ఇప్పటికి ఇద్దరు,ముగ్గురు రాసేసారు.నేను కొత్తగా రాసేది ఏమీ లేదు.కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అబిమానం కొద్దీ..ఇంకా ఏదొ రాయాలని తపన..!చిన్నప్పుడు మా ఇంట్లొ 'Bad'album ఉండేది.అప్పుడు భాష,పదాలు అర్ధం అయ్యేవి కావు.కానీ ఆ మ్యూజిక్ నచ్చేది.పదే పదే ఆ పాటలు వినీ వినీ ఇంటర్లూడ్ లతొ సహా అవి బట్టీ వచ్చేసాయి...'భాడ్", 'లిబేరీన్ గాల్ ' 'మాన్ ఇన్ థ మిర్రర్ ' ఇవన్ని అందులోని పొపులర్ సాంగ్స్.తరువాత చాలా వచ్చాయి కానీ అందులో నాకు నచ్చినవి రెండే..
1) All I wann say is that They dont really care about us
2) పర్యావరణం,జంతు సంరక్షణ గురించి జాక్సన్ స్వయంగా రాసి,బాణీ కట్టిన పాట ఇది.
History:past,present and future,book I నుంచి earth song:ఆ ఫస్ట్ లిరిక్స్ చాలా బాగుంటాయి-- "What about sunrise What about rain What about all the things That you said we were to gain.. . What about killing fields Is there a time
What about all the things That you said was yours and mine... Did you ever stop to notice All the blood we've shed before
Did you ever stop to notice The crying Earth the weeping shores? "
వివాదాలు,విమర్శలూ,విబేధాలు...అనేవి ఫేమస్ పెర్సొనాలిటీస్ అందరికీ ఉన్నవే.
ఏది మంచి-ఏది చెడు?ఏది పాపం -ఏది పుణ్యం?
ఒకరి తీర్పు ఇంకొకరికి అన్యాయంఒకరి తప్పు ఇంకొకరికి ఒప్పు!!
అతని వ్యక్తిగతం నాకు అనవసరం.అతనిలొని సంగీతజ్ఞుని నేను అభిమానిస్తాను.పాప్ సంగీత సామ్రాజ్యానికి అతను మకుటంలేని మహారాజు!!
ఏది ఏమైనా..మరో సూర్యకిరణం అస్తమించింది..మరో ప్రభంజనం మూగబోయింది..
మరో జీవితం ముగిసిపొయింది.. మరొ గళం మట్టిలో కలిసిపోయింది..
ఇక ఆ మనిషి కనిపించడు..వినిపించడు..ఇదే నిజం..ఇదే నిజం..
సుజాతగారు ఇందాక ఒక కామెంట్ లొ అన్నట్టు--అతని ఆత్మకి శాంతి ఉందొ లేదొ..
may his soul rest in peace!!
9 comments:
Shocking news. I learned about it here in your blog and then rushed to look at LA times.
There is no denying he was a greatly talented artist. My favorite was "Billy Jean" from Thriller album.
కొత్త పాళీ గారూ,నేను బ్లాగ్ రెజిస్టర్ చేసుకున్న రోజున మీ మొదటి వ్యాఖ్య వచ్చింది.మళ్ళీ ఇవాళే..i feel honoured when knowledgable persons like you visit my blog. thanks to jackson!!
నిరంతర సంఘర్షణామయ జీవితం! ఆకలి, అశాంతి,కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, గెలవాలన్న కసి, గెలిచి చూపించిన ధీరో దాత్తత, మనిషిగా బలహీనతలు,(సెలెబ్రిటీ కాబట్టి కానీ ఇంకెవరన్నా అయితే ఆ వివాదాలకు ఇంత ప్రాముఖ్యం వచ్చేదే కాదు)కొంత వెర్రి తనం....మొత్తానికి బతికినన్నాళ్ళూ సంచలనమే!
ఆ ఎర్త్ సాంగ్ నాక్కూడా బాగా నచ్చేది.
ఎందుకో బాధగా ఉంది.
మొత్తానికి ఇక ఆ మనిషి కనిపించడు, ఆ గళం వినిపించదు. అతనిక చరిత్ర!
అంత ఏం లేదండి. I am just another blogger.
My fav is ''Will you be there'' from Dangerous. His stage shows are awesome and uncomparable.
అబ్బ,పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నానండీ sujatagAru..మీరు చదివితే బాగుండును..చూస్తారో చూడరొ అని..దుఖాన్ని కలసి పంచుకుంటే కూడా కాస్త ఊరట కలుగుతుంది.పరిచయం లేకపోయినా నాకెందుకో నమ్మకం మీరుకూడా నా దుఖాన్ని పాలుపంచుకుంటారని.నెట్ లొ పొద్దున్న ఈ వార్త చూసినప్పటినుంచీ నాకూ మనసు బాగాలేదండీ.సంగీత ప్రపంచంలో కొందరు మన కుటుంబంలో ఒకరు అనిపిస్తారు..వాళ్ళ సంగీతం,పాటలూ విని విని...వాళ్ళు మన మనసులకి ఎంతొ దగ్గరైపొతారు ఏ సంబంధం లేకపోయినా సరే.ఒక హరిహరన్,ఒక శివ కుమార్ శర్మ,ఒక లత,ఒక ముఖెష్ ,ఒక భీంసేన్ జొషీ,మార్క్ ఆంటోనీ,సిలేన్ డియోన్,జాక్సన్..ఇలా ఎందరో... ఇలా ఎంతైనా రాసేస్తాను నేను....ఇంక ఆపేస్తానండీ.. thanks for the visit.
కొత్త పాళీగారూ,అలా అనకండి.తెలుగు పద్యాలకి మీరిచ్చిన ట్రాన్స్లేషన్ చదివాను.ఎంతొ విద్వత్తు ఉంటే గానీ అలాంటి సాహసం చేయలేము.భాషా పాండిత్యం అందరికీ అబ్బదండీ.
బాగా రాశారు తృష్ణ గారు. భౌతికంగా ఇక కనిపించడేమో కానీ అతని గీతాలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి, అతని అద్భుతమైన డాన్స్ వీడియో లలో ఎప్పటికీ సజీవుడై కనిపిస్తూనే ఉంటాడు అందులో ఇసుమంతైనా అనుమానం లేదు.
venugAru,dhanyavAdAlu.
Post a Comment