సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, June 15, 2009

ఆమ్మే నా బెస్ట్ ఫ్రెండ్!!

ఈ టపా రాసే ముందు ఒక పుస్తకం గురించి చెప్పాలి.నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి "అమ్మకి జేజే".ఇది 2000లో పబ్లిష్ అయింది.అమ్మ గురించి ఒక 17మంది తో చెప్పించి దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి తరువాత వాటన్నింటినీ ఒక పుస్తకంలో పొందుపరిచారాయన. బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన గొప్పగొప్పవాళ్ళంతా వాళ్ళ అమ్మని గురించి భలేగా చెబుతారు ఈ పుస్తకంలో.దొరికితే తప్పకుండా చదవాల్సిన పుస్తకం.ఇంతకీ 'మా అమ్మ ' దగ్గరికి వచ్చేస్తే;
అమ్మ గురించి ఎంత రాసినా తక్కువే.ఆ సబ్జక్టు సముద్రమంత విశాలమైనది,లోతైనది.అందుకని చాల క్లుప్తంగా మాత్రమే రాద్దామని...

అమ్మానాన్నలతో పదహారేళ్ళు, నాన్నతో నలభైఏళ్ళ సాంగత్యం అమ్మది. జీవితమే ఆవిడ పాఠశాల.సహనానికి మరో పేరు మా అమ్మ.మౌనంతో సమస్యలని పరిష్కరించవచ్చని అమ్మని చూసి నేర్చుకున్నను.'ఎవరైనా రైజ్ అయినప్పుడు మనం మౌనంగా ఉండిపోతే సగం సమస్య తీరినట్లే ' అనేది అమ్మ.ఇంక అమ్మ చేసిన త్యాగాలు,పడిన అవమానాలూ,బాధలూ,వేదనలూ ఎన్నో.కానీ 'అందరితో పంచుకోవాల్సినది సంతోషం మాత్రమెఅనే అమ్మ ముఖంలో ఎప్పుడూ నేను చిరునవ్వునే చూసాను.ఎంత బాధ లోన ఉన్నా ఎప్పూడూ ఆవిడ బయిటకి వ్యక్తపరచడం నేను ఇంతవరకూ చూడలేదు.
పొద్దున్న లేచి స్నానం చేసి,పూజ చేసుకున్న తరువాతే మిగిలిన పనులు మొదలెడుతుంది ఇప్పటికీ. పనిమనిషి రాకపోతే అంట్లు కూడా తొమనిచ్చేది కాదు. పెళ్ళయితే ఎలాగూ తప్పవు.నాకు వదిలెయ్ అనేది.ఇప్పుడు తను అత్తగారు అయినా నాకన్నా కోడళ్ళని బాగా చూసుకుంటుంది. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి అనేది ఆవిడ కన్సెప్తు.కావాల్సినంత ఫ్రీడం వాళ్ళకి. అలా చేయాలి,ఇలా ఉండాలి అని ఎప్పుడూ రూల్సు పెట్టదు.
మా నాన్నది మీడియారంగం కావటంతో మాకు ఎప్పుడూ వచ్చేపోయే జనాలు ఎక్కువే ఉండేవారు.2,3రోజులు ఉండటానికీ,లంచ్ కీ,డిన్నర్లకీ కూడా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు.వచ్చినవాళ్ళందరికీ విసుగు లేకుండా,కబుర్లు చెప్తూ వండిపెట్టేది ఆవిడ.నాకు తెలిసి 10రోజులైన పుట్టింటికి వెళ్ళలేదు తను.ఎందుకమ్మా అని అడిగితే 'మే నాన్నకి హోటల్ భోజనం పడదు.నే వెళ్తే ఇబ్బందిపడతారు ' అనేది."బిహైండ్ ఎవ్రీ సక్స్సెసుఫుల్ మాన్ థెరీజ్ అ ఉమన్"కి నిర్వచనం మా అమ్మే. ఆవిడ సుఖపడింది చాల తక్కువ, మాకు ఇచ్చింది చాలా ఎక్కువ.తాను ఒక కొవ్వత్తిలా కరిగి మాకు వెలుగును చూపింది.
మా పాప పుట్టినప్పుడు 20రోజులు ఐ.సి.యు.లో ఉంది.పుట్టిన 3వ రోజు ఒకటి,5వనెలలో ఒకటి-రెండు సర్జరీలు అయ్యాయి. ఆమ్మే లేకపోతే నేను నా పాపని నేను దక్కించుకోలేకపోయేదాన్ని.దానికి ఆవిడ చేసిన సేవ అపారం.జన్మంతా చేసినా ఆవిడ ఋణం నేను తీర్చుకోలేను అనిపిస్తూఉంటుంది. ఆమ్మ విలువ పెళ్ళయ్యాకే తెలుస్తుంది. అత్తగారింట్లో కొన్నాళ్ళు ఉన్నాకే అమ్మ బాగా మనకు అర్ధం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అమ్మ అలా ఎందుకు చేసేదొ పెళ్ళయ్యాకా స్వీయానుభవం మీదే అర్ధం అవుతుంది.
అమ్మ దగ్గరున్న స్వాతంత్ర్యం మరెవరిదగ్గర దొరకదు మనకి. కసిరినా, కోప్పడినా, తిట్టినా, అరిచినా, మాట్లాడకుండా ఉన్నా.....మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!మనల్ని అర్ధం చేసుకుని,పొరపాట్లని ఎత్తిచూపి, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా కాపాడే మన మొదటి గురువు అమ్మే కదా.అందుకే ఎప్పటికీ నా బెస్టు ఫ్రెండు మా అమ్మే!!

11 comments:

పరిమళం said...

అమ్మ మనసు అంతే మరి !
ఎవరికైనా అమ్మే ఫస్ట్ ఫ్రెండ్ ! బెస్ట్ ఫ్రెండ్ !

తృష్ణ said...

పరిమళంగారు,ధన్యవాదాలు.

తృష్ణ said...

పరిమళంగారు,మీ బ్లాగులో పరిమళాలు నన్నూ తాకాయి.

సృజన said...

అంతే.... అమ్మ...అమ్మే!!

తృష్ణ said...

అవును సృజనగారూ.మీ బ్లాగులో మీ గురించి మీరు రాసినది చాలా నచ్చింది నాకు.

ఆత్రేయ కొండూరు said...

nijamE caalaa baagaa raaSaaru abhinandanalu.

తృష్ణ said...

ఆత్రేయగారూ,మీ కామెంటుకి కృతజ్ఞతలు.

మురళి said...

"అమ్మ దగ్గరున్న స్వాతంత్ర్యం మరెవరిదగ్గర దొరకదు మనకి.కసిరినా,కోప్పడినా,తిట్టినా,అరిచినా,మాట్లాడకుండా ఉన్నా.....మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!" నిజం!!

తృష్ణ said...

మురళిగారూ,ధన్యవాదాలు.

sivaprasad said...

chala bagundi

తృష్ణ said...

sivaprasad garu,thanks.