సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 28, 2010

"ళృ ...ళౄ"



గుణింతం గుర్తులు
 మధ్యనే నేను మా పాపతో పాటూ గుణింతం గుర్తులు నేర్చుకున్నాను. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము etc..etc.. అంతవరకూ బానే ఉంది. చిన్నప్పటివి ఎలానూ గుర్తులేవు. మళ్ళీ నేర్చేసుకోవటం అయ్యింది. అక్షరాలు కూడబలుక్కుని పేపర్లో హెడ్డింగులు, ఏదైనా కథల పుస్తకంలో వాక్యాలు చదివిస్తూంటే చక్కగా చదువుతోంది పాప. అది చూసి రెండు కాకులమూ("కాకి పిల్ల..." సామెత ప్రకారం) చాలా ఆనందిస్తున్నాం.


ఇక గుణింతాలు రాయటం, పలకటం నేర్చుకుంటున్నాం(నేనూ,పాప). దాదాపు అన్ని గుణింతాలు వచ్చేసాయి. "" నుంచి "" వరకూ, ఆఖరుకి "" "క్ష" గుణింతాలు కూడా పలకటం వచ్చేసాయి. కానీ ఒక్క గుణింతం మాత్రం నాకు పలకటం రావట్లేదు. అది కూడా మొత్తం కాదు. రెండే రెండు అక్షరాలు. అదీ "" గుణింతం. , ళా, ళి, ళీ, ళు, ళూ వరకూ వస్తోంది ఇకపై నాలిక పలకటం లేదు... "ళృ ...ళౄ" నేను పలికిన తీరు చూసి మా పాప పడీ పడీ నవ్వుతోంది...:(

మీకెవరికైనా పలకటం వస్తోందేమో కాస్త చెబుదురూ...

15 comments:

SHANKAR.S said...

చాలా మంది తల్లిదండ్రులు తెలుగు నేర్పించడం నామోషి అనుకునేలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మీ అమ్మాయికి దగ్గరుండి శ్రద్ధగా తెలుగు నేర్పిస్తున్నందుకు అభినందనలు. 'మాతృ'భాష అన్నా పదాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారన్నమాట. :) ఇక మీ కష్టాలు చూస్తే 'త్ప్రువ్వట బాబా తలపై పువ్వట' పద్యం గుర్తొస్తోంది. ఇంకా బండి 'ర' (దీన్ని తెలుగులో ఎలా టైపు చెయ్యాలో నాకు తెలియలేదు) లాంటివి వాడుకలో లేకపోవడం వలన మీరు బ్రతికిపోయారు.

జ్యోతి said...

లేఖినిలో

~ra .. ఱ

mirchbajji said...

ha haa hi hee hu hoo he hey hai ho ... idi nerpandi mee paapaku. maa paapa nenu guninthaalu nenu cheputhaanante nenu cheputhaa ani potee padevaallam.

జయ said...

చక్కాగా సంగీతం నేర్చుకుని శృతి, లయలతో పాడ గలిగిన నాలుక...ఆ మాత్రం అనలేకపోతే ఎలా!!! Common say 100 times:)

gosukonda sudhakar said...

మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
http://donotkeepyourself.blogspot.com/

ఇందు said...

చూసి ఏంటో అనుకున్నా! బాబోయ్! కొంచెం కష్టమేనండీ :))

రాధిక(నాని ) said...

ళ్రుళ్రు ళ్రు హహ్హహ్హ బాగుందండి..టంగ్ ట్విస్టర్లా .

Ennela said...

చాలా సింబళ్ ఆండీ(ఆంటీ అని చదువుకోగలరు)...ఐ వెండ్టు సీ మై అంగళ్ ..ఇడ్ వాస్ సింబిళీ సూపళ్ ...అని 30 సార్లు రిపీట్ చెయ్యండి....ళృ ళౄ అవే వచ్చేస్త్తాయి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చలికాలంలో స్వెట్టర్లు వేసుకొని, దుప్పట్లు కప్పుకొని తెల్లవారు ఝామున గొదావరిలొ దిగితే ళ గుణింతం తో బాటు సంగీతం కూడా బోనసు గా వచ్చేస్తుంది. మాకు అల్లాగే నేర్పారు చిన్నప్పుడు. Good luck.

Somasekhar said...

బావుందండీ. ఇవాళ ఇలా అఆ లతో, గుణింతాలతో మొదలు పెట్టి, రేపు మీ పాప కూడా మీలా ఒక మంచి రచయిత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

Mauli said...

"ళృ ...ళౄ"??? ivi yenduku asalu :)

తృష్ణ said...

@SHANKY: మేము మా పాపకు ఏ,బీ,సీ,డీలకన్నా మొదట నేర్పినవి ఆ,ఆలేనండి. పిల్లలతో ఇంగ్లీషులో మాట్లాడటం (పబ్లిక్ ప్లేసెస్లో మరీనూ)ధన్యవాదాలు. మేము మా పాపకు ఏ,బీ,సీ,డీలకన్నా మొదట నేర్పినవి ఆ,ఆలేనండి. పిల్లలతో ఇంగ్లీషులో మాట్లాడటం (పబ్లిక్ ప్లేసెస్లో మరీనూ) ఫేషనయిపోయిందండి ఈ రోజుల్లో.
"ఱ" గురించి క్రింద జ్యోతిగారు చెప్పారుగా.
ధన్యవాదాలు.

@జ్యోతి: థాంక్సండి.

@మిర్చిబజ్జీ: నేర్పేసానండీ..:) ధన్యవాదాలు.

తృష్ణ said...

@జయ: అలాగే టీచర్ గారూ...థాంక్యూ.
ధన్యవాదాలు.

@ఇందు: అవునండి నాలుగ తిరగదు...ధన్యవాదాలు.

@రాధిక(నానీ): :) ధన్యవాదాలు

తృష్ణ said...

@ఎన్నెల: మీళూ సూపళండి అసలు...:) ధన్యవాదాలు.

@బులుసు సుబ్రహ్మణ్యం: :) :)
చిన్నప్పుడు అలా చదివించేవారని మా నాన్నమ్మగారు చెప్తూండేవారు. ధన్యవాదాలు.

తృష్ణ said...

@సోమశేఖర్: ఎవరు ఏమౌతారో ఎవరికి ఎరుక..:)thanks for the wishes.

@మౌళి: అక్షరమాలలో ఇప్పటికే కొన్ని అక్షరాలు మిస్సింగ్ కదండి. స్కూలు పుస్తకాల్లోనే ఉండటం లేదు. కనీసం గుణింతలైనా అన్నీ నేర్పించాలనండీ. ధన్యవాదాలు.