సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, June 21, 2009

స్వగతం

ఇవాళ ఆదివారం అస్సలు 8అయితేకానీ లేవకూడదు అని నిన్న చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. కాని అలా ఎప్పుడు అనుకున్నా ఇంకా త్వరగా మెలుకువ వచ్చేస్తుంది.ఇవాళ ఐదింటికే మెలుకువ వచ్చేసింది.నాకు మెలకువ వస్తే ఓ పట్టన నిద్ర పట్టదు..అప్పుడె లేచి ఏమి చేసేది?వాకింగు కూడ అటకెక్కి 2నెలలు అవుతోంది.బధ్ధకంగా ఉంది...ఆయన ఎంత హాయిగా నిద్రపోతున్నారూ...తామరాకు మీద నీటి బొట్టు తత్వం ఆయనది.నిద్దరోక నాలా ప్రపంచంలోఉన్న కష్టాలన్నింటి గురించీ ఆలోచిస్తూ దొరికే ఒక్క ఆదివారాన్నీ వేస్టు చేసుకోరు.శనివారం మాకు స్కూలులో,కాలేజీలో కూడా హాఫ్ డే ఉండేది..అందుకని ఇప్పుడు ఫుల్ డే ఆయన ఆఫీసు,పాప స్కూలు ఉండేసరికి...విసుగ్గా ఉంటుంది.వారంలో ఉన్న ఒక్క ఆదివారంలో ఏమిటొ ఏదో ఆనందాన్ని అనుభవించేసి,సుఖపడిపోవాలని ప్రతి వారం అనుకుంటూనే ఉంటాను...అన్ని వారాలకీ మించి బిజీగా ప్రతివారం గడిచిపోతూ ఉంటుంది..పక్కింట్లో అప్పుడే సుప్రభాతం మొదలైంది.మొగుడూపెళ్ళాలు ఎందుకో అరుచుకుంటున్నారు...సుప్రభాతం,భజగోవిందం,సూర్య స్తుతి,సూర్య దండకం,ఆదిత్య హృదయం కూడా అయిపోయి మీడియా ప్లేయరు సైలెంటు అయిపోయింది.అయ్యో..అప్పుడే అత్తగారు పూజ మొదలేట్టేసారు..ఇంక వంటింట్ళొకి పిల్ల లేవకుండా వెళ్తే కాసిని పనులు అవుతాయి.అది లేస్తే దాన్ని బ్రష్ చేయించేసరికీ ఉన్న ఓపిక ఊడి నీరసం వస్తుంది....!!

8 comments:

భావన said...

ఆదివారం పొద్దుట 5 కు నిద్ర లేవటం... హమ్మో హమ్మో

మరువం ఉష said...

>> నాలా ప్రపంచంలోఉన్న కష్టాలన్నింటి గురించీ ఆలోచిస్తూ
ఇది నాకు వారాంతాలు వారంలోను సదా నన్నంటివుండే అలవాటు. అంచేత దానికనుగుణంగా నా ఇతర పనులు అల్లేస్తాను. 5కి లేచి స్వగతంలోనే కాలాతీతం చేసేసారు, కాసింత వాకింగ్ చేసి వస్తే feel good hormone release అయ్యేది కదా...

తృష్ణ said...

నిజమే ఉషగారూ,వేసవి సెలవుల బధ్ధకం నుంచి ఇంక నేను బయట పడాలి.వాకింగు మళ్ళి మొదలేట్టాలి.ఆ ప్రశాంతతే వేరు.మీ వంటి విజ్ఞులు నా బ్లాగు వీక్షించినందుకు ధన్యవాదాలు.నేను అప్పుడప్పుడు మీ బ్లాగులోకి తొంగి చూసి మీ విజ్ఞతకి ముగ్ధురాలినౌతూఉంటాను.

తృష్ణ said...

భావనగారు,చెప్పా కదా లేటుగా లేవాలనుకున్నప్పుడే త్వరగ మెలుగువ వచ్చేస్తుంది.సబ్కాన్షియస్ మైండు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది ఒకోసారి!!

sivaprasad said...

chala baga undi mi narration style......

సుజాత వేల్పూరి said...

వారంలో ఏడు రోజులూ నేను ఐదింటికే లేస్తానండీ! ఆదివారానికి ఈ విషయంలో ఏ ప్రత్యేకతా లేదు.రోజూ వాక్ లో కలిసే వారు కొంతమంది శనాదివారాలు కనపడరు. ఏమిటో మరి! అందువల్ల ఆ రెండు రోజులూ వాక్ ఇంకా ప్రశాంతంగా నా ఎంపీత్రీ ప్లేయర్ ని ఆఫ్ చేయకుండా నడవగలుగుతాను.

తృష్ణ said...

సుజాతగారూ,మీరు నా తృష్ణని చూసినందుకు చాలా సంతోషమైంది.
వాకింగుకి వెళ్ళేప్పుడు అయిదింటికి లేవను కానీ 5.45కి లేస్తూ ఉంటాను.యియర్ ఫొన్స్,మొబైలు లేక చిన్న రికార్డర్ లేకుండా నేనస్సలు కదలలేనండి.ఏదో ఒక సంగీతం వింటూ ఎంత దూరమైనా నడిచేస్తాను..

తృష్ణ said...

siva prasad garu,ఏదో ఊసుపోక రాసిన నాలుగు వాక్యాలవి...దాంట్లో ఏమంత గొప్పతనం లేదు.