సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 27, 2010

ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!

చిన్ననాటి కబుర్లు ఎన్ని చెప్పుకున్నా తనివితీరదు. ఆనందాన్నిచ్చే మధురమైన జ్ఞాపకాలను తలుచుకున్న కొద్దీ మనసు పసిపాపలా మారిపోయి ఆ జ్ఞాపకాల దొంతరల్లో పరుగులు పెడుతుంది. జ్యోతిగారు "గుర్తుకొస్తున్నాయి.." అనే శీర్షికతో రాయమని అడిగినప్పుడు, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి రాయాలని అనుకున్నా.. కానీ అన్నింటిలో వేటి గురించి రాయాలి...అని ఆలోచిస్తే దేన్నీ వదలాలనిపించలేదు. అందుకనే నా అందమైన జ్ఞాపకాల్లో ముఖ్యమైన కొన్నింటిని కలిపి ఇలా ఓ చోట పోగేసాను...

























గోదారిఒడ్డూ...జన్మనిచ్చిన రాజమండ్రీ...
తాతగారిల్లూ...పెద్ద గేటు
మెట్లమీదుగా రేకమాలతి పందిరి
జ్ఞాపకాల్లోనూ మత్తెక్కించే ఆ పూల పరిమళం
దొంగా పోలీస్ ఆటలు, పరుగులూ
పాపిడీ బండి, రిబ్బన్లబ్బాయ్...

విజయవాడ వీధులూ...సూర్యారావుపేట
భాస్కరమ్మగారిల్లు...పక్కింటి తాతగారూ...
పెరడు, మొక్కలు, పక్కింటి పిల్లలు
అడుకున్న ఆటలూ, గోడల మీద విన్యసాలు
చింతల్లేని చిన్నతనం...తిరిగిరాని అమాయకత్వం




















సర్కార్ ఎక్సప్రెస్...కాకినాడ ప్రయాణాలు
రామారావుపేట..శివాలయం ప్రదక్షిణాలు
తాతమ్మా,నానమ్మల కథలు కబుర్లు
అన్నయ్యతో షికార్లు...గాంధీపార్క్ సాయంత్రాలూ
దొడ్లో మొక్కలూ...సంపెంగిపువ్వులూ
సన్నజాజిమాలలు...గిన్నెమాలతి అందాలు
సొంత ఇల్లు అందం...మహారాణీ భోగం..
గేటు దగ్గరి నైట్ క్వీన్ పూల సుగంధం...


మన్ చాహేగీత్ పాటలూ...నాన్నతో ముచ్చట్లు
టేపులూ....రికార్డింగులూ...ఆకాశవాణి స్టూడియోలూ
నిర్వహించిన యువవాణి కార్యక్రమాలు...
చెప్పిన హిందీ పాఠాలూ...కవితలూ..
చిరు చిరు సంపాదనల విజయగర్వాలు




















మేరీస్టెల్లా, బాబాగుడి , ఐదవనెంబరు బస్ రూటు
ఆప్షన్స్, ప్రబోధా, ఆర్చీస్ గేలరీలు, గ్రీటింగు కలక్షన్లు
కాలేజీ స్నేహితులూ..చెప్పుకున్న ఊసులూ
పోస్ట్ మేన్ కోసం పడిగాపులూ...ఉత్తరాల పరంపర..
సినిమా సరదాలు...టికెట్ క్యూల్లో పడిగాపులు
తిరిగిన వీధులు...తిన్న ఐస్క్రీములు


నాన్న అవార్డులు...ఢిల్లీ ప్రయాణాలు
ఆయన సన్మానాలూ..పేపర్లో వార్తలు
నాన్న కూతురినన్న గర్వం
వెళ్ళిన ప్రతిచోటా మర్యాదల పర్వం





















పున్నమ్మతోట క్వార్టర్స్, డి-వన్ ఇల్లు 
పెంచిన పూదోటలూ, పండించిన కాయగూరలు
మెట్ల మీద కబుర్లూ, బేట్మెంటన్ ఆటలు..
న్యూ ఇయర్ సంబరాలు, సంక్రాంతి ముగ్గులూ
పిన్నల మన్ననలు, పెద్దల దివెనలూ
ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!



తలిచినప్పుడల్లా నిన్నటివా గత జన్మావా అనిపించే ఈ చిన్ననాటి స్మృతులు ఎన్నటికీ తరగని నా ఆనంద నిధులు. రాస్తున్నంత సేపూ మనసు ఈ జ్ఞాపకాల తరంగాల్లో ఉయ్యాలలూగింది. ఈ శీర్షికకు రాయటం ద్వారా నాకు లభించిన మధుర క్షణాల ఆనందానికి కారణమైన జ్యోతిగారికి కృతజ్ఞతలు. ఆలస్యమేమిటి...అందరూ ఓసారి అలా మీ మీ చిన్నతనంలోకి వెళ్ళి వచ్చి నాలా రిఫ్రెష్ అయిపోండి మరి...!!

22 comments:

జ్యోతి said...

అబ్బో! ఎన్ని జ్ఞాపకాలో. నిజంగా చిన్నతనం గుర్తుచేస్తే ఒకదానితర్వాత ఒకటి అలా గుర్తొచ్చేస్తుంటాయి కదా. ధాంక్స్ తృష్ణ..

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు

కొత్త పాళీ said...

సంతోషం.
ఇంతకు మునుపొక సారి అడిగినట్లు గుర్తు. మీ నాన్న గారిని గురించి, వారి వివిధ కార్యకలాపాల గురించీ వివరంగా రాయండి.

Sasidhar Anne said...

Chala baaga raasuru..first time mee blog chusa..

మాలా కుమార్ said...

మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి .

Kalpana Rentala said...

తృష్ణ,

మీవి నావి దాదాపుగా కొన్ని జ్నాపకాలు ఒకటే...కాకపోతే మీదాంట్లో కొంత గోదావరమ్మ కూడా ఉంది. నాకు మాత్రం ఒక్క కృష్ణమ్మ మాత్రామే. విజయవాడ లో ఆ వీధుల పేర్లు,ఆ రేడియో స్టేషన్ జ్నాపకాలు అన్నీ ఒక్కటే...మీరు ఇలా రాయడం ద్వారా నేను మాత్రం మరో సారి మన వూరు వెళ్ళి వచ్చేశాను.

మీరే కాస్త చొరవ తీసుకొని కాసేపు ఆ వంటల బ్లాగ్ గురుంచి పెద్దగా రాయకుండా అన్నీ ఇవే రాయకూడదా....

తృష్ణ said...

@జ్యోతి: మీకు మరోసారి చాలా చాలా థాంక్స్ అండి.

@రాధిక(నాని): ధన్యవాదాలు.

తృష్ణ said...

@జ్యోతి: మీకు మరోసారి చాలా చాలా థాంక్స్ అండి.

@రాధిక(నాని): ధన్యవాదాలు.

divya vani said...

నాకు కూడా మీలా gnapakaalu varasagaa raayaalani undi trishna gaaru
chala bagunnayi mee ananda nidhulu

తృష్ణ said...

@కొత్తపాళీ: అవునండీ గుర్తుంది. ఇప్పుడిప్పుడే కాస్త స్వస్థత చేకూరుతోందండీ. త్వరలో తప్పక రాస్తాను.

@Sasidhar Anne: మీ బ్లాగ్స్ కూడా ఇవాళే చూసానండీ. బాగున్నాయి. ధన్యవాదాలు.

తృష్ణ said...

@కల్పన రెంటాల: మన బెజవాడని ఎన్నిసార్లు తలుచుకున్నా తనివి తీరదండి. అంత కమ్మనివి మన జ్ఞాపకాలు.

ఇక ఆ వంటల సంగతికొస్తే..."ఆ ఒక్కటీ అడక్కండి"..!వారానికి ఒక్క వంట గురించైనా రాయకపోతే నాకు అన్నం అరగదు. ఆ పక్కన నలభీములున్నారు, ఇట్నుంచి కొత్తపాళిగారు పోటీకి వస్తానంటున్నారు...ఎలాగో ఏమిటో...!!

తృష్ణ said...

@దివ్యవాణి: ధన్యవాదాలు.

@ :వ్యాఖ్య రాయటం కుదరక SMS చేసి పోస్ట్ బాగుందని చెప్పినవారందరికీ కూడా many many thanks.

జయ said...

చిన్నతనం నుంచి బయటికే రాబుధ్ధేకాదు:) స్కూల్, ఇంటర్ చదువులే కాదు, అనేక ఇతర అనుభవాలు నేనెప్పుడూ మర్చిపోలేను. చాలా మంచి అనుభవాలు పంచుకున్నారు. ఎవరి కైనా అదే కదా గోల్డెన్ ఏజ్.

siva said...

చాలా బాగు౦ద౦డి, ఎప్పటిలాగే.....ఐనా మీ ప్రతి బ్లాగు ఎక్కడో మనస్సు అడుగున నిద్రిస్తున్న జ్నాపకాలను తట్టి లేపేవే కదా! జ్నాపకాలు “ఆనాటివి” కావనుకొ౦టా. అవి ఎల్లప్పుడు మనతొనే ఉ౦డేవి , ఒకోసారి స్తబ్దుగా, ఒకో సారి జలపాతాల్లాగా.

veera murthy (satya) said...

మారాము, గారాబం, పెంకితనం, అలక, అమాయకత్వం, బుంగ మూతి, కమ్మని ఇకిలింపు(నవ్వు) , నవ నూతన ప్రపంచము , పసితనము , ముక్కు సూటితనము, చలాకీతనము , సంసిధ్ధత, స్థిరత్వం తెలీని - గమ్యం లేని పరుగు, అలసి సొలసి గాఢ నిద్ర , నా బల్యంలో నాకివే గుర్తుకొస్తాయ్ . .. ..

తృష్ణ said...

@జయ: నిజమేనండీ. కానీ అన్నింటి గురించీ రాయాలి అనే భావన ఇలా కిచిడీ రాత రాయించింది. ధన్యవాదాలు.

@శివ: చాలా రోజులకు వ్యాఖ్య రాసారు...! ధన్యవాదాలు.

@సత్య: నా టపా కన్నా మీ వ్యాఖ్య నాకు బాగా నచ్చేసింది...బంగారు బాల్యం అంటే అదేనండీ.
thank you.

భావన said...

వో విజయవాడ కబుర్లు తో ఇంకో సారి మమ్ములను కూడా తీసుకెళ్ళారు గా. ఆ వీధులు ఆ రోజులు.. ప్చ్..చాలా బాగా రాసేరు చిన్నతనాన్ని తలచుకోవటం ఎప్పుడూ సరదా ఐన పనే కదా.

మధురవాణి said...

Nostalgia! :)మీ విజయవాడకి నేను మొన్నే హాయ్ చెప్పి వచ్చాను. :)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నేనూ ఓసారి స్వర్ణముఖి ఇసుకలో గుడికట్టుకొచ్చా :)

Somasekhar said...

చాలా బావుందండీ. మీ గతం గురించి కళ్ళకి కట్టినట్టు రాశారు. చదువుతుంటే నా బాల్యం కూడా నాకు గుర్తు వచ్చింది. ఎందుకంటారు.....??? :-).

శిశిర said...

చాలా బాగా రాశారండి. చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు.

Unknown said...

very well written in beautiful language.....in the short piece you seem to have covered your entire childhood.
look forward to seeing more from you
vasu, prasuna