నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మేము ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్, ఋషీకేష్, మధుర(శ్రీకృష్ణుని జన్మస్థలం) మొదలైన ప్రదేశాలకు వెళ్ళాం. అప్పుడు హరిద్వార్ దగ్గర మొదటిసారి గంగా స్నానం చేసాను. ఎంత ఆనందంగా పవిత్రంగా అనిపించిందో చెప్పలేను...ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో ఆనాటి అనుభూతి నూతనంగానే ఉంది.
మళ్ళీ పది నెలల క్రితం మేము కాశీ, గయ మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాశీలో రెండవసారి గంగా స్నానం చేసాను. ఆనందం వేసింది కానీ చిన్నప్పుడు హరిద్వార్ లో ఆ మొదటిసారి పొందిన భావనే గొప్పగా తోచింది నాకు...ఎందుకనో మరి...!!
ఆ రోజు కాశీనాధునికి నా చేతులతో పాలాభిషేకం చేసాను, పువ్వులు వేసాను...విచిత్రంగా నాకు ఏమీ కోరుకోవాలనిపించలేదప్పుడు...అప్రయత్నంగా "ఆదిభిక్షువు వాడినేమి కోరేదీ.." పాట గుర్తుకొచ్చింది.
ఆ రోజు శుక్రవారం. విశాలాక్షి అమ్మవారి గుడి ఖాళీగా ఉంది మేం వెళ్ళినప్పుడు. ఎందుకో మరి మేం అడగకుండానే రండి కూర్చోండి అని కుంకుమపూజ చేయించి, కుంకుమ,గాజులూ ఇచ్చారు ఆ పూజారి. ఎంతైనా "ఇస్త్రీ "ని కదా..చాలా ఫీలయిపొయి ఆనందించేసాను.
అప్పుడు కాశీలో, గయలో తీసిన కొన్ని ఫోటోలు...
తెడ్డుపడవలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తూ ఒడ్దున కనబడిన వాటికి తీసిన ఫోటోలు ఇవి
"గంగా ఆయీ కహా సే..." అనే ఆర్.డి.బర్మన్ పాట గుర్తుకు వచ్చింది పడవలో వెళ్తూంటే...
కార్తీకం లో మీతో కాశీ యాత్ర చేయించేసాను చూసారా... :)
15 comments:
ఓ ధన్యవాదాలు తృష్ణ గారు! ఫోటోలు కూడా బావున్నాయి
హ హ మరే కార్తీకం లో మాచేత కాశీ యాత్ర చేయించారు మొత్తానికి :-) కానీ మొన్నీ మధ్యే వెళ్ళి వచ్చిన స్నేహితుడు అక్కడ శుబ్రత గురించి కాస్త ఆలోచించాల్సిందే అని చెప్పాడు. వాళ్ళ పాప పాపం అడుగు కింద పెట్టలేదుట ఎక్కడికి వెళ్ళినా డర్టీ గా ఉంది ఎత్తుకో అని అంటూ.
మీ తో పాటు మాకు పుణ్యం ఇచ్చారన్నమాట . థాంక్ యు .
ఫొటోలు బాగున్నాయి .
గంగా స్నానమంటేనే ఒక పవిత్ర భావన కలుగుతుంది. గంగోత్రి లో నేను చేసిన గంగా స్నానం నాకు ఆ అనుభూతిని ఎప్పటికీ మిగిల్చింది. హరిద్వార్, కాశీ ఈ రెండు ప్రాంతాలకన్నా నా కెందుకో గంగోత్రి లో చాలా అతీతమైన భావన కలిగింది.అక్కడి ప్రశాంతతే దీనికి కారణమయి ఉండొచ్చు. మీ అనుభూతిని చాలా బాగా వివరించారు. అంత చక్కటి పూజా అవకాశం రావటం కూడా అదృష్టమే.
1990లో వెళ్ళాను మీ టపాతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
@పరిమళం : థాంక్స్ అండీ..
@వేణూ శ్రీకాంత్: "ఇన్ బెనారస్" అని పదవ తరగతిలోనో, ఇంటర్ లోనో ఒక పాఠం ఉండేదండీ...అప్పుడే రాసారు కాశిలోని అపరిశుభ్రత గురించి...
ఈ నీళ్ళలో స్నానం చెయ్యాలా? అని సందేహించాము చాలా సేపు మేము కూడా...అందుకేనేమో నాకు చిన్నప్పటి "హరిద్వార్" గంగా స్నానమే హాయిగా తోచింది.
@మాలా కుమార్: ధన్యవాదాలు.
@జయ: కావచ్చునండీ...ఏ పుర్వ పుణ్యమో నాకు...మరీ జన్మలో అలాటి కొన్ని అవకాశాలు కలిగాయి.
@చిలమకూరు విజయమోహన్: బావుందండీ..
ధన్యవాదాలు.
నేను మూడేళ్ళ క్రితం ఐ.ఐ.టీ రూర్కి కి ఇంటర్యూకి వెళ్ళినప్పుడు అక్కడకు దగ్గరే అని హరిద్వార్ వెళ్ళాను. అక్కడ సాయింత్రం గంగానదికి హారతి ఇచ్చే టైంలో పూజారులు అమ్మ,నాన్నల గురించి పూజ చేస్తానని చెప్పి ఓ కర్పూరం వెలిగించి, నాలుగు మంత్రాలు చదివి ఒక్కొక్కళ్ళ దగ్గరా అక్షరాలా వందరూపాయలు దోచుకున్నారు. సెంటిమెంట్ తో కొట్టేసరికి ఇవ్వక తప్పిందికాదు నాకు. ఇలాంటి మోసాలు అక్కడ కొకొల్లలు అనుకుంటా. మీకు ఇలాంటి అనుభవాలు జరగలేదా?
ఫోటోలు బాగున్నాయండీ..
@శేఖర్:మేము వెళ్ళినది చాలా ఏళ్ళ క్రితం కదండీ అప్పుడింత మోసాలు లేవేమోనండీ..
నిజం గానే మాతో మానసిక కాశీ యాత్ర చేయించారు తృష్ణ. ఇప్పుడే అచ్యుతం కేశవం రామ నారాయణం వింటూ బ్లాగ్స్ ఓపెన్ చేసేను హరిహరుల దర్శనమయ్యింది ఒకే సారి.
@bhaavana: ఇదే విచిత్రం అంటే...నేను మీకు వ్యాఖ్య రాసి ఇటు వచ్చాను.. రాగానే... మీదిక్కడ...:) :)
మొత్తానికి డబుల్ పుణ్యం కొట్టేశారు :):)
@ murali: :)
అబ్బో ఎన్నితెలివితేటలో? ఒకటపాపెట్టి, డాజనుఫోటోలుకూడా లేకుండా రెండుపేరాలురాసి పుణ్యాన్నిమాత్రం గంపలతో ఎత్తుకెళ్తారా?
ఇకమీవిశేషాలకు వస్తే, హరిద్వార్ కాశీల మద్యన మనకుకనిపించే తేడా అక్కడిజీవనవిధానంలోని వైవిద్యం. మీకు కాశీలోని అపరిశుభ్రత కనిపించింది కానీ దానికి కారణం వెదికారా? లేదు. ఆకారణం మనమే. అంటే మనలాంటి యాత్రికులే.
తిరుపతికి వెళ్తే అక్కడ ముందు తలనీలాలు, క్యూలో నిలబడి దర్శనం, తిరుగుప్రయాణం. మరి ఇక్కడ? అంతకుమించింది మరేదో మనబ్లాగుల్లో, వ్యాఖ్యల్లో చెప్ప్పలేనిది. ఇక్కడ వందరూపాయలు కట్టీ క్యూలోనిల్చోవాలి. మరక్కడ ఎంతకట్టి తీసుకున్నారు దర్శనం టికెట్టు? విశ్వనాధున్ని తాకేందుకు ఎంతచెల్లించగలరు మీరు?
కాశీలోచూడాల్సినవి గుళ్ళూగోపురాలే కాదు. అక్కడి భారతీయత. అక్కడి సంస్కృతి.అంతకు మించిన మరేదోభావం.శతాబ్దాలపాటు జరిగిన దాడులను ఎదుర్కొని నిలబడ్డ ఆత్మస్థైర్యం. అందుకే అది కాశీ.
ఇక గంగవిషయానికి వస్తే ఆపాపం కాశీవాసులది కాదు. వారికి ఎగువన ఉన్న పరిశ్రమలది. హరిద్వార్ దగ్గర కొండల్లోంచి ఉరికివచ్చిన భగీరథి గంగగా మారే ప్రాంతం. అక్కడ కొండలెక్కువ కాబట్టి జనసాంద్రత తక్కువ. కాబట్టే కాలుష్యం తక్కువ.గంగప్రవహించిన ప్రతిప్రాంతం పునీతమైతే, అలాంటి గంగను పునీతంచేసిన ప్రాంతం కాశీ.
ఇక విశాలాక్షి గుడి విషయానికి వస్తే- ఆగుడిలో ఎప్పుడూ రద్దీ ఉండదు. మిగతామందిరాల్లోకెళ్ళేప్పుడు ఉండేంత తనెఖీలు ఇక్కడ ఉండవు. మీకోసంగతి చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. బెనారస్లో చాలామందికి విశాలాక్షమ్మ తెలియదు. గుడిపేరుచెప్పి అడిగినా తెల్లమొహం వేస్తారు. అక్కడికి వెళ్లేవారు సింహభాగం మనం, తమిళులు. అన్నపూర్ణగుడిలో ఎక్కువ తెలుగువాతావరణం ఉంటే ఇక్కడ తమిళవాసనలు ఎక్కువ. దాన్ని పునర్మిర్నించింది కూడా తమిళుడే.
వీధులు అక్కడ ఎందుకు ఇరుగ్గా ఉంటాయి అంటే దానికి కారణం మనచరిత్రే. దాడులనుంచి కాపాడుకునేందుకు స్థానికులు ఆగుళ్లకి చూట్టూతా ఇళ్ళుకట్టుకుని కాపలాకాశారు, కాలక్రమంలో పర్యాటకులే వారికి జీవనాధారం అయిన పరిస్థితుల్లో అక్కడె స్థిరపడిపోయారు. కాశీప్రజలు అక్కడికి వచ్చినవారికి ఉచితంగా భోజనం,వసతి కల్పించే స్థాయినుంచి యాచించే స్థాయికి వచ్చారు అంటే కారణాలు ఆలోచించండి.
ఇంకా చక్రతీర్ధం, బీహెచ్‌యూ, సంకటమోచనహనుమాన్, గంగాహారతి ఇలాచాలా ఉన్నాయి. రాసినట్టులేదు. బిజీనా? మణికర్ణిక దగ్గర ఒకశివాలయం ఉంటుంది దాని ఫోటోపెట్టలేదు?
గయలో కూడా చాలా ఉన్నాయికాదా? ఫల్గుణీనది, వటవృక్షం, బుధ్ధగయ వగైరవగైరా.
అన్నట్లు బెనారస్లో బస ఎక్కడ? ఆంధ్రాశ్రమమా? ఆప్రాంతాన్ని మానసరోవర్ అంటారు. ఆఘాట్ దగ్గరే అది ఉమ్టుంది.ఆవీధినే మినీబెజవాడ అంటారు. ఇకగయలో అరుణాచారి దగ్గరేనా? తెలుగువాళ్లు అక్కడకే వెళ్తారు? ప్రయాగవెళ్లల్లేదా? చాలా ప్రశ్నలు ఎందుకంటే మీయాత్రను ఇంకావివరంగా రాయాలి అని.
Post a Comment