సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, August 26, 2009

Bhootnath



"क्रॊध कॆ बोझ को मन पे उठाये काहे चेल्ता है प्राणी

क्शमा जो श्त्रु को भी कर दे,वहि मुक्त है...वहि ग्यानी"
bhootnath సినిమాలో జావేద్ అఖ్తర్ "समय का पैय्या चेलता है.." పాటలోని మొదటి రెండు వాక్యాలూ..ఇవి.
"మనసులో కోపమనే బరువును ఎందుకు మోస్తూంటాడు ప్రాణి
శత్రువును సైతం క్షమించినప్పుడే ముక్తి....అదే జ్ఞానం(...అతడే జ్ఞాని..)"-- అని అర్ధం !!

ఆ మధ్యెప్పుడో "Outsourced " అనే సినిమా సగం నుంచీ చూసాకా మళ్ళీ చాలా రొజులకి టి.వీ.పెట్టి 4,5రోజుల క్రితం ఇంకో సినిమా కేబుల్ టి.వీలో ఆఖరు సగం చూశా..!అదే "bhoothnath".రెండు నిమిషాలు చూడగానే,కధ వేరే మార్చిన ఆంగ్లచిత్రం "Casper"కు భారతీకరణ అననుకున్నా.కానీ నెట్లో వివరాలు పరిశీలించాకా కధ Oscar wilde రాసిన short-story "the Canterville Ghost"కు adaptation అని తెలిసింది. చూసిన గంట ఆట బాగుంది.మొదటి సినిమా అయినా వివేక్ శర్మ కధను చిత్రీకరించిన విధానం బాగుంది.మరి నే చూడని మొదటి భాగం ఎలా ఉందో,బాక్సాఫీసు రిపోర్ట్ అవీ తెలీదు.పెద్దగా ఆడలేదని విన్న గుర్తు.

కొడుకు నిరాదరణకు గురైన ఒక తండ్రి చనిపోయి,తన ఇంట్లోనే భూతమైతిరుగుతూ, ఆ ఇంట్లో ఎవరు అద్దెకు దిగినా భయపెట్టి పారిపోయేలా చేస్తూ ఉంటాడు..ఆ ఇంట్లో దిగిన ఒక కుటుంబంలోని పిల్లవాడు మాత్రం ధైర్యంగా, అతనితో మచ్చిక చేసుకుని దగ్గరౌతాడు.ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ భూతానికి ముక్తిని కలిగించే ప్రయత్నం చేస్తారు.ఆ భూతం తాలూకు కుమారుడు వచ్చి శ్రార్ధకర్మలో పాల్గొని తండ్రిని క్షమాపణలు చెప్పుకోవటంతో ఆ తండ్రి ఆత్మకు విముక్తి కలిగి పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు.ఇది క్లుప్తంగా సినిమా కధ.

ఆ శ్రార్ధకార్యక్రమాలు జరగబోతున్నాయి అని పిల్లవాడు భూతానికి చెప్పినప్పుడు,భూతం పాత్ర పోషించిన అమితాబ్ ఆ పిల్లవానికి జీవితంలో కొన్ని సూత్రాలు పాటించవలసిందిగా చెప్తాడు."అబధ్ధాలు చెప్పకూడదు,ఇతరులని,తల్లిదండ్రుల్నీ బాధ పెట్టకూడదు......ముఖ్యంగా మనల్ని బాధపెట్టిన వాళ్ళని క్షమించటం నేర్చుకోవాలి"అని చెప్తాడు.అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు "మరి నువ్వెందుకు నీ కొడుకుని క్షమించలేదు..?" అని.ఆ సీన్ నాకు చాలా నచ్చింది.అప్పుడు వస్తుంది నేను పైన రాసిన పాట.మొదటి రెండు వాక్యలూ అయ్యాకా "సమయ్ కా పైయ్యా చెల్తా హై" అని పాట మొదలౌతుంది.

సినిమాలో నాకు బాగా నచ్చిన పోయింట్ ఇది.శత్రువును సైతం క్షమించగలగటానికి ఎంతో ధీరత్వం ఉండాలి.ఉదాత్తత ఉండాలి.మనల్ని బాగా బాధపెట్టినవాళ్లనీ,సూటిపోటి మాటలతో మనసుని గాయపరచిన వాళ్ళనీ,తమ చేతలతో మనసుని ముక్కలు చేసిన వాళ్ళనీ మనం క్షమించగలమా?చాలా కష్టం..!కానీ ఈ పాటలోని వాక్యాలు విన్నాకా అనిపించింది...నిజమే,ఎందుకు మనం ఇతరులపై కోపాన్నీ,బాధనీ,దు:ఖాన్నీ మోసుకుంటూ బ్రతుకుతాం?వాళ్ల పాపానికి వాళ్ళని వదిలెసి మన మనసులని ఎందుకు తేలిక చేసుకోమూ...అని. లేకపోతే మనం కూడా అమితాబ్ మాదిరి చనిపోయాకా భూతంగా మారిపొతామేమో....ఈ లెఖ్ఖన ప్రపంచంలో ఎన్ని కోట్ల,బిలియన్ల భూతాలు తిరగాడుతూ ఉన్నాయో..అనిపించింది కూడా!!

పాత్రల విషయానికి వస్తే,"బంకు" పాత్రలో పిల్లవాడు Aman Siddiqui మనసుని దోస్తాడు."భూత్నాథ్"పాత్రలో అమితాబ్ బచ్చన్ నటనకు తిరుగు లేదు.ఆ హావభావ ప్రదర్శన,కామిడీని పండించటం అన్నీ సూపర్.ఒక అసాధారణ నటుడిగా ఉన్నతమైన స్థానంలో ఉండే అమితబ్ "క్యారెక్టర్ ఆర్టిస్టు" పాత్రలు వేయటం వరకు ఒప్పుకోగాలను ,కానీ ఇలా ఒక బేల తండ్రి పాత్రలో కొడుకుని ప్రాధేయపడటం నేను సహించలేని విషయం.అలాంటి పాత్రలు కూడా వేసి ప్రేక్షకులను మెప్పించటం అమితాబ్ గొప్పతనమైనా,అతడిని అలా ఇతరులను ప్రాధేయపడే పాత్రల్లో చూడలేకపోవటానికి నాకతని మీదున్న అభిమానామే కారణం."baagbaan" లో కూడా నిరాదరణకు గురయ్యే తండ్రి పాత్రలో అమితాబ్ ను అస్సలు చూడలేక పోయాను.
ఈ సినిమాలో ఇతర పాత్రల్లో జూహీ చావ్లా,షారుఖ్ ఖాన్,ప్రియాన్షు చెటర్జీ,రాజ్ పాల్ యాదవ్ నటించారు.

10 comments:

Padmarpita said...

నాకూ నచ్చిన సినిమా...చిన్నపిల్లవాడి నటన బాగుంది.

లక్ష్మి said...

ఈ మధ్య కాలంలో వచ్చిన చక్కటి సినిమా ఇది. ఎవ్వరూ కూడా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా చక్కటి మెచ్యూరిటీ కనపరిచారు నటనలో. పిల్లాడు మాత్రం కంట తడి పెట్టించాడు.

మురళి said...

నేను చూడాలనుకుని చూడలేక పోయిన సినిమాల్లో ఇదీ ఒకటి.. బాగుందండీ పరిచయం..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మనకు నచ్చినా నచ్చకపోయినా కథ తనకు నచ్చితే అందులో బిచ్చగాడి పాత్రకూడ వేసేందుకు సిద్దమే ఆయన. ఇమేజీ చట్రాల్లో ఇరుక్కుపోయి ఫార్ములా చిత్రాలు తీస్కునే సగటు హీరోకాదు కాబట్టే ఆయన అమితాబ్ అయ్యాడు.

శేఖర్ పెద్దగోపు said...

నేను ఈ సినిమా చూడలేదు. కానీ అందరూ అనటం విన్నాను..ఆ పిల్లవాడు, అమితాబ్ నటన చాలా బావుంటుందని..
@సుబ్రహ్మణ్య ఛైతన్య గారు, బాగా చెప్పారు.

సృజన said...

అందుకే ఆయన బిగ్ బి అయ్యారు
మనందరి అభిమానాన్ని చూరగొన్నారు.

Sujata M said...

Oscar wilde రాసిన short-story "the Canterville Ghost"కు adaptation -- ఓహ్ ! నాకు తెలియదు. నేను దీని గురించి నవతరంగం లో రాశాను. నాకు ఈ సినిమా చాలా నచ్చింది. అమితాబ్ కి మా ఆయన పెద్ద పంఖా ! నాకూ ఇష్టమే ! అయితే అమితాబ్ తో సమానంగా భలేగా నటించాడు బంకూ ! ఇందులో చోఢో భీ పాట నాకు చాలా ఇష్టం.

తృష్ణ said...

Thankyou verymuch to all for the comments.Iam unable to respond to all the comments because of slight ill-health.see you all in my next post...thank you one and all.

మధురవాణి said...

ఈ సినిమా నాక్కూడా చాలా నచ్చింది.
ఇంతకీ @outsourced' సినిమా చూసినట్టా.. లేదా మీరు.?

తృష్ణ said...

madhuravani,
check this link.
http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_10.html