
ఈ మధ్యన కొన్ని(చాలానే) సినిమా సీడీలు, డివీడిలు కొన్నాకా మళ్ళీ ఇప్పట్లో మ్యూజిక్ షాప్ కు వెళ్లద్దనుకున్నా. మొన్నొక రోజు బయటకు వెళ్తుంటే నాన్న ఫోన్ చేసి ఈ మధ్యన "sa re ga ma" వాళ్ళు కొన్ని మంచి మంచి ఎం.పీ3 ఆల్బంలు రిలీజ్ చేసారు...చూస్తావేమిటీ వెళ్ళి" అనడిగారు. ఈ మధ్యన రెస్ట్ గా ఉండటంవల్ల ఆయన ఎక్కడికీ వెళ్లటం లేదు. సరే నా కోసం కాదులే నాన్న కోసం కదా అని దారిలోనే ఉన్న మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళా. మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్లోనే నాతో పాటూ నాన్నతో కూడా షాపింగ్ చేయించేసా. నేను ఒకో సీడీ లిస్ట్ చెప్పటం, కొనాలో వద్దో తను డిసైడ్ చెయ్యటం. తనకు కావాల్సినవి కొనేసా. నా భ్రమ కానీ మ్యూజిక్ షాపుకెళ్ళి నేనెప్పుడూ ఖాళీగా వచ్చాను...? పనిలో పని నాన్న చెప్పిన సీడీలతో పాటూ నేనూ రెండు మూడు కొనేసుకున్నా.
ఏమైనా "sa re ga ma"వాళ్ళు మంచి ఎం.పి౩లు చేసారు. ఎంపిక చేసిన పాటలు కూడా మంచివే ఉన్నాయి. ఒకోసారి పేరు బాగుంటుంది తప్ప ఆల్బంలో పాటలన్నీ బాగుండవు. వేటూరిగారివి రెండు సీడిలు చూశాను. ఎవరు కంపైల్ చేసారో కానీ రెండింటిలోనూ పెద్దగా కొని దాచుకోవాల్సిన కలక్షన్ లేదు. ఇంతకీ ఈ "sa re ga ma"వాళ్ళు సీడీల్లో కొన్నింటికి కర్టసీ విజయవాడలో ఉండే నేమాని సీతారాం గారు. బోలెడు పాత పాటల కలక్షన్ ఉంది ఆయన దగ్గర. హెచ్.ఎం.వి వాళ్ళు కూడా కొన్ని సీడీలకూ, కేసెట్లకూ పాటలకోసం ఆయనను సంప్రదిస్తూ ఉంటారు. నా దగ్గర నాకిష్టమైన పాత పాటల లిస్ట్ ఒకటి ఉండేది. నేను కూడా విజయవాడలో ఉండగా ఆ పాటలన్నీ ఆయన దగ్గర రికార్డ్ చేయించుకున్నాను. డివోషనల్, డ్యూయెట్స్, మేల్ సోలోస్, ఫీమేల్ సోలోస్, పేథోస్...అంటూ వాటిని డివైడ్ చేసి దాదాపు పది కేసెట్లు దాకా చేయించుకున్నా.
ఇంతకీ నే కొన్న సీడీల దగ్గరకు వచ్చేస్తే, చాలా వరకూ మా దగ్గర ఉన్నవే కాబట్టి లేనివాటి కోసం వెతికాము.(షాపులో నేను, ఫోనులో నాన్న..)
1)"హిట్ పైర్ - మాధవపెద్ది సత్యం ఽ పిఠాపురం నాగేశ్వరరావు" సీడి ఒకటి. ఇందులో
* అట్టు అట్టు పెసరట్టు
* భలే చాన్సులే
*అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే
*సైకిల్ పై వన్నెలాడి
*సోడా సోడా
*వివాహభోజనంబు
*ఏం పిల్లో తత్తరబిత్తరగున్నవు
మొదలైన సరదాపాటలు ఏభై దాకా ఉన్నాయి. కొనేసా.
2)రెండవది "మొక్కజొన్న తోటలో - మెలొడీస్ ఆఫ్ సుశీల". ఇందులో
* మొక్కజొన్న తోటలో
*నీవు రావు నిదుర రాదు
*అందెను నేడే
*గోరొంక కెందుకో
*నిదురించే తోటలోకి
*కన్ను మూసింది లేదు
*నీ కోసం
*నీ చెలిమి నేడే కోరితిని
*మీరజాలగలడా
మొదలైన మధురమైన పాటలు ఉన్నాయి. ఇదీ కొనేసా.
3) మూడవది "మసక మసక్ చీకటిలో...ఎల్.ఆర్.ఈశ్వరి హిట్స్". ఇందులో
*మసక మసక చీకటిలో
*ఏకాంతసేవకు
*మాయదారి లోకం
*అలాటిలాటి
*కలలో కనిపించావులే
మొదలైన పాటలు ఉన్నాయి. పదే పదే వినదగ్గవి కాకపోయినా ఒక రేర్ వాయిస్ గల గాయని పాటలుగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ సీడీని. సో, కొనేసా.
4) "సరసాల జవరాలను....డాన్స్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్స్" అని ఇంకో సీడి. ఇది కొనుక్కో దగ్గ మంచి సీడీ. నాకు బాగా నచ్చినది. ఇందులో మంచి జావళీలు, ఇంకొన్ని ప్రఖ్యాతిపొందిన డాన్స్ సాంగ్స్ ఉన్నాయి.
* అందాల బొమ్మతో
*సరసాల జవరాలను
*బాలనురా మదనా
*నిను చేర మనసాయెరా
*పిలిచిన బిగువటరా
*చూచి చూచి నా మనసెంతో
*ఇంతా తెలిసియుండి
*ముందటీవలే నాపై
*ఎంతటి రసికుడవో
మొదలైన రసభరితమైన పాటలు జావళీలపై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతాయి. కొనేసా..!!
5)తరువాత ఆదిత్యవాళ్లది "సిరివెన్నెల హిట్స్" ఒకటీ సాంగ్స్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను.
*ఉన్నమాట చెప్పనీవు
*ఏ శ్వాసలో
*వేయి కన్నులతో
*చెప్పవే ప్రేమా
*ఏ చోట నువ్వున్నా
*నీకోసం ఒక మధుమాసం
*దేవుడు కరుణిస్తాడని
*నీకోసం నీ కోసం
*ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు
*కొంచెం కారంగా
*గుమ్మాడి గుమ్మాడి
*పెదవిదాటని
ఇలా రాస్తు పోతే సీడీలోని పాటలన్నీ రాసేయాలి. అంత మంచి పాటలున్నాయి దాంట్లో.
ఇంకా ఏం తీసుకున్నానంటే..(6)"ఆదిత్యా" వాళ్ళ కొత్త రిలీజ్ "జెమ్స్ ఆఫ్ దీక్షితార్ ". ఇక ఫైనల్గా గజల్స్ కొనుక్కోకుండా నా పాటల షాపింగ్ అవ్వదు కాబట్టి (7)"mementos" అని ఒక గజల్స్ ఆల్బం కొన్నా. ఇంకా నాన్న మాట్లాడుతున్నారు...ఇంక కళ్ళు మూసుకుని బయటకు వెళ్పోతా నాన్నా చాలా బిల్లయింది అన్నా. సర్లెమ్మని పెట్టేసారు. అదీ రీసెంట్ గా నే చేసిన సీడీ షాపింగ్.
15 comments:
భలే ఉందండీ మీ షాపింగ్ లిస్టు. ఇలాంటి పాటలన్నీ సెలవల్లో, సొంత ఊళ్ళో, కొబ్బరి చెట్టు కింద నవారు మంచం మీద విష్ణు మూర్తి పోజులో పడుకుని అరమోడ్పు కళ్ళతో వింటూంటే భలే ఉంటుంది.
అన్నట్టు నా వందో పోస్ట్, ఆ తరవాతి పోస్టు చూసి మీ అభిప్రాయం చెప్పండి. (సెంచరీ కొట్టేసా :) )
bAguMdi.
సారీ, ఇందాకటి వ్యాఖ్య పూర్తికాకుండానే ప్రచురించేశాను.
మీ దృష్టిలో ఎక్కడన్నా పోతన భాగవతాన్ని చదివిన/పాడిన రికార్డింగ్ కనబడిందా? ఉంటే వివరాలు తెలుపగలరు.
ఈ కలెక్షన్ సిడిస్ చాలా సార్లు త్వరపడి తీసుకొని బాగా డిసప్పాయింట్ అయ్యాను. 2,3 పాటలు బావుంటాయి. మిగతావన్నీ ఎప్పుడూ వినని, ఇంకోసారి వినాలనిపించని పాటలతో నింపేస్తారు.
నేమాని సీతారాంగారు మా నాన్నకు కాలేజ్ ఫ్రెండ్.నేను ఇండియా వచ్చినప్పుడల్లా ఆయన కలెక్షన్స్ లో నుండి నాకిష్టమైన పాటలు తప్పకుండా సిడిలు,కాసెట్లు చేయించుకొని తెచ్చుకుంటా.చాలా గ్రేట్ కలెక్షన్. 1950s-80s ఆయన దగ్గర లేని పాటలు లేవనుకుంటా.
మా అమ్మా,నాన్నలకు కూడా చాలా ఇష్టం పాటలంటే.వాళ్ళదగ్గర కూడా బినాకా గీత్ మాలా,రేడియోలోనుండి రికార్డ్ చేసింది,తో సహా చాలా పాతపాటలున్నాయి.
హ్మ్! చాలానే కొనేసారు! నాకు సిరివెన్నెల సీడీలో పాటల కలెక్షన్ నచ్చింది.ఎంతైనా నేను సిరివెన్నెల గారి ఫాన్ కదా! :) నైస్ షాపింగ్ తృష్ణగారు!
Thanks తృష్ణగారు వివరాలు అందించినందుకు. నా దగ్గర యల్ ఆర్ ఈశ్వరి గారిది సుశీల గారిది ఉన్నాయి మాదవపెద్ది గారి కలక్షన్ కోసం ఎప్పటి నుండో చూస్తున్నాను నేనూ త్వరలో మ్యూజిక్ షాప్ కు ఒక విజిట్ చేయాలి.
మీరు వెళ్ళిన ఆ షాప్ ఎక్కడో చెప్పకూడదూ? ఇక్కడ మంచి కలక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ ఏరియా కి ఎప్పుడైనా వెళ్తే మేము కూడా visit చేస్తాము. మా ఇంటి దగ్గర కూడా ఒక షాప్ ఉంది. కానీ అంత మంచి కలక్షన్ ఉండదు. నాకు కావల్సిన ఒక CD కోసం ఈ మధ్య ఒకసారి అడిగితే simple గా,"అది release అయింది కానీ మా దగ్గర లేదండీ, banjara hills music world లొ try చెయ్యండి" అన్నాడు. 25KM వెళ్ళే time లేక ఆ CD ఇప్పటి వరకు కొనుక్కోవడం అవ్వలేదు.
@SHANKY:ఆ సీన్లో "వెన్నెల"ని మిస్ చేసినట్లున్నారు..:) (కొబ్బరిచెట్టు క్రింద వెన్నెల లేకపోతే మజా ఏం ఉంటుందండీ?)
వందో పోస్ట్ కోసం చాలానే వైటింగ్ చేయించారు...గుర్తుచేసినండుకు ధాంక్స్ అండీ.
@కొత్తపాళీ: మావారు కొన్న "గజేంద్ర మోక్షం" పార్ట్ ఉన్న ఒక కేసెట్ మా దగ్గర ఉందండీ. 'జగ్గయ్య' వ్యాఖ్యానం, 'ఎస్.రాజేస్వరరావు' సంగీతం. "పోతన భాగవత సుధ" అని ఒక కేసెట్ పేరు. కానీ ఇది చాలా ఏళ్ళ క్రితం కొన్నదట. ఇప్పుడు కూడా దొరుకుతోందేమో కనుక్కుని వివరాలు తెలియజేస్తానండీ.
@Mahek: అవునండీ. చాలా వరకూ కలక్షన్స్ ఇలానే ఉంటాయి. మేమూ చాలా కొని మోసపోయాము. కానీ ఇవి బాగున్నాయండి. సీతారాం గారు మా నాన్నగారికి కూడా స్నేహితులేనండి. అయితే మనం మనం ఫ్రెండ్స్ అన్నమాట...:)
@ఇందు: మావారు సిరివెన్నెలకు పెద్ద పంఖా. తన కోసమే ఆ సీడీ కొన్నది...:)
@వేణూశ్రీకాంత్: చేయండి చేయండీ. కొన్నాకా వివరలతో పోస్ట్ రాయాలి మరి.
@soms: మా ఇంటి దగ్గర షాప్ అంటే ఏమిటో కొనుక్కోవాలి మరి..! అందుకోసమైనా మా ఇంటికి వస్తారు కదా అని...:)
ఇక్కడనుంచేమయినా మంచి స్మెల్ల్ వస్తోందా? మీ లిస్ట్ చూసి...నా మనసున మల్లెల మాలలూగెనే....
@ennela:ఎక్కడివీ పరిమళాలూ..అనుకుంటున్నానండి..మీరేనా...:)
aa madhavapeddi , pithapuram collection kosam chala years nunchi vedukutunna andi. Internet lo kuda search chesenu. ekkada dorakaledu. pchh...India vachheka dorukutundo ledo naku. ledante mee intiki vachhi copy chesukuntamu. meeru emi anukoru kada..
@durga hemadribhatla:ఇండియాలో ఎవరైనా మిత్రులుంటే కొనిఉంచమని అడగండి.తెలుగు పాటలు దొరికే అన్ని ప్రముఖ కేసెట్ షాపుల్లోనూ లభ్యమౌతోంది.అంతగా దొరక్కపోతే అలానే...thanks for the visit.
Post a Comment