సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 29, 2011

ఆంధ్రజ్యోతి ఆదివారం(26-6-11) అనుబంధంలో ప్రచురితమైన కథ: "కల్పన"



ఆంధ్రజ్యోతి ఆదివారం(26-6-11) అనుబంధంలో ప్రచురితమైన కథ పేరు "కల్పన". రచనసామాన్య. నాకు కథలో రచయిత స్పృశించిన సున్నితమైన అంశాలు నచ్చాయి. రచయిత అనుమతి తీసుకుని కథ పి.డి.ఎఫ్. ను టపాలో పెడుతున్నాను. అనుమతినిచ్చిన రచయిత్రి కి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు. ఆసక్తి ఉన్నవారీ కథానికను క్రింది లింక్స్ లో చదవవచ్చు.

part -1

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQM2M5YWE0YTItOTYyOS00YzQ0LWIzN2EtZmVkMmNjMmQ5M2Ri&hl=en_US&authkey=CJmxqNoO


part - 2

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQZDViMjAzMmQtNGZjZS00OGE5LTk2NzYtYmRjNjljZGQ1MTE0&hl=en_US&authkey=CIOty9cH


part -3

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQYjJhZTFiZDEtZWQ0Ny00NmIzLWI1ZGItYzk2OTFhYWY3ZDJk&hl=en_US&authkey=CLiotbcP


part -4

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B3wjxgMVVajQMzE3Njg2ZmItM2VhNS00Mjg4LWJlMGEtZTIxM2VkZWU5ZjI0&hl=en_US&authkey=CKKFiW4



17 comments:

కృష్ణప్రియ said...

ముందర మీ కథేమో అనుకుని తెరిచాను. తర్వాత.. మీకు నచ్చిన కథ కదా అని చూశాను. చాలా టచింగ్ గా ఉంది. Thanks for sharing this one.

వనజ తాతినేని/VanajaTatineni said...

తృష్ణ గారు.. మీ.. పరిచయం ద్వారా "కల్పన" కధని ..చదివాను. తెలియని ఆవేదన చుట్టుముట్టుకుంది. ఆధునిక కాలం అమ్మాయిల చదువులు,ఉన్నత ఉద్యోగాలు..సంపాదన అంటూ..ఆకాశానికి..ఎత్తేయడం..అందరికి కనిపించే బాహ్య కోణం. ఇంటా బయట.చాకితిచేస్తూ..పాత కొత్త తరాల మద్య సంధి కాలంలో.. స్త్రీలు ఎంత నలిగిపోతున్నారో .అన్న దానికి.. కథ . దర్పణం పట్టింది. ఆర్ధిక సమానత్వం కల్గిన స్త్రీని..భార్యగా అంగీకరించలేని..సమాజంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు స్త్రీలకి..చదువు ఉద్యోగాలతో పాటు అన్నీ ఉన్నాయి..వరకట్నం, వేధింపులు,ఆదిపత్య ధోరణి ని భరించాల్సి రావడం..ఇంకా అనేక సాంఘిక సమస్యలు... అన్ని ఉన్నా.. స్త్రీ లో..మాతృత్వం కి..పెద్దపీట..వేయడం..స్త్రీఅత్వానికే చిహ్నంగా.. ముగింపు..కధకి వన్నె తెచ్చింది..వాస్తవం కూడా..అదే..! కధని.. ఇంకా బాగా వ్రాయవచ్చు. కల్పన తన గురించి చెప్పడంలో..ఇంకా .సున్నితత్వం ఇంకా అవసరమనిపించిది. అఫ్ కోర్సు..ఇన్ని సమస్యలని పేస్ చేసిన స్త్రీలకి.. సున్నితత్వం పోతుంది లెండి. ..చక్కని..కధ అని అనలేను.. వాస్తవములు..అంటాను. ఆ ఆవేదన తోనే.. మీకు.. సామాన్య గార్కి . అభినందనలు తెలుపుతూ.

SHANKAR.S said...

వాస్తవికంగా ఉన్న మంచి కథ. ఎలాగూ పబ్లిష్ అయిపోయిన రచనే కదా అనుకుని డైరక్ట్ గా పబ్లిష్ చేయకుండా రచయిత్రి అనుమతి అడిగి బ్లాగ్ లో పోస్ట్ చేసిన మీ సంస్కారానికి నమస్కారం. మంచి కథ పరిచయం చేసినందుకు మీకు వీరతాళ్ళు. ఈ కథలో కల్పన నవ్వు ఆమెకు ఎవర్ని గుర్తుకు తెస్తోందో చివరికైనా తెలుస్తుందేమో అని చూశా. ప్చ్ ..తెలీలేదు.:)

శ్రీలలిత said...

నిజంగానే చాలా సున్నితమైన అంశాలు స్పృశించారు రచయిత్రి సామాన్య. చాలా పెద్ద విషయాన్ని అంత చిన్న కథలో ఇమడ్చడం చాలా కష్టం. కాని రచయిత్రి అ పని సమర్ధవంతంగా చేయగలిగారు. ఆవిడ అనుకున్న భావాన్ని సూటిగా చెప్పగలిగారు. రాసిన ఆవిడకి అభినందనలు. ఆ కథ చూపించి చదివించిన మీకు ధన్యవాదాలు.

Anonymous said...

చాలా బాగుంది కథ. అయితే కథలో చెప్పిన విషయాన్ని గురించి చర్చించుకోవటానికెంతో వుంది.
శారద

Indira said...

chala bagundi kadha.jyothi teppinchkuni maree chadivanu.thanks for sharing.

తృష్ణ said...

@కృష్ణప్రియ: నా కథా..??? మిగిలిఉన్న కూసింతమంది అభిమానులు పారిపోతారా లేదా అనిపించినప్పుడు రాస్తానండీ..:))
టైటిల్ మరోలా పెట్టాల్సిందేమో కదా.
ధన్యవాదాలు.

@వనజ వనమాలి: క్రింద శారద గారు చెప్పినట్లుగా కథ చదివాకా చర్చించాలనిపించిన అంశాలు చాలా ఉన్నాయండి. మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు.

తృష్ణ said...

@శంకర్.ఎస్: అదివరకూ ఓ కథానిక పిడిఎఫ్ పెట్టినప్పుడు, రచయిత పర్మిషన్ తీసుకుని పెడితే మంచిదని బ్లాగ్మిత్రులొకరు సలహా ఇచ్చారండి. అండుకని ఈసారి అనుమతి తీసుకున్నాను. అదండి సంగతి.
మీ ప్రశ్న రచయిత్రిగారిని అడగాల్సిందే ! ధన్యవాదాలు.

@శ్రీలలిత: అందుకే టపాలో పెట్టాలని అనిపించిందండి. ధన్యవాదాలు.

తృష్ణ said...

@శారద: మీ పాయింట్ చాలా కరక్ట్..
ధన్యవాదాలు.

@ఇందిర: అవునా? లింక్ లో చదివేయొచ్చు కదండీ. మీ ముందరి వ్యాఖ్య చూశాను. చాలా సంతోషం కలిగింది. నాన్నగారికి చెప్పాను. వారు కులాసా. ధన్యవాదాలు.

Indira said...

dear trishna, once again indira here.Kalpana kadha meedanunchi manasu mallatam ledu.because recently an alliance came for our elder daughter.everything o.k anukunnatime lo they said that she should leave her job.my daughter is working as a sse in an MNC.then her father is on sight and i accompanied her in all rounds of the selection process.really i enjoyed more when she got selected in 3 companies at a time.pelli inataruvata wife and husband oka understanding ki vatchi decide chesukovalsina vishayanni vallu demanding ga oka issue cheyyadam to we dropped that.really i felt very bad.meeru ichina link lo chadavachu kani power baga potondi.na comment ki mee response naku chala anadanni itchindi.actually i want to type in telugu.but i dont know how to.ila pedda pedda comments raste emi anukokandi.mee blog lage naku na alochanalani share chesukovadaniki manchi wavelength match ina friend dorikinattuga undi.how is your daughter?next time veelaite gollapudi maruthi rao gari Railu Mallitappipoyindi chadivi mee comment post cheyyandi.koumudi library lo undi.very good novel.regards indira.

తృష్ణ said...

ఇందిర గారూ, మరేమీ బాధ పడకండి. మంచి సంబంధం వస్తుంది మీ అమ్మాయికి. I believe the saying 'marriages are made in heaven'.something best is in store for your daughter.
మీరు రాసినది నేను చదవలేదండి. వీలు చూసుకుని చదువుతాను. మీరు onlineలోనే లేఖిని.కాం లో తెలుగు రాయచ్చు. లేదా "బరాహా" డౌన్లోడ్ చేసుకోండి. తప్పక మీ అభిప్రాయాల్ని శేర్ చేసుకోవచ్చు. మీ అభిమానానికి ధన్యవాదాలు.

gandavarapu saamaanya said...

trushna gaaru thank you .spandichina andarikee dhanyavaadaalu .

kiran said...

thanks for sharing a nice story.

తృష్ణ said...

సామాన్యగారూ, Thanks a lot.

కిరణ్ గారూ, thanks for the visit.

union said...
This comment has been removed by the author.
తృష్ణ said...

@union:Thanks for the info.

lakshmi said...

trishna garu, manasulone chala rojula ninchi kadaladuthunna bhavalu okkasariga baitiki kalla mundu kadaladina bhavana. Bharya-Bhartha antaru. bharya peru mundu palikina Bharthade ee samajam lo mundadugu, paicheyyi. iddaru samanam eppudu kaadu kaaleru. aadadi entha chadivina, entha manchi family lonchi vachina, entha samskaravanthuralaina, aame jeevithamlo vivaham oka punarjanma. akkada elanti sthanam labhisthundo, ekkada labhisthindo antha daivadhenam. norethakoodadu,jaregedi choosthu, sardukuntu, daniki thaggattuga jeevithanni, manasuni malachukuntu povadame aadadaani karthavyam.saati manishiga aameki eppudu sthanam ledu. undadu. ivanni oka stri paiki cheppina, andaru cheppukolekapoyina... prathi sthree kadha inthe. koddo goppo thedalo.... samanya garu chala samanyam ga rasina, hrudayamunnavari hridayalni sprusincharu. aavidaki, meeku kooda dhanyavadalu.