సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, November 7, 2009

స్నేహం..


" సృష్టి లో తీయనిది స్నేహమేనోయి.."
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.."
"నిజమైన స్నేహితుడు భగవంతుడు ఇచ్చిన వరం..."

"A friend in need is a friend indeed"
"A Friend is one..who comes in when the whole world has goneout.."
"A true friend is a gift of God.."

స్నేహమనగానే ఇలా ఎన్నో నిర్వచనాలు. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసేవారు, మన తప్పులని సరిదిద్దేవారూ, మనలోని మంచి గుణాలను మనకు చూపెట్టేవారు, అంధకారంలో కొట్టుకు పోతూంటే వెలుగు చూపెట్టే నిజమైన స్నేహితులు చాలా అరుదుగా దొరుకుతారు. స్నేహమైనా ప్రేమైనా నాదొకటే సూత్రం-- ఒక వ్యక్తిలోని సద్గుణాలను మాత్రమే ఇష్టపడటం కాదు. ఒక వ్యక్తిని ఆ వ్యక్తిలో మనకు నచ్చని లోపాలతో పాటూ ఇష్టపడాలి. ప్రేమించాలి. అప్పుడే ఏ బంధమైనా గట్టిగా నిలిచేది. నేను నా స్నేహితులను అలానే ప్రేమించాను. ఇవాళ నాకు మిగిలిన స్నేహితులు కూడా నన్ను అలా స్వీకరించినవారే.

జీవితంలో రకరకాల మజిలీలను దాటాకా ఇవాళ్టికీ నా పక్కన నిలబడినవారే నా నిజమైన మిత్రులు. వెనుదిరిగి చూస్తే దారిలో నిలిచిపోయిన వారు, మధ్యలో వీడిపోయినవారూ ఎందరో...! ఆ ఋణం అంతవరకేనన్నమాట అనుకుంటూ ఉంటాను. "ఇది కధ కాదు" చిత్రంలో ఆత్రేయగారన్నారు...

"వెళ్తారు వెళ్లేటివాళ్ళు,
చెప్పేసెయ్ తుది విడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు
వింటారు నీ గుండె రొదలు..." అని.

ఈ సొదంతా ఎందుకంటే...ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ "మధవి" ఫోన్ చేసింది. ఆ ఆనందంలో తన గురించి చెప్పాలనిపించి ఈ టపా...!అందరికీ గొప్ప స్నేహితులు కొందరు ఉంటారు. నాకూ కొద్దిపాటి మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లలో మాధవి ఒకర్తి. తనిప్పుడు బొంబాయిలో ఒక బాంక్ లో మేనేజర్. మాధవి తో నా స్నేహం వింతగా జరిగింది. తను నా స్కూల్ ఫ్రెండ్. నేను 8th క్లాస్ లో స్కూల్ మారాను. తను, నేనూ వెరే వేరే సెక్షన్స్. ఆ ఏడు పరిచయమే ఉండేది. 9th క్లాస్ లో మేమిద్దరం ఒకే సెక్షన్లో పడ్దాం. నా లెఖ్ఖల పరిజ్ఞానానికి మా మేథ్స్ సార్ గారు కొంచెం భయపడి, అమ్మా ఇవాళ నుంచీ నువ్వు మాధవి పక్కన కూర్చోమని నా ప్లేస్ మార్చేసారు. మధవీ లెఖ్ఖల్లో ఫస్ట్. సార్ బోర్డ్ మిద చెప్తూంటే అది వెనక నుంచి చెప్పేస్తూ ఉండేది. ఆయన వెనక్కు తిరిగి, "నువ్వు చెప్తావా? నన్ను చెప్పనిస్తావా? " అనేవారు. ఆపేసేది. మళ్ళీ మర్నాడు అదే తంతు. సార్ ఫేవొరేట్ స్టూడెంట్ తను. ఈ లెఖ్ఖలనెవడు కనుక్కున్నాడురా బాబు? అనే టైపు నేను...! మొత్తానికి పక్కన కూర్చోవటం వల్ల కాస్త బానే నేర్చుకున్నాను. అలా మా స్నేహం మొదలైంది.

మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ "హిందీ పాటలు". ఇద్దరం తెగ పాడేసుకునేవాళ్ళం. నేను బాగా పాడేదాన్నవటo వల్ల తనకీ నాపట్ల ఆసక్తి పెరిగింది. కానీ నాకు కొంచం కోపం ఎక్కువే. కాస్త తిక్క, ఆలోచన తక్కువ, దూకుడు ఎక్కువ. ఒకరోజు నాకు తనమీద ఎందుకో కోపం వచ్చింది. ఆ రోజంతా నేను అసలు తనతో మాట్లాడలేదు. సాయంత్రం స్కూల్ బస్ ఎక్కటానికి వెళ్పోతూంటే నా వెనకే వచ్చి నా చెయ్యి పట్తుకుని ఆపింది..."నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు...కానీ నాతో మాట్లాడటం మానద్దు..." అనేసి వెళ్పోయింది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..ఎందుకో దీనికి నేనంటే అంత అభిమానం అని పొంగిపోయాను. ఆ రోజు మొదలు నేనెప్పుడూ తనతో దెబ్బలాడలేదు.

మేం కలిసి చదివుకున్నది రెండు సంవత్సరాలే. ట్రాంస్ఫర్ అయి వాళ్ళు గుంటూరు వెళ్పోయారు. ఇంటర్, డిగ్రీ అక్కడే చేసింది. అప్పుడప్పుడు విజయవాడ వచ్చేది తనే. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం చాలా ఏళ్ళు...డిగ్రి అవ్వగానే BSRB రాసింది. బ్రిలియంట్ బ్రైన్ కదా మొదటి ఎటెంప్ట్ లోనే జాబ్ వచ్చేసింది. తర్వాత పి.ఓస్ కి రాస్తే మొత్తం 5,6 బ్యాంకుల్లో ఒకేసారి వచ్చాయి పోస్ట్లు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా ఫోన్లు చేసేది..."నేను ఉద్యోగం చేస్తున్నాను కదే,నేనే చేస్తాను" అనేది. మా ఇరవై రెండేళ్ళ స్నేహం లో నా ప్రతి పుట్టినరోజుకి తన ఫొన్ వస్తుంది. ఒకసారి మద్రాస్ లో ట్రైనింగ్లో ఉంది. నా పుట్టినరోజుకి రాత్రి 9.30 ఫోన్ చేసింది. పొద్దున్నుంచీ కుదరలేదే అని. ఆ మధ్య తనని బ్యాంక్ వాళ్ళు రెండేళ్ళు లండన్ పంపించారు. అప్పుడు కూడా తను నెలకోసారైనా ఫోన్ చేసి మాట్లాడేది. మళ్ళీ మేము బొంబాయిలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాంస్ఫర్ మీద అక్కడకు వచ్చారు వాళ్ళు. మళ్లీ చాలా ఏళ్ళకు కలిసున్నాం కొన్నాళ్ళు. ఇప్పుడు మేం వచ్చేసినా తను అక్కడే.

తన సిక్స్త్ సెన్స్ ఎలా ఎలర్ట్ చేస్తుందో గానీ నాకు ముడ్ బాగోలేనప్పుడు తన ఫొన్ తప్పక వస్తూంటుంది. చాలా సమయాల్లో నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది తను. రెండునెలల క్రితం చాలా రోజులయ్యింది ఫొనుల్లేవని నేనే చేసాను. పాపకి బాలేదు నువ్వు కంగారు పడతావని చెప్పలేదే..అంది. అంత కంగారులో కూడా నేను ఎక్కడ టెంషన్ పడతాననో అని ఆలోచించిందది. ఇందాకా ఫొన్ చేసి చాలా రోజులయ్యిందని బోల్డు సేపు మాట్లాడింది. బొంబాయి లాంటి హడావుడి ఊళ్ళో, లోకల్ ట్రైన్స్ లో తిరుగుతూ, ఉద్యోగం టెంషన్స్ తో, ఇద్దరు పిల్లలతో బిజీ గా ఉన్నా సరే... లోకల్ ట్రైన్స్ లో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడూ నన్ను పలకరిస్తూ ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి అనిపిస్తుంది నాకు. True friend అంటే తనే కదా మరి.

మన సద్గుణాలనే కాదు, మనలోని లోపాలను కూడా భరించేవారే నిజమైన స్నేహితులు. నా మిత్రులు నాలోని సద్గుణాలను నాకు చూపారు. నాకు తెలియని ప్రత్యేకతలను నాలో చూసారు...నాకు చూపెట్టారు. ఇవాల్టికీ నన్ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నారు. అందుకే వారంతా నా నిజమైన మిత్రులు ...! నాకున్న ఇలాంటి మంచి స్నేహితులు ఇంకొందరి గురించి మరోసారి ఎప్పుడన్నా...

23 comments:

సుభద్ర said...

very very good..chaalaa chaalaa baagaa raashaaru..

కొత్త పాళీ said...

a good friend.

హను said...

nice,good friendship, nd mee explenation kuDa baagumdi

జ్యోతి said...

Lucky to have such a good and caring friend..

జయ said...

ఇటువంటి స్నేహితాలే కలకాలం నిలిచేది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతమని ఊరికే అన్నారా! Good friendship...keep it up. Congrats.

శ్రీలలిత said...

ఎవరో చెప్పగా విన్నాను. మన తల్లితండ్రులని, తోబుట్టువులని, చుట్టాలని మనం ఎన్నుకోలేం. కాని మనకి నచ్చినవాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉన్నది ఒక్క స్నేహితుల దగ్గరే. అందుకే అంటారేమో స్నేహానికి మరేదీ సాటి రాదని.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అదృష్టవంతులు

Padmarpita said...

Lucky to have a good friend..
Its nice....

జాన్‌హైడ్ కనుమూరి said...

we are lucky to read ur feel

best wishes

మరువం ఉష said...

స్నేహం లేని ప్రేమ లేదు. ఈ రెండూ లేని నేను లేను. ఇంతకన్నా చెప్పాలనిలేదు. మీ మాధవి కూడా మీ గురించి ఇలా అనుకోబట్టే మీ స్నేహం ఇంతకాలం నిలబడింది. నాకు నా నవీ సునీ ఇలా ఎందరో.

భాస్కర రామిరెడ్డి said...

బాగున్నాయండి. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఒకరో ఇద్దరో తగులుతారేమో. మీ ఫ్రెండ్ కు మీమీద, మీకు తనమీద వున్న నిష్కల్మషమైన ప్రేమ చదువుతుంటే ముచ్చటేసింది.

మాలా కుమార్ said...

మీ స్నేహం గురించి చదువుతుంటే సంతోషంగా వుందండి . మీ స్నేహం ఇలాగే కలకాలం నిలవాలి .

కార్తీక్ said...

chaala baagaa rasaaru friendship gurinchi friends gurinchi.

www.tholiadugu.blogspot.com

తృష్ణ said...

@సుభద్ర
@కొత్తపాళీ
@హను
@జ్యోతి
@జయ
@శ్రీలలిత
@చైతన్య
@పద్మ
@జాన్ హైడ్ కనుమూరి
@ఉష
@భాస్కర్ రామి రడ్డి
@మాలా కుమార్
@కార్తీక్

...టపాకు స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలండీ...చాలా మందికి చాలా గొప్ప గొప్ప స్నేహాలు ఉంటాయి....ఉన్నాయి కూడా. నిన్న తను ఫోన్ చెయ్యగానే ఆనందంలో నేను ఈ టపా ద్వారా కేవలం నా స్నేహితురాలు "మాధవి" గురించి చెప్పాలని మాత్రమే రాసాను. అంతే తప్ప నేనేదో గొప్ప అనో, మా స్నేహమే గొప్పదనో తెలుపటానికి కాదు...!!

భావన said...

స్నేహానికి గొప్ప తక్కువ ఏమి వుంటాయి తృష్ణ. స్నేహమంటే కలసిన మనసులతో ఒక రాగానికి స్పందించే రెండు వీణల కంపనం.. దానికి కొలమానాలు పోలికలేమి వుంటుంది.. అదృష్ట వంతులు. చెలిమితోట లో విరబూసిన తలపు పువ్వు ల పరిమళాలను మాకూ పంచినందుకు ఎంతో ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది తృష్ణ గారు. ఇన్నేళ్ళగా ఇంకా ఇంత తరచుగా టచ్ లో ఉండటం చాలా ఆనందదాయకం. పైన అందరూ చెప్పినట్లు ఇంతటి స్నేహాన్ని పంచుకున్న మీ ఇద్దరూ అదృష్టవంతులు.

sreenika said...

హృదయ వేణియపై
పలికిన....పలకని రాగాల
విశ్లేషకులు..స్నేహితులంటే

మా ఊరు said...

మరొకసారి నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసేలా చేసారు మీ టపా తో

పరిమళం said...

మీ స్నేహం మరిన్ని పరిమళాలు వెదచల్లుతూ జీవితాంతం కొనసాగాలని నా ఆకాంక్ష !చిన్ననాటి స్నేహితుల్ని , ఆ స్నేహాన్ని నిలుపుకోగలగడం నిజంగా అదృష్టం !

హరే కృష్ణ said...

మీరు చాలా లక్కీ
ముంబై లో వున్నా friends r in keep in touch with you
great
పొస్ట్ చాలా బావుంది

తృష్ణ said...

@భావన: చాలా బాగా చెప్పారండీ...స్నేహానికి కొలతలేమిటీ...

@వేణూ శ్రీకాంత్ : అవునండి...ఇన్నేళ్ళు నన్ను భరిస్తూ నిలబడిందంటే గట్టి స్నేహమే...:)

తృష్ణ said...

@శ్రీనిక: బాగా చెప్పారండీ...

@మాఊరు: మంచి పని చేసారండీ...థాంక్స్ టు మై పోస్ట్...:)

తృష్ణ said...

@పరిమళం : భగవంతుని దయ...

@హరే కృష్ణ: అవును కదా...ముంబై లో ఉన్నవాళ్ళకి ముంబై జనాల గురించి బాగా తెలుస్తుందండోయ్...:)