సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 2, 2009

సింగీతంగారి "క రాజు కధలు"


4,5 ఏళ్ల క్రితం "హాసం"అని ఒక తెలుగు మాసపత్రిక వచ్చేది.ఆ పత్రిక మొదటి కాపీ నుంచి ఆఖరు కాపీ దాకా మా ఇంట్లొ తెప్పించాము.ఎందువలనో పత్రిక ఆగిపొయింది.కానీ పత్రిక వినూత్నంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేది.సింగీతం శ్రినివాసరావు గారు "క రాజు కధలు" అనే శీర్షికతో కొన్ని కధలు ప్రతి నెలా రాసేవారు.అందరికీ ఎలా ఉండేవో తెలియదు కానీ నాకు మాత్రం ఆ కధలు చాలా అద్భుతంగా అనిపించేవి.ప్రతి కధలో గొప్ప లాజిక్,నీతి ఉండేవి.ప్రతి నెలా అవి కట్ చేసి, మొత్తం 21కధలు నేను బైండు చేయించి దాచుకున్నాను.తరువాత ఇటీవల ఒక పుస్తక ప్రదర్శనలో ఆ కధలు పుస్తక రూపంలో కనబడే సరికీ ఎగిరి గంతేసి పుస్తకం కొనేసాను.2005లోనే మొదటి ప్రచురణ జరిగినట్లు రాసారు.

ఇక్కడ సింగీతం గారి గురించి కొంత చెప్పాలి.అప్పటిదాకా నాకు ఆయన ఒక ప్రఖ్యాత దర్శకునిగానే తెలుసు.ఈ కధలు చదివాకా ఆయన ఎంతటి గొప్ప రచయితో,ఆలోచనాపరులో అర్ధం అయ్యింది. ఆయన గురించి అప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకున్నాను.

సుమారు 60చిత్రాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు.తెలుగు,కన్నడ,తమిళ్,మళయాళ,హిందీ,ఇంగ్లీషు భాషా చిత్రాలెన్నింట్లికొ ఆయన దర్శకత్వం వహించారు.రాష్ట్రపతి పతకాలు,నందీ అవార్డులు,ఎల్.వి.ప్రసాద్ అవార్డ్ వంటి ప్రతిస్ఠాత్మక అవార్డ్లెన్నొ అందుకున్నారు.
ప్రయొగాత్మక చిత్రాలకి ఆయన నాంది పలికారు.మయూరి,పుష్పక విమానం,విచిత్ర సోదరులు,మిఖేల్ మదన కామ రాజు,ఆదిత్య 369, భైరవ డ్వీపం, బృందవనం..మొదలైన సినిమాలతొ ఆయన ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించారు.అసలు డైలాగులే లేకుండా ఆయన తీసిన 'పుష్పక విమానం" నాకెంతొ ఇష్టమైన సినిమాలలొ ఒకటి.

1954లొ కె.వి.రెడ్డిగారి దగ్గర దొంగరాముడు,మాయాబజార్ వంటి చిత్రాలకి ఆయన సహాయ దర్శకులుగా పనిచేసారు.దర్శకేతర విభాగాల్లో కూడా ఆయన పనితనం చూపించారు.మొదట్లో కధలు,నాటకాలూ రాసి ఎన్నొ బహుమతులు అందుకున్నారు.భైరవద్వీపం చిత్రంలొ"విరిసినది వసంతగానం" అన్న పాటని ఆయనే రాసారు.కన్నడంలో కొన్ని సినిమాలకు సంగీతం కూడా చేసారు.కన్నడ జర్నలిస్టుల ఆసొసియెషన్ సింగీతం గారి మీద ఒక ప్రత్యేక పుస్తకాన్ని అచ్చువేసిందంటే అది ఆయన ప్రతిభకు నిదర్శనమే కదా.కొందరు గొప్ప దర్శకులు బొత్తిగా అర్ధంపర్ధం లేని కొన్ని ఫ్లాపు సినిమాలు ఎందుకు తీస్తారో తెలియదు.అలాంటి కొన్ని ఫ్లాపు సినిమాలు తీసినా కానీ;నిరంతరం ప్రేక్షకులకి ఒక కొత్తదనాన్ని అందించాలనే తపన ఉన్న గొప్ప దర్శకులు శ్రినివాసరావుగారు.


క్రిందటేడు "ఘటొత్కచ్" అని పలు భాషల్లో యేనిమాషన్ చిత్రాన్ని తీసి, తెలుగువారు కూడా యేనిమాషన్లు తీయగలరు అని నిరూపించిన ప్రతిభాశాలి ఆయన.కధనంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ సినిమా తప్పకుండా ఆడి ఉండేది!
ఏవో సర్దుతూంటే కనిపించిన పుస్తకం పట్టుకుని ఇంత పెద్ద పోస్టు రాసేసాను.ఆ పుస్తకం + ఆ రచయిత మీద ఉన్న అభిమానం అలాంటిది.ఓపిగ్గా చదివినవారికి ధన్యవాదాలు.బ్లాగు పుణ్యమా అని మరొసారి ఆ కధలని నేనూ చదువుకుంటాను!!

10 comments:

సుధీర్ వూణ్ణ said...

బాగా రాసారు. మీరు ఆ కధలను చదువుతు కొంచం బ్లాగిస్తే, మీ పుణ్యమా అని మేము కూడ ఆ ఆనందాన్ని పొందుతాం.ఎమంటారు?

సుధీర్ వూణ్ణ said...

బాగా రాసారండి. మీరు ఆ కధలను చదువుతూ కొంచం బ్లాగిస్తే, మీ పుణ్యమా అని మేము కూడ ఆ ఆనందాన్ని పొందుతాం.ఎమంటారు?

మురళి said...

నేను నాలుగేళ్ల క్రితం చదివానండి ఈ పుస్తకాన్ని.. మరోసారి తిరగేయాలి.. 'బహుముఖ ప్రజ్ఞాశాలి' అనదగ్గ అతి కొందరు తెలుగు వాళ్ళలో సింగీతం ఒకరు.. బాగుంది టపా..

తృష్ణ said...

muraligaru,sudhir garu,dhanyavAdAlu.

Padmarpita said...

బాగా రాసారండి...

తృష్ణ said...

sudirgAru,prayatnistAnu.kAni nAku time ekkuva umdadamdi.

తృష్ణ said...

padmarpita garu,dhanyavAdalu.

mohanrazz said...

excellent అండీ..ఆయన మాయాబజార్ కి సహాయ దర్శకుడని ఇప్పుడే తెలిసింది..చాలా బాగుంది మీ పోస్ట్....బ్లాగర్లకి కరాజు కథలు ఒకటొకటిగా పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మీదే అయితే!

sriram velamuri said...

మీరు అమావాస్య చంద్రుడు ,పంతులమ్మ ,మరిచిపోయినట్టున్నారు.. త్యాగయ్య సినిమా ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ .ది గ్రేట్ ఇళయరాజా మ్యూజిక్ చేస్తున్నారు.పోతే,హాసం పత్రిక ఆగిపోవటం తెలుగువారి దౌర్భాగ్యం

Anil Piduri said...

హాసం- పత్రిక అన్ని సంచికలనూ, కొని, దాచిపెట్టుకున్నాను.
వెలమూరి శ్రీ రాం తో ఏకీభవిస్తున్నాను.
ఒక మంచి పత్రిక- అది.
తృష్ణ- గారు మంచి వ్యాసాన్ని అందించారు.
కాదంబరి(కోణమానిని)
;