సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 4, 2010

It's my Day ...!!



"భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి..
I have to live everyday to the fullest as there is no tomorrow.. .."

ఇది నేను క్రితం ఏడాది నా పుట్టినరోజుకు రిజొల్యుషన్ అనుకున్నాను...ఆ రోజు రాసిన పోస్ట్ లో కూడా అదే రాసాను.
చాలావరకూ ఆచరణలో కూడా పెట్టాను. అనుకోకుండా గత సంవత్సరంలో చాలా నెలలు ఎన్నో ఇబ్బందులు,సమస్యలు, షాక్ లతో గడిచిపోయింది...జీవితమ్ అయిపోయిందేమో అన్న దిగులులో కూడా పడ్డాను. బాధలకూ ఏడ్చాను, ఇబ్బందుల్లో కష్టపడ్డాను, దిక్కుతోచనప్పుడు తల్లడిల్లాను... కానీ గత ఏడాది పుట్టినరోజునాడు చేసిన ఆ రిజొల్యుషన్ నేను మర్చుపోలేదు. జీవితాన్ని ద్వేషించలేదు. మన ప్రాప్తానికీ, కర్మకూ, ఇబ్బందులకూ జీవితాన్ని తిట్టుకోవటం అవివేకమని నా అభిప్రాయం. జీవితంలో ఏర్పడే బాధలూ, సమస్యలూ ఇబ్బండికరమైనవి కానీ జీవితం కాదు. Life is beautiful. అందుకే భగవంతుడు ఇంత అందమైన అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆనందపడతాను.

చాలామంది ఇంత వయసు వచ్చేసింది ఏం పుట్టినరోజులే? అనుకుంటారు. . కానీ, అందమైన పువ్వుల్ని చూసే కళ్ళని, కమనీయమైన గానాన్ని వినే చెవులను, వెన్నలలోని చల్లదనాన్ని అనుభూతి చెందే మనసునూ ఇచ్చిన ఈ జీవితానికి, అది ఏర్పడటానికి కారణమైన ఈ రోజు నాకెంతో అపురూపం గా తోస్తుంది. మనిషిగా పుట్టాం కాబట్టే కదా ఇంత గొప్ప అనుభూతుల్నీ,ఆనందాల్నీ feel అవ్వగలుగుతున్నాం అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పుట్టినరోజంటే కూడా నాకు చాలా ఇష్టం.

మా ఇంట్లో డేట్స్ ప్రకారమే కాక తిథుల ప్రకారం కూడా కలిపి రెండు పుట్టిన రోజులు చేసేసుకుంటాం. నిజానికి ఇప్పటిదాకా మరీ ఇంత ఆరోగ్యం బలహీనపడింది ఇప్పుడే...ఇంకా ఎప్పటికి కోలుకుంటానో కూడా తెలియని స్థితి. అయినా ఈసురోమని ఉండటం నాకస్సలు నచ్చదు. అందుకే ఈరోజు కూడా బయటకు వెళ్ళకపోయినా నాకు తోఛినట్లు ఈ రోజును ఆనందంగా గడిపాను. It's my Day ..It's my birthday and i love it !!

TO ME...!!!



34 comments:

జ్యోతి said...

హ్యాపీ హ్యాపీ బర్త్ డే తృష్ణ.. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి. కష్టాలు వస్తుంటాయి. తట్టుకుని ధైర్యంగా ఉండాలి.

శరత్ కాలమ్ said...

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

Pramida said...

Happy Birthday...

..nagarjuna.. said...

య్యాపి య్యాపి బర్తుడే తృష్ణగారు...ఇలాంటి య్యాపి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా... :)

jyothi said...

MANY MORE HAPPY RETURNS OF THE DAY AND WISH U A SPEEDY RECOVERY.

Padmarpita said...

Many more happy returns of the day.

జయ said...

తృష్ణా, హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు కావాల్సినంత మనోబలానికి మేమంతాఉన్నాంగా...ప్రతీ సంవత్సరం మా అందరిమధ్య ఈ విధం గానే యాపీ యాపీ బర్త్ డే జరిగిపోతుంది. మనసు నిండిపోయే మీ చిన్నారి చిరునవ్వులతో, ప్రేమార ఆదరించే మీ వారితో, అమ్మానాన్నల దీవెనలతో, అయిన వారి పలకరింపులతో, రోజంతా తెలియకుండానే గడిచిపోయుండాలే!!! ఉబ్బి తబ్బిబ్బైయుండాలే!!! మరి మా స్వీట్స్ ఏవమ్మా...

divya vani said...

many more happy returns of the day తృష్ణ... gaaru

It's My Dairy said...

Wish You A Very Very Happy Birth Day Trshna gaaru.

Sree

Mahitha said...

Happy Birthday :)

sunita said...

Happy happy birthday to you!get well soon.

పద్మ said...

Happy Birthday, తృష్ణ గారు. :)

మాలా కుమార్ said...

జన్మదిన శుభాకాంక్షలు .

అనంతం కృష్ణ చైతన్య said...

wish you many happy returns of the day.......................
మీ అభిమానిగా మీరు నూరెళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ............................................
భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మరింత అర్ధవంతంగా, అందంగా తీర్చిదిద్దుకుని మీరు మరింత ముందుకెళ్ళాలని, (వెళ్తారు కూడా) ...............
"HAPPY BIRTHDAY TO YOU"

భాస్కర రామిరెడ్డి said...

Happy birthday to you trushna gaaru.

శ్రీలలిత said...

MANY HAPPY RETURNS OF THE DAY
Srilalita...

Sahithi said...

జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు చాలా జరుపుకోవాలని. మీకు భగవంతుడు మీరు కోరినవి అన్ని ప్రసాదించాలని కోరుకుంటూ

-సాహితి

వేణూశ్రీకాంత్ said...

Happy Birthday తృష్ణ గారు :-)

Anonymous said...

Many Many happy returns of the day thrishna garu.. :)

చిలమకూరు విజయమోహన్ said...

మీరు త్వరగా కోలుకొని చక్కటి ఆరోగ్యంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

మురళి said...

Many more happy returns of the day...

సుజాత వేల్పూరి said...

Happy birthday Dear!

Ravi said...

Puttina roju subhakhankshalu.

SRRao said...

తృష్ణ గారూ !
పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ధృఢ సంకల్పం మనోనిబ్బరం కలిగిస్తుంది. మీరు తప్పక త్వరలో కోలుకుంటారు. All the best.

గీతాచార్య said...

Oh really? Happy birthday to you

రాధిక(నాని ) said...

పుట్టినరోజు శుభాకాంక్షలు తృష్ణ గారు.మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడి ,ఇలాంటి పుట్టినరోజులు జీవితాంతం జరుపుకోవాలని ఆశిస్తున్నాను .

భావన said...

Many Many Happy Returns of the Day తృష్ణ. సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో ఎప్పుడూ నవ్వుతూ వుండాలని ఆశీర్వదిస్తూ.

సి.ఉమాదేవి said...

భగవంతుడిచ్చిన అపురూపమైన వరం పుట్టుక.కష్టాలకు వెరవక,నష్టాలకు బెదరక జీవితనౌకను సాఫీగా నడపగలగడానికి పుట్టినరోజు ఒక ఉద్దీపన.మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

హరే కృష్ణ said...

జన్మదిన శుభాకాంక్షలు

Krishna said...

Many Happy Returns of the Day Trishna Gaaru....

తృష్ణ said...

అభినందనలు తెలిపిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా మన:పూర్వక కృతజ్ఞతలు.Thankyou,thankyou and thankyou verymuch.

@జయ:కరక్ట్ గా ఊహించారు.

'sweet..?" మరి టపాలో కేక్ అందుకేకదండీ పెట్టాను..టేస్ట్ చెయ్యలేదా...?

Anonymous said...

ayyo choodledandi, college work lo busy ga undi, system on cheyyaledu, anyways i heartily wish you a happy birthday, though delated
aparna

పరిమళం said...

తృష్ణగారు, పుట్టినరోజు శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా ....
"భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి.." నిజం!

Overwhelmed said...

Happy Birthday Trishna. Mi peru enta baaguntundo..