సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 3, 2009

ఈ పాట గుర్తుందా..?

కొందరు సినీ నటులంటే మనకు ప్రత్యేకమైన ఆసక్తి లేకపొయినా సరే, మనకి ఇష్టమైన వాళ్ళకి ఆ నటుడు/నటి ఇష్టమైతే అప్రయత్నంగా మనమూ వాళ్ళ సినిమాలన్ని చూసేస్తూ ఉంటాము..! మా అన్నయ్యకి చాలా ఇష్టమైన నటుడు "కమల్ హసన్". కమల్ ప్రతి సినిమా వాడు చూడటమే కాకుండా మేమంతా అవి చూసేలా చేయటం వాడికి చిన్నప్పటి నుంచీ అలవాటు. కొన్ని సినిమాలు పాపం వాడు అడగకపోయినా రాగానే మేమే చూసేసేవాళ్ళం. అలా చూసిన ఒక సినిమా "గుణ". సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఈ పాట బాగా హిట్ అయ్యింది. (తమిళ్ లో కూడా) ఇళయరాజా సంగీతంతో పాటూ డబ్బింగ్ అయినా సరే పాట సాహిత్యం కూడా బాగా కుదిరింది. కొన్ని డబ్బింగ్ పాటలు సంగీతం బాగున్నా సాహిత్యాన్ని వినలేము...బాబోయ్..అనాలనిపిస్తుంది..

కాలేజి రోజులూ...ఈ పాట.. పొద్దున్నుంచీ గుర్తువస్తున్నాయి... క్లాసులో "లీజర్ పీరియడ్" వస్తే నాతో ఈ పాట అడిగి అడిగి పాడించుకునే వారు మావాళ్ళంతా...నేనేం గొప్ప సింగర్ ను కాదు కానీ బానే పాడతాను. (అదే...ఒకప్పుడు పాడేదాన్ని..!) మా క్లాస్ లో చాలా బాగే పాడే అమ్మాయి ఉండేది...తను ఎన్ని పాడినా, మళ్ళీ నన్ను పిలిచి "గుణ" లో ఈ పాట నేనే బాగా పాడతానని నాతో పాడించుకునేవారు. ఈ పాటది ఒక చిత్రమైన సన్నివేశం....పాట మధ్యలో డైలాగులు కూడా బాగుంటాయి...

ఇదిగో ఆ పాట ఇదే...




అది ఓపెన్ అవ్వని వాళ్ళ కోసం URL
http://www.youtube.com/watch?v=mO59WJTqGro

పాడినది: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
రచన: వెన్నెలకంటి
సంగీతం: ఇళయరాజా
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్నీ పాటలే కనుల తొటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో..కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...

గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గానీ నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నదీ
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదూ
అగ్ని కంటే స్వచ్చమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
నా హృదయమా...

24 comments:

కన్నగాడు said...

ఓ గీ పాటనా, గిదైతే మేం గిప్పటికీ మస్తుగ ఇంటం. మస్తుగ ఉంటది పాట

కార్తీక్ said...

తృష్ణ గారు భలే చక్కని పాట గురించి టపా రసారండి దన్యవాదాలు మీకు
నేనీ పాట రొజుకొక్కసారన్న వింటానండి అంథిస్టం ఈ పాటంటే మరే.......
నా రింగ్టొనె కూడా ఈ పాటలొదేనండి......
ఈ లైన్సే...

"నా ప్రేమెలా చెప్పలో తెలీకిదౌతుంటే ఏడుపొస్తుంది
కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాదపెడుతుందనుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడా ఆఆగుతుంది....

మనుషులర్ధం చేసుకునేందుకిది మామూలు ప్రేమ కాదు!
అగ్ని లాగ స్వచ్చమైనది "

www.tholiadugu.blogspot.com

జయ said...

ఈ పాట విన్నాను. కాని, మీరు పాడింది పెడితే ఇంకా బాగుండేది కదా... మీ పాట మేము కూడా వినే వాళ్ళం కదా!

Anonymous said...

ఈ సినిమా నాకు చాలా..చాలా ఇష్టం. ఈ సినిమా రిలీజయినపుడు ఉమాదేవి అని మా ఫ్రెండ్ ని కాలేజ్ లో అబ్బాయిలు చాలా ఏడ్పించేవారు పాపం .

అడ్డ గాడిద (The Ass) said...

Nice song this is! :)

మాలా కుమార్ said...

ఈ పాట వినటము ఇదే మొదటిసారి . బాగుంది .

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

పాటగా మార్చిరాశావా? నేనుకూడా మారుస్తా? మొదట నాప్రియా అన్నానుగాగా? అక్కడ ప్రియతమా అని మార్చుకో.
ప్రియతమా నీవక్కడ క్షేమమా? నేనిచట క్షేమం.
ఆహా!ఓహో! నిన్నూహించుకుంటే కవిత వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలంటే అక్షరాలే మాటలే
అదే
అదే అహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
మ్‌మ్‌ నాకుతగిలిన గాయమైతే చల్లగా మారిపోతుంది. అదేంటొ నాకుతెలీదు. ఏమాయో తెలీదు. నాకేమీ కాదు. ఇదికూడా రాసుకో. అక్కడక్కడా పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడునాకు ఏగాయమైనప్పటికీ ఒళ్లు తట్టుకుంటుంది. నీఒళ్లు తట్టుకుంటుందా? తట్టుకోదు. దేవి ఉమాదేవి.
అదిప్రేమ. నాప్రేమలా చెప్పలో తెలీక ఇదౌతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాదపెడుతుందనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది..అ%%హాహ్హహ్హ
మనుషులర్ధం చేసుకునేందుకిది మామూలు ప్రేమ కాదు! అగ్ని లాగ స్వచ్చమైనది.

ఈవాక్యాలు లేకుండా ఈపాట వింటే ఎలాఉంటుంది?
ఇంతకీ మీరు పాడేప్పుడు బాలువాక్యాలు ఎవరు పాడేవాళ్లు? అవిలేకుండా ఈపాత ఎంత బాగాపాడినా ఆ ఫీల్‌రాదు.

Hima bindu said...

నేను పాడుతున్నానూ .............అందమయిన ప్రేమలేఖ :)

SRRao said...

తృష్ణ గారూ !
మంచి పాట అందించారు. అభినందనలు.

తృష్ణ said...

@కన్నగాడు: ధన్యవాదాలు.

@కార్తీక్: మధ్యలో డైలాగులు కూడా వచ్చే మీకు..బావుందండీ...ధన్యవాదలు.

తృష్ణ said...

@జయ: ఎందుకండి బాబూ....వచ్చే ఈ నాలుగు వ్యాఖల్నీ ఇలా ఉండనివ్వండి....:) :)
(ఎవరూ పారిపోరు అనే ధైర్యమ్ వచ్చాకా తప్పక పెడతానండీ..)
ధన్యవాదలు.


@లలిత: సినిమా ట్రేజడీ కదాండీ. నాకు కొంచెం ట్రేజడీలు నచ్చవు...కానీ ఈ పాట మాత్రం నచ్చుతుందండీ...
ధన్యవాదలు.

తృష్ణ said...

@అడ్డగాడిద: రుద్రవీణ సినిమాలో ఒక డైలాగు ఉందండీ.."అంత చక్కని రూపేంటి? ఆ పేరేంటి?" అని.
జవాబు రాసేప్పుడు మీ పేరు(అడ్డగాడిద) రాయాలంటే , ఎక్కడన్నా చదివేప్పుడు కూడా ఇబ్బందిగా అనిపిస్తోందండీ...

ఇన్ని వేలు,లక్షల తెలుగు పదాల్లో మీకు ఏ పేరు దొరకలేదాండీ?

ఏమీ అనుకోకండి ఇలా రాసానని....ఇతర బ్లాగుల్లొ నా అభిప్రాయమ్ తెలపకూడదని రాయలేదు...ఇది నా బ్లాగ్ కాబట్టి రాస్తున్నాను...please don't mind.

Thankyou verymuch for your first comment in my blog.

తృష్ణ said...

@మాలా కుమార్: అరే..ఎప్పుడూ వినలేదా..? ఆశ్చర్యం...

@చైతన్య: బాగుంది...మొత్తం బానే బట్టీకొట్టావు...

మాది ఉమెన్స్ కాలేజీ. అక్కద "బాలు" లు ఉండరు డైలాగులు చెప్పటానికి :) :)

సంతోష్ said...

ఈ పాట మా కాలేజి లో మా సీనియర్ ఒకసారి పాడితే విన్నాను...
ఈ పాట ఏ సినిమాలోదో తెలుసుకొవడనికి చాలా time పట్టిందండి..
నన్ను raging కూడ చేశారు..
చేస్తే చేసారు గాని కమ్మని శ్రావ్యమైన పాటని రోజూ వినేలా చెసారు...
చక్కని పాట గురించి రాసినందుకు ధన్యవాదములు.... తౄష్ణ గారు..

కొత్త పాళీ said...

ఈ సినిమా ఏదో చూసినట్టుందే.
స్కూలు, లీజర్ పీరియడ్, ఆ పీరియడ్లో ఇల్లాంటి కలాపోసన కార్యక్రమాలు .. అదో లోకం!
మీరు పాడింది పెట్టరూ?

తృష్ణ said...

@సంతోష్ : Thankyou too..

@కొత్తపాళీ: స్కూల్లో అయితే కోయిర్ గ్రూప్ లో నేను ఉండేదాన్ని...రోజూ మేము మైక్ లో ప్రయర్ పాడితే పిల్లలంతా మా వెనుక పాడేవారు....అదో లోకం..!!
కాని నేను గట్టిగా పాడి చాలా కాలం అయ్యిందండీ...
ఇప్పుడు అందరూ ఇలా అడిగితే పాడేయాలనిపిస్తోంది...కాని అందరూ పారిపోతేనో...అని భయం..:) :)

మురళి said...

చాలా రోజులు విని ఈ మధ్యే కొంచం గ్యాప్ ఇచ్చిన పాట ఇది.. మళ్ళీ గుర్తు చేశారు.. అన్నట్టు మీ కార్తీకం సెలెబ్రేషన్స్ బాగున్నాయండీ..

నిషిగంధ said...

అదేపనిగా తినేసి మొహంకొట్టి ఇక పట్టించుకోని బాగా నచ్చిన స్వీట్ లాంటిదీ పాట నాకు... విని కొన్ని సంవత్సరాలైంది.. గుర్తుచేసినందుకు బోల్డన్ని థాంక్సులు :-)

తృష్ణ said...

@murali: thankyou.

@నిషిగంధ: First comment...thankyou verymuch for the visit.

తృష్ణ said...

మీ ఇద్దరికీ జవాబు రాయలేదని ఇప్పుడే చుసానండి..

@చిన్ని: అయితే మీరు అటో....ఇటో మరి..:)
ధన్యవాదాలు.

@ఎస్.ఆర్.రావు: ధన్యవాదాలండీ.

భావన said...

నేను తరుచు గా వినే పాట ఇది, ఇది రిలీజ్ ఐనప్పుడూ నన్ను అందరు తెగ ఏడిపించే వారు మరి ఉమ కదా నా పేరు.. నాకైతే బాలు గొంతు ను గొంతు అంటే ఫిజికల్ గా కాదు ఆ గాలిలో తేలి వచ్చే ఆ గొంతు ను అలా ముద్దు పెట్టుకోవాలనిపించేది, అదెలా అని అడగకండి ఎం.స్ గారి గొంతు వింటే బాలు గొంతు వింటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది.. బలే మంచి పాట, నాకు ఆ సినిమా కూడా బానే వుంది అందరికి నచ్చలేదు. జాగ్రత్త ఎవరో నిన్ను కూడ ఇదే మాదిరి ప్రేమిస్తున్నారేమో కొంప తీసి అని ఏడిపించే వారు.

తృష్ణ said...

@ bhavaana: :)
ya,i've seen ur name in kaumudi.

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి పాట గుర్తు చేశారు తృష్ణ గారు. బాలు గారి డైలాగులు లేని ఈ పాటను అస్సలు ఊహించలేను. ఈ సినిమా కూడా ఇష్టం నాకు.

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్: పైన చైతన్య ఆ డైలాగులన్నీ రాసేసాడు..చూసారా..:)