సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 5, 2009

గుర్తింపు ..


ఉద్యోగం చేస్తేనేనా నేడు స్త్రీ కి గుర్తింపు?డబ్బు సంపాదనేనా జీవిత పరమావధి?

మనిషిని మనిషిగా మనిషి గుర్తించడా ?మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?

ఎన్ని వేలు సంపాదిస్తే చిన్నపిల్లలకి మన చేత్తో మనం అన్నం పెట్టుకున్న తృప్తి వస్తుంది ?

'అమ్మా' అని బిడ్డ కౌగిలిన్చుకున్నప్పుడు వచ్చే తృప్తి,ఆనందం యెంత పెద్ద ఉద్యోగం చేస్తే వస్తాయి ?

పిల్లల చిన్నప్పటి ముద్దు-ముచ్చట్లు ఉద్యోగాలకి వెళ్ళిపోయి కోల్పోతే మళ్లీ పొందగలమా?

భర్తకు కావాల్సినవి సమకూర్చి ,బయిటనుంచి రాగానే పలకరించి,దగ్గర కూర్చుని వడ్డించే ఓపిక,సమయం ఉద్యోగానికి వేళ్తే ఉంటాయా?ఈ ఆనందాన్ని ఉద్యోగం చేస్తే పొందగలమా?

తప్పనిసరి అయితే తప్పదు.పరిస్థితులతో రాజీ పడాల్సిందే!!

కానీ అలాంటి అవసరాలని పక్కన పెడితే;

పరుగులు,హడావుడిలు ,చిరాకులు,పరాకులు,పనుల పంపకాలు ,పంచుకోవటానికి మిగలని క్షణాలు ,పెంచుకోవటానికి వీలవని బంధాలు...ఇవే సంపాదన మనకిచ్చే వరాలు!

'పిండి కొద్దీ రొట్టె ','చెట్టు కొద్ది గాలి' అన్నట్లు--భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే,

జీతాలు పెరిగే కొద్ది పెరిగే సుఖాలు,వాటి కోసం కట్ అయ్యే loan instalments,ఆడవాళ్ళకి ఇంట్లో+బయట పేరిగే పనుల వత్తిడ్లు--కనిపించని సత్యాలు,ఓప్పుకోని నిజాలు.ఎక్కువ నలిగేది ఆడవాళ్లే.

కానీ ఇవాళ ఇవి ఎవరూ పట్టించుకోవట్లేదు .

"అయ్యో ఉద్యోగం చేయట్లేదా?"అంటారు పెద్ద నేరమేదో చేస్తున్నట్లు !

"మరి ఖాళీ సమయాల్లో యేంచేస్తూ ఉంటారు?" అని ప్రశ్న.ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఉంటానండి --అని చెప్పాలనిపిస్తుంది.

నిజంగా ఇంట్లో ఉండే ఏ ఇల్లాలికి తీరిక ఉంటుంది?పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10,11గంటల దాకా స్కూళ్ళు,ఆఫీసుల హదావుడి.ఆ తరువాత ఇల్లు సర్దుడు,బట్టలు-ఇస్త్రీలు,నీళ్ళు కాచడాలు/వాటర్ ఫిల్టర్ కడగటాలు-బోటిల్స్ నింపి ఫ్రిజ్ లొ పెట్టడాలు,సాయంత్రానికి కూరలు,టిఫిన్లూ తయారీలు,కావాల్సినవి ఉంటే బయటికి వెళ్ళి కూరలు ,సరుకులూ తెచ్చుకోవటాలు ఇలా ఏ రోజు పని ఆ రొజు ఉంటుంది.ఇలా గృహిణి పనుల లిస్టు చెప్పుకుంటూ పోతే యెంతైనా ఉంటుంది..ఇక ఉండేది జాయింట్ ఫ్యామిలీ లో అయితే పనులతో పాటు బాధ్యతల బరువులు కూడా ఆడవారికి అదనపు సౌకర్యమే.

ఆదివారం అన్నిరోజులకన్న బిజీ.అన్ని పనులూ లేటు నడుస్తాయి కాబట్టి!! ఇలా రోజులో మహా అయితే ఒక గంట,2గంటలు పేపర్,పుస్తకం,టివి లకు లేక ఇతర హాబీలకి మిగిలి ఉంటాయి...

కానీ ఇవన్నీ కనిపించని పనులు.గృహిణి అంటే అందరికీ లోకువే!

అందుకే అనిపిస్తుంది మనిషిని మనిషిగా మనిషి ఎప్పటికి గుర్తిస్తాడు?అని.

వెనక ఉన్న ఆస్థిపాస్తులకో,సంపాదించే డబ్బుకో మాత్రమే విలువ ఇచ్చే మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?

గమనిక:

నేను ఉద్యోగం చేసే వాళ్లకు వ్యతిరేకిని కాను.ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కాదు ,మనల్ని మనం నిరూపించుకోవటం కోసం అని కూడా నా అభిప్రాయం. కానీ పైన రాసినది ఇద్దరూ ఉద్యోగం చేసే చాలా మంది అలా ఇబ్బందులు పడతున్నారని చెప్పటానికి ; ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని కించపరచకూడదు ,వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పటానికి .

8 comments:

Murali said...

ur blog is very nice. Please visit my blog and give ur opinion .

http://muralikrishn.blogspot.com/

basu said...

very good explanation.

Prerana said...

hi trishna gaaru.. your blog is really very nice. mee blog chaduvuthunnatha sepu naa manasulo nenu anichipettukunna aalochanalu anni akshararoopam lo choostunnattu anipinchindi.. working women life is horrible i feel. wont be able to do justice to both the lifes. and also at the same every one will give more important to their job rather than the individual. ladies job cheyyatam ante chaala mantal struggle andi.

తృష్ణ said...

ప్రేరణగారు,మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

రమణ said...

చాలా బాగుంది టపా. పిల్లలకు అమ్మ ప్రేమ ఊపిరి.

తృష్ణ said...

@venkataramana:పిల్లల బాల్యాన్ని ,వాళ్ల కేరింతల్ని ఇప్పుడు మిస్సయితే మళ్ళీ పొందలేమన్నది నా అభిప్రాయమండి.ధన్యవాదాలు.

మైత్రేయి said...

I have seen mothers who are housewives not focusing on their children and living in frustration.

On the other hand I have seen working mothers giving their 100% when they reach home and compensating for all the time kids missed them. There are so many positive effects of working mothers on family and kids too. working mom usually will be more confident. their kids will have individuality. kids especially boys will lean gender equality.

I agree with you that one should never judge a person by what he/she is earning. and I also agree that when we can't balance and give enough time for family we should choose family to profession. But that is true for even men. Men also should not become earning machines.

It depends on individual choice, interest, opportunities, support they get from other family members. we can't generalize that.

hkpt said...

ఈ విషయం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చు. ధన సంపాదనతో కొలిచేదే వ్యాసంగమూ కాదు, జీవితానుభవమూ కాదు. సంపాదిస్తున్న వారంతా దేశోద్ధరణ కోసమూ కాదు. ఎవరి అవసరాల కోసం వారు సంపాదించుకుంటున్నారు. ఎవరి ఆత్మ న్యూనతని వారు పూడ్చుకోవడం కోసం వారికి వారు సంపాదించుకుంటున్నారు. అట్టే స్పృశించ బడని చిదంబర రహస్యమొకటిక్కడ చెప్ప్పాలి: ఉద్యోగాలు చేసే స్త్రీలందరికీ తమ వెనకన ఇంటిపనులు చేసి పెట్టే పనివాళ్ళు కావాలి. అనేక సందర్భాలలో ఆవిడ గారి తల్లిదండ్రులో అత్తమామలో ఆ పనివాళ్ళుగా రూపాంతరం చెందడం నేనెరుగుదును. నిజానికి తమభారన్నే తాము మోయలేని ముసలివాళ్ళని ఇంటి చాకిరీకి వాడుకునే confident employed women ఏ కుటుంబంలోనైనా విరివిగా కనబడతారు ఈరోజుల్లో.