సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, June 18, 2009

పులిహోర

ఇది చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన.అప్పుడు నా వయసు 18.వంటింట్లో 'ప్రయోగాల ' పేరుతో అప్పుడప్ప్పుడు చేతులు కాల్చుకోవటం తప్ప పెద్దగా వంట రాలేదింకా.ఆమ్మ ఊళ్ళో లేదు.కాలేజీ నుంచి వచ్చి నాన్నకి ఇష్టమైన బజ్జీలు చేయటంలో బిజీగా ఉన్నాను.నాన్న ఆఫీసు నుంచి వస్తూనే చెప్పిన వార్త విని గుండెల్లో అలజడి మొదలైంది.ఢిల్లీ నుంచి వస్తున్న ఒక పెద్ద ఆఫీసరు నాన్న మీద అభిమానం కొద్దీ మా ఇంట్లో దిగబోతున్నారని. పెద్దాయనకి ఏమి వండాలో అని కంగారు మొదలైంది.ఆయన రానేవచ్చారు."ఎక్కువగా ఏమీ వద్దమ్మా,లైటుగా ఉంటే మంచిది రాత్రి పూట" అన్నారు.ఏదో చేతనైన విధంగా గుత్తివంకాయ కూర,గోంగూర పచ్చడి,పొట్లకాయ పెరుగు పచ్చడి,సాంబారు,పరమాన్నం,ఆప్పడాలు మొదలైనవి చేసాను.'రాత్రిపూట అరగవు,ఇన్నెందుకమ్మా చేసావు" అంటూనే మళ్ళి మళ్ళీ వేయించుకుని భోజనం ముగించారు ఆఫీసరుగారు.!"అమ్మయి వంట బాగా చేసిందోయ్.మీ ఆవిడ అప్పుడప్పుడు ఊరు వెళ్తూ ఉండచ్చు ఇంక" అని ఒక ప్రశంస పడెసారు.హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నను. మర్నాడు ఆదివారం..షిరిడీ వెళ్తున్న ఒక ఫ్యామిలీకి మేము భోజనం ఇవ్వల్సి ఉంది.త్వరగా వంట మొదలెట్టాను.ఊళ్ళో ఉంటున్న మా పిన్ని ఫొన్ చేసింది నేను "పులిహోర" తెస్తున్నను.నువ్వు వేరేది వండు అని.ఇంతలో ఆఫీసరుగారు వంటింట్లోకి వచ్చారు "అప్పుడె వంట మొదలేట్టవేమి" అన్నరు.ఇలా రైల్వే స్టేషన్ కి భొజనం పట్టుకెళ్ళాలి అన్నాను.'యేమి వండుతున్నావు?" అన్నరు.కంగారులో 'పులిహోరండి ' అనేసాను.ఓహో అని వెళ్పోయి,5నిమిషాల్లో ఒక డబ్బాతో వచ్చారు."ఎటూ మీవాళ్ళ కోసం చేస్తున్నవుగా, నాకు కూడా ఈ డబ్బాలో కాస్త పెట్టియ్యి" అనేసి వెళ్ళిపోయారు.నాకు పులిహోర చేయ్యటం అప్పటికి ఇంకా రాదు.కంగారులో అబధ్ధం చెప్పినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. పిన్ని స్టేషన్ కి వచ్చేస్తానంది...గబగబా నాన్న దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాను.ఆఫీసరుగారు బాత్ రూం లోకి వెళ్ళగానే ఫోను దగ్గరకు పరిగెట్టాము ఇద్దరం.పిన్నికి ఫొను చేసి ఇంటికి వచ్చేయమని ,కలిసి స్టేషన్ కి వెళ్దామని చెప్పము.ఈలోగా ఆఫీసరుగారు వచ్చి 'ఎక్కువ పెట్టకమ్మా.ఏదో చేస్తున్నానన్నావని అడిగాను" అన్నారు.నాకు కంగారు,నవ్వు రెండూ వచ్చాయి.ఇంకా నయం ఎలా చేస్తున్నావని వంటింట్లోకి తొంగి చూడలేదు అనుకున్నాను.బ్యాగ్గు సర్దుకుని ఆఫీసరుగారు హాలులో కూర్చున్నారు నేను పులిహోర డబ్బ ఎప్పుడు ఇస్తానా అని.నాన్నకి,నాకూ కంగారు పెరిగింది.ఆటొ తెస్తానుండండి అని నాన్న పిన్ని ఇంటికి బయల్దేరారు బండి వేసుకుని.సందు చివరకి వెళ్ళగానే పిన్ని కనిపించిందట,వెనుక కూర్చోపెట్టుకుని తీసుకు వచ్చారు.'దిగగానే వంటింట్లోకి వెళ్ళూ" అని బయటే మా పిన్నికి చెప్పారుట.ఏమీ అర్ధం కాని పిన్ని వంటింట్లోకి రాగానే ఒక్క ఉదుటన తన చేతిలోని పులిహోర బాక్సు లాక్కుని ఆఫీసరుగారి డబ్బా నింపి హాలులోకెళ్ళి ఆయనకు అందించాను.మరోసారి రాత్రి తిన్న వంటని పొగిడి ఆయన నాన్న తెచ్చిన ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు.అయోమయంగా చూస్తున్న పిన్నికి విషయమంతా చెప్పి ఊపిరి పీల్చుకున్నం మేము.10రోజుల తరువాత ఢిల్లి నుంచి ఉత్తరం వచ్చింది "మీ అమ్మయి ఆవ పెట్టి చేసిన పులిహోర అద్భుతంగా ఉంది.ఈసారి అటువైపు వస్తే మా ఆవిడతో సహా మీ ఇంట్లోనే దిగుతాను మీ అమ్మయి చేతి పులిహోర తినటానికి" అని.'ఎందుకైనా మంచిది పిన్ని దగ్గర పులిహోర చెయ్యటం నేర్చుకోవే" అన్నారు నాన్న. వెంఠనే పిన్నికి ఫొను చేసాను."ఆ రోజు పులిహోర నేను చెయ్యలేదు.అప్పుడే నరసాపురం నుంచి వచ్చిన మా అత్తగారు చేసారు" అంది పిన్ని.ఇప్పుడు నరసాపురం వెళ్లాలా? అనుకున్నాము నేను,నాన్న!! ఇప్పటికీ ఈ సంగతి గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వువస్తూఉంటుంది.

18 comments:

నేస్తం said...

ha ha భలే రాసారు ...

మురళి said...

:-) :-) :-)

భావన said...

అసలే ఆకలి వేస్తుంటె మీ పోస్ట్ మళ్ళీ దాని పైన పులిహోర ఫొటొ నేను ఖండిస్తున్నా తృష్ణ గారు.. ఇంతకి ఫొటో ఆ రోజు ఆవ పెట్టిన పులిహోర దేనా?

సుభద్ర said...

baagundi mee pulihoraa..
intaki photo lo pulihoraa meeru cheseraa lekaa................

madhu said...

paapam meeru antha kasta padatam endukandee ? aa rojedo ala experiment gaa vachindi, ala cheyatam marchipoyaanu aneyochu kadaa !

mohamaatalaki poyi andarikee chestu koorchunte, mana pani ade aipotundi jeevitham lo ! konni sarlaina, ledu, kudaradu ano, leka appatlo ala ano maryaadagaane chepthe...pakka valloo artham cheskuntaaru, manaki samayam, srama aada avuthaayi ...

meeru mareee manchi ammai laa unnaaru. kaani athi manchitanam valla manake kastaalu. anubhavam tho cheptunnaa !

తృష్ణ said...

రాధికగారూ,మీ బ్లాగు అదిరింది.ఇలా ఎవరైనా నా బ్లాగు వైపు తొంగిచూస్తేనే నాకు ఇన్ని మంచి బ్లాగులు ఉన్నయని తెలిసేది.
భావనగారూ,మా ఇంటికి వచ్చేయండి.పులిహోరేమిటీ,మీకేమికావాలన్నా చేసిపెట్టేస్తాను.
సుభద్రగారూ, ఎప్పుడో చేసిన పులిహొర ఫోటో ఇప్పుడు ఎలా వస్తుందండీ?అది నేను చేసిందే కాని అప్పటిది కాదు.
మా అన్నయ్యా, నేను కలిసి కొన్ని వంటలు చేసినప్పుడు అలా ఫొ్టోలు తీసి దాచుకుంటూ ఉంటాము

తృష్ణ said...

శ్రీ గారూ,మేరు చెప్పినది అక్షరాలా నిజం.
అతి మంచితనం చాలా కష్టాలని ,ఇబ్బందులని తెస్తుంది.ఇది నాకూ స్వీయానుభవమే.కానీ పుట్టుకతో వచ్చిన బుధ్ధులు పుడకలతో కానీ పోవని ఊరికే అన్నరా..?

ఓ చిన్నోడు said...

పులిహోర చేసుకోవాలంటే మన రమణ గులగుల బోణి సినిమా చూడండి ..

Vinay Chakravarthi.Gogineni said...

baagundi post ............manchi experiance......

Krishna K said...

ఆవ పెట్టిన పులిహోర అంటె ఏమిటి? రెసిపి నెట్ లో ఎమయినా ఉంటె లింక్ ఇస్తారా

తృష్ణ said...

క్రిష్ణగారు,అప్పుడు తెలీదు కాని ఇప్పుడు రెసిపీ తెలుసునండి.మామూలుగా పులిహోర చేసుకున్నాకా,బయట కొన్నదైనా సరే,పచ్చి ఆవాలు గ్రైండ్ చేసుకున్నాసరే--ఆ ఆవపొడిని 2,3,స్పూన్లు పులిహొరలో కలుపుకోవటమే.చాల కొంచం వేసుకోవాలి.ఎక్కువ అయితే ఘాటు.తినలేము. బాగా వేడి చేస్తుంది కూడా.

Telugu Velugu said...

తృష్ణ గారు,రేసిపే పెద్ద కష్టం కాదన్నమాట ! నూనె కాగేప్పుడు, ఆవపిండి వేయాలా, లేక మొత్తం పులిహోర చేయటం ఐపోయాకనా ? ఎందుకంటే నేను ఆవ పెట్టి కూరలు చేస్తే, నూనె లో వేస్తుంటాను ఆవ పిండిని !

తృష్ణ said...

srigAru,ఇందాకటి కృష్ణ మీరేనా?పులిహోర అయిపొయాకా,అది చల్లారాక ఆవపిండి వేయాలండీ.లేకపోతే చేదెక్కుతుంది.

Telugu Velugu said...

తృష్ణ గారు, లేదండీ ! నేను కృష్ణని కాను ! కృష్ణ గారు అడిగేదాకా, రేసిపే అడగాలని తట్టలేదు నాకు ! ఏమో, కష్టమైన రేసిపెనేమో అనేసుకుని, అడగలేదు ! :-)

Telugu Velugu said...

తృష్ణ గారు, అందుకేనేమోనండీ ! నేను ఆవ పెట్టిన కూరలు నాకే విరక్తి పుట్టిస్తయి ! మా వైపు ఆవ పెట్టిన కూర అనే కాన్సెప్ట్ లేక, తెలియక, నేనే ఏదో గరిట చేసుకుని, అలా నూనె లో ఆవ పిండి వేసి భంగపడ్డా అన్నమాట !

రవి said...

వావ్. భలే ఉన్నాయ్ మీ జ్ఞాపకాలు.ఇప్పటికైనా మీరు పులిహోరలో ప్రావీణ్యం సంపాదించారా లేదా?

తృష్ణ said...

అయ్యో ఇప్పుడు నేను అన్ని వంటల్లోనూ ఎక్స్పర్ట్ నేనండోయ్..!!
నిమ్మకాయ,దబ్బకాయ,నిమ్మ ఉప్పు, నూపప్పు, చింతపండు, ఆవ, చింతకాయ మొదలైన రకాల పులుహోరలన్నీ సుభ్బరంగా, సులువుగా చెసేస్తాను..:)

గీతాచార్య said...

అయితే బాగా పులిహార పెట్టారన్నమాట :-)