వినటానికి కొత్త భాషలా ఉండి మాట్లాడుకునేవారికి మాత్రమే అర్ధమయ్యే కొన్ని 'కోడ్' భాషలు మన తెలుగువారి సొత్తు. చాలా మందికి పరిచితం కూడా.వాటిల్లో-- 'క ' భాష , 'గ' భాష,వెనుకనుంచి పదాన్ని పలికే భాష....ఇలా కొన్ని ఉన్నాయి.వాటిల్లో 'క 'భాష అంటే ప్రతి పదానికీ ముందర 'క ' అక్షరాన్ని పెట్టి మాట్లాడటం. (ఉదా:కను కవ్వు కఏ కమి కచే కస్తు కన్నా కవు? అంటే:నువ్వు ఏమి చేస్తున్నావు?)
'గ ' భాష అంటే పదాం మధ్యన 'గ ' అక్షరాన్ని చేర్చి పలకటం. (ఉదా: నంగాకు అంగది వంగద్దు! అంటే: నాకు అది వద్దు!)
ఇక పదాన్ని వెనుకనుంచి పలికే భాష ఒకటి ఉంది.(ఉదా: లాఇ చ్చివ ర్చొకూ. అంటె: ఇలా వచ్చి కూర్చొ)ఈ భాషలో మా చిన్నప్పుడు మా పక్కింటి అబ్బాయి సినిమా పాటలు పాడేవాడు. "సునమ కేలిప నమౌ తంగీ వేనీ..." అని.స్వాతిముత్యంలోని "మనసు పలికే మౌనగీతం నీవే..' పాట అది. ఈ కోడ్ లాంగ్వాజీలన్ని కొత్తవారికి,మనకిష్టం లేనివారికి అర్ధమవ్వకుండా మనం అప్పుడప్పుడు ఉపయొగిస్తూ ఉంటాము.జంధ్యాలగారు 'చంటబ్బాయి" సినిమాలో హీరో,హీరోయిన్ల మధ్య వాడిన 'క ' భాష బాగా ఆదరణ పొందింది.'లేడీస్ టైలర్ ' సినిమాలొ వంశీగారు 'జ 'భాష ని కూడా పరిచయం చేసారు.
మా అమ్మగారి ఇంట్లో మావయ్యలూ,పిన్నిలూ,పెద్దమ్మా అందరూ ఈ 'కోడ్' భాషలన్నింటిని చాలా స్పీడుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు.నా చిన్ననాటి ఒక సంఘటన ఈ సందర్భంగా చెప్పాలి.ఒకసారి మేము మా నాలుగవ మావయ్యతొ విశాఖపట్నం వెళ్తున్నాము.రైలులో మాతొ బాటూ ఒక కుటుంబం ఎక్కారు.ఎక్కిన మొదలు అందరూ 'క 'భాషలొ నే మాట్లాడుకోవటం మొదలెట్టారు.ఎవరికీ అర్ధం కాదనుకున్నారో ఏమో..ఇంక ఓ గంటలో విశాఖ వస్తుందనగా వాళ్ళు ఏవో ప్రశ్నలు వేసుకుంటూంటే..మా మావయ్య వాళ్ళకి 'క ' భాషలో సమాధానం చెప్పాడు. వాళ్లందరూ ఒక్కసారిగా సైలెంటు అయిపొయారు!! ఇందాకటినుంచీ వాళ్ళు మాట్లాడుకునేవన్నీ మాకు అర్ధమయిపొయాయని తెలిసేసరికీ వాళ్ళ మొహాలు మాడిపొయాయి...మళ్ళీ రైలు దిగే దాకా వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు!!
10 comments:
hahaha !
baagundi..............
kabha kalea kavu kan kadi
కభ కలే కవు కన్న కది
madhu gAru,కధ కన్య కవా కదా కలు.
sri garu,vinaygaru,thanks.
అరే మీరు కూడా మాట్లాదేస్తారా? స్కూల్లో ఉన్నప్పుడు ఓ అని తెగ ప్రాక్టీస్ చేనే వాళ్ళం. పొరపాటుగా ఇంట్లో కూడా మాట్లాడేసి, అక్షింటతలేయించుకునే (తిట్లు) వాళ్ళం. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
శృతిగారూ, నాకు 'క ' భాష,'గ 'భాష రెండే వచ్చు.పదాన్ని వెనక్కు తిప్పి మాట్లాడే భాష మాత్రం మా ఇంట్లోవాళ్ళకి వచ్చు.మా పిన్ని అయితే సూపర్ స్పీడుగా మాట్లాడేస్తుంది.
దాన్ని చాలా సార్లు ట్రై చేస్తే పాంటీ కింద నాలుక పడేది. ఇది మన రేంజ్ కళ కాదు అని ఆపేసా. మయ ఫ్రెండ్స్ లో చాలా మంది నేర్చుకున్నారు. ఐతే ఇప్పుడు అలవాటు పోంది అనుకుంటా వాళ్ళకి.
sumguparga vunadi.
Post a Comment