భాషా పాండిత్యం లేని నాబోటి సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా సరళమైన కవిత్వాన్ని రాయగల నేర్పు ఒక్క కృష్ణశాస్త్రిగారికే ఉందనటం అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుని గళం వినాలనే కుతూహలం లేనిదెవరికి? 5-2-54 లో కాకినాడ లోని సరస్వతీ గానసభ వజ్రోత్సవాల(గోల్డెన్ జూబిలీ) సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చేసిన ప్రసంగంలోని కొంత భాగం ఇక్కడ పెడుతున్నాను.
ఈ సభ జరిగిన నాలుగైదేళ్ల తరువాత ఆయన స్వరం బొంగురుపోవటం, తప్పనిసరిగా ఆపరేషన్, తదనంతరం ఆ స్వరం మూగపోవటం జరిగింది. అందువల్ల చాలా మందికి ఈ అద్భుత కవి స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఆంధ్రా షెల్లీ గా ప్రఖ్యాతిగాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గళాన్ని ఈ బ్లాగ్ ద్వారా వినిపించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
18 comments:
ఆ మహనీయుని గొంతు వినే అదృష్టం కలిగించిన మీకు ధన్యవాదాలు.
తృష్ణ గారూ !
అద్భుతం, అరుదైన అద్భుత కవి గళాన్ని మీరందించడం. ధన్యవాదాలు.
కృష్ణ శాస్త్రి గారి గళం వినిపించినందుకు ధన్యవాదాలండి.
ఆ మహానుభావుని గొంతు వినే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు తృష్ణ గారు.
ఆడియో ఏదండీ, మాకేమీ కనిపించట్లేదు.
sastry gaari galam vinipinchinandukumeeku dhanyavaadaalu
@ఆ.సౌమ్య: విడ్జట్ లో ప్లే బటన్ ఉంది చూడండి.
అబ్బ, ఎంత బావుంది తృష్ణా! ఎంత స్పష్టత!
నేను ఆయన గొంతు ఇంకా సుకుమారంగా ఉంటుందని ఊహించుకునేదాన్ని! బహుశా ఆయన భావ కవిత్వం ప్రభావం కాబోలు!
థాంక్యూలు మీకు! బోలెడు!
కృష్ణశాస్త్రిగారి గొంతు వినగలగడం గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని మీ దగ్గరే అట్టిపెట్టుకోకుండా మాకు కూడా పంచి ఇచ్చినందుకు ధన్యవాదాలు.
thanx alot ,u made me so happy ;-)
అంత స్వచ్చమైన తెలుగు ప్రసంగం వింటున్నప్పుడు టైం మెషీన్లో తెలుగు సాహిత్యం ఓ వెలుగు వెలిగిపోతున్న రోజులకు వెళ్ళిపోయానా అని అనిపించింది...మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీదగ్గర...
Excellent post with a very nostalgic recording. Thank you Madam. Well done.
download చేసుకోవటం ఎలాగండీ?
నాకు ఎంతో ఇష్టమైన భావకవి అద్భుత మాటలు వినే అదృష్టం కలిగించిన తృష్ణకు కృతజ్ణతలు. ఆ పాటలు కూడా వినాలనిపిస్తోంది మరి. I wish you a very happy Independence Day.
మరో దేవులపల్లి ఆడియో, ఇక్కడ:
http://www.eemaata.com/em/issues/200401/1135.html
చాసో, విశ్వనాథ, రాయప్రోలు గొంతుకలు కూడా. అలాగే మహాప్రస్థానంలోని రెండు కవితలు రజనిగారి స్వరకల్పనలో (మొదటిది మల్లిక్ గారి గళంలో).
భవదీయుడు,
శ్రీనివాస్
@shanmukhan : Sirnivasgaru has given the link.please check the link and maybe you can copy the voice.
@శ్రీనివాస్ పరుచూరి: లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండీ. ఆ ఆడియో తెలుసండీ. ఆ voices అదే సీక్వెన్స్లో నాన్నగారి దగ్గర ఉన్నాయండీ.
వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు..
Post a Comment