సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, November 1, 2009

" My lost world..."


వెన్నెలని, వర్షాన్ని, కృష్ణశాస్త్రి గారి రచనల్ని ప్రేమించని మనుషులుంటారా?
ఉండరు కాక ఉండరు..
నేను అంతే...వెన్నెలంటే ఎంతిష్టమో...కృష్ణశాస్త్రిగారు అంటే అంతే ఇష్టం..
వారి జన్మదినం సందర్భంగా మన "ఆంధ్రా షెల్లీ" కృష్ణశాస్త్రి గారిని స్మరిస్తూ..
నాకు చాలా ఇష్టమైన రెండు పాటల్లోని ఈ వాక్యాలు...

"....బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు..
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై నడిచిన
నీ అడుగుల గురుతులే మిగిలినా చాలును...."

(మేఘసందేశం)
*******


"....నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియ యేని ఇక విడిచి పోకుమా...
ఎగసిన హృదయము పగులనీకుమా..

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో..."
(మల్లీశ్వరి )

********** *************

"రెండు రోజులు blog ముట్టుకోను" అన్నప్పుడే మావారు అదోరకంగా చూసారు...
ఆ చూపుకర్ధం ఇప్పుడర్ధమయ్యింది..:)

but i have strong reasons...asusual...

నాన్నకు కొంచెం బాలేదని చూద్దామని వచ్చాను...కానీ ఎప్పటిలానే ఈ ఇంట్లో ఉండిపొయిన నా ప్రపంచాన్ని పలకరిస్తూ..వెతుక్కుంటు..అవి ఇవి చూస్తుండగా... చాలా రోజుల్నుంచీ వెతుకుతున్నా నా రెండూ అట్టపెట్టెలు దొరికాయి..."My lost world.."!!

అదీ నా ఆనందానికి కారణం...ఆ పెట్టెల్లో నా ఒకప్పటి ప్రపంచం ఉంది..

కొనుక్కున్న గ్రీటింగ్స్..
రాసుకున్న పాటల డైరీలు...
తెలుగు,హిందీ..ఇంగ్లీష్..దేశభక్తి గీతాలు, గజల్స్, లలిత గీతాలు..ఎన్నో...

కలక్ట్ చేసుకున్న కొటేషన్స్ బుక్స్...
కొన్ని నోట్స్ లు...
ఇంకా కొన్ని కవితలు..డైరీలు...
ఏవేవో పేపర్ కట్టింగ్స్...
హిందు పేపర్ తాలుకూ కొన్ని ఆదివారపు ఫోలియో బుక్స్..
చూసిన ప్రతి సినిమా పేరూ..వివరం..
దాచుకున్న సినిమా టికెట్లు..వాటి వెనుక ఎవరితో వెళ్ళానో + ఆ సినిమా పేరు..

నా ప్రపంచాన్ని చూసి నాకే నవ్వు వచ్చింది..
ఎంత పిచ్చిదాన్ని...అసలు నా అంత పిచ్చివాళ్ళెవరైనా ఊంటారా అని సందేహం..

ఒకప్పుడు ఇదే జీవితం....
ఇప్పుడు ఇవి కేవలం నా జ్ఞాపకాలు...
వీటిని చూస్తే పెదాలపై ఒక చిరునవ్వు...అంతే!!

అవన్నీ చూసి ఏవో లంకె బిందెలు దొరికినంత ఆనందం...
ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం..
నా ఖజానాలోని కొద్ది భాగం మిత్రుల కోసం ఈ ఫొటోల రూపంలో...




ఇది కొటేషన్స్, గ్రీటింగ్ కార్డ్ మేటర్స్ రాసుకున్న డైరీలో పేజీ..

"సుమిత్రా నందన్ పంత్" కవిత్వానికి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

""మహాదేవి వర్మ" కవితకి తయారు చేసుకున్న నోట్స్ తాలుకూ పేజీలు..

24 comments:

మురళి said...

తృష్ణ గారూ 'బ్రతుకంతా ఎదురు చూతు పట్టున రానే రావు..' పాట మధ్యలో కొన్ని లైన్లు మిస్సింగ్.. ఖాళీ అయినా ఉంచాల్సింది కదా.. మీ గత స్మృతులు బాగున్నాయి.. నా కొక్కిరాయి రాత చూసినప్పుడల్లా 'చేతి రాత బాగుంటే నుదుటి రాత బాగుంటుంది' అనేవాడు బాబాయి.. 'ముత్యాల్లాంటి అక్షరాలు' అంటే ఏమిటో ప్రాక్టికల్ గా చూపించారు మీరు...

మురళి said...

అన్నట్టు నేను కూడా చాలా రోజులు టిక్కెట్టు వెనుక సినిమా పేరు, తేదీ రాసుకుని దాచుకున్నాను... వాటికి కాలదోషం పట్టేసింది.. అవి కనిపిస్తే యెంత సంతోషం కలుగుతుందో నేను ఊహించగలను.. స్వీట్ మెమొరీస్...

గీతాచార్య said...

:-)

Seems like you have a great interest in lit. Valuble info this is!

సుభద్ర said...

మీ నాన్న గారికి ఎలా ఉ౦ది ఇప్పుడు..
బాగు౦ది.మీ ఖజానా..విలువకట్టలేని స౦పద కదా!నాకు మా అమ్మ వాళ్ళి౦ట్లో ఓ బోషాణ౦ ఉ౦ది.నాకు గ్రీటి౦గ్ కార్డ్ లు,కీ చెయిన్స్ అ౦టే మహా పిచ్చి చిన్నపుడు.నచ్చినవి రాసుకొవట౦ కూడా..అన్ని సరదాలు పోయినా ఈ రాసుకోవట౦ ఇ౦కా ఉ౦ది.సినిమా టిక్కెట్లు కాదు కాని నేను చాక్లేట్లు తిని వాటి కాగితాలు మీద మీలానే తారీకు,ఎవరు ఇచ్చారు,ఎ౦దుకు,ఎవరితో తిన్నాను రాసుకుని దాచుకునేదాన్ని.అవి అన్నిఉన్నాయి..నేను అవి చూస్తున్నప్పుడు మా వారు లేకు౦డా జాగర్త పడతా,తనను నన్ను చూసే జాలి చూపు తట్టుకోలేక.నాకు ఆపాత వాసనలు తగలగానే లోక మర్చిపొతాను.మ౦చిస్మృతి గుర్తు చేశారు.ధ్యా౦క్స్..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

వ్రతంచెడ్డా ఫలం మాకు దక్కింది. మీఇంట్లో దొంగతనానికి వచ్చేవాడికి కూడా కొద్దిగా కళాహృదయం ఉండాలి.
"అసలు నా అంత పిచ్చివాళ్లు ఉంటారా?" ఈప్రశ్నతో మీలో సెల్ఫ్రియలైజేషన్ మొదలైమ్దని అనుకుంటున్నా. ;)
ఇంతకీ ఈరోజు అన్నంవండుకున్నారా? లేకవీటిని చూసుకుంటూనే...

జయ said...

తృష్ణ, కృష్ణశాస్త్రి గారి గురించి ఎంత రాసినా తక్కువే. మనకు తెలిసింది కూడా తక్కువే.చక్కగా రాసారు.
మీ లాంటి ప్రపంచమే కొంచెం అటూ ఇటూగా నాక్కూడా ఉంది. ఇంకా చాలా మంది క్కూడా ఉందని నా అనుమానం. మనలాంటి పిచ్చివాళ్ళకి ఈ లోకంలో ఏం కొదువ లేదనుకుంటా! మంచి సేకరణలు. మీతోటే భద్రంగా ఉంచుకోండి.
నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త.

తృష్ణ said...

@ మురళి: తప్పులు రాకూడదని పుస్తకంలో చూసి మరి రాసానండీ.."మేఘసందేశం'లోని ఆ పాతలొ ఆ నాలుగు నాకు బాగా నచ్చుతాయి...ఆ లైన్లే రాసాను...

మిగిలిన లైన్లు "మల్లీశ్వరి"లో "మనసున మల్లెలు" పాతలోవి...నాకు చాలా ఇష్టమైన పాట అది..మీకు తెలిసే ఉంటుంది.

Tkts. గురించి--అయితే పర్వాలేదండి..నాలాటి వాళ్ళు ఇంకొందరున్నారని సంతోషిస్తాను..:)

నుదుటి రాత సంగతి తెలీదు కాని..నా రైటింగ్ కోసమని చాలా మంది నాతో నోట్సులు అవీ రాయించుకునేవారు..కొందరికి సైన్స్ రికార్డ్స్ కూడా రాసిపెట్టానండి...

తృష్ణ said...

@ G : thankyou.

@సుభద్ర: అడిగినందుకు థాంక్స్ అండీ..నాన్నకు ఇంకా తగ్గలేదండీ..సమయం పడుతుంది..
పెద్దవారయ్యే కొద్దీ ఇలా ఏవో ఒకటి...మనం పెద్దవుతున్నా అమ్మానాన్నలను అలా పెద్దగా అవుతుంటే, శారీరిక ఇబ్బందులతో చూడలేము ఎందుకో...

"మా వారు లేకు౦డా జాగర్త పడతా,తనను నన్ను చూసే జాలి చూపు తట్టుకోలేక." ఈ మాట నిజం..:)

తృష్ణ said...

@ చైతన్య: అంటే ఏమిటి నీ ఉద్దేశం? హమ్మా...
ఉన్నది అమ్మ దగ్గర కదా ఇవాల్టికి వండుకునే పని లేదులే..రేపట్నుంచీ తప్పదు..

తృష్ణ said...

@ జయ: ధన్యవాదాలు. నాన్నకి..కొంచెం పర్వాలేదు.. టైం పడుతుంది..

పొనీలెండీ..నాకు తోడు బోలెడుమంది ఉన్నారని సంతోషంగా ఉంది..

మరువం ఉష said...

ఎంత ఆనందం అనుభవించి వుంటారో మీ టపా తెలుపుతూనే వుంది. మీరు మీవంటి వారు ఒంటరి మాత్రం కాదు.

ఆ "ముందు తెలిసెనా..." [మేఘసందేశం] ఈ మధ్య ఒక రోజంతా పాడుతూనేవున్నాను.

నేను అపురూపం గా దాచుకున్న లిస్ట్ ఇంకా పెద్దది. కానీ నా జ్ఞాపకాల బౌతిక గుర్తులు కొన్ని చేజారిపోయాయి. కానీ మనసులో పదిలం.

మీ నాన్నగారికి త్వరలో స్వస్థత చేకూరాలని ఆకాంక్షిస్తూ...

తృష్ణ said...

@ ఉష: నా దగ్గర కూడా నాతో అత్తారింటికి పట్టుకెళ్ళినవి కాక ఇక్కడ మిగిలిపోయిన వాటి లిస్ట్ అండి..ఇది..

thanks for the concern ma'm.

Padmarpita said...

అయితే ఈ ఆదివారం ఆనందంగా గడిపివుంటారు, కాస్త నాన్నగారి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టినా...అవునా?

Hima bindu said...

నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియ యేని ఇక విడిచి పోకుమా...
ఎగసిన హృదయము పగులనీకుమా..
భానుమతి గొంతులో విని విని రికార్డు కూడా అరిగిపోయిందేమో ...ఇష్టం చాల .
మీరు చేసిన లా నేను చేసేదాన్ని ఒక్క సినిమాలు టికెట్స్ లాటివి తప్పించి .అన్నట్లు మీర్ మారిస్ స్టెల్లా లోన మొంటి స్సోరి లో చదివారా నాకెందుకో రెండోది అనిపిస్తుంది ...ప్రభోధ బుక్ సెంటర్ నాకిష్టమైన సెంటర్ ,తరువాత మంచి కార్డ్స్ అశోక్ లో దొరికేవి (మీరెక్కడో వీటి ప్రస్తావన తెచ్చారు అందుకే )

SRRao said...

' When loved ones
especially members of our immediate family die, we are inconsolable........... '
ఒక్కసారి మరచి పోయాననుకుంటున్న గతం కళ్ళ ముందు కదిలింది. Thanks.
కృష్ణ శాస్త్రి గారి గురించి ఎంత చక్కగా రాసారో మీ డైరీలో రాతలు అంత చక్కగా రాసారు. ఇతరుల డైరీ చదవడం సభ్యత కాదేమో ! కానీ మీ దస్తూరీని ఇంకా దగ్గరగా చూడాలనిపించింది. చూస్తే జ్ఞాపకాల తలుపు తట్టారు. మీరేమీ ఆలోచించకండి. మీ కంటే పిచ్చివాళ్ళు చాలామందే ఉన్నారు. ఉదా . నేను.

తృష్ణ said...

@ పద్మ: అవునండీ...చాలా చాలా...దొరకవనుకుని ఆశ వదిలేసాకా దొరికినవాటిని చూస్తే ఎలా ఉంటుంది..?

@చిన్ని:నాక్కూడా అది చాల ఇష్టమైన తెలుగు పాట..ఆ 4వాక్యాలు కూడా..విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అప్రయత్నంగా...

రెండోది కాదు...మొదటిది--"మారిస్ స్టెల్లా" .అప్పట్లో ఊళ్ళోకెల్లా బెస్ట్ కాలేజీ. నాకెంతో ఇష్టమైన కాలేజీ..నాకెంతో నేర్పిన కాలేజీ..i just love my college..! ఏ గ్రీటింగ్స్ షాపులు లేని రోజుల్లో "ప్రబోధా" నే ఉండేదండీ..అక్కడకి నేనూ,మా నాన్న తెగ వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంగణంలోని పెద్ద పెద్ద చెట్ల పైంటింగ్ కూడా నాన్న ఒకసారి వేసారు..

తృష్ణ said...

రావు గారూ,
అది పర్సనల్ డైరీ కాదండి..పర్సనల్ డైరీ అలా ఫొటొ పెట్టేస్తానా.. :)

అది నేను కలక్ట్ చేసిన కొటేషన్స్, గ్రీటింగ్ కార్డ్ మేటర్స్ రాసుకున్న డైరీ.. (టపాలో రాసాను.)
బావున్నాయనిపించినవన్ని అందులొకెక్కించేదాన్ని..
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ said...

చాలా మంచి సంపద దాచుకున్నారు. నేనూ ఇంటికి వెళ్లినప్పుడు పైన అలమారాలో ఉన్న నా మిగిలిన కొద్ది ఖజానాని ఇలానే చూసుకుని గత స్మృతుల్లోకి వెళ్ళిపోతుంటాను. నాలాంటి పిచ్చివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట!

తృష్ణ said...

@సిరిసిరిమువ్వ :ఓహ్..బావుందండీ..నేను ఒంటరిని కాదన్నమాట...నాకు తోడు బొలెడు మంది...

కార్తీక్ said...

krishna saasthri gaari gurinchientha raasinaa thakkuve.....

krishna saasthri gaarante nachchani vaallanTe naaku chalam, sree sree lu gurthosthunnaru.....

vaallu koodaa poorthigaa ayistatha choopaledanukondi......


www.tholiadugu.blogspot.com

Hima bindu said...

సో మీరు మా కాలేజి లోనే చదివారా !ప్రభోధ బుక్ సెంటర్ లో పెద్దపెద్ద చెట్లు ఆవరణ అంతా పూలు రాలి ....గత స్మృతుల్లా...ఇప్పుడా వన్నె తగ్గిన ఒక క్షణం లోపలి వెళ్లి రావలన్పిస్తుంది

sunita said...

మీ ఖజానా బాగుంది!మీ నాన్నగారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ.....

వేణూశ్రీకాంత్ said...

ఆహా అద్భుతమైన సంపద :-) నిజంగా ఎంత పెద్ద లాటరీ తగిలినా ఇంతకన్నా ఆనందం ఉండదేమో :-)
మీ నాన్నగారికి పూర్తి స్వస్థత చేకూరిందని తలుస్తాను.

తృష్ణ said...

వేణూ శ్రీకాంత్: నిజమేనండీ...
నాన్నకు ఇంకా పుర్తిగా తగ్గలేదు. అడిగినందుకు ధన్యవాదాలండీ.