సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 22, 2009

ఎగరేసిన గాలిపటాలు..

చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతొ మధురమైనవి.ఆ జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చే ఎన్నొ పాటలు ఉన్నాయి.వాటిల్లో
"స్నేహం" చిత్రంలోని ఈ పాట ప్రతి మనసులోని ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది...
పాడినది:పి.బి.శ్రినివాస్ గారు, స్వరపరచినది:కె.వి.మహదేవన్ గారు. క్రింద లింక్ లో ఈ పాట వినవచ్చు.
http://www.savefile.com/files/2160020

ఎగరేసిన గాలిపటాలు

దొంగాట దాగుడుమూతలూ
గట్టుమీద పిచ్చుక గూళ్ళు
కాలువలో కాగితం పడవలూ
గోళీలు గోటీబిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల
చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు

పడగొట్టిన మావిడికాయ
పొట్లంలో ఉప్పూకారం
తీర్ధంలో కొన్న బూర
కాయ్ రాజా కయ్ (4)

దసరాలో పువ్వుల బాణం
దీపావళి బాణా సంచా
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు

నులివెచ్చని భోగిమంటా
మోగించిన గుడిలో గంటా
వడపప్పు పానకాలు
పంచుకున్న కొబ్బరి ముక్క

గొడమీద రాసిన రాతలు
వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు
చిత్త,స్వాతి వానజల్లు

చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలిరాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు....!!

9 comments:

మురళి said...

మంచిపాటని గుర్తు చేశారు

తృష్ణ said...

ధన్యవాదాలండి.

Bhãskar Rãmarãju said...

అత్భుతమైన పాటని అందించారు. ధన్యవాదాలు.

తృష్ణ said...

మంచి పాటని గురించి రాస్తే మురళిగారు తప్ప ఇంకెవరూ స్పందించలేదే అని బాధపడుతున్నాను.. చాలా చాలా ధన్యవాదాలండి.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఇప్పటిదాకా వినలేదు ఈపాటని. చాల బావుంది. పాట మొత్తచాలా బావుంది కానీ
"గొడమీద రాసిన రాతలు
వీడిపోవు వేసిన బొమ్మలు
చెరిగిపోని జ్ఞాపకాలు
చిత్త,స్వాతి వానజల్లు"
బాగా నచ్చింది. ఉదయమ్నుంచి సెర్వర్ దౌన్. అందుకే కామెంటలేదు.

తృష్ణ said...

బాపుగారి స్పేషాలిటి అది.ఆయన సినిమాలొ డైలాగులే కాదు పాటలు కూడా అద్భుతంగా రాయిస్తారు.
ఇల్లుమారే హడావుడేమో అనుకున్నా..నిన్నది చూడలేదా?

sriram velamuri said...

బాగుందండీ ...ఈ సినిమా మీద ఒక జోక్..సృష్టి లో తీయనిది స్నేహమేనోయీ అని ఓ కవి అంటే..బాపు రమణలు తీసిపెట్టారట

వేణూశ్రీకాంత్ said...

పాట సాహిత్యం చాలా బాగుంది తృష్ణ గారు. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకో ఆడియో లింక్ పని చేయడం లేదు. నేను వేరే వెబ్సైట్ లో విన్నాను.

భావన said...

లింక్ పని చెయటం లేదు తృష్ణా.. పొద్దుట నుంచి ప్రయత్నిస్తున్నా ఆ ట్యూన్ కోసం.. గుర్తొస్తుంది గుర్తు రావటం లేదు.. అబ్బ ప్లీజ్ ఇంకా ఎక్కడైనా మీకు తెలిసి వుందేమో చెప్పరు ప్లీజ్..