సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, November 15, 2009

కూరల మార్కెట్...

(ఇది రెండు రోజుల క్రితం మార్కెట్కు వెళ్ళినప్పుడు రాసినది...అప్పుడు పెట్టలేకపోయాను..ద్వితీయ విఘ్నం కాకుండా ఇవాళ పెట్టేస్తున్నా..:) )


చల్లని సాయంత్రం...ఆహ్లాదకరమైన వాతావరణం...బస్ ఎక్కాలనుకుని మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకున్నాను. నడిచి వెళ్ళాలని అనిపించింది. కూరల కోసం రిలయన్స్...చౌపాల్ మొదలైన వాటికి వెళ్ళటానికి విసుగనిపించినప్పుడల్లా నేను దగ్గరలోని మార్కెట్ కు వెళ్తూంటాను. కొద్దిగా దుమ్ముని, బురదని భరించగలిగితే మార్కెట్టే కూరలకి బెస్ట్ నాకైతే. ఇయర్ ఫోన్స్ తీసి చెవులకు తగిలించుకున్నాను. అలా పాటలు వింటూ ఎంత దూరమైనా నడిచేయటం నాకు చాలా ఇష్టం...అలానే వింటూ బయల్దేరాను. ఆర్.జే ఏదో జోకేసారు. భలే నవ్వు వచ్చింది....రోడ్దు మీద నవ్వుకుంటు వెళ్తూన్న నాకే అనుమానం వచ్చింది...ఒక్కర్తి రోడ్డు మీద నవ్వుకుంటా వెళ్తోంది..పిచ్చిదనుకుంటారేమో...అనిపిమ్చి బలవంతాన నవ్వు ఆపుకున్నా... చెవిలో "గల గల పారుతున్న గోదారిలా..." మొదలైంది...ఆలోచనలూ పరిగెట్టడం మొదలేట్టాయి...

కూరల కోసం మార్కెట్ కు ఎప్పటినుంచీ వెళ్తున్నానో గుర్తు వచ్చింది...12,13 ఏళ్ళ నుంచీ వెళ్తున్నాను. నా ఫ్రెండ్ గుర్తుకు వచ్చింది. మధ్యలో ఈ ప్రెండేమిటి? అంటే...డిగ్రీలో ఉన్నప్పుడు నా క్లోజ్ ప్రెండ్ ఒకమ్మాయి ఇల్లు విజయవాడ సత్యనారాయణపురం మార్కెట్ వెనక సందులో ఉండేది. మొదట్లో వాళ్ళింటికి వెళ్ళేప్పుడు అమ్మ కూరలు తెమ్మంటే "తేను ఫో" అనేదాన్ని. ఒకసారి నేను వెళ్ళినప్పుడు తను "కూరలు తేవాలి వస్తావా?" అంది..."కూరలు నువ్వు తెస్తావా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.."అవును..అమ్మకి కుదరకపోతే నేను వెళ్తాను.." అంది. అంతే...ఆ రోజు మొదలు ఈ రోజు దాకా నాకు కూరలు తేవటం చాలా ఫేవరేట్ పని అయిపోయింది. అమ్మ అడగకుండానే "అమ్మా!కూరలు కావాలా?" అని అడిగేదాన్ని. కాలగమనంలో నా ఫ్రెండ్ నాకు నెమ్మదిగా దూరమైపోయింది...అయినా ఈ "కూరలు కొనటం" అనే ఇష్టం మాత్రం ఇలాగే ఉండిపోయింది...!

ఆ ప్రెండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం...మా ఇద్దరి మధ్యన రహస్యాలు, చెప్పుకోని విషయాలు ఉండేవే కాదు...అర్ధరాత్రి అపరాత్రి లేదు...ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది ఒకరితో ఒకరం చెప్పేసుకోవాల్సిందే. మా ఇద్దరి నాన్నలూ ఫోను బిల్లులు గురించి బెంగలు పెట్టుకున్న రోజులింకా గుర్తు నాకు.. 10,12 ఏళ్ళ గాఢ స్నేహం తరువాత చెప్పుకోదగ్గ కారణాలు లేకపోయినా జీవనగమనంలో మారే ప్రాధాన్యతలూ, యాంత్రిక జీవన విధానం మా దూరానికి కారణం అయ్యాయి...కొన్ని స్నేహాలు అంతేనేమో...వాళ్ళని blame చెయ్యాలనిపించదు....she's still is a part of my heart...! తను గుర్తొస్తే నాకీ ఆతిఫ్ పాట గుర్తు వస్తుంది..""तेरे बिन में यु कैसे जिया...कैसे जिया तेरे बिन..लेकर याद तेरी राते मेरी कटी..."

సరే, ఇంతకీ మార్కెట్ వచ్చేసి ఆలోచనలు కట్ అయ్యాయి...fm లోంచి ఇయర్ ఫోన్స్ లో "ओ सथिरॆ तेरॆ बिना भी क्या जीना.." పాట మొదలైంది...ఆహా ! అనుకున్నా...అలా వింటూనే కూరలు కొనటం మొదలెట్టాను. ఏమిటో ఈ రేట్లు...సింధుభైరవిలో భైరవి డైలాగ్ గుర్తు వచ్చింది "వంకాయలా గుర్రాలా?" అంటుంది. అలాగ వంకాయ ధర కాకపోయినా మిగిలిన వాటి ధరలలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించట్లేదు. చివరిగా ఆకుకూరలతో కొనటం పూర్తి చేసాను...

చెవిలో ఇదివరకెప్పుడూ వినని కొత్త పాటొకటి మొదలైంది...చిల్లర లెఖ్ఖ వేసుకునే హడావుడిలో పాట తాలుకూ వివరం వినలేదు. "రింగ రింగా రింగ రింగా..." అని వస్తోంది పాట. ఏదో మాస్ పాటలాగుంది. ఏదన్నా కొత్త సినిమాలోదేమో...సరదాగా అనిపించింది. సగమే విన్నాను మరి..మొత్తం ఎలా ఉంటుందో..ఇంటికెళ్ళగానే గూగులమ్మనడగాలి అనుకున్నా. కూరల బరువుతో బస్సెక్కటం వీలు కాదు కాబట్టి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నా...

ఇంకేంటి..? ఆటో ఇంటికీ....నేను లిఫ్ట్ లోకీ...!! అంతే...

19 comments:

మేధ said...

హ్మ్..
ఆ పాట ఆర్య-2 సినిమాలోనిది.. పాట బీట్ బానే ఉంటుంది కానీ, ఆ లిరిక్స్ భయంకరంగా ఉంటాయి!!

తృష్ణ said...

@ మేధ: అవునా? మొత్తం వినలేదు...సగమే విన్నానండీ...అయినా సరదాగా అనిపించి రాసాను.....

వీరుభొట్ల వెంకట గణేష్ said...

________________________
ఇల్లు విజయవాడ సత్యనారాయణపురం మార్కెట్ వెనక సందులో ఉండేది.
_________________________

బెజవాడలో, మా ఇంటి వెనకాల సందులో సత్యనారాయణపురం (డాక్టర్ రాజగోపాలచారి) మార్కెట్ (:-

More, Reliance Fresh లలో కూరలు కొనడం నాకు ఇష్టం ఉండదు. కనీసం వారం రోజుల నిలవ సరకు ఉంటుంది.

శేఖర్ పెద్దగోపు said...

ఏంటోనండీ..ఈ కూరల మార్కెట్ కి వెళ్ళి కొనటం బాగానే ఉంటుంది..కానీ వాటి ధరలు తిరిగి ఇంటికి వచ్చి చెప్పటం ఉంటుంది చూశారూ! అది మాత్రం చాలా కష్టమైన పని నాకైతే..

హరే కృష్ణ said...

Now i'm fine,thanks

lekar yaadein teri, raatein meri kati
mujhse baatein teri, karti hain chandni

tanha hai, tujh bin raatein meri
din mere, din ke jaise nahi

tanha badan, tanha hai ruh
nam meri aankhen rahe
aaja mere ab rubaroo
jeena nahi bin tere


మీ టపాలో ఈ రెండు లైన్ల ను చూసి తెలియకుండానే ఇక్కడ వరకు పాడేసా
అతిఫ్ గొంతులో ఎదో magic ఉంది still he is controversial for Aadat song

మీ ఫ్రెండ్ గురించి అంత బాగా రాసారు కదా పేరు చెప్పనేలేదు :)

జయ said...

మొదట్లో రోడ్ మీద నేను చాలా మంది ని, ఏదో తమలో తామే మాట్లాడుకుంటూ, రకరకాల ఆక్షన్స్ చేసుకుంటూ పోయేవాళ్ళను చూసి కొంచెం ఆశ్చర్యపోయేదాన్ని. కాని తరువాత తెలిసింది అది చెవిలో ఇయర్ఫోన్స్ ప్రభావమని. ఇప్పుడు అది అందరికీ అలవాటైపోయింది. కాబట్టి భయం లేదులే తృష్ణా! ఇప్పుడెవరూ ఇటువంటి వాళ్ళని పిచ్చి వాళ్ళనుకోరులే.
కాలక్రమంలో నాకు కూడా కొంతమంది స్నేహితులు దూరం అయ్యారు. వాళ్ళను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో తెలియదు మరి.

కొత్త పాళీ said...

Nice. ఆంధ్రదేశం వదిలి పెట్టే వరకూ నేను బిసెంటు రోడ్డు చివరన ఉండే కూరల మార్కెట్టునించి కూరలు తెచ్చే వాణ్ణి. అంగడి వాళ్ళు నోటితో సంక్లిష్టమైన లెక్కలు అవలీలగా చేసెయ్యడం నాకు గొప్ప ఆశ్చర్యం కలిగించేది.

మురళి said...

Ringa..ringaa is from Arya-2.. What about bargaining?? :)

తృష్ణ said...

@గణేష్: అయితే మీరు నన్ను చాలా సార్లు చూసి ఉంటారు..:)

రిలయన్స్ లో కూరలకి ఫొటో తీసి నెట్లొ పెట్తాలన్నంత కోపం వస్తుందంది నాకు..ఒకొసారి ఆ వాడి వడిలిన కురలను చూస్తే...

@శేఖర్: అయ్యో అలగంటే ఎలాగండి..నేర్చుకోండి..ఫ్యూచర్లో పనికి వస్తుంది..
ఇంటికి వచ్చి కాయితం మీద ఏ కూరలు కొన్నానో లెఖ్ఖ రాసుకుని..ఎంత పట్టుకెళ్ళానో ఎంత అయ్యిందో చూసుకుంటాను నేను..:)

తృష్ణ said...

@ హరే కృష్ణ: ఆ పాట నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటండీ...ఎన్నిసార్లు విన్నా విసుగు రాదు..ఆ గొంతులో ఉన్న మేజిక్ అది...

తను నాతో లేకపోయినా పేరు చెప్పి నా స్నేహితురాలిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండీ...

తృష్ణ said...

@ జయ: నేనూ మొదట్లో మీలాగే అనుకునేదాన్ని ..ఆ సంగతి నా "ఎఫ్.ఎం.నేస్తాలూ టపాలో రాసానండీ..
http://trishnaventa.blogspot.com/2009/07/fm.html

విడిపోయిన చిన్ననాటి స్నేహితులను,సన్నిహితులను ఎప్పటికీ మర్చిపోలేమండీ..

తృష్ణ said...

@ కొత్తపాళీ: ఆ "గవర్నర్ పేట మార్కెట్" కూడా తెలుసునండి నాకు..కాని సత్యనారాయణపురం మార్కెట్లో రేట్లు తక్కువగా ఉండేవి...రైతు బజార్ వచ్చాకా ఇంక అక్కడ నుంచే తెచ్చేదాన్ని...
వాళ్ళ లెఖ్ఖలు నాకూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండీ.. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు వాళ్ళ ఫాస్ట్ కౌంటింగ్ అర్ధం కాక వేళ్లతో లెఖ్ఖేసుకుంటు ఉంటాను..:)


@ మురళి: పైన మేధగారు చెప్పారు పేరు..

కూరలు బేరం ఆడటం నాకు రాదండి...అమ్మ నేర్పేది కానీ..ఎందుకనో నాకు అలా రెండురూపాయిలో,రూపాయో.. తగ్గించు అని అడగాలని అనిపించదు..బాగా ఎక్కువ అనిపిస్తే తప్ప బేరమాడను.రిలయన్స్ మొదలైన షాపుల్లో పెట్టిన రేట్లకు మాట్లాడకుండా కొంటాము..వీళ్ల దగ్గర పాపం బేరాలెందుకు.. అని చెప్పిన రేటుకు కొనేస్తూ ఉంటానండీ..

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నాకు మార్కెట్టుకెళ్లి కూరలుతే అని చెప్పేకంటే ఏకాదశి అని కేలండర్లో రాసుకోవడమే నయం అనుకుంటుంది అమ్మ. అంతలేతగా, నవనవలాడే ఉత్తమజాతి కూరలను తీసుకొస్తానన్నమాట.
'సింధుభైరవి‌' పేరు వినగానే "కుడితినీళ్లు తాగవచ్చిన లేగదూడను.." గుర్తొచ్చి నాఆస్థానగాయకుడు వినాంప్ చేత పాడించా.

తృష్ణ said...

@ చైతన్య: నాకు ఆ సినిమా డైలాగులన్నీ బట్టీ....కేసెట్ ఉండేది ఇంట్లో...."పు మాల వాడెనుగా..." "నేనొక సింధు.." "పాడలేను పల్లవైన.." మూడూ సూపర్ పాటలు ....its a good film..

ప్రణీత స్వాతి said...

కూరలు కొనడానికి వెళ్ళడమంటే నాకూ ఇప్పటికీ ఇష్టమేనండీ..
కాకపోతే ఒకటే ప్రాబ్లం..ఏంటంటే ఇప్పటికి కూడా నాకు బేరం ఆడడం రాదు. కొట్టతను ఎంత చెప్తే అంత ఇచ్చేసి కొనేస్తాను..అదేంటో కానీ పాపం వాళ్ళెలా బ్రతుకుతారు పాపం మనం బేరమాడి అంతా తగ్గించేస్తే అనే భావన వుండేది చిన్నప్పుడు..అది ఇప్పటికీ కంటిన్యు అవుతోంది..
ఒక్క కూరలే కాదండోయ్ ఏది బెరమాడలేను.
ఇంతకీ మీ టపా చాలా బాగుంది.
అయితే నాకు లాగా మీరు కూడా హిందీ పాటలు వింటారన్నమాట.

వేణూశ్రీకాంత్ said...

ఫోటో కలర్‍ఫుల్‍గా భలే ఉంది :-) నాకు కూరల మార్కెట్ అనుభవం తక్కువే. ఆర్య-2 లో ఈ పాట ట్యూన్ ఎంత బాగుందో లిరిక్ అంత చిరాకు తెప్పిస్తుంది. ఇందులోనే ’బేబి హిలవ్స్ యూ’ అనే పాట ఉంది దాని సాహిత్యం చాలా బాగుంది వినండి.

తృష్ణ said...

ప్రణీతగారూ, అయితే మనం మనం ఒక జాతే నన్నమాట...:)
బేరమాడటం గురించి మురళిగారికి రాసిన సమాధానంలో రాసాను చూడండి..

హిందీ పాటల గురించి "నాకిష్టమైన పాటలు" లేబుల్లో చూడండి..చాలా కబుర్లు దొరుకుతాయి...నేను అన్ని రకాల సంగీతాల్నీ వింటానండీ...హిందీ పాటలంటే మాత్రం స్పెషల్ ఇంట్రస్ట్..

తృష్ణ said...

వేణూగారూ, నిన్న మన బ్లాగ్మిత్రులు ఇచ్చిన పేరును పట్టుకుని గూగులమ్మలో ఈ సినిమా పాటలు వెతికి విన్నానండీ.
మీరు చెప్పిన పాట బాగుంది నిజంగా. "రింగా రింగా" లిరిక్ మీరన్నట్లు అసభ్యంగా ఉన్నా, ఆ బీట్ సరదాగా బాగుందండీ..

భావన said...

కొట్టు ఫొటో బాగుంది. ఎన్ని కూరగాయలో ఎంచక్కగా.. మీరు అలా ఓ సాథిరే తెరె బిన పాట రింగ రింగ పాట కలిపి వినేస్తున్నారా? హ హ హ .. అతిఫ్ పాట అప్లోడ్ చెయ్యరూ నా కోసం ప్లీజ్..