సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 7, 2009

అందమైన ఇండోర్ ప్లాంట్

గార్డెనింగ్ అభిరుచి ఉన్నా,లేకపొయినా ఇండోర్ ప్లాంట్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు.డ్రాయింగ్ రూం లోనో,లివింగ్ రూం లోనో..పచ్చగా ఉన్న ఆకులను చూస్తే మనసు ఎంతో ఆహ్లాదపడుతుంది. చాలా సులభంగా పెరిగే ఒక ఇండోర్ క్రీపర్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను...

ఒక మంచి "చిలకడ దుంప"(స్వీట్ పొటాటో) తీసుకోవాలి.దానికి పైభాగంలో అడ్దంగా ఒక పుల్ల,కొంచెం బలంగా ఉండేది గుచ్చాలి.పైన నేను పెట్టిన ఫొటోలో లాగ.అది ఎందుకంటే మనం పెట్టే సీసాకు గానీ,ఫ్లవర్వేజ్ కు గానీ సపోర్ట్ గా ఉండేందుకు,లోపలికి జారిపొకుండా.పెట్టేది ఒక గాజు సీసా కానీ,ట్రాన్స్పరెంట్ బౌల్ గానీ అయితే మొక్క పెరిగే కొద్దీ దాంట్లో పెరిగే తెల్లని వేళ్లు మరింత అందంగా కనిపిస్తాయి.దాంట్లో పుల్లకు గుచ్చిన చిలకడ దుంప పెట్టి, నిండుగా నీళ్ళు పొయ్యాలి.రెండు రోజులకొకసారి నీరు నింపుకుంటూంటే చాలు(నీరు తగ్గుతూ కనిపిస్తుంది).

మధ్యలో నెలకొకసారి నీరంతా వంపేసి,మళ్ళీ తాజాగా నీరు నింపుకోవాలి.2,3నెలల పైనే పెరుగుతుంది ఈ క్రీపర్.బాగా గుబురుగా కావాలనుకుంటే రెండు దుంపలను వేసుకుంటే సరి.బాగా పైకి పెరిగిన కొమ్మలు కట్ చేసేసుకోవచ్చు.ఆకుపచ్చ,లేత ఆకుపచ్చ రంగుల్లో,కొత్త చిగురులతొ ఎంతో అందంగా ఉండే ఈ ఇండోర్ క్రీపర్ గురించి తెలిసాకా పెంచకుండా ఉండలేము.పైన ఉన్న ఫొటొలోది నేను మా ఫ్రిజ్ మీద పెట్టి పెంచుతున్నది....(మొబైల్తో తీసినందువల్ల ఫోటో క్లియర్ గా లేదు)
మరి మీరూ ప్రయత్నించండి..

22 comments:

శేఖర్ పెద్దగోపు said...

చిలకడ దుంప అంటున్నారు..అది బయట కదా పెరిగేది..మరి మీరు ఇండోర్ ప్లాంట్ అంటున్నారు..అర్ధం కాలేదండీ..అంటే చిలకడ దుంప ఇండోర్ ప్లాంట్ కి సపోర్ట్ గా పెట్టారా? ప్లీజ్ కొంచెం వివరంగా చెప్పరా...నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టం..అందుకే ఈ యక్ష ప్రశ్నలు సంధించాల్సివచ్చింది.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

కొన్ని సూచనలు:
ఆవేశపడి మర్రిచెట్లు, రావిచెట్లు వేసేరు. జాగ్రత్త.
దానికి ఒక చిలకడదుంపచాలు. రెండొది మనకు. అప్పుడు మనమే ఏపుగా పెరగొచ్చు.
భగ్నప్రేమికులు పెరిగే మొక్కలో వారిని చూసుకోవచ్చు

తృష్ణ said...

శేఖర్ గారూ,ఈ మొక్క మట్టిలోపల దుంపలాగ పెరుగుతుంది.నిజమే.కాని ఇది వఠ్ఠి నీళ్లల్లో కుడా పెరుగుతుంది.మట్టి వెయ్యకుండా ఇల ఇండోర్ ప్లాంట్ లాగ పెంచుకోవచ్చు.సపొర్ట్లా కాదు.నీళ్లల్లో చిలకడ దుంపకే చిగుర్లు వచ్చి క్రీపర్ లాగ పెరుగుతుంది.మనీ ప్లాంట్ లాగ అన్నమాట.
అర్ధమైందాండి?

సిరిసిరిమువ్వ said...

ఒహ్ బాగుంది మీ ఐడియా, ధన్యవాదాలు. నేను కూడా పెట్టి చూస్తాను.

చిలకడదుంప..ఎర్రవి తెల్లవి రెండూ ఉంటాయి కాదా, ఏదయితే బాగుంటుంది?

ఇంకా ఇలాంటి మంచి మంచివి చెప్తుండండి.

తృష్ణ said...

చైతన్య,నీ వ్యాఖ్యలొ ఒక్క ముక్క అర్ధమైతే...ఒట్టు..please explain your intention behind this comment..?

తృష్ణ said...

@సిరిసిరిమువ్వ: నాకు ఎర్రవొక్కటే తెలుసండి.. తెల్లవాటికి కూడా చిగుర్లు వస్తాయి నా ఉద్దేశంలో.ప్రయత్నించండి.మొక్క మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకుంటే.

శేఖర్ పెద్దగోపు said...

అర్ధమైందండి. ఈ సారి మొక్క బాగా పెరిగిన తర్వాత ఇంకోసారి పెద్ద ఫోటో తీసి పెట్టండి.
థాంక్యు ఫర్ షేరింగ్ బ్యుటిఫుల్ అయిడియా!

సుజాత వేల్పూరి said...

I love plants, no matter indoor or out door! I will try this Idea...!

తృష్ణ said...

@sujata:Try it.you'll be delighted.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

సరీ. నేను చిలగడదుంపని సపోర్ట్ కోసమో, లేక ఫీడింగ్ కోసమో పెట్టారు అనుకున్నా. క్రీపర్ అనేది చెట్టు అనుకున్నాను. మా ఫ్రెండుగాడు ఒకడు గులాబీమొక్కను పెంచి దానితో మాట్లాడుకునేవాడు. ఎందుకో పైన చెప్పానుకదా. అదీ సంగతి. నేను కంప్యూజ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను.

raviteja said...

మా అమ్మ పెంచుతుంటుంది ఇలాంటివన్ని :)i l tel her.. మీ blog భలే homely గా ఉండండీ.. నాకు ఈనాడు-వసుంధర చడువుతున్నట్లుంది :P

సుభద్ర said...

భలే ఐడియా మాటలో చెప్పలేని ఆన౦ద౦ గా ఉ౦ది.
నాకు మొక్క అ౦టె చెప్పలేని అ౦తా ఇష్ట౦..నాకు ఇ౦డోర్ అవుట్ డోర్ గార్డెన్ ఉ౦ది.
మా ఆయన అ౦దరితో మా ఆవిడ ఒక ఫైన్ డే నన్ను నా పిల్లల్ని బయట పెట్టి మెక్కల్ని ఇ౦ట్లో పెడుతు౦ది అని అ౦టారు.చాలా ధ్యా౦క్స్ అ౦డి.మాకు ఇక్కడ మొక్కలు చాలా రేట్లు
ఉ౦టాయి,ఇ౦కా మీ దగ్గర ఉన్న మొక్కల కబుర్లు ప్లీజ్ చెప్పరు.

తృష్ణ said...

@ శేఖర్ గారూ, బ్లాగ్ చదివి నా అభిప్రయాలు షేర్ చేసుకుంటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు..

చైతన్యా,"క్రీపర్" అంటే "తీగ" అని అర్ధం.

తృష్ణ said...

@రవితేజ :పెద్ద ప్రశంసే ఇచ్చేసారు...ధన్యవాదాలు.

@సుభద్ర: ఇంకేం మనం మనం ఫ్రెండ్స్ అయితే..నా మొక్కల పిచ్చి గురించి ఒక టపా రాయాలని..త్వరలో రాస్తాను.

మురళి said...

అరె.. బాగుందండీ ఈ అయిడియా.. నేను సైతం ప్రయత్నిస్తాను..

తృష్ణ said...

@ మురళి:తప్పక ప్రయత్నించండి..

Rani said...

good post, thanks for sharing :) I have to start this one right away.

తృష్ణ said...

@rani:thanks for the visit.

మాలా కుమార్ said...

అరె ఈ ఐడియా బాగుందే !

పరిమళం said...

నేను కూడా పెట్టి చూస్తాను....thanks!

తృష్ణ said...

@మాలా కుమార్ :
@ పరిమళం:

తప్పక ప్రయత్నించండి..ధన్యవాదాలు.

Unknown said...

భలే అవిడియా !!!

నేను ఫాలో అయిపొయా. కాకపోతే ఫ్రిజ్ పై కాకుండా
గుమ్మానికి పక్కగా గాజు సీసా లో పెట్టి కిటికి కి పాకించాను.
తీగ కిటికీ కి గుబురు గా అల్లుకుంది.
వాస్తు ప్రకారం, ఆ దిక్కు లో, నీరు నింపిన గాజుపాత్రని ఉంచాలి. చేపల తొట్టి ఉంచడానికి మాఇంట్లో ఒప్పుకోలేదు.జీవహింస అది ఇది అని. సో, ఇది ఇంప్లిమెంట్ చేశా.
చిన్న వాస్తు దోష నివారణ అన్నమాట..