అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో రోడ్డు మీద....ఏదైనా సందులోకి అడుగుపెట్టగానే గుప్పని మత్తెక్కించే ఈ పూల పరిమళం ముక్కుపుటాల్లోంచి మనసులోకి జారుకుంటుంది...గుండెల నిండా ఈ వాసన పీల్చుకుని అబ్బా...అనుకోని వారుంటారా అనుకుంటూ ఉంటాము మేము. వాసన వచ్చిన మొదలు ఆసందులోనో..ఆ విధిచివరలోనో ఎక్కడో దాగున్న ఆ చెట్టు కోసం కళ్ళు వెతుకుతాయి...పొడుగాటి వృక్షాలు...వాటికి చిన్న చిన్న ముదురాకుపచ్చ ఆకులు...గుత్తులు గుత్తులుగా వేళ్ళాడుతున్న పొడుగు కాడలున్న తెల్లని పూలు....ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం ఈ పువ్వులది.....
ఇవి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పువ్వులు...ఫోటో తీసుకోవటానికి ఆ చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఇన్నాళ్ళూ వెతుకుతున్నాను...నిన్న అనుకోకుండా ఒకచోట దొరికాయి...వెంఠనే కెమేరాలో బంధించేసాను..!! కాడ చాలా పొడుగ్గా ఉంటుందని వీటిని మేము "కాగడామల్లి" అంటాము. ఆ మధ్య చిన్నిగారు ఒక టపాలో వీటిని "పొన్నాయి పూలు" అంటారని రాసారు. పేరు ఏదైనా మత్తెక్కించే వీటి సువాసన మాత్రం అమోఘం...!!
చిన్నప్పుడు మా తమ్ముడు, నేను ఈ పూలు ఎక్కద దొరికినా బోలెడు ఏరి తెచ్చేకునేవాళ్ళం...వాటిని నేను నీళ్ళు పోసిన పొడుగాటి గ్లాసులో వేసి ఫ్రిజ్ మీదో , టి.వి మీదో పెట్టేదాన్ని...రెండు మూడు రోజులు పాడవకుండా ఉండేవి అవి...నేనెక్కువ ఏరానంటే నేనెక్కువ ఏరానని గొప్ప చెప్పుకోవటం... అవన్నీ మధురస్మృతులు...
ఒకసారయితే రోడ్డు మీద ఎక్కడొ చిన్న చిన్న మొక్కలు చూసి తవ్వి తెచ్చి నాన్న,తమ్ముడూ వాటిని ఇంటి ముందు నాటారు. మేము ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలయి వాటికి బోలెడు పువ్వులు పూస్తున్నాయిట...అవి పెద్దయ్యే సమయానికి అక్కడ లేమే అనుకుంటూ ఉంటాము...
28 comments:
ఈపూలంటే నాకూ చాల ఇష్టమండీ .....మా వీధిచివర అపార్ట్మెంట్ ని ఆనుకొని ఉంటుందీ చెట్టు .... బైటకువెళ్తే సిగ్గుపడకుండా ఏరుకుంటాను మావారిచేత చివాట్లు తింటున్నా ! వడిలిపోయినా వాసనపోని పూలివి !
చిన్నప్పుడు స్కూలు కెళ్లే దారిలో కిందపడినవి ఏరుకుని జడలా అల్లడం అలవాటుగా ఉండేది. అలాగే గుత్తిగా గ్లాసులో వేసి దాన్ని చూసుకుంటూ ఉండడం..అదో అనుభూతి..
నేనెప్పుడూ చూడలేదు ఈ పూలని...మా ప్రాంతంలో కూడా కాగడామల్లి అనే ఓ పువ్వు ఉంది..కాని అది దీనిలా ఉండదండి...దాన్ని సన్నజాజులకి ప్రత్యామ్నాయపూలుగా వాడతారని గుర్తు...ఇవి మాత్రం భలే ఉన్నాయి...
పున్నాగ కి అపభ్రంస రూపమై ఉండొచ్చు, పొన్నాయి.
ఈ పూలంటే మన సినీ కవులకి చాలా ఇష్టం :)
నేణు బర్కత్‌పురాలో ఉన్నప్పుడు, నేనున్న ఇంటికి వెనకవేపున ఐమూలగా ఉన్న కాంపౌండులో పేద్ధ చెట్టుండేది. అక్కణ్ణించి నా గదిలోకి వాసనలే వాసనలు. నేచురల్ ఏర్ ఫ్రెషెనర్ అన్న మాట :)
ఈ పూలని చూడగానే నా చిన్నప్పుడు అబ్బాయిలం అందరం పూలు ఎరితే అమ్మాయిలూ జడలు అల్లడం గుర్తొచ్చింది.. మా ఊరికే ప్రత్యేకం అనుకున్నాను..జ్యోతి గారు కూడా అల్లానంటున్నారు కాబట్టి అన్నిచోట్లా ఆ ప్రాక్టిస్ ఉందన్న మాట..
మావైపు వీటిని కొండమల్లెలు అంటారు. ఈ పూల ప్రస్తావనతో సితార సినిమాలో ఒక పాట కూడా ఉంది. "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.......కొండమల్లెలే కొప్పునపెట్టి వచ్చే దొరసాని" అని.
పోన్నాయి పూలు మా ఇంటి నిండా ,ఆఫీసు నిండా రోజు సువాసనలు వెదజల్లుతున్నాయి -రోడ్ల మీద పడిపడి ఏరిమరిఅన్ని గదుల్లో ను ఫ్లోవేర్వజేస్ ,చెట్టు అందితే కొమ్మలు విరగదీసి మరి కొట్టుకోస్తున్నాను :)
@శేఖర్
,ఆర్,కే భవన్ ప్రక్కనే వున్నా ఫ్లయోవేర్ ఎక్కితే ఎడం వైపు పొన్నాయిపూలేపూలు ,,,ట్రై చేయండి , పోన్నాయి పూలు మా ఇంటి నిండా ,ఆఫీసు నిండా రోజు సువాసనలు వెదజల్లుతున్నాయి -రోడ్ల మీద పడిపడి ఏరిమరిఅన్ని గదుల్లో ను ఫ్లోవేర్వజేస్ ,చెట్టు అందితే కొమ్మలు విరగదీసి మరి కొట్టుకోస్తున్నాను :)
@శేఖర్
,ఆర్,కే భవన్ ప్రక్కనే వున్నా ఫ్లయోవేర్ ఎక్కితే ఎడం వైపు పొన్నాయిపూలేపూలు ,,,ట్రై చేయండి , పోన్నాయి పూలు మా ఇంటి నిండా ,ఆఫీసు నిండా రోజు సువాసనలు వెదజల్లుతున్నాయి -రోడ్ల మీద పడిపడి ఏరిమరిఅన్ని గదుల్లో ను ఫ్లోవేర్వజేస్ ,చెట్టు అందితే కొమ్మలు విరగదీసి మరి కొట్టుకోస్తున్నాను :)
@శేఖర్
,ఆర్,కే భవన్ ప్రక్కనే వున్నా ఫ్లయోవేర్ ఎక్కితే ఎడం వైపు పొన్నాయిపూలేపూలు ,,,ట్రై చేయండి , పోన్నాయి పూలు మా ఇంటి నిండా ,ఆఫీసు నిండా రోజు సువాసనలు వెదజల్లుతున్నాయి -రోడ్ల మీద పడిపడి ఏరిమరిఅన్ని గదుల్లో ను ఫ్లోవేర్వజేస్ ,చెట్టు అందితే కొమ్మలు విరగదీసి మరి కొట్టుకోస్తున్నాను :)
@శేఖర్
,ఆర్,కే భవన్ ప్రక్కనే వున్నా ఫ్లయోవేర్ ఎక్కితే ఎడం వైపు పొన్నాయిపూలేపూలు ,,,ట్రై చేయండి ,
తృష్ణ గారు, పున్నాగ పూలు చాలా బాగున్నాయి. మా కాలేజ్ లో చాలా చెట్లే ఉన్నాయి. క్లాస్ రూంల్లోకి చక్కని పూల వాసన గాలిలో తేలి వొస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ పూలు జడలల్లటం నాక్కూడా వొచ్చు. ముఖ్యంగా ముడి చుట్టూ వీటిని పెట్టుకొనే వాళ్ళు. ఎంత క్లాసిక్ గా ఉండేదో!
వీటిని పొగడ పూలంటారట !! అమ్మ చెప్పింది !!! శ్రీకృష్ణునికి పరమ ప్రీతికరమయిన చెట్టట ఇది...బృందావనం లో పొగడ చెట్టు కింద శ్రీకృష్ణుడు మురళి వాయించేవాడని భాగవతం లో ఒక వర్ణన కూడ ఉంది.
నాకు కూడా ఆ పూలంటె చాలా ఇష్టం . అవి పున్నాగ పూలు.వాటి కాడలు నోట్లో పెట్టుకొని పీలిస్తె తేనె వస్తుంది.మా చిన్నప్పుడు వాటిని ఏరుకుని అలా తేనె తాగి తరువాత జడలు అల్లి ఆడేవాళ్ళం.
@పరిమళం: "బయతకు వెళ్తే..." విషయమ్లొ సెమ్ టు సేమ్..:) :)
@జ్యోతి: అయితే మీ దగ్గరికి ఆ జడలా అల్లతం నెర్చుకోటానికి వస్తానండీ...
@శేఖర్: కాడమల్లి వేరే ఉందండి...దుబ్బులా రౌండ్ గా పెరిగి దుబ్బు నిండా పూస్తాయి. చిన్నిగారు ఏదో చెప్పారు...పాటించండి...
@మురళి: మీరు పులు ఏరి ఇస్తే జడలు అల్లుతున్న అమ్మాయిలు....దృశ్యం బాగుందండీ... :) :)
@శిశిర: అవునాండీ..భలే...
@కొత్తపాళీ: ఆ పూల "నేచురల్ ఏర్ ఫ్రెషెనర్ " ఆస్వాదించిన మీరు భలే లక్కీ....
@చిన్ని: మా ఊళ్లో ఉన్నప్పుడు అలానే ఇంటినిండా ఉండేవండీ..
ఇక్కడ ఒకరి అపార్ట్మెంట్లో బోలేడు వృక్షాలు ఒకేచోట నిన్న అనుకోకుండా కనిపించేసరికీ ఆనందం పట్టలేదు...
లక్కీగా కెమేరా కూడా ఉండటం వల్ల ఫొటోలు తీయగలిగాను...
@జయ: అయితే జ్యోతిగారితొ పాటూ మీదగ్గరకు కూడా రావాలి నేను....ఆ జడలేమిటో నేర్చేసుకోవాలని మహా సరదాగా ఉంది నాకు...
@అనూ: ఆ తేనె నేను పీలుస్తూ ఉంతానండీ..కాని అప్పుడే రాలిన పూలైతే తేనె ఎక్కువ ఉంటుందండీ..:)
@అన్వేషిత: అయ్యో...."పొగడ పూలు" వేరండీ...లైట్ బ్రౌన్ కలర్లో చాలా చిన్నగా ఉండి లేత సువాసన కలిగి ఉంటాయి...వాటిని దండగా గుచ్చి ఆడుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు...
@శ్రీనిక: మేము కూడా "కాగడామల్లి" అనె అంటామండీ...మంచి సరే..మత్తెక్కించే వాసన అనాలండీ...i just love that fragrance..
మొన్న మొన్నటి దాకా ఈ పూలు మా పక్క వీధిలో ఫ్రెండ్ ఇంట్లో ఉండేవి. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా వాటిని ఏరి జడలల్లుతూ కూర్చునేదాన్ని, మా ఫ్రెండ్ విసుక్కుంటున్నా కూడా. మంచి సంగతులు గుర్తు చేసేరు..
ఫోటోలు భలే పెట్టారు, బాగున్నాయి.
ఈ పూలు చాలా సార్లు చూశాను కానీ వాటి పేరు తెలిదు.
అమ్మో నాకు అత్యంత ఇష్టమైన పూల మీద కామెంటటానికి ఇంత లేటైనానా? అయ్యో.. పర్లేదు లే లేట్ బెటర్ ధేన్ నెవర్. మా బందరు నిండా ఇవే పూలు వుండేయి. స్కూల్ మధ్యాన్నం పూట ఖాళి లో వెళ్ళి ఏరుకొచ్చి సాయంత్రాలు జడలల్లే వాళ్ళం. మా ప్రైవేట్ పక్కన కూడా ఇవే.. కొత్త పాళి గారన్నట్లు మన సినీ రచయతలకు ఇష్టమైన్ పువ్వు. పున్నాగ పూలు, బొగడ పూలు, పారిజాతాలు, విరజాజులు, మల్లె పూలు, సంపెంగలు, రాధా మనోహరాలు, రేరాణి పూలు (నైట్ క్వీన్ అని కూడా అంటారు సన్నగా చిన్న గా గుత్తు లు గుత్తులు గా వుంటాయి), వేప పూత, చంద్ర కాంత పూలు, మొగలి పూలు... ఈ సుగంధాలన్నీ నా బాల్యం లో పెన వేసుకు పోయిన భాగాలు. ఒక్కొ క్క దాని గురించి ఒక పోస్ట్ రాయొచ్చేమో.. ఫోటో చాలా బాగుందండి తృష్ణా...
అయ్యో నా కామెంట్ అన్నిసార్లు , కొంచెం ప్రోబ్లం అయ్యిందండీ,
ఇవి కాగడమల్లెలుకాదు బాబోయ్ :)
@బావన
వసంతంలో ప్రతి గదిలోనూ వేప పూల గుత్తులే ,అవి నాకిష్టం :)
naku kuda chala istam andi...chinappudu ma inti daggara railway quarters lo undevi nenu ma chelli velli yerukuni techukuni amma tho jada kuttinchukunevallam jada kuttina 5 min ki padu ayepoyevi flower vases lo guttu ga peditey chala andam ga undi illu anta vasanatho nindipoyedhi....ippudu ma office mundu undi aa chettu..officeboy tho teppistanu roju :P
వీటిని మేము పున్నాగపూలు అంటాము . వీటితో జడలల్లటమేకాదు , కాడల తో బూరలూదటము , రేకుల తో బుడగలు చేయటము అబ్బో చిన్నప్పటి ముచ్చటలే !
గన్రాక్ కాలనీ నిడా ఇవే పూలు . నేను ఏరుకుంటూ వుంటే మా ఫ్రెండ్స్ నవ్వుతారు .
అసలు నేనురాద్దామనుకున్నాను . ప్రతిసారీ కెమెరా తీసుకెళ్ళటము మర్చి పోతూ , ఆలశ్యం చేసాను . బాగుంది పొస్ట్.
పంతులమ్మ సినిమాలో" పున్నాగ పువ్వే " అని ఓ పాటకూడా వుంది . ఈ పదము మధ్యలోది అనుకోండి . మీకు తెలిసేవుంటుంది .
అమ్మయ్య ఓ పొస్ట్ అంత కామెంట్ రాసాను కాబట్టి పొస్ట్ రాయలేదన్న దిగులు లేదు .
@మాలా కుమార్: నేను ఇప్పుడే బయట నుంచి వచ్చానండీ....దారిలో song గుర్తు వచ్చింది.రాగానె మీకు రాయాలి అని బ్లాగ్ తెరిచాను..మీ వ్యాఖ్య ఉంది..ఉండండి వస్తున్నాను...
జడలే కాక, బూరలూ, బుడగలూ నా...వెమ్థనే మీ ఇల్లు వెతుక్కుని వచ్చేస్తా ఉండండి....
నేను వీటితో జడ అల్లిక మాదిరి మాల అల్లేదాన్ని. నాకు చాలా ఇష్టం. మేము చాలాకాలం నివసించిన ఒక ఆఫీస్ క్వార్టర్ గుమ్మం లో వుండేది.
పొన్న ( calophylium Inophylium )ను సంస్కృతంలో పున్నాగ అంటారు.కానీ తెలుగు లో పొన్న వేరు పున్నాగ వేరు.పొన్నఆకులు చిన్న సైజు బాదం ఆకుల్లా ఉంటాయి.కాయలు గుండ్రంగా ఉంటాయి.పున్నాగ పూలను"కొండమల్లెలు" "కాగడామల్లి" "పొన్నాయి పూలు" "సన్నాయి పూలు"అనికూడా అంటారు.మళయాళం వాళ్ళు చేసినట్లుగా మనతెలుగు వాళ్ళూ మన మొక్కల పేర్లూ ఇలా జత చేస్తే బాగుండునుః http://ayurvedicmedicinalplants.com/plants/3.html
Post a Comment