సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 16, 2010

శ్రీరాముడి విజయం..!!


ఆనందమానందమాయెనే...మన శ్రీరాముడు ఇండియనైడిలు ఆయెనే....!!

***

నిన్న పొద్దున్నే ఫోనులో ముఖ్యమైన విశేషాలు అయిపోయాకా, పిచ్చాపాటి కబుర్లలోకి వచ్చాము...

"ఇవాళ ఇండియన్ ఐడిల్ చూడాలి రాత్రి" అన్నాను.
"ఇండియన్ ఐడిలా..??" తన ప్రశ్న.
"శ్రీరామ్ గురించి ఎక్కడా చదవలేదా..చూడలేదా?"
"శ్రీరామ్ ఎవరు?"
"రామ రామా..ఇదేం ప్రశ్నండీ..? once upon a time in mumbai...


మనం సోనీ చానల్ లో ఇండియన్ ఐడిల్ ప్రోగ్రాం మొదలైనప్పటీ నుంచీ ఇద్దరు ఐడిల్స్ సెలక్షన్స్ వరకూ అన్ని ఎపిసోడ్స్ చూసేవాళ్ళం...
అర్ధరాత్రి దాకా రిజల్ట్ చెప్పరు..మధ్యలో ఏడ్స్...నాన్పుడు, టైమ్ వేస్ట్ అని మీరు విసుక్కునేవారు గుర్తులేదా?"
"ప్చ్...!"
"అవునులెండి, మీకు గుర్తుంటే ఆశ్చర్యపడాలికానీ.....అయినా శ్రీరామ్ గురించి తెలియకపోవటమేమిటండీ..." అన్నాను నిరాశగా..

అప్పుడు ఓ నవ్వు నవ్వి చెప్పారు " నేను SMS చేసాను" అని.
ఈసారి నేను ఆశ్చర్యపోయాను..

"ఏమిటి? మీరేనా? SMS ఆ? అయితే ఆ కుర్రాడు ఖచ్చితంగా గెలుస్తాడు.." అన్నాను నవ్వుతూ.
"అవును మరి, మన తెలుగుఅబ్బాయిని మనమే గెలిపించాలి " అన్నారు.

FM లకు, టివీ ప్రోగ్రాములకు SMS లు పంపటం అనేది మా ఇద్దరికీ ఇష్టం లేని పని. మామూలు SMS కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ రేట్ అయినా సరే SMSలు చేసేస్తూ మనకు తెలియకుండానే మొబైల్ కంపెనీలను పోషిస్తూ, వాళ్ళ లాభాలను పెంచుతున్నాం అన్నది మా అభిప్రాయం. మా అత్తగారు ఏదన్నా కార్యక్రమానికి SMS పంపమని అడిగితే, నాకయితే ఛాయిస్ ఉండదు కానీ మా వారయితే బయటకు వెళ్తున్న మనిషి ఆగిపోయి, ఆవిడ "బాబూ, నేను SMS పంపనులే.నువ్విక వెళ్ళు" అనే దాకా ఆవిడకు ఓ క్లాస్ ఇచ్చి వదులుతూ ఉంటారు. అలాంటి మనిషి ఇవాళ తెలుగువాడిని గెలిపించాలి అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు.

సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు. అలాంటిది ఒక తెలుగువాడిని గెలిపించాలి అని ఇవాళ రాష్త్రమంతా కలిగిన ఈ స్పృహ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీరామ్ లోని ప్రతిభ అతడిని చివరిదాకా నడిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కార్యక్రమం గురించి తెలిసినా, తెలియకపోయినా; ప్రేక్షకుల్లో సంగీతం గురించిన అవగాహన ఎంత ఉందీ అన్న ప్రశ్న పక్కన పెడితే, తెలుగువాడిని గెలిపించాలి అనే స్పృహ వలన యావత్రాష్ట్రంలో కలిగిన ప్రకంపనల తరంగాలు అతడి విజయానికి కారణమయ్యాయి. కానీ ...ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి? అన్న ఒక్క విషయమే నాకు మింగుడు పడని ప్రశ్న. మిగిలిన కార్యక్రమాలకీ సంగీత పోటీలకూ తేడా ఉంది కదా. ఇక్కడ గెలుపును సంగీతజ్ఞులు, విద్వాంసులు నిర్ణయిస్తే సమంజసంగా ఉంటుంది. విద్వాంసులు, సంగీతజ్ఞులైన జడ్జీలు ఉన్నా కూడా గెలుపు జనం ఇచ్చే తీర్పు పై ఆధారపడి ఉంటుంది అంటే అది నేను హర్షించలేను. ప్రాంతీయ,జాతి,మత భేదాలు లేకుండా ఎంత మంది జనం నిజమైన ప్రతిభకు ఓటు వేస్తారు? ఇలాంటి గెలుపు ను పాల్గొనేవాళ్ళు, ప్రేక్షకులు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు? అన్నది నాకు అర్ధంకాని ప్రశ్న.

ఈ మధ్యన ఏ టివీ చానల్ చూసినా ప్రతి కార్యక్రమంలో ఈ మధ్యన ఈ SMSల జోరు బాగా పెరిగిపోయింది. ఏ కార్యక్రమమైనా సరే అసలు మన డబ్బు ఖర్చుపెట్టి ఎందుకు SMSలు చెయ్యాలి? పూర్వకాలం ఈ SMSలు ఉన్నాయా? అయినా "సురభి", "TVS Saregama", సిధ్ధార్ధబాసు క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ షోలు, సీరియల్స్ మొదలైన వన్నీ ప్రాముఖ్యతను పొందలేదా? ఎందుకు మొబైల్ కంపెనీవాళ్ళ ఆదాయాల్ని సామాన్య ప్రేక్షకుడు పెంచాలి? అన్నవి సమాధానం దొరకని ప్రశ్నలు. నాకనిపించేదేమిటంటే జనంలో పెరగాల్సింది SMSలు చెయ్యటం వల్ల మనకన్నా మొబైల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మనం వాటిని పెంచి పోషిస్తున్నాము అన్న స్పృహ. కాదంటారా?

*****

ఇవాళ పొద్దున్నే తనకు ఫోన్ చేసాను...


"శ్రీరామ్ గెలిచాడు తెలుసా. అర్ధరాత్రి దాకా కూర్చుని చూసాను.."
"తెలుసు...అతనిది మన ఏరియానేట. రాత్రి చాలా హంగామా చేసారు...ఆ టపాకాయలూ, ఫైవర్క్స్ సందడికి నాకు మెలుకువ వచ్చెసింది...నిద్రలో పిల్ల జడుసుకుంది కూడా..."

10 comments:

నేస్తం said...

మీ ఇంట్లో అలా జరిగిందా ...నిన్న మా ఇంట్లో ఇలా..
ఏమండీ ఇండియల్ ఐడిల్ వస్తుంది ఈ రోజు చూడాలి..మన తెలుగబ్బాయి శ్రీరాం ఫైనల్ కొచ్చాడండి...
ఓ .. ఆ రోజే అన్నానుగా ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉందని ...
మీరా ? అన్నారా? ఏ రోజు? అసలు మీకు శ్రీరాం ఎవరో తెలుసా ?????
సరిపోయింది..గుర్తుపట్టలేదా.. మొన్న తెలుగు మహాసభలకు వచ్చాడుగా ...సూపర్ సింగర్స్ శ్రీక్రిష్ణ రాలేదని తెగ ఫీల్ అయిపోయావ్ ..కాని ఈ అబ్బాయి చాలాబాగా పాడాడు ..మన వెనుక వరుసలోనే కదా కూర్చున్నారు...
ఓ ఆ అబ్బాయి ఈ అబ్బాయా?????



అదన్న మాట సంగతి..నిన్న రాత్రి 12 :50 నిమిషాలు వరకు మేలుకుని నిద్రపోయా ప్రొద్దున్న లేచాకా బ్లాగుల్లో చదవడమే ..మీరింకా SMS లకు ఫీల్ అవుతున్నారా...అంత చక్కని ప్రోగ్రామె లో ఆ పిచ్చి డ్రెస్ల పాటలేంటో నాకేం అర్ధం కాలేదు....సగం నిద్ర పోడానికి కారణం అది :)

హరే కృష్ణ said...

Congratulations Sreeram!

మైత్రేయి said...

ఈ యస్ యమ్ యస్ ల గూర్చి తీవ్రంగా ఆలోచించాక తట్టిందేమిటంటే, మనకు ఈ ప్రొగ్రామ్ ద్వారా, రామ్ ద్వారా, మ్యూజిషియన్ ల ద్వారా వినోదం లభిస్తున్నది కనుక మనము డబ్బు పెట్టి మెసేజ్ పంపటం తప్పు లేదు. అలా వచ్చిన డబ్బేగా వాళ్ళు ప్రైజ్ ఇవ్వగలుగు తున్నారు. చూసినందుకూ యాడ్స్ వస్తాయను కోండి.
ఏ పిచ్చి సినిమానో బోల్డు డబ్బు పెట్టి చూడటం లేదా!
అసలు చిన్న సైజు యానివర్సిడే కాలనీ కమ్యూనిటీ హాల్ లో చెయ్యటానికి ఏబైవేలు దాకా అవుతుందని విన్నాను. మరి ఈ లెవెల్ లో అన్ని వూళ్ళు తిరిగి సెలెక్టు చేసి, మేకప్ లు చేసి అన్నీ చెయ్యాలంటే వాళ్ళకూ పైసలు కావాలికదండి.

Anonymous said...

సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు.

hahahhahhaahh :D

congrats sriram..!!

Pranav Ainavolu said...

"ఒక సంగీత పోటీలో గెలుపు ఓటముల్ని SMSలు నిర్ణయించటమేమిటి?"
నాకూ (నాలాంటి చాలా మందికి) ఇలానే అనిపిస్తుంది. ఆ డబ్బులు పాడినవారికి పారితోషికంగా ఇస్తారా అంటే అదీ లేదు. tv ఛానల్ వాళ్లు, mobile కంపనీల వాళ్ళు కలిసి డబ్బు దండుకోవడానికే ఈ SMSల ప్రక్రియ అని అందరికీ తెలిసిందే.
ఇన్ని మాట్లాడే నాకే ఆ గళం విన్న క్షణం ముగ్ధుణ్ణై ఒక మంచి గాయకుడు కేవలం SMS వల్ల ఓడిపోకూడదు అని పంపాలనిపిస్తుంది.
నాలాంటి వాళ్ళు ఎంతమందో :)

గీతాచార్య said...

:)

Bussiness sentiment

శేఖర్ పెద్దగోపు said...

నేనూ చూశాగా రాత్రి..కాకపోతే అంతంత సేపు యాడ్స్ ఇచ్చినప్పుడు మాత్రం తిక్కవచ్చింది..ఏదో మనవాడు గెలిస్తే కళ్ళారా చూడలనుకునే కోరిక తీర్చుకోడానికి భరించాల్సివచ్చింది...ఇలాంటి ఇజ్జత్ కా సవాల్ సంధర్భాల్లో టాలెంట్‌తో మనవాడు ఉన్నప్పుడు ఎస్సెమ్మ్సెస్ గురించి అంతగా ఆలోచించనవసరంలేదని నా ఫీలింగ్...

Sujata M said...

ponlendi. Sriram original reaction (gelichaka) naku chala nachindi.
Inka, tanu Mi cheta manchi post rayinchaadu kooda. god bless him.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

"సౌత్ ఇండియన్ అంటే మదరాసీ నా? అని అడిగే ప్రతివాడి నెత్తినా ఒక మొట్టికాయ కొట్టి "దక్షిణాదిన మిగిలిన వాటితో పాటూ ఆంధ్ర రాష్ట్రమొకటి ఉంది" అని వంద సార్లు ఇంపోజిషన్ రాయించాలి అనిపిస్తుంది నాకు."
ఇక్కడ రెండేళ్ళుగా ఇంపోజిషన్లుకాదు గోడకుర్చీలు, నీల్‌డౌన్లు, శీర్షాసనాలు వెయ్యించి మొత్తానికి మాజనాన్ని కొంతవరకుమార్చా. బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడూ, తిరుపతి ఆంధ్రాలో ఉంది, శ్రీహరికోట ఆంధ్రాలో ఉంది...
వారణాసికి వచ్చేవాళ్ళలో మూడొంతులు తెలుగోళ్ళే అయినా గంగాకావేరి, సంఘమిత్ర ఎవరు దిగినా వాడు అరవోడే ఇక్కడోళ్ళకి. వ్యాఖ్యలో సరిపోదుగానీ దీనిపైన టపారాస్తా వీలుచూసుకుని.

Truely said...

తెలుగు వాళ్ళు అంటే ఎవరో ఈ పాటికి ఈ north ముండ వాళ్ళకి అర్ధం అయివుంటుంది. మీరు ఎంతమంది నమ్ముతారో లేదో north Indians కి సౌత్ ఇండియాన్స్ అంతే చాల చిన్న చూపు. వాళ్ళకి pakistan వాళ్ళు అన్న ఇష్టమే కాని సౌత్ ఇండియాన్స్ అంటే చిన్న చూపు. మన శ్రీరాం తన సత్తా చూపి తెలుగు వారి గొప్పతనాన్ని చాటాడు. Hats off to you.......