సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 24, 2009

మీనా


మీనా అంటే యద్దనపూడిగారి నవలానాయిక గురించి కాదు నేను చెప్పబోయేది.స్వశక్తి ని నమ్ముకున్న ఒక మంచి అమ్మాయి గురించి.మీనా మా ఇంట్లో పనిచేసే దుర్గ కూతురు.వాళ్ల అమ్మతొ పాటూ ఒక్క మా ఇంటికే వస్తుంది సాయానికి.తొమ్మిదింటికల్లా మళ్ళి వెళ్పోతుంది-కాలేజీకి తయారవ్వటానికి.ఇప్పుడు B.com ఫైనల్ కి వచ్చింది.సినిమా ల్లో హీరో లతో పాటూ హీరోయినులు కూడా బూతులు మాట్లాడేస్తూంటే.. అదే ఫాషన్ అనుకునే ఈ కాలంలో అంతటి సౌమ్యురాలిని,మృదుభాషిణిని నేను చూడలేదు.తన పనేదొ తాను చేసుకు పోతుంది.అడిగితే తప్ప సమాధానం చెప్పదు. మరాఠీ అమ్మాయి ఆయినా చక్కని తెలుగు మాట్లాడుతుంది.పొందికైన దుస్తులు ధరిస్తుంది.ఈ కలం పిల్లేనా అనిపిస్తుంది తనని చూస్తే. ఎన్విరాన్మెంటల్ సైన్సు కి సంబంధించిన ఏవొ టాపిక్కులు కావాలంటె ఆ మధ్యన కొన్ని డౌన్లోడు చేసి ఇచ్చాను.ఇవన్నీ చదివేస్తుందా...అని లోపల అనుకుంటూ.'పనమ్మాయి కూతురు ' అనే తక్కువ భావమేదొ నాలో ఉంది అప్పటికింకా. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాకా చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెప్తుందని తెలిసింది ఈమధ్యనే.అబ్బో.. అనుకున్నాను.సంపాదనకే అయినా ఎంతొ కొంత విజ్ఞానం ఉంటేనే కదా నలుగురికి బోధించగలదు.తన ఇంట్లో ఇద్దరు చెలెళ్లకి,ఒక తమ్ముడికి చదువు చెప్తుంది.వాళ్ల అమ్మకి వంట సాయం చేస్తుంది.అన్నివిధాలుగా తల్లికి తొడుగా నిలుస్తుంది. రెండవ సంవత్సరం డిగ్రీ మార్కులు ఎన్నివచ్చాయి అని అడిగాను మొన్న యధాలాపంగా."70% " అంది కూల్ గా.మొదటి సంవత్సరంలో ఎన్ని వచ్చాయి? అని అడిగాను అనుమానంగా.."70%" అంది తొణక్కుండా...ఆశ్చర్యపోవటం నా వంతైంది.ఆర్ట్స్ సబ్జక్ట్ లకి ఫస్ట్ క్లాసు రావటమే గొప్ప నే చదువుకున్నప్పుడు.. ఇప్పుడు మార్కులు అంత స్త్రిక్ట్ గా వెయ్యకపొయినా ఒక పనమ్మాయి కూతురికి ఇన్ని మార్కులా? అనుకున్నాను...ఆ పిల్లని ఆమె తాహతబట్టి అంచనా వేసినందుకు నా మీద నాకే సిగ్గు వేసింది.నేను ఆడిగితే తప్ప మార్కుల గురించి చెప్పుకోని ఆ అమ్మాయి నిరాడంబరత ని చూసి ముచ్చట వేసింది. నా దృష్టిలో ఎవరెస్టంత ఎదిగిపొయింది ఆ అమ్మయి. పొద్దున్న లేవగానే కాఫీ ఇవ్వలేదని తల్లితొ గొడవ పడే ఆడపిల్లలని,20ఏళ్ళు వచ్చినా గుండ్రం గుండంగా ఉంటాయే అవేమిటి (ఆవాలు పేరు తెలియక వచ్చిన తిప్పలు అవి) అని అడిగే పిల్లలని చూసాను గానీ ఇంతటి అణుకువ,వినయ విధేయతలున్న పిల్లని ఈకాలంలో నేనసలు చూడనే లేదు.ఇది కొందరికి అతిశయోక్తిలా అనిపించవచ్చు.కానీ సినిమాలు చూడని టీనేజీ పిల్లలు ఈకాలంలో ఎంతమంది?మా పాత పనమ్మాయి అయితే వచ్చిన కొత్త సినిమా ఆ వారంలొ చూసేసి మాకు రివ్యూ చెప్పేసేది.అందుకే అనిపిస్తుంది నిజంగా మీనా ఈ కాలం ఆడపిల్లలకి ఆదర్శవంతం కాగల అర్హతలున్న మంచి అమ్మాయి అని.నేను,మావారు ఇద్దరం కూడా హామీ ఇచ్చాము -ఏ అవసరం ఉన్నా అడుగు సహాయం చేస్తాము అని.ప్రస్తుతం డిగ్రీ తరువాత ఆ అమ్మయి చేత ఏ ఏ ఎంప్లాయిమెంట్ ఓరియెంటెడ్ పరీక్షలు రాయించాలా? అని అలోచిస్తున్నను. స్వశక్తి ని నమ్ముకున్న ఆమె తన కాళ్ళపై తను నిలబడి మరికొందరికి మార్గదర్శకం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధించాను.

3 comments:

Telugu Velugu said...

తృష్ణ గారు, ఇంత మంచి పనమ్మాయిలు కూడా ఉన్నారా ? మా ఇంట్లో పనమ్మాయి పని తక్కువ, మాటలు ఎక్కువ, వాళ్ళ నోరు తట్టుకోలేము కొన్ని సార్లు ! అన్నిటికీ బోల్డంత విసుగే ఆ సగం పనికి కూడా ! అందుకే మేమే చేసుకుంటాము ఇంట్లో పనులు !

మీనా గురించి చదువుతుంటే, చాల ఆనందమేసింది ! ఆ అమ్మాయికి బంగారు భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నా నేను కూడా ! మీనా లాంటి అమ్మాయిలని చూసి మన యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది !

అన్నట్టు టీనేజ్లో పనుల్లో సయం చేసిన పాపాన పోలేదు కానీ, "ఒక ఆట, పాట, సినిమా, షికారు ఏమి లేవా "? బయటకెళ్ళి సినిమా చూడు, అప్పుడప్పుడు అలా సినిమాలు కూడా చూస్తుండాలి అని మా ఇంట్లో పోరేవారు ! ;-) వేరే వాళ్ళ ఇళ్ళల్లో రివర్స్ సీను !

ఇప్పుటి సంగతి అడక్కండి ! :-)

తృష్ణ said...

మీ కలం పేరు బాగుంది.మేమూ చాల రకాల పనివాళ్ళతొ పడ్డాము.ఏదొ అదృష్టవశాత్తు ఈ అమ్మాయి దొరికింది.

మధురవాణి said...

@ తృష్ణ గారూ,
నా బ్లాగులో ఈ లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు.
మీనా గురించి మీరు చెప్పింది విన్నాక (అదే చదివాక) నాకూ బోలెడంత సంతోషమేసింది. ఇలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఉండటం ఖచ్చితంగా అపురూపమే..ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి తెలిశాక తను తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. మీ మీనాకి మా అందరి శుభాకాంక్షలు అందజేయండి.