జ్యోతి గారి ఆహ్వానంతో వనభోజనాలకు వంటకాలతో రెడీ... (కానీ ఇవాళ నేను ఉపవాసం..ఇవేమీ తినటానికి లేదు..)
నేను 2,3 రకాల వంటకాలను రాస్తున్నాను..
ముందుగా ఒక టిఫిన్ --
పావ్ భాజీ :(కావాల్సినవి)
ఒక నలుగురికైతే 10,12 పావ్ లు తెచ్చుకోవాలి.(బేకరీల్లో దొరుకుతాయి)
100gms నెయ్యి
2,3 చెంచాల నూనె.
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, కూరలో పిండటానికి 2,3నిమ్మ చెక్కలు
కూర కొసం:
* ముందురోజు ఒక మీడియం గ్లాసుడు బఠాణీలు నానబెట్టుకుని ఉంచుకోవాలి.
* నానిన బఠాణీల తో పాటుగా చిన్న కాలీ ఫ్లవర్,ఒక పెద్ద బంగాళాదుంప,2 కేరెట్లు, ఇష్టం ఉంటే కొద్దిగా క్యాబేజీ తరిగినది...ఇవన్నీ కలిపి బాగా ఉడకపెట్టాలి. కుక్కర్ లో అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి.
* దింపాకా మొత్తం బాగా మేష్ చెయ్యాలి.(అంటే చిదిమెయాలి)
* 2 తొమాటోలు, 2 ఉల్లిపాయలు బాగా ముద్దగా గ్రైండ్ చేసి బాగా వేగనివ్వాలి.
* తరువాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొద్దిగా వేగాకా,బాగా మేష్ చెసి పెటుకున్న కూర ముక్కల ముద్దని దాంట్లో వేసి, ఒక 3 చెంచాల 'పావ్ భాజి మసాలా పౌడర్" వెయ్యాలి.
ఈ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్లలోను దొరుకుతుంది. చివరగా ఒక చెంచా నెయ్యి వెయ్యాలి.
* తరువాత , పెనం పెట్టి పావ్ లని నెయ్యితో కాని బటర్తో కానీ మాడకుండా కాల్చాలి...బ్రెడ్ కాల్చుకున్నట్లే.
సర్వ్ చేసేప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండి..ఇవ్వాలి..
పైన ఫొటోలో లాగన్న మాట..:)
**********
ఇప్పుడు భోజనంలోకి ఒక చపాతీ కూర, కొత్తరకం దోసావకాయ.
పచ్చి బొప్పాయి కూర: (చూడటానికి క్యాబేజి కూరలా ఉన్న దీనిని అన్నంలోకి కూడా తినచ్చు.)
కావల్సినవి:
ఒక మీడియం సైజు బొప్పాయి తురుము.
1/2 కొబ్బరి చెక్క తురిముకోవాలి.
పొపుకి : ఆవాలు,మినప్పప్పు,సెనగ పప్పు, 2 పచ్చి మిర్చి, జిలకర్ర,కర్వేపాకు, కావాలంతే ఒక ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు.
1)బొప్పాసి తొక్కు తీసేసి, తురిమేసి,కొద్దిగా నీరులో తగినంత ఉప్పువేసి ఒక్క పొంగు వచ్చేదాకా ఉడకబెట్టాలి.ముద్దగా అవ్వకుండా కొద్దిగా ఉడికినట్లు అనిపించగానే దింపేసుకోవాలి.
2)నీరు మిగిలి ఉంటే వడబోసేయాలి పుర్తిగా.
3)మూకుడులో పోపు వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని, 2 నిమిషాలయ్యాకా ఉడికిన బొప్పాయి తురుము వేసి 3,4 నిమిషాలలో ఆపేసుకోవాలి.
ఇది చపాతీలలోకి చాలా బాగుంటుంది.
మావారు పూర్తిగా ఖాళీ చేసే ఏకైక కూర ఇది.కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను.
కొత్తరకం దోసావకాయ:
దోసావకాయ అంటే చాలామందికి ఎర్ర మిర్చి కారంతో చేసుకునేదే తెలుసు. పెళ్ళిళ్ళలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అదికాక పచ్చి మిర్చితో చేసుకునేది మరొకటి ఉంది.
కావాల్సినవి:
ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.
మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.
అన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.
దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెత్లో దొరుకుతుంది. లెకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె,తగినంత ఉప్పు వెసి బాగా కలపాలి.
ఈ ముద్దలోకి తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.
ఇది నాకు చాలా ఇష్టమైన పదార్ధం.
**********
ఇవాళ స్పెషల్ వంటలు అన్నారు కాబట్టి నెయ్యి,నునె గట్రా బాగా వాడే పదార్ధాలు రాయటం అయ్యింది.
మిగిలిన రొజులు కట్టడిగా తిన్నా, నెలకి ఒక్కసారి తినచ్చు ఇలాగ...:) :)
నిన్న ఇవన్నీ చేసి మా అమ్మగారింట్లో అందరికీ పెట్టాను...బ్లాగ్ కోసం నేను చేసిన పదార్ధాలకి ఫొటోలు తీస్తూంటే
....ఓసినీ..ఇదేమిటి ఇవన్నీ మా కోసం కాదా చేసింది....నీ బ్లాగ్ కోసమా అని మా తమ్ముడు హాచ్చర్యపడి..కించిత్ అలక వహించాడు..!!
26 comments:
పావ్బాజీ నా ఎక్కడ? తినడానికి మేము రెడీ ! ఇక వడ్డించటమే మీ విధి.
హమ్మో! ఇన్ని వంటలే ఇప్పటికే కడుపు నిండా లాగించి వస్తున్నా! బొమ్మలు చూసి మళ్ళీ నోరూరుతోంది,కాళ్ళు,చేతులు ప్రక్షాళన చేసుకుని వస్తా!
ఇక్కడ వాటితోనే పొట్ట నిండిపోయింది, మిగతావి ఎలా తినాలో! బొప్పాయి కూర నాకు కూడా చాలా ఇస్టం కానీ ఇంట్లో వాళ్లకి తింటం కష్టం.
నేను బొప్పాయి కూర చేస్తా అయితే క్రొత్తగా ఉంది :)
తృష్టగారు..బాగున్నాయి..అన్ని.
మహిళాబ్లాగర్స్ అ౦తా ఎవరు ఏమి వ౦డుతున్నారో తెలియక పోయినా డిష్ రిపీట్ కాకు౦డా బ్యాలన్స్ గా పచ్చడి తో సుద్దా పద్ధతి గా వడ్డిస్తూన్నారు.
బొప్పాయి చెప్పిన౦దుకు చాలా థ్యా౦క్స్ ..కూరలకి వెళ్ళి నప్పుడల్లా నన్ను బొప్పాయిలు దీన౦గా చూస్తూ ఉ౦టాయి.నన్ను తీసుకెళ్ళమని నాకేమొ రాదు..సరే మీ పుణ్యమా అని కొత్త రక౦ మా వాళ్ళు ఖుష్.........నేను ఖుష్.
మీ మామిడి చెట్టు కింద పావుబాజి తినేకంటే "పులిహోర "తింటే బావుంటాదేమో...ఎవరైనా తెస్తారా ?ఎవరైనా అలిగితే బాగుండు వాళ్ళతోపాటు మనకు పులిహోర వస్తుందేమో :):) మీ వంటలు బాగున్నాయండీ .
తృష్ణ, బాగున్నయి, అసలే వంటలు ఎక్కువ అయ్యి భుక్తాయాసం వస్తుంటే మరీ మూడూ వంటలా, కష్టమబ్బా.. సరే ఈ బొప్పాయ కూర ఏదో కొత్త గా వుంది నాకు తెలియదు కుంచం వెయ్యి పళ్ళెం లో, కూసంత దోసావకాయ మళ్ళీ వేడి చేస్తుంది కొంచం చాలు, అబ్బ ఏంఇటి తృష్ణా మీరు మరీను కొంచమన్ననా ఇంత వేసేరు, అబ్బ పావ్ బాజి వద్దు లే అబ్బ నా వంతు కూడ భా రా.రే కు పెట్టెయ్యండి.
బొప్పాయి కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిజంగా ఇవాళ చాలా వెరైటీలు వచ్చాయి.
psmlakshmi
కాస్తా మీ వంటలు పార్శిల్ చేసిస్తారా?...ఇప్పుడే నేస్తం గారి గుత్తొంకాయ,జ్యోతి గారి కాప్సికం పీకలదాకా తిని భుక్తాయాసంతో ఉన్నా.....కొంచెం టేస్ట్ మాత్రం చూసి డిన్నర్ కి లాగించేస్తా...ఇదుగోండి..ఆ పావ్ బజీ మాత్రం నాకు మిగిలినవారికంటే ఎక్కువ వడ్డించకుంటే ఊరుకోను...:)
పావ్భాజీ నే ! నా ఫేవరెట్ , బాంబయ్ వెల్లినప్పుడల్లా , దీనికొసం ప్రత్యేకంగా వి. టి స్టేషన్ కు వెళుతాను . మొత్తం నాకే .
తృష్ణ గారు, నాకు పావ్ భాజి అంటే చాలా ఇష్టం. అదే ఎక్కువ తినేస్తాను. మిగతా కూరలన్నీ బాగా నోరూరించేస్తున్నాయి. అవన్నీ మెల్లగా తింటాను. సరేనా!
వంటలు బాగున్నాయి.
తృష్ణగారు వెరైటీ వంటకాలు చెప్పారు. ట్రై చేయాల్సిందే..
ఇవాళ పొద్దున్నుంచీ హడావుడి..ఇప్పుడే వచ్చాను...
వంటలు నచ్చినందుకు...అందరికీ ధన్యవాదాలు...
**************************
భాస్కర్ రామి రెడ్డి గారూ,
విజయమోహన్ గారూ,
ఇంతకీ వచ్చారా లేదా? వడ్డనకి నేను రెడీ..
@సిరిసిరిమువ్వ: అందుకే ఇక్కడ తినేసి వెళ్ళండి ఇవాళ.
@నేస్తం: బొప్పాయి రెమ్డు మూడు రకాలుగా వండచ్చండీ..ఇది అన్నం,చపాతీలూ రెండీటికీ బాగుంటుంది.
సుభద్ర: నేనూ అదే అనుకున్నానండి.
ఈసారి బొప్పాయి తప్పక ట్రై చేయండి...
చిన్ని: మీతో చాలా మాట్లాడాలి ..ఉండండి వస్తాను...
భావన: మీ వ్యాఖ్య తో నా కడుపు నిండిపోయింది...థాంక్యూ..
psmlakshmi: ధన్యవాదాలు.
శేఖర్: అందిందా పార్సిల్..? పొద్దున్నే పంపేసానే..
మాలాకుమార్: మా ఇంట్లో అందరికీ ఫేవరేట్..నేను బొంబాయిలోనే నేర్చుకున్నానండీ..
జయ: నాక్కూడా...మెల్లగా అన్నీ తిన్నారా?
సునీత: థాంక్స్ అండీ..
జ్యోతి: వస్తున్నా...ఇదిగో వస్తున్నా...
boppai naa favourete vachheyyamantara....madanapalle nundi ravalandii!!!!!!!!!!!
నేను ఆలస్యంగా వచ్చాను. పోనీలెండి. తప్పు నాదేకదా. మీరు చెప్పినట్లే వండుకుని తింటాలెండి, ఇంకెవరికీ పెట్టకుండా..
@lakshmi raghava:ఓ తప్పక రండి.
@శ్రీలలిత: సరే..సరే...:)
బొప్పాయి తో కూర చేస్తారని మొదటి సారి వింటున్నానండీ :-) ఫోటోలు నోరూరిస్తున్నాయి :-)
@venu srikanth: thankyou.
అన్నీ చాలా ఓపిగ్గా బాగా చేసారు
inadvertantly i read ur blog. Very readable in presentation. every one of us pass through the same mill of life, with different experiences. Yet, most of us cannot write. Some can write but they think they don't have time. some attempt to write but don't know how to express. Ur narration is like a seasoned story writer's one. u can grow as a good stroy writer. Start today. Wish u good luch. God bless u.
U can visit our site:'www.andhrapradeshpatrika.com'
Valliswar, Chief Editor
@VALLISWAR G : Thankyou verymuch sir.Iam feeling very honoured. thankyou once again.
Post a Comment