సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, September 22, 2010

"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ !!


"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ సరదాగా రాద్దామనిపించింది...చదివి నవ్వుకోండి..!!

బ్లాగరు బ్రతుకింతే
బ్లాగు కథ ఇంతే
బ్లాగున్న మనిషికీ
తృప్తిలేదంతే

పోస్ట్ రాస్తే ఖూషీరాదు
వ్యాఖ్య కోసం ఆశపోదు
రాసే చేతికి అదుపులేదు
రాయకపోతే శాంతిలేదు

అంతా చదువుతారని తెలుసు
అయినా వ్యాఖ్య రాయరని తెలుసు
తెలిసీ చూసే ఎదురుచూపులో
తీయదనం బ్లాగరుకే తెలుసు

మరుజన్మ ఉన్నదోలేదో
ఈ బ్లాగులప్పుడేమౌతాయో
బ్లాగరు కథయే ఓ ప్రహసనం
బ్లాగరెలా వదుల్చుకుంటాడీ వ్యసనం

***** ****** *****

అసలు పాట ఇక్కడ వినండీ..


19 comments:

ఆ.సౌమ్య said...

అదరగొట్టేసారండీ...నా మననులోని మాటలని అలా అలా బయటపెట్టేసారు :D

తిరు said...

:)
బావుంది.
ఐనా అంత నిరాశ ఏమిటండీ?

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది :)

తృష్ణ said...

@tiru:అసలు పాట లోని pathetic mood చెడిపోకుండా అలా రాసానండీ...:)

swapna@kalalaprapancham said...

hahaha superb, excellent

హరే కృష్ణ said...

మీకెందుకు అండీ అంత శ్రమ నేను రాసి పెట్టేవాడిని కదా
మీ పాటే బావుంది :)
నేను రాసుంటే మూడ్ pathetic గా తయారయ్యేది

veera murthy (satya) said...

లేనిచి చూపలేము ఉన్నది దాచలేము .

కనీసం హాస్యంగానైనా .మా అంతరంగాన్ని బయటిగి లాగారు.బాగుంది (నవ్వుకోవడానికి).

కొత్త పాళీ said...

good one

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

రాస్తే పబ్లిష్ చెయ్యగలను
రాయనివ్వరు
పబ్లిష్‌చేస్తే కామెంట్ రాయగలను
పబ్లిష్ చెయ్యనివ్వరు...ఖళ్ ఖళ్

kiran said...

hahahhaha..chala bagundi.. :D

Satish Dhanekula said...

Nice One....

జయ said...

అంతేనంటారా:)

lakshmi sravanthi udali said...

:) andari baadha abenadi
meere ala nate mememanali mari

Somasekhar said...

"అంతా చదువుతారని తెలుసు
అయినా వ్యాఖ్య రాయరని తెలుసు..."

నా లాంటి readers అభిమానన్ని indirect గా దెబ్బ తీసి వాళ్ళ చేత వ్యాఖ్యలు రాయించేసుకుంటున్నాయి ఈ పైన lines :-).

Very nice parody andi. Great idea and nice expression....

Ravi said...

EE tapa chadivi comment pettaka pote baagundadu ani.........

Emi aina chala baaga rasaru, Congrats.

పరిమళం said...

:) :)

divya vani said...

తెలిసీ చూసే ఎదురుచూపులో
తీయదనం బ్లాగరుకే తెలుసు..
baagundi trishna gaaru peradi

తృష్ణ said...

వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

Srujana Ramanujan said...

:D