సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, December 17, 2010

గీతాసారం

రెండు పర్వదినాలు ఇవాళ ఒకేసారి వచ్చేసాయి. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. ముక్కోటి ఏకాదశి గురించి ఇక్కడ అదివరకూ రాసాను. ఇక "గీతా జయంతి" సందర్భంగా సంక్షిప్తం చేసిన గీతాసారం:


గీతా సారం:

* ఏమి జరిగిందో, అది బాగా జరిగింది.
* ఏమి జరుగుతోందో, అది బాగా జరుగుతోంది.
* ఏమి జరగబోతోందో, అది కూడా బాగానే జరగబోతోంది.
* నీది ఏది పోయింది, ఎందుకు నీవు బాధ పడుతున్నావు?
* నీవు ఏమి తెచ్చావని,
* అది పోయిందని బాధ పడుతున్నావు?
* నీవు ఏమి సృష్టించావని అది నష్టపోయిందనడానికి?
* నీవు ఏమి తీసుకున్నావో, ఇక్కడ నుంచే తీసుకున్నావు.
* నీవు ఏమి ఇచ్చావో, ఇక్కడనే ఇచ్చావు.
* ఈవేళ ఏది నీదో, అది న్నిన్న ఎవరిదో మరెవరిదో అయిపోతుంది.
* పరివర్తన సంసారం యొక్క నియమం.

********************************

పైన రాసిన "గీతాసారం" ఒక కేలండర్లో మా హాల్లో ఉండేది చాలా ఏళ్ళు. చాలా మంది బాగుందని రాసుకుని వెళ్ళేవారు కూడా. క్రితం ఏడు "గీతా జయంతి"నాడు నేను ఊళ్ళో లేనందువల్ల టపా రాయలేక, చైతన్యను తన బ్లాగ్లో పెట్టమని చెప్పాను. ఆ టపా ఇక్కడ. అప్పుడు నా బ్లాగ్లో రాయలేదన్న లోటూ ఈసారి ఇదిగో ఇలా తీర్చేసుకున్నాను...:)

4 comments:

గీతాచార్య said...

అహా కలలు నిజమాయే...

గీతా జయన్తి శుభాకాంక్షలు :)

జయ said...

బాగుంది గీతా సారం. ముక్కోటి ఏకాదశికి ఉపోషమేనా. శుభాకాంక్షలు అందుకోండి మరి.

durgeswara said...

వందే గీతామాతరం

తృష్ణ said...

@గీతాచార్య: అంతేగా మరి...:)ధన్యవాదాలు.

@జయ: ఏమిటో నాకు ఉపవాసాల మీద పెద్దగా నమ్మకం లేదండి. చిన్నప్పుడు మాత్రం అమ్మ ఉపవాసపు సాయంత్రం చేసే పసందైన వంట కోసం అప్పుడప్పుడు ఉపవాసం ఉండేదాన్ని...:)ధన్యవాదాలు.

@దుర్గేశ్వర: ధన్యవాదాలు.