సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 25, 2009

ఈ పూలు ఏమిటో చెప్పుకోండి..?


పూలు ఏమిటో చెప్పుకోండి..?


నేనే చెప్పేస్తాను....ఇవి "కుంకుమ పూలు" (Saffron flowers). ఆ పువ్వు మధ్యలో కనిపిస్తున్నదే మనం వాడే కుంకుమపువ్వు. ఇప్పుడే దూరదర్షన్ లో "కశ్మీర్ నామా" అనే కార్యక్రమం వచ్చింది..దాంట్లో తెల్లని మంచు కురుస్తున్న రోడ్లు....ఇంకా కొన్ని ప్రదేశాలూ అవీ చూపించారు...సన్నగా, తెల్లగా చెట్లని కప్పేస్తూ కురుస్తున్న మంచు ఎంత బాగుందో...

ఇంకా ఇదిగో ఈ కుంకుమ పువ్వుల తోటలు , వాటిని కోయటం అవీ చూపించారు. వంటల్లోకి, పాలలో వాడటం తప్ప ఇంతవరకూ నాకూ తెలీదు ఈ పూలు ఇలా ఉంటాయి అని...ఆశ్చర్యంగా అసలు ఆకు అనేదే కనబడటం లేదు. మట్టి లోంచి ఆ పువ్వు ఒకటే కనిపిస్తోంది. నాకయితే పెద్ద వింతలా ఉంది...అన్దరికీ చూపిద్దామని ఇలా ఫోటో తీసాను కానీ..మన దూరదర్షన్ వాళ్ళ ప్రసారం క్లారిటీ ఇంత బాగుంది...వేరే ఏ చానల్ లోంచి ఫోటో తీసినా అద్భుతంగా వస్తుంది. DD క్వాలిటీ మాత్రం నా చిన్నప్పటి నుంఛీ ఒకలాగే ఉంది...!!

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇది బ్లాగ్మిత్రుల కోసం:
రెండు శుభకార్యాల ఆహ్వానాల నిమిత్తం....నేను సైతం ఒక చిన్న విరామన్ని తీసుకుంటున్నాను...
ఓ నాలుగు రోజుల పాటు మీరంతా హాయిగా, స్వేచ్చగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి...
మళ్ళీ సోమవారానికల్లా పెద్ద సుత్తితో నేను రెడీ అయిపోతాను కదా...
వెళ్ళిన చోట శ్రీలక్ష్మి లెవెల్లో "బ్లాగంటే...." అంటూ ఆహ్వానితులందరికీ బ్లాగ్లోక విశేషాలు చెప్పి
నా బ్లాగ్లోక వియోగభారాన్ని తగ్గించుకోటానికి ప్రయత్నిస్తాను...
అంత సమయం చిక్కకపోతే కనీసం నూతన్ ప్రసాద్ లాగ "మా బ్లాగులు మూడువేలు...."
అనయినా చెప్పే ప్రయత్నం చేసి బ్లాగులందు నా విశ్వాసాన్ని చాటి చెప్పుకుంటాను...

ఉండనేమో అని వ్యాఖ్య రాయటం మానేరు...
రోజంతా బయట పనులున్నా ఇవాళ్టికి ఇంట్లోనే....
రాత్రికి వచ్చిన వ్యాఖ్యలు ప్రచురించుకుని రేపొద్దున్న వెళ్తాను...
సోమవారం దాకా శెలవు మరి.....!!

ఇది చూసి శ్రీవారి వ్యాఖ్య :
"ఈ నాలుగురోజులూ హమ్మయ్యా అని హాయిగా,గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు పాపం వాళ్ళంతా ..." :( :(

15 comments:

భావన said...

బలే వున్నాయండి కుంకుమ పువ్వులు. గూగులమ్మ లో వెతికి చూద్దాము. అలా ఏమి కాదు అని చెప్పండి మీ వారికి. మీరు లేక పోతే నాలుగు రోజు లు బ్లాగ్ లోకం బోసి పోతుంది అందరం మిస్ అవుతాము అని చెప్పండి. బాగా ఎంజాయ్ చేసి రండి మా కళ్ళు మనసు కూడా పెట్టీ.

గీతాచార్య said...

Nice pictures.

ఇది చూసి శ్రీవారి వ్యాఖ్య :
"ఈ నాలుగురోజులూ హమ్మయ్యా అని హాయిగా,గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు పాపం వాళ్ళంతా ..." :( :(

LOL.

పరిమళం said...

వచ్చేటప్పుడు బోలెడు కబుర్లు మూట గట్టుకు రావాలి మరి !

మురళి said...

పూల మీద సిరీస్ రాయబోతున్నారా అని అడుగుదాం అనుకునేంతలో సెలవు ప్రకటించేశారు.. నూతన్ ప్రసాద్ ఆటో బయోగ్రఫీ, బాధితుల హావభావాలు గుర్తు చేశారు..

Hima bindu said...

బాగుందండీ ,పనిలో పని 'ఒలిసి పూలు 'ఎలా ఉంటాయో మీకేమైనా తెలిస్తే చెప్పరూ ?లేకపోతె స్వాతి లో కి వెళ్లి మన పసలపూడి హీరోనే అడిగోస్తాం :)

మాలా కుమార్ said...

కుంకుమ పూలు బాగున్నాయి .
wish you happy holidays .

తృష్ణ said...

@భావన: వెతకండి. బొమ్మ క్లియర్ గా ఉన్న ఫొటోలు దొరుకుతాయేమో...
అంతమాటన్నారు...అదే పదివేలు...


@గీతాచార్య: :) :)

తృష్ణ said...

@పరిమళం: ఓ..తప్పకుండా...కొత్తగా మాటలు నేర్చిన శ్రీలక్ష్మిలాగ ఒకేసారి నాలుగు రోజుల కబుర్లతో వస్తా...:)

@చిన్ని: తప్పకుండా ప్రయత్నిస్తానండీ...తెలిస్తే మీ బ్లాగ్లొకొచ్చి మరీ చెప్తాను...సరేనాండీ..కీ ప్యాడ్ త్వరగా బాగు చేయించుకోండి/మార్చేయండి....నిన్న నేను కావాలనే సరదాకి అలా పెట్టారేమో అనుకున్నాను..:)
చాలా ఇబ్బంది అలా ఉంటే..

తృష్ణ said...

@మురళి: లేదండి...అనుకోకుండా టి.వి లొ ఆ పూలను చూసేసరికీ వెంఠనే బ్లాగ్మిత్రులకు చూపెట్టాలనిపించి అలా ఫొటోలు తీసానండీ...

@మాలాకుమార్: థాంక్స్ అండీ...
ఈసారి ఏదన్నా పాట గుర్తురాకపోతే అడగండి..

సుభద్ర said...

మీరు మాకు టై౦ ఇస్తూన్నారని కుళ్ళు మీ వారి..మీరే౦ పట్టి౦చుకోక౦ది.మేము మిమ్మల్ని చాలా మిస్స్ అవుతాము తెలుసా...సరే మరి మీరు కొ౦చ౦ రెస్ట్ తీసుకుని పరిమళ౦ గారు చెప్పినట్లు మాటల మూట తో ర౦డి.పువ్వులు బాగున్నాయి.

తృష్ణ said...

@subhadra: :) thankyou soooo much...!!

వేణూశ్రీకాంత్ said...

Happy Holidays తృష్ణ గారు.

జయ said...

కొన్ని కుంకుమ పూలు నాక్కూడా ఇవ్వొచ్చుకదమ్మా! అలా చూపించి ఆశ పెడితే ఎలా తృష్ణమ్మా?

తృష్ణ said...

@venu: థాంక్స్ అండీ.


@jaya: అయితే మా ఇంటికి రండి..:)

Anonymous said...

తృష్ణ గారు మీ బ్లాగు డిసైన్ చాలా బావుందండి. మీరూ, డి.డి ప్రేక్షకులనమాట నాలాగె.