సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Wednesday, December 1, 2010
నువ్విలా...("మనసారా" లో పాట)
"నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపలా ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా... "
నిన్న బస్ లో వెళ్తూంటే ఓ ఎఫ్.ఎం లో ఒక పాట విన్నా. భలే నచ్చింది. ఇప్పుడే తీరుబడిగా కూర్చుని ఏ సినిమాలోదో వెతికితే రాబోతున్న 'మనసారా' సినిమాలోది అని తెలిసింది. ఆడియో 'రాగా.కాం' లో దొరికింది. ఇదిగో వినండి. సినిమా ఎలా ఉంటుందో తెలీదు. నాకైతే పాట తెగ నచ్చేసింది. మిగతావి వినాలి ఇంకా.
యూట్యూబ్ లో ట్రైలర్ కూడా బాగుంది. కానీ టాక్ రాకుండా కొత్త సినిమాలు అస్సలు చూడకూడదన్నది (పాత అలవాటే అయినా) ఈ మధ్యన మూడు కొత్త సినిమాలు చూసి బుక్కయిపోయాకా తీవ్రంగా తీసుకున్న 'గఠ్ఠి నిర్ణయం'...:)
మొత్తం songs రాగా.కాంలో ఇక్కడ వినండి.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అది రఘుబాబు సినిమా. కొంత ఎక్స్‌పెక్టెషన్స్ పెట్టుకొవచ్చు. కాకపోతే థియేటర్స్ఎక్కువరోజులాడవు
ఈ పాట నాకు కూడా బాగా నచ్చిందండీ. కానీ మీలా కాకుండా, పాట విని సినిమా చూడాలి అన్న నిర్ణయం తీసుకుని, 1st day ticket కూడా బుక్ చేసుకున్నాను. ఆది మంచి నిర్ణయమా కాదా అనేది కాలమే చెప్పాలి :-).
ఇంతకీ మిగిలిన పాటలు విన్నారా లేదా...? Title song కూడా బావుంది ఇందులో.
@chaitanya: i think the name is 'ravi babu' not raghu babu'
@soms,movie elaa undo cheptE chOostaam..:)
Post a Comment