సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, June 18, 2011

బాగా నచ్చేసిన కొత్త పాట



ఈ పాట మొదటిసారి మొన్న బస్సులో వెళ్తూంటే విన్నా. తెలుగేనా? అని ఆశ్చర్యపోయా. "వెలిగినది" "వాన" "ఎద" "అణువు" తప్ప మిగిలిన అక్షరాలు అస్సలు అర్ధం కాలేదు. ఖచ్చితంగా ఏదో డబ్బింగ్ సినిమాలో పాట అని అర్ధమైపోయింది. మళ్ళీ ఎఫ్.ఎంలో వచ్చినప్పుడు అక్షరాలు గుర్తుంచుకుని ఏ సినిమానో వెతుకుదాం అనుకున్నా. నిన్న బయటకు వెళ్తుంటే ఈ పాట మళ్ళీ మొదలైంది. ఈసారి మొదటి లైను బాగా గుర్తుపట్టుకుని నెట్లో వెతకాలి అనుకున్నా. ఆ రాగం ఏమిటో గానీ సాహిత్యం తికమకగా ఉన్నా పాట ఎంత నచ్చేసిందో. కొన్ని పాటలు అలా ఏవో లోకాల్లోకి తీసుకుపోతాయి. ఆ పాట వెనుక ఉన్న రాగం మహిమ అది. ఇలాంటిదేదైనా పాత పాట ఉందేమో అనిపిస్తోంది కానీ గుర్తురావట్లే.


ఇంటికొచ్చాకా ఓ టివీఛానల్ లో "నాన్న" సినిమా ఏడ్ వస్తోంది. ఇదే పాట. అరే ఇందాకటి పాట...ఇందులోదా అనుకున్నా. అయితే అసలు పాట వెతుకుదాం అని నెట్లో వెతికితే తమిళ్ పాట దొరికింది. ఇదివరకూ ఇలానే కొన్ని డబ్బింగ్ పాటల సాహిత్యం నచ్చక అర్ధం కాకపోయినా ఒరిజినల్ తమిళ్ పాటలనే రికార్డ్ చేయించుకున్నా. డ్యూయెట్, చెలి, మెరుపుకలలు మొదలైన సినిమాల్లోని ఒరిజినల్ తమిళ్ సాంగ్సే నాకు చాలా ఇష్టం. భాష అర్ధం కాకపోయినా అలా వింటూనే ఉండాలి అనిపిస్తాయి ఆ పాటలు.


ఇంతకీ ఈ కొత్త సినిమా "నాన్న" తమిళ్ సినిమా "Deiva Thirumagan"కు డబ్బింగ్. ఆ పేరుకు అర్ధం "holy Son of God" ట.("wiki" చెప్పింది). తమిళ్ లో apt titles పెట్టి తెలుగులో ఇలా సినిమాపేర్లు మార్చేస్తారెందుకో నాకు అస్సలు అర్ధం కాని ప్రశ్న. మొన్నటి "వైశాలి" కూడా అంతే. టైటిల్ సంగతి ఎలా ఉన్నా రెహ్మాన్ మేనల్లుడైన ప్రకాష్ కుమార్ సంగీతం బానే ఉన్నట్లుంది. గతంలో ఇతను స్వరాలందించిన "ఉల్లాసంగా ఉత్సాహంగా" సినిమాలో "ప్రియతమా.." పాట కూడా నాకు బాగా నచ్చేది. అప్పట్లో "చిక్బుక్ చిక్బుక్ రైలే.." అనీ, "వేసేయాలి కన్నమంట....దొంగ దొంగ" అనీ పాడింది ఇతనే అని అన్నయ్య చెప్పినప్పుడు బాణీలు కట్టేంత పెద్దయిపోయాడా అనిఆశ్చర్యపోయా.


తెలుగు కన్నా తమిళ్ లోనే నాకు బాగా నచ్చేసిన "విరిసినదొక వానవిల్.." అనే ఈ తెలుగు పాట తమిళ్ ఒరిజినల్ ను "సైంధవి" గొంతులో వినేయండి :

7 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

లిరిక్స్ అర్థం కాలేదు.చిత్రీకరించిన విధానం బావుంది

యశోదకృష్ణ said...

naaku kuda induloni melody baaga nachhindi.

Anonymous said...

తమిళంలో ఈ పాట చాలా బాగుంది. ఒక్కముక్క అర్ధం కాకపోయినా వినాలనిపించే పాట. You have a very good taste.

Ennela said...

బాగుందండీ...మంచి పాట వినిపించినందుకు థ్యాంక్స్..ఇంతకీ తెలుగులో వాన విల్ అంటే ఏంటో!!!!!

తృష్ణ said...

@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: అవునండి. వినటానికి మాత్రం చాలా బావుంది. ధన్యవాదాలు.

@గీత_యశస్వి: ధన్యవాదలు.

@born2perform: అవునండీ భాష అర్ధం కాకపోయినా కొన్ని తమిళ్ పాటలు వింటూనే ఉండాలనిపిస్తాయి.
ధన్యవాదాలు.

@ఎన్నెల: "వానవిల్లు" అనేమో గాయని అంటున్నది. ఆ పదం వేటూరి గారు కూడా అదివరకూ వాడారండి. మరి అర్ధం నాకూ తెలీదు...ధన్యవాదాలు.

జ్యోతి said...

తృష్ణ గారు,మంచి పాటని వినిపించినందుకు థాంక్స్ అండీ. నా బ్లాగు లో మీ కామెంట్ చూసాను, కానీ........
టైం దొరికితే తప్పకుండా చూసేది మీ బ్లాగు, ఫణి బాబుగారి బ్లాగు.
ఎన్నెల గారు, వానవిల్ అంటే వానవిల్లు (Rainbow)ఆ పదం తెలిసిన తర్వాత నాకెంత నచ్చిందో, హరివిల్లు, ఇంద్రధనస్సుల కంటే ఎక్కువగా... వేటూరిగారు చాలా పాటల్లో వాడారు. వానవిల్లు అనేపేరుతో ఫణీంద్ర గారు ఒక బ్లాగ్ రాసేవారు, చాలా బాగుండేది. వీలయితే చూడండి.

-మెహక్

తృష్ణ said...

@మహెక్: ఎన్నాళ్ళకెన్నాళ్ళాకి...చాల థాంక్స్ వ్యాఖ్య రాసినందుకు. బ్లాగ్ వీలైనప్పుడు చదువుతున్నారని తెలిపినందుకు మరీ మరీ మరీ థాంక్స్..:))) మాకు మళ్ళీ పరీక్షలెప్పుడు మొదలెడతారు?
ఎన్నెల గారి వ్యాఖ్య చూశాకా ఆలోచిస్తే నాకు అదే అర్ధం తట్టిందండీ. తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నా. అవునండీ నేనా బ్లాగ్ని చాలా ఆలస్యంగా చూశాను. మీ బ్లాగ్ గురించి రాసిన టపాలోనే ఆ బ్లాగ్ గురించి కూడా రాసాను. వారి ఇప్పుడు "కలం కలలు" అని మరోటి రాస్తున్నారు. చాలా బావుంటుంది.చూస్తున్నారా?