సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 16, 2009

నాలోన శివుడు కలడు..."

(Siva temple in coimbatore)
ఈ చివరి కార్తిక సొమవారం పరమ శివుణ్ణి ఇలా స్మరిస్తూ...
******

'పూర్తిగా తెలిసే వరకూ ఏ వ్యక్తి మీదా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు’ అన్నది నేను తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో ఒకటి. ఒక మనిషిని మనం మొదట ఏ దృష్టితో చూస్తామో అదే అభిప్రాయం మనకి ఆ మనిషి గురించి ఇంకా బాగా తెలిసేవరకూ ఉండిపోతుంది. మెల్లగా, పూర్తిగా ఆ వ్యక్తి తెలిసాకా, మనకు గతంలో కలిగిన అభిప్రాయానికీ, కొత్తగా ఏర్పడిన అభిప్రాయానికీ ఎంత తేడా ఉందో తెలిసాకా ఆశ్చర్యం వేస్తుంది. అలా నాకు గతంలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఒక వ్యక్తంటే అమితమైన అభిమానం ఏర్పడిపోయింది. అది "తనికెళ్ళ భరణి" గారు. ఆయనను సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో చూసి చూసి చిన్నప్పుడు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు..

"హాసం" మాస పత్రిక మొదలైయ్యాకా దాంట్లో ఆయన రాసిన వ్యాసాలు చదివాకా నాకు ఆయనంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంత మంచి రచయిత ఉన్నాడా ఈ వ్యక్తిలో అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మిగతా రచనలు కుడా కొన్ని చదివాను. తర్వాత ఆయన ఒక డైలాగ్ రైటర్,నాటక రచయిత,కధా రచయిత అని కూడా తెలుసుకున్నాను. దాదాపు పదేళ్ల క్రితం ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను...ఆయన గొప్ప శివ భక్తుడని. ఆయన స్వయంగా రచించి, స్వరపరిచి, పాడిన "నాలోన శివుడు కలడు" అనే ఆల్బమ్ విన్నాకా. ఇది నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాల ఆల్బమ్. మొత్తం ఐదు పాటలూ శివ తత్వాన్నీ, భరణి గారికున్న శివ భక్తినీ తెలుపుతాయి. అన్ని పాటలకూ ముందుమాట సామవేదం షణ్ముఖశర్మగారు చెప్తారు. అందులో నాకు బాగా నచ్చే మూడు పాటలు ఇక్కడ వినటానికి...మొదటి పాట మొత్తం సాహిత్యం కూడా....
--------------



నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి మూటగట్టేయగలడు(౩)

************

2) "హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా
విడి విడిగా వెతికాను ఒకచోటే కలిసారా..
అమ్మేమో విల్లంటా అయ్యేమో అమ్మంటా
గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంటా.."



************

3)"నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికీ
నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి.." పాటలో

"బుసకొట్టే పాములేరా మీ కోరికలు
అట్టలు కట్టిన జడలే పాతకమ్ములు"

"కడకు వల్లకాడేగద మీ నివాసమూ
కపాలమే గదా కడకు మీ విలాసమూ.."
వాక్యాలు జీవన తత్వాన్ని ఎంతో సులభంగా తెలియపరుస్తాయి.





*************

4)"ఈ జన్మకింతేరా మల్లనా
ఇంకో జన్మ నాకీయి మల్లనా..""
పాటలో "జానకి"గారి గళంలో పలికే ఆర్ధ్రతను విన్నాకా కళ్లలోకి నీరు ఉబికి వస్తుంది...

5)"ఓ శివా నా శివా బజ్జోరా మా శివా
ముడు కన్నులు మూసి బజ్జోర మా శివా..."
పాటలో "సుశీల" గారి జోల వింటూంటే మనకూ నిద్దుర వచ్చేస్తుంది...

భక్తిగితాలపై ఆసక్తి ఉన్న ప్రతివారు కొనుక్కోవలసిన కేసెట్ ఇది. ఇప్పుడు సి.డి కూడా వచ్చిందేమో తెలీదు మరి.
*********************************************************

ఇక రేపు తెల్లవారు ఝాములో పెట్టే "పోలి స్వర్గం" దీపాలతో ఈ కార్తీకానికి "హర హర మహాదేవ.."

18 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మీరు పెట్టిన చిత్రం, కోయంబత్తూర్లోని Isha Yoga ఆశ్రమం వారి "ధ్యాన లింగం". మొన్నీ మధ్యనే అక్కడకు వెళ్లి వచ్చాను. భరణి గారి, నాలోన శివుడు కలడు పాట నాకు చాల ఇష్టం.

మురళి said...

Prior to this, Bharani penned poems with the 'makutam' 'aata kadara sivaa..'

durgeswara said...

ee jagannatakamane aatanu sivudelaa aadutunnaado bharani gaaru chakkagaa vivaristunnaaru

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయండీ.. నేను ఇదే మొదటి సారి ఈ ఆల్బం గురించి వినడం.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఈకార్తీకం అంతా మీబ్లాగుద్వారా పుణ్యాన్ని బుట్టలతో ఎత్తుకున్నారా?
నేనూ చిన్నప్పుడూ గొల్లపూడిని, రావుగోపాలరావుని అలానే అనుకునేవాడిని. రావుగారి గురించి పెద్దగా తెలీదు ఇప్పటికీ. కానీ గొల్లపూడి గురించి తెలిశాక పెద్దఫ్యాన్ని అయిపోయా.

తృష్ణ said...

@వీ.వెం.గణేష్: అది మా ఫ్రెండ్ ఎవరో పంపినదండీ...


@మురళి: అలా ఒక్క లైను రాయకపోతే కాసిని డీటైల్స్ రాయచ్చు కదండీ...

తృష్ణ said...

@దుర్గేశ్వర: ధన్యవాదాలండీ..

@వేణూ శ్రీకాంత్: దొరికితే తప్పక కొనుక్కోండి.

@చైతన్య: మరే మరే...ఏదో రూపంలో కాస్తంత పుణ్యాన్ని మూటగట్టుకోవాలి కదా...

"వి.వి" సినిమాలో హీరోయిన్ తండ్రి రావుగోపాలరావు కొడుకుట కదా తెలుసా?

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అదేమో తెలీదుగానీ కొత్తబంగారులోకంలో ఫిజిక్సులెక్చరర్, మగధీరలో గతంగురించి విలన్‌కి చెప్పే అఘోరా అతనే

కొత్త పాళీ said...

చాలా బావుంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ ఆల్బం దొరుకుతోందా?

తృష్ణ said...

@చైతన్య: అఘోరా అని తెలీదు కానీ.. "కొ.బం.లో" లో లెక్చరర్ అని తెలుసు.

@కొత్తపాళీ: కేసెట్ దొరుకుతుందేమోనండీ మరి. చాలా ఏళ్ళ క్రితం కదా మరి వివరాలు నాకు తెలియవు.
ఈ పాటలు మీకు కావాలంటే మాత్రం అందించే ప్రయత్నం చేస్తానండీ..

భావన said...

బాగుంది తృష్ణా.. చాలా సార్లు సినిమాలు చూసి అదేదో వాళ్ళు నిజ జీవిత విలన్ లని కోపమెట్టేసుకుంటామే మనం... పాటలు బాగున్నాయి. అందించినందుకు థ్యాంక్స్.

పరిమళం said...

ఈ ఆల్బం గురించి నాకు తెలీదు భరణి గారివి మంచి పాటలు అందించారు ....

తృష్ణ said...

@bhaavana:
@ parimaLam:

thankyou.

Meher Krishn@ said...

can u mail me "aata kadara sivaneeku..."song &lyrics written by Mr.Tanikellabharani

my ID: tmk1989@gmail.com

తృష్ణ said...

@meher:i don't have that song presently. If i find it anywhere i'll surely mail to you. Thankyou for the visit.

రాజ్ కుమార్ said...

ముందుగా ధన్యవాదాలు అండీ.. వింటున్నాను. అద్భుతంగా ఉంది.
శివరాత్రి శుభాకాంక్షలండీ..

తృష్ణ said...

@raj: Thank you very much for the visit.

BoBy said...

chala chala dhanyavadamulandi...తృష్ణ...garu...