ఓ పలకరింపు,
ఒక చిన్న మాట,
నిట్టూర్పులో చల్లని ఓదార్పు..
ఇవి చాలు జీవితానికి
పోరాటం నడపటానికి
ప్రశాంతంగా సేదతీరటానికి!
అక్షరాల భావుకతని, పదాల విన్యాసాలని, చిన్ననాటి ముచ్చట్లని,
కధలని,కబుర్లని, నిర్మలమైన స్నేహాలను చూసి సరదాపడ్డాను
కోల్పొయినదేదొ ఇక్కడ పొందుదామని ఆరాటపడ్డాను
స్పూర్తి పొందుదామని బ్లాగు ముంగిట్లో అడుగు పెట్టాను..
కానీ నెలతిరక్కముందే నిరాశ చుట్టుముట్టింది..
ఇక్కడా అవేనా..??
మనుషుల మధ్య ఏవో విసుర్లు,ఇంకేవో కసుర్లు
వాదోపవాదాలు, విమర్శలూ, వెక్కిరింతలూ...
నేనో కొత్త పక్షినే
తప్పొప్పులూ,పూర్వాపరాలు తెలియవు..
నీ సొదేదో నువు రాసుకు పో
లేక బ్లాగు మూసుకు ఫో..
మా గొడవలు నీకెందుకు అని ఎవరైనా అనచ్చు!!
కానీ నాకే ఏదొ బాధ ..మనసులో..
మన జీవితాలలో ఉన్నవి చలవా?
ఇంకా ఎందుకు కొత్తవి?
ఇక్కడా అవేనా..??
దీనికెన్ని వస్తాయో విమర్శలు...
గాంధీ గారంతటి మహోన్నత వ్యక్తికే తప్పలేదు విమర్శలు...
ఈ అనంత విశ్వంలో నేనెంత... నా ఉనికెంత?!
16 comments:
come on తృష్ణా! ఎప్పుడైనా ఉగాది పచ్చడి రుచులని జిహ్వ పరంగా కాక జీవితానికి అన్వయించుకుని చూసారా? చేసుంటే మీకీ వీచారం కలిగేది కాదు. చేయకపోతే ఒకసారి ప్రయత్నించండి. మనసు వరకు ఏ ఇద్దరిదీ ఒక భాష కాదు. నలుపు-తెలుపు, చిన్న-పెద్ద అవన్నీ ఎవరి నిర్వచనాలు వారివే. సమాతరంగా సాగే బాటలు ఒక్కోసారి X రోడ్స్ దగ్గార కలిస్తే సందోహం, సండడీ వుండవా? ఇది అంతే నలుగురు కలిసిన కూడలి, రచ్చలు, చర్చలు వుంటాయి. గమనించండి, కావాలంటే ఆనందించండి. లేదా తెలిసిన దారి వెదుక్కుని సాగిపోండి. బాటసారులం. మజిలీలు వస్తాయి, విశ్రమిస్తాము కాని మన పయనం ఆపుతామా. అంతే మీ బాట పూల బాట కాదు ముళ్ళే వుండవు, రాళ్ళూ తప్పవు. ఎత్తూ పల్లాలూ వుంటాయి. సాగండి, ప్రక్కన నా బోటి తోటి బాటసారులని పలుకరించండి. ఇప్పుడు చూడండి, మీ రచనలోని వేదన దూది పింజెలా ఎగిరిపోయుంటుంది.
నాకు కూడా అదే అనిపిస్తోంది అండీ. నేను దాదాపు 10 ఏళ్లుగా నెట్లో చాటింగ్ గట్రా చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేయా ఫ్రెండ్స్ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఈనాడులో నెమలికన్ను గురించి చూసి బ్లాగుల మీద మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాను. అలానే మీ వంటి వాళ్ళ బ్లాగులు చూసినప్పుడు ఆ అభిప్రాయం బలపడింది. కానీ ఇలాంటివి చూసినప్పుడు ముందు కొంచం ఆశ్చర్యం వేసింది. తరువాత అసహ్యం వేసింది. అందులోనూ అందరూ విద్యాధికులే, వయసులో పెద్దవారే. ఇంతకంటే ఎక్కువ రాయదల్చుకోలేదు. కానీ మనం మన దారిలోనే వెళ్దాం.
మరీ నిరాశపడవద్దు, ఈమధ్యనే ఇలా.తాత్కాలికమేలెండి.ముందు బాగుంటుందిలెండి,మీరు మాత్రం కొనసాగించండి
తృష్ణగారు,
మీకు బాధ కలగడం సహజమే.. అవి పట్టించుకోకండి. కొద్ది రోజులలో సర్దుకుంటాయి. అంతా మామూలే. పదిమంది చేరినపుడు ఇలాంటి అభిప్రాయ బేదాలు రావడం సహజమే కదా ...
బాగా అన్నారు.
ఎక్కడైనా మనం మనమే కదా మరి.
తృష్ణ గారు,
బ్లాగు కర్తలు మనుషులైనపుడు మరి బ్లాగ్లోకంలో మనుషుల నిజాలు నిజస్వరూపాలు ఉండటం సహజమే కదా? అవి లేని చోటకు వచ్చి సేద తీరాలని ఆశించటం భావుకులు పలాయనవాదులు అన్న నానుడిని నిజాన్ని చేస్తుందేమో?
ఎన్ని విసుర్లు,విమర్శలూ పడ్డాయో..ఇవాళా నా బ్లాగు మూసివేసుకోవటమ్ ఖాయమ్ అనుకుంటూ సైన్ ఇన్ అయ్యాను....
నిజంగా ఎంత ఆనందం వేసిందో చెప్పలేను...
ఉషగారూ,మీ కామెన్టు చదివాకా మనసంతా హాయిగా అయిపొయింది...మెరు చెప్పినదంతా నూరుపాళ్ళ నిజం.కృతజ్ఞతలు.
విజయమొహన్ గారు,చైతన్యగారు,అబ్రకదబ్రగారు,రాజమల్లేస్వర్ గారు...మీ అందరికీ నా ధన్యవాదాలు.
జ్యోతిగారు,మీరన్నట్లు ఇదంతా తాత్కాలికమే అని ఆసిద్దాం.
భావుకుడున్ గారూ,మిగతావారి సంగతి ఏమో గాని మరి నేను మాత్రం పలాయనవాదినే..అది తప్పే కావచ్చు..ఇక్కడ నుంచి కూడా ఎన్నాళ్ళు పారిపొకుండా ఉంటానో చెప్పలేను...:):)
SOME PEOPLE ARE BETTER IGNORED.
bonagiri gAru,thanks.
సముద్రానికి ఆటుపోట్లు - జీవితానికి ఎదురుదెబ్బలు.
ఒకే ఒక్క మనసులో ఎన్ని భావాలు?
"యద్భావం తద్భవతి !"
మన వైపు నుంచి చూసిన ప్రతి కోణమూ ఒప్పు కాగా అదే అంశం ఎదుటి వారి కోణంలో తప్పు గా మారిపోతుంది.
బ్లాగ్లోకం సువిశాల సంద్రం.
ఇక్కడ కేవలం విహారం కోరుకునే వారు నిశ్శబ్దంగా తీరంపై విహరిస్తూ విభిన్న భావతరంగాలని మౌనంగా ఆస్వాదించాలి. సరదా పడితే నాలుగైదడుగులు దిగి కెరటాల అలజడులను అనుభూతం చేసుకోవచ్చు.
మరి ఆ సువిశాల సాగరంపై విహరించాలనుకుంటే మాత్రం దాడులని , ఎదురుదాడులని తట్టుకోవాలి.
సుడిగుండాలని దాటిముందుకు సాగిపోవాలి.
సముద్రం తీరంపై హాయిగా విహరించేటపుడు ఇక్కడంతా ఉప్పునీరు , ఉప్పవాసన అంటే ఎలా?
అందులోని ఆణిముత్యాలు, అగాథజలనిధులు చూడనైనా చూడాలి లేదా చూసిన వారి ద్వారా ఆ అనుభూతిని అందుకోవడానికి సిద్ధంగా నైనా ఉండాలి.
ఇప్పుడు చెప్పండి .. మీ తృష్ణ ని బ్రతికించుకుంటారా ? లేదా?......
@తెలుగుకళ :ఎప్పటిదో పాతది...ఇది..నేను బ్లాగ్లోకంలోకి వచ్చిన కొత్తల్లో ఇక్కడి వాగ్వివాదాలూ అవీ వింతగా అనిపించి రాసినది...
ఇపుడవి అలవాటైపొయాయి..నాకు ఈ లోకంలో విహరించటం అలవాటైపోయింది... now there are
no regrets..and no complaints...
Motthaaniki ilanti stage nundi start chesi, 300 post lu poorthi chesesaaru...Nice andi..
Post a Comment