సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 22, 2011

జుట్టు ఊడకుండా ఉండేందుకు ఒక మంచి powder తయరీ:

అరే పొరటున వేరే బ్లాగ్ అనుకుని వెళ్లిపోకండి...ఇది తృష్ణ బ్లాగే ! చాలా రోజుల్నుంచీ ఈ టిప్ రాయాలని అనుకుంటూ బధ్ధకిస్తున్నాను. నాకు తెలిసీ ఒత్తైన జుట్టు ఇష్టపడనివాళ్ళు అరుదుగా కనిపిస్తారు. కానీ స్ట్రెస్ వల్లనో, కొన్ని మందుల వాడకం వల్లనో, హార్మోన్ల లోపాల వల్లనో చాల మందికి జుట్టు రాలిపోవటం, జడలు సన్నబడటం జరుగుతూ ఉంటుంది. కొందరి శిరోజాలు ఎటువంటి పోషణా తీసుకోకపోయినా అస్సలు ఊడవు. అది వారి వారి అదృష్టం. కొందరికి ఎంత సేవ చేసినా ఊడే జుట్టు ఊడుతూనే ఉంటుంది.

నా జడ వేయటానికి మా అమ్మకు కష్టమయ్యేంత ఒత్తైన పొడువైన జడ ఉండేది నాకు. అలాంటిది ఒకసారి టైఫాయిడ్ వచ్చినప్పుడు నా జడ బాగా సన్నబడిపోయింది. అప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒకావిడ ఒక విధానం చెప్పారు. చాలా ఏళ్ళు నేను ఆవిడ చెప్పిన పొడాలు అన్నీ కలిపి జుట్టుకు వాడాను. జుట్టు అస్సలు ఊడేది కాదు. పెళ్ళయ్యాకా కుదరక మానేసాను. సిజేరియన్లు, అనారోగ్యాలు కారణాంగా మళ్ళీ జడ సన్నబడిపోయింది. ఈమధ్యనే మళ్ళీ ఆంటీ చెప్పిన పొడాలన్నీ కొనుక్కుని జుట్టుకి పెట్టడం మొదలెట్టాను. జుట్టు ఊడటం బాగా తగ్గింది. కాబట్టి ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది కదా అని ఈ టపాలో రాస్తున్నాను. కొంచెమ్ శ్రమ అనిపించినా క్రింద రాసిన విధంగా చేస్తే కొత్తగా పెరగకపోయినా, జుట్టు ఊడటం మాత్రం బాగా తగ్గుతుంది. నేనీ విధానం చెప్పిన చాలా మంది మంచి ప్రయోజనం కనబడిందనే చెప్పారు.

ముందుగా క్రింద రాసిన పొడులన్నీ కొని ఒక డబ్బాలో కలిపి పెట్టుకోవాలి:
ఉసిరి పొడెం : అర కేజీ
షీకాయ పొడెం: అర కేజీ
కుంకుడు పొడెం: అర కేజీ
మెంటి పొడెం: వంద గ్రాములు
గోరింటాకు: వంద గ్రాములు
వేప పొడెం: ఏభై గ్రాములు

ముందుగా ముక్కుకి గుడ్డ కట్టుకుని ( ఈ పొడాలు కలిపేప్పుడు ఘాటుకి బాగా తుమ్ములు వస్తాయి)ఈ ఆరు పొడాలనీ బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆరునెలలు దాకా ఈ పొడెం వాడచ్చు.

ఎలా వాడాలంటే:
* రేపు తలంటు పోసుకుంటాం అనగా ముందురోజు రాత్రి స్ట్రాంగ్ గా ఒక గ్లాసుడు టీ డికాక్షన్ తీసుకుని ఉంచాలి. ( ఇందుకోసం తాజ్మహల్, రెడ్లేబుల్ టీ పొడాలు కాకుండా టీ అమ్మే షాపుల్లో దొరికే మామూలు(తక్కువ రేటు) టీ పొడెం కొని వాడతాను నేను.)

* ఒక ఇనుప మూకుడు (ఇంట్లో లేకపోతే కొనుక్కోవాలి) లో ముండుకా కలుపుకున్న పైన చెప్పిన పొడెం నాలుగైదు చెంచాలు (మన జుట్టుకి సరిపోయేంత) తీశుకుని ఈ తీసుకున్న టీ డికాక్షన్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి.


* మర్నాడు పొద్దున్నే తలకు ఈ ముద్దను పట్టించుకుని ఓ గంట సేపు ఉంచాలి.

* ఈ పొడిలో షీకాయ అవీ ఉన్నాయి కాబట్టి, జుట్టు కడిగేసుకున్నాకా తలంటుకి షంపూ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. అయితే పొడెం బాగా వదిలేలా కడిక్కోవాలి. ఎక్కువ నీళ్ళు పడతాయి.

* తలంటు పోసుకోవటం అయిపోయాకా చివరిగా ఒక నిమ్మ చెక్క రసం తీసుకుని ఉంచుకుని, దానిని ఒక మగ్గు నీటిలో కలిపి తలంతా తడిసేలా నీళ్ళు పోసుకోవాలి. అంటే "లాస్ట్ వాష" అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నీటితో కడగకూడదు తలను. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. పొడెం వాడకపోయినా మామూలుగా తలంటు పోసుకున్నాకా చివరలో ఇలా చేయచ్చు. తర్వాత తువ్వాలుతో పిడప చుట్టేసుకోవాలి.

ఇలా క్రమం తప్పకుండా వారానికి ఓసారి చేస్తే తేడా మీకే తెలుస్తుంది. నిజ్జంగా జుట్టు అస్సలు ఊడదు. నేను మధ్యలో చాలా ఏళ్ళు వాడటం మానేసాను కానీ నాకు ఈ టిప్ చెప్పిన ఆవిడ వయసు ఇప్పుడు అరవై ఐదు పైనే. ఇప్పటికీ ఆవిడ ఓపిగ్గా ఇలానే చేస్తారు. ఆవిడ జుట్టు కూడా ఇంత ఒత్తుగా, పొడవుగా ఆరోగ్యంగా ఉంది.

20 comments:

నేస్తం said...

ఎంత మంచి టిప్పు..... కాని ఇందులో ఒక్క పొడి కూడా నాదగ్గరలేదే ఎలా? హౌ?:(

శ్రీరామ్ said...

Nestam garu...

Jaiho...mustafa ! :-)

తృష్ణ said...

నేస్తంగారూ, ఏముందండి..కొనుక్కోవటమే ! అక్కడ దొరకకపోతే ఎవరితోనైనా తెప్పించుకోవటమే !
ధన్యవాదాలు.

శ్రీరామ్ గారూ, మీ వ్యాఖ్య నాకు అర్ధం కాలేదండి ..
Thanks forthe visit.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఎంత మంచి టిప్పు. నా దగ్గర పొడులు అన్నీ ఉన్నాయి కానీ నెత్తి మీద జుట్టే లేదు. నిజం ఒక్క టంటే ఒక్కటి కూడా:))

ఇందు said...

Thnks manchi tip cheppinanduku :)

Na daggara ee podulu levu :( india ninchi teppinchukovali :)

Sriram garu Nestam garini Sinagapore lo unna 'Mustafa' ane shopping complex ki velli aa podulu konukkondi ani chebutunnaru anthe :)

తృష్ణ said...

నేస్తo గారూ, ఇందు గారి వ్యాఖ్య చూశాకా శ్రీరామ్ గారి వ్యాఖ్య అర్ధమైంది. ఇక అలా చేసేయండి మరి..:)

తృష్ణ said...

@బులుసు సుబ్రహ్మణ్యం: ఇది మరీ హాయండి. ఏ టెంషన్ ఉండదు. ఆల్ హేపీస్ అన్నమాట. ఎంజాయ్ చెయ్యండి..!
ధన్యవాదాలు.

@ఇందు: ఎవరైనా వస్తూంటే తెప్పించుకోండి. నిజంఘా బాగా పనిచేస్తుంది. కొత్త జుట్టు రాకపోయినా ఉన్నది ఊడదు ..:))
పై వ్యాఖ్యకు అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు.

హరే కృష్ణ said...

తృష్ణ గారు మీరెంత మంచి వారు
బట్రా హెయిర్ ఫాల్ అని సొమ్ము చేసుకుంటున్న ఇటువంటి జుట్టు ఊడే రోజుల్లో ఇలా అందరి ముందు పంచుకోవడం ఎంతో అభినందనీయం
శ్రీ రామ్ గారి మాటే నాది కూడా జై జై ముస్తఫా

హిందీలో ఉసిరి పొడెం : అర కేజీ
షీకాయ పొడెం: అర కేజీ
కుంకుడు పొడెం: అర కేజీ
మెంటి పొడెం: వంద గ్రాములు
గోరింటాకు: వంద గ్రాములు
వేప పొడెం: ఏభై గ్రాములు
వీటిని ట్రాన్స్లేట్ చెయ్యగలరు వీక్ ఎండ్స్ తయారు చేసేసి ముంబై లో ఒక డీలర్ అవతారం ఎత్తాలి
పేటెంట్స్ మీకే :)

తృష్ణ said...

@hare krishna:

ఉసిరి పొడెం : amla
షీకాయ పొడెం: shikakai
కుంకుడు పొడెం: reetha
మెంటి పొడెం: methi
గోరింటాకు: mehendi
వేప పొడెం: neem

:)))thank you.

తృష్ణ said...

hare krishna: you can get these in any popular super market. 'Banjara products' or 'girijan products' are more advised..:))

Unknown said...

post bavundi. informative also

తృష్ణ said...

శైలబాల గారు, ధన్యవాదాలు.

Indira said...

thank you very much!! :)

neha said...

thank you so much:) :) nenu eeroje ee powders anni techukunta!! inni rojulu parlour lo evo treatments teskunedanni.. kani natural ga meeru chala manchi tip chepparu.. plz skin ki kuda telisthe cheppandi..

spandana said...

Tip baavundandi. Hyderabad lo ivanni yekkada dorukutaayo cheppagalaraa..

తృష్ణ said...

స్పందన గారూ, ఇవన్నీ మీకు ఏ సూపర్ మార్కెట్లో అన్నా దొరుకుతాయండి. లేదా మోండామార్కెట్లో తప్పక దొరుకుతాయి.
ధన్యవాదాలు.

gv said...

naku nammakam ledhu endhukante hair kosam chala vaadi visugu vachindhi. kani meru nammakam chepthunnaru kabatti try chesthanu

తృష్ణ said...

@gv:నాకు బాగా ఉపయోగపడిందండి. ఇప్పటికీ వాడతున్నాను. ఎవరికైనా కూడా అవసరం అయితే ఉపయోగపడుతుందని బ్లాగ్లో రాసాను. వాడినందువల్ల జుట్టుకి నష్టం మాత్రం జరగదు. మీ నమ్మకం మీ ఇష్టం :)
జుట్టు ఊడటానికి చాలా కారణాలు ఉంటాయిట. ఏ ఉపాయమూ పనిచెయ్యకపోతే సరైన కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఈమధ్యన కాస్మెటాలజిస్ట్లు చెప్తున్నారండి..
ధన్యవాదాలు.

Unknown said...

chala manchi tip,kani okati naku ardham kale, a powers anni equal quality thisukovaala? hair apply chesi nappudu before 1day oil apply cheyala? cheyakudadha?

తృష్ణ said...

@Pallavi Hr: quantity of the powders is written in the blog post pallavi gaaru. u can apply oil before one day.. no problem.
Thanks for the visit.