సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, November 14, 2009

ఒక మంచి పిల్లల పాట....

>(నా బ్లాగ్ రెగులర్ రిడర్స్ కోసం: కొద్దిపాటి అస్వస్థత తరువాత ఇవాళ మళ్ళీ బ్లాగ్లోకం లోకి....ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయినా మిత్రులను మిస్సవుతున్న కారణంగా...ఈ రాక...)



బాలల దినోత్సవం సందర్భంగా ఇవాళ నాకు సాహిత్యపరంగా,సంగీతపరంగా నాకు చాలా చాలా నచ్చే ఈ పిల్లల పాట ...సినీ సంగీత దర్శకులు ఎం.బి.శ్రీనివాసన్ గారు రేడియో కోసం ఈ పాటకు సంగీతాన్ని అందించారు. మంచి అర్ధంతో కూడిన ఈ అందమైన పాట ఇంకా ప్రాచుర్యం పొందాలని నా ఆశ...

రచన:దాశరధి
సంగీతం:ఎం.బి.శ్రీనివాసన్
పాడినది:వాణీజయరాం బృందం.



పిల్లల్లారా పాపల్లారా
రేపటి భారత పౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా...పిల్లల్లారా

మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడూ
ఉన్నడూ....పొంచున్నాడూ
మీ మనసుల్లో దేముడు కొలువై ఉన్నాడూ
ఉన్నాడూ..అతడున్నాడూ
భారతమాతకు ముద్దుల బిడ్డలు మీరేలే
మీరేలే...మీరేలే..
అమ్మకు మీపై అంతే లేని ప్రేమేలే...
ప్రేమేలే.. ((పిల్లల్లారా))

ఉత్తరాన గల మంచుకొండకు దక్షిణాన గల సముద్రానికీ
ఐకమత్యమూ సాధించే అందమైన ఓ బాలల్లారా
ఆశాజ్యోతులు మీరేలే...((ఉత్తరాన))
కులాల మతాల గుద్దులాటలు
మరిపించేది మీరేలే...మరిపించేది మీరేలే
భాషావేష బేధాలన్ని పారద్రోలేది మీరేలే
రూపుమాపేది మీరేలే ((పిల్లల్లారా))

భారతదేశం ఒకటే ఇల్లు భారతమాతకు మీరే కళ్ళు
మీరే కళ్ళు...
జాతిపతాకం పైకెగరేసి జాతిగౌరవం కాపాడండి
జాతిగౌరవం కాపాడండి(2)
బడిలో బయట అంతా కలిసి భారతీయిలై మెలగండీ
భారతీయిలై మెలగండీ(2)
కన్యకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచండీ(2)
వీడని బంధం వేయండీ....((పిల్లలారా...))

16 comments:

శేఖర్ పెద్దగోపు said...

Superb Lyrics...Photo is too good...

మురళి said...

"ఉత్తరాన గల మంచుకొండకు.." చరణం విన్నట్టు గుర్తు లేదండీ.. మిగిలిన పాటంతా గుర్తుంది.. రేడియోలో చాలా సార్లు విన్నాను.. ఆదివారాలు తప్పనిసరిగా వచ్చేది... ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి...

కొత్త పాళీ said...

Nice

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఈపాట మాచిన్నప్పుడు అమ్మపాడేది. కొద్దిగా లీలగా గుర్తొస్తోందికానీ నాకు పల్లవితప్ప చరణం తెలీదు. ఇంతకు ముందుపాటల్లనే దీనికీ ఏదైనాలింకుని పెట్టుండాల్సింది. వినుండేవాళ్లం.
"ఆశాజ్యోతులు మీరేలే..." ఎందుకో బాగానచ్చింది.

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి పాట. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. Wish you speedy recovery.

జయ said...

బాగుంది తృష్ణ. మరి బాలల దినొత్సవ సందర్భంగా మీ పాపకు ఇవాళ ఏవిటి ప్రత్యేకం. ఆరోగ్యం ఎలా ఉంది. అసలే ఇక్కడ అంతా ఒకటే వైరల్ ఫీవర్.

తృష్ణ said...

@శేఖర్: అవునండీ..ఈ సాహిత్యం చాలా బాగుంటుంది... ధన్యవాదాలు.

@మురళి: పెద్ద పాట కదాని రెండు చెరణాలే ప్రసారం చేసేవారేమోనండీ...ధన్యవాదలు.

@కొత్తపాళీ: ధన్యవాదాలు.

తృష్ణ said...

@చైతన్య: divshare embed MP3 పెట్టాను. సరిగ్గా రాలేదేమో మరి.ఇప్పుడే మళ్ళీ సరి చేసాను. ఇప్పుడు విను.

@వేణూ శ్రీకాంత్: చాలా థాంక్స్ అండీ. పాట మీకు తెలుసా? చాలా సార్లు రేడియోలో వస్తూండేది.

తృష్ణ said...

@జయ: లేకేం...ఫాన్సీ డ్రెస్ ఏదన్నా వేసి పంపమన్నారండీ...వైట్ కుర్తా, మినీ డాక్టర్ కిట్ కొని తయారుచేసి దింపి వచ్చానండీ...ఇవాళ "చిల్రెన్స్ డే" తెలుసా అని అది అందరికీ చెప్తూంటే అందరం నవ్వుకున్నాం...

దేముడి దయవల్ల ఫీవర్ అయితే రాలేదు లెండి...థాంక్సండీ.

హరే కృష్ణ said...

adenti akkada kooda viral vasthunnaya
ee rains valla naaku 2 weeks paatu vadalledu

>> బ్లాగ్ రెగులర్ రిడర్స్ కోసం...:)
good post
wish you speedy recovery

Telugu Movie Buff said...

ఈ పాటను గుర్తు చేసినందుకు అనేక ధన్యవాదలు తృష్ణ గారు.
చినప్పుడు మా ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్లో మా తెలుగు మాస్టారు ప్రతి శుక్రవారం ఓ కొత్త పాట నేర్పించే వారు.
ఈ పాటను మటుకు మళ్లీ మళ్లీ పాడుకునే వాళ్ళం. ఆ వాతావరణం అంతా మదిలో మెదులుతోంది ఈ పాట వింటుంటే.

నాదొక మనవి:
అందరం ఒకటే, మనమందరం ఒకటే
ఆంధ్రులమైన తమిళులమైనా.....అని ఒక పాట వుంది..
ఆ పాట online ఎక్కడైనా వుందేమో మీ ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

వేణూశ్రీకాంత్ said...

చిన్నపుడు రేడియోలో విన్నది గుర్తుందండి. ప్రత్యేకించి చరణం లో ఒచ్చే కోరస్ ’ఉన్నాడు..పొంచున్నాడు’ ’ఉన్నాడు..అతనున్నాడు’ లాటివి భలే ఆసక్తికరంగా ఉండేవి అప్పట్లో :-)

తృష్ణ said...

@హరే కృష్ణ: ఇప్పుడు మీకు తగ్గిందా? నాకు జ్వరమ్ లేదు. జలుబు,ఒళ్ళు నెప్పులూ గట్రా...

@ఫణి: ఎక్కడైనా దొరికితే తప్పక చెప్తానండీ...ఈ పాటతో చిన్ననాటి రోజులు తలుచుకున్నారన్నమాట..బావుందండీ..

@వేణూ: కదండీ...పాటలో ఆ కోరస్ఏ నాకు బాగా నచ్చేది.

SRRao said...

తృష్ణ గారూ !
కొన్ని పనుల వత్తిడిలో గత రెండు రోజులుగా చాలా టపాలు చదవలేక పోయాను. చాలా రోజులయింది. ఈ పాట విని. మంచి పాట వినిపించారు. ధన్యవాదాలు.

తృష్ణ said...

rao gaaru,thankyou sir.

Rajesh Devabhaktuni said...

పాట నిజంగానే చాలా బాగుంది. సంగీతమే కాకుండా, వ్రాసిన వాక్యాలు కుడా చక్కగా, పిల్లల భవితవ్యాన్ని నిర్దేశీంచేవిగా ఉన్నాయి.