'చిత్రం భళారే విచిత్రం' అని పాడాలనిపించింది.....
అసలేం జరిగిందంటే, ఇవాళ టపా రాసే మూడ్ లేక రాయలేదు.so, కొన్నికావాల్సిన ఫోటోలు వెతుకుదాం అని శోధన మొదలెట్టా. బ్లాగ్లో పెట్టే ఫోటోలు రాయల్టీ ఫ్రీ అయితే ఇబ్బంది ఉండదు అని ప్రత్యేకం అలాంటివాటి కోసం వెతకటం నా పనుల్లో ఒక పని. అవసరమైనప్పుడే కాక దొరికినప్పుడే దొరికినన్ని దాచుకోవటం కూడా ఒక అలవాటు. అలానే ఇందాకా ఒక ఫోటో కోసం నెట్లో వెతుకుతున్నా. ఒక ఫోటో లోంచి మరో ఫోటో లోకి వెళ్ళా, అక్కడ్నుంచి ఆ ఫోటో నన్నొక పికాసా వెబ్ ఆల్బమ్ లోకి తీసుకువెళ్ళింది. ఆ ఆల్బం తాలూకూ మనిషి ఇండియనో కాదో తెలీదు. పేరు కూడా హిందూవులా లేదు. అక్కడ కొన్ని పబ్లిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. పబ్లిగ్గా పెట్టిన ఆల్బమ్స్ అన్నీ కొన్ని దేవాలయాలవి(ఇండియాలోవి కాదు),
చారిత్రాత్మక ప్రదేశాలవీ. ఎంతో శ్రధ్ధతో డీటైల్డ్ గా తీసినట్లు తెలుస్తున్నాయి. కొన్ని ఇతర దేశాలవీ ఉన్నాయి. అద్భుతమైన ఫోటోలు.
నాకసలే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక కట్టడాలన్న, పూర్వీకుల, తరతరాల రాజుల తాలూకూ చరిత్రలు అన్నా మహా ఇష్టం. (డిగ్రీలో అన్నింటికన్నా హిస్టరీలోనే బోలెడు ఎక్కువ మార్కులు వచ్చాయి). మహానందపడిపోతూ ఫోటోలనీ చూసేసాను. ఇక ఆ ఆల్బమ్స్ లో ఒక ఆసక్తికరమైన ఆల్బం కనిపించింది. బహుశా అవి ఒక ఆధ్యాత్మిక మ్యూజియం తలూకూ ఫోటోలై ఉంటాయి అనిపించింది. మానవజాతి ఎలా ఆరంభమైంది, ఎలా పరిణితి చెందింది మొదలుకుని యోగా, కుండలిని, సైన్స్ కు సంబంధించిన చిత్రాలు రకరకాలు ఉన్నాయి. మధ్యలో అది ఏ భాషో తెలియదు కానీ నోట్స్ తాలూకూ పేజీలకు తీసిన కూడా ఉన్నాయి.
నాకా మనిషికి ఉన్న వైవిధ్యమైన ఆసక్తులు పట్ల మక్కువ కలిగింది. ఒక ప్రదేశం తలూకూ ఫోటోలు బాగున్నాయని ఆ పేరు పట్టుకెళ్ళి గూగుల్లో పెట్టా ఏ ప్రదేశమో తెలుసుకోవాలని. అది శ్రీలంక లోని ఒక చారిత్రాత్మక ప్రదేశం అని వచ్చింది. ఇక ఆ పేరు తాలుకు ’వికీ’లోకి వెళ్ళి వివరలు చదివా. ఆ తరువాత ఆ వ్యక్తి వివరాలు దొరికాయి. అతనొక జియోఫిజిసిస్ట్, రచయిత కూడా అని ఉంది. అదీ కధ. అక్కడితో నా పరిశోధన పూర్తి అయ్యింది. ఈ వెతుకులాటలో ఒక మంచి ఇంగ్లీషు బ్లాగు కూడా తగిలింది. ఏమి నా భాగ్యము అనుకున్నా.
ఒకోసారి అనుకోకుండా జరిగే చిన్న చిన్న సంఘటనలు ఏంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. తెలియని కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు, మనకు ఇష్టమైన సంగతులు మరొకచోట కనబడినప్పుడు కలిగే సంతోషాన్ని భావాలను మాటల్లో చెప్పటం కష్టం.
14 comments:
antha manchi blog gani aythe meeru asalu vivaralu gani url gani ivvakunda ala ala post chesaaru idi baagunadaa
క్రీస్తుశకం రెండువేలపది సెప్టేంబరు ఇరవైమూడున (వ్యావహారీక చాంద్రమానేన వికృతినామ సంవత్సర, ఆశ్వయుజ పూర్ణిమనాడు) తృష్ణగారు గొప్పవిషయాన్ని శోధించారు :)
నిజం.
కానీ బ్లాగు వ్యసనం మొదలయ్యాక నా స్వేఛ్ఛాజాలవిహరణ బాగా తగ్గిపోయింది :(
మీ బ్లాగులో కామెంటడానికి నొక్కితే ఏంటో కొత్త తెరలు (ప్రకటనలు) లేస్తున్నాయి. కొంచెం వాటి సంగతి చూడమని మనవి.
aa english blog mariyoo aa phoTo pikaasaa link peTtanDi. maemoo choostaam.
బాగుందండీ మీ శోధన.
@rameshsssbd:
@sunita:
ఆయన ఎవరో తెలియదు. పైగా నేను వెళ్ళింది దొడ్డిదారిలో...ఇక చూసినవాటి లింక్ ఇవ్వటం ప్రైవసీని దొంగలించటం అవుతుండని ఇవ్వలేదండీ.
ఇక దొరికిన ఇంగ్లీష్ బ్లాగ్ గురించి త్వరలో రాస్తానండి. చాలా మంచి బ్లాగ్.
@chaitanya: ఏమిటి ఏ మాసంలో ఉన్నావు? ఇదింకా భాద్రపదమే.(నిన్న భాద్రపద పౌర్ణమి) ఆశ్వీజానికి,ప్రసాదాలకీ ఇంకా టైముంది..:)
@కొత్తపాళీ: నిన్నటికీ, ఇవాళ్టిదీ కలిపి బోలెడు థాంకూలండీ....మీరు రాసిన సంగతి చూస్తానండీ.
@amruta: thank you.
So, you too are researching
"అవసరమైనప్పుడే కాక దొరికినప్పుడే దొరికినన్ని ఫొటోలు దాచుకోవటం కూడా ఒక అలవాటు"
మరే మాక్కూడా ఆ అలవాటుందండి.
మాకు పౌర్ణమినుంచే నెల మొదలవుతుంది. అందుకే చిన్నతేడా. శుభికే! శిర అరోహా ఎఫక్టు
photo bagundi trishna gaaru ,
mee shodhana vijayavantam ayinanduku shubhakankshalu
@సృజన: మరి తమ్ముడికి తగ్గ అక్కననిపించుకోవద్దూ..?
@శ్రీనివాస్ పప్పు: చాలా రోజులకు కనబడ్డారు...థాంక్సండీ.
@chaitanya: :)
@దివ్యవాణి: థాంక్సండి.
Post a Comment