సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 16, 2009

ముగ్గులు..











ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం. ముగ్గులు వెయ్యటం... అంటే అదొక సరదా.. సంక్రాంతి వస్తోంది అంటే ముగ్గులతొ రెడీ . రకరకాల ముగ్గులు యెక్కడెక్కడనుంచో సంపాదించి,పుస్తకంలో నింపటం...నెల పట్టడం, ముగ్గులు వెయ్యటం...సందులో అందరికన్న పెద్ద ముగ్గు వెయ్యాలని తాపత్రయపడటం...నేనే వేసేదాన్ని కూడా..పండగకి వేరే ఊరు వెళ్ళినా అక్కడా నేనే ముగ్గులు పెట్టేదాన్ని.అప్పుడు కమేరాలు,ఫొటొలు తీసుకోవటాలు తెలియవు...ఏవొ అప్పుడప్పుడు ఫొటొలు తీసుకున్న నేను వేసిన ముగ్గులు కొన్ని ఉన్నాయి.అవే ఇక్కడ పోస్టులో పెడుతున్నాను.ముగ్గులు చాలమంది వేస్తారు.కానీ కాకి ముగ్గులు కాకికి ముద్దు కదా ...

4 comments:

Anonymous said...

ఇది అన్యాయం

తృష్ణ said...

అలా అర్ధం అవ్వకుండా వ్యాఖ్య రాస్తే ఎలాగండీ?అన్యాయం దేనికి?బ్లాగులో ముగ్గులు పెట్టినందుకా?అలా ఎక్కడ రూలు ఉన్నట్టు చదవలేదు.
అవి ఎవరివో ముగ్గులు కాదు.నేను వేసినవే కాబట్టి ఎవరినీ కాపీరైటు అడగక్కరలేదు.
ఒకవేళ ఫొటోలు క్లియరుగా లేవని అలా అన్నట్లయితే; నాకున్న పరిజ్ఞానానికి అంతకన్నా బాగా అటాచ్ చేయటం రాదండి.
'ఆన్యాయం ' దేనికో వివరిస్తే బాగుంటుంది.

జ్యోతి said...

మొదటి ముగ్గు అదే రంగు ప్లెయిన్ చీర మీద వేసి చూడండి .. బావుంటుంది. మీకు నచ్చకుంటే ఆ చీర నేను తీసుకుంటాలెండి. :))

తృష్ణ said...

జ్యొతి గారూ,ప్రయత్నిస్తాను.బాగుంటే మీకిస్తాను.లేకుంటే నేను ఉంచేసుకుంటాను.అయినా 'పెళ్ళిపుస్తకం 'లో బాపూగారు నేయించినంత బాగా నేను వెయ్యలేను లెండి.