వాళ్ళ వెంట పరుగెత్తాలి..
:) ఇంక పైంటింగ్ మొదలు పెట్టేసి ఫొటొలు కూడా పెట్టేయండి ఇక్కడ
గుడ్ లక్....బాగా చదువుకుని వచ్చే సంవత్సరము 1st క్లాస్ కి వెళ్ళాలి.
నేస్తంగారు,మీరు రోజూ చూస్తూంటానంటే త్వరలోనే మరికొన్ని వర్క్స్ పోస్టు చేస్తాను.మీ బ్లగు చూసాను.బాగుంది.'ఆమ్మ 'గురించి రాసింది బాగా నచ్చింది.త్వరలో నా నుంచి కూడా ఒకటి రాబొతోంది.
పద్మార్పిత గారు ,థాంక్యూ !
తృష్ణగారు, నేనిప్పుడు రెండవ తరగతికి వచ్చేసానండోయ్ :) మీరు యూ.కే.జీ బాగా చదవండి, బాగుంతుంది.
సాయి ప్రవీణ్ గారు, అమ్మ కంప్యూటర్ ముందు కూర్చున్నా, అంతరిక్షానికి వెళ్ళినా అమ్మే నండీ. అట్టలు వెయ్యటం, చిట్టి చిలకమ్మా అంటూ పాటలూ పద్యాలూ చెప్పటం, వారితో పాటు మళ్ళా తను పెరగటం ఇవే ఏ అమ్మకైనా ముందు ముఖ్యమైన పనులు. ఉద్యోగ బాధ్యతలు అనేవి కేకు మీద క్రీం లాంటివి మాత్రమే కానీ అదే కేకు అనుకుంటే ఎలా?
lakshmigArU,అయితే నేను మీ దగ్గర ట్యూషనుకి వస్తా.
తృష్ణ గారూ, బాగుంది టపా.. గోదారి టపాకి కూడా ఒక కామెంట్ పెట్టానండి.. మరి ఎందుకో రాలేదు..గోదారి గురించి ఎంత చదివినా తనివితీరదు నాకు.. చక్కగా రాశారు మీ అనుభూతులు..వీలు చూసుకుని మీ టపాలన్నీ చదువుతానండి..
thanks muraligAru.godavari miida mii comment raalEdamdii.ela miss ayimdO mari.innAllaki mii vyaakhya vachchimdi.dhanyavaadaalu.
:) నేనిప్పుడు ఆరో క్లాస్ అయితే.. చాలా బాగుంది. నా చిన్నప్పుడు మాకు స్కూళ్లు తెరుస్తున్నారని మా అమ్మ కి సంతోషం వేయటం చూస్తే.. ఒళ్లు మండేది. ఇప్పుడర్థం అవుతోంది..
Post a Comment