
जब जब दर्द का बादल छाया ,
जब ग़म का साया लहराया ,
जब आंसू पलकों तक आया ,
जब यह तनहा दिल घबराया ,
हमने दिल को यह संजय ,
दिल आखिर तू क्यूँ रोता हैं ?
दुनिया में यूँ ही होता हैं .
यह जो गेहेरे(deep) सन्नाटे(silence ) हैं ,
वक़्त ने सबको ही बाटे हैं ,
थोडा ग़म हैं सबका पिस्सा(plenty ) ,
थोड़ी धूप हैं सबका हिस्सा(share),
आग तेरी बेकार ही नम हैं ,
हर पल एक नया मौसम हैं ,
क्यूँ तू ऐसे पल खोता हैं ?
दिल आखिर तू क्यूँ रोता हैं ?
(-- javed akhtar from 'ज़िन्दगी न मिलेगी दुबारा' )
ఎంత గొప్ప ఫిలాసఫి ఇది...మనసా ఎందుకు నువ్వు దు:ఖిస్తావు? జీవనవిధానం ఇంతే. కష్ట నష్టాలు అందరికి సమానంగానే పంచింది కాలం. ప్రతిక్షణం ఒక కొత్త ఋతువు అనుకుని ప్రతి క్షణాన్ని జీవించు . కష్టాన్ని చూస్తూ దు:ఖించకు అని పైన రాసిన కవితకు అర్ధం. నిన్న చూసిన ఈ సినిమా మైకం నుండి నేను ఇంకా తేరుకోలేదు...జగ్జీత్ సింగ్ లాగ में नशे में हूँ ...అని పాడాలని ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇది ఒకటి అని గాట్టిగా చెప్పగలిగిన మరో సినిమా 'ज़िन्दगी न मिलेगी दुबारा'.
నేను ఈ సినిమా కోసం ఎదురు చూడటానికి , చూడటానికి కారణం మూడు కారణాలు - hrithik , hrithik , hrithik :))
కానీ సినిమా చూసాకా మొత్తం అందరు నటీనటుల పట్లా, మొత్తం సినిమా crew పట్ల అభిమానం పొంగి పొర్లింది. అంత బాగా చేసారు అందరూ. ముఖ్యంగా శంకర్-ఎహ్సాన్-లాయ్ చేసిన నేపథ్య సంగీతం సినిమా మూడ్ ను బాగా ప్రాజెక్ట్ చేసింది. ఇక ఫోటోగ్రఫి , లోకేషన్స్ అయితే సినిమాకే హైలైట్స్ అని చెప్పాలి. నేను గత ఏడాదిగా నేర్చుకుని ఆచరిస్తున్న జీవిత సత్యాన్ని ఈ సినిమా మరోసారి నాకు చూపెట్టింది. "ఈ రోజు మాత్రమే నీది..జీవితాన్ని ప్రతి క్షణం జీవించు..." ఇది ఈ సినిమాలో చూపెట్టిన ఫిలాసఫి. ముగ్గురు స్నేహితులు తమ తమ జీవితాలను కొత్తగా ఎలా చూడటం మొదలుపెడతారో, అతర్లీనo గా తమలో ఉన్న భయాలను ఎలా తొలగించుకుంటారో వైవిధ్యమైన కథనంతో గా చూపెట్టింది దర్శకురాలు జోయా అఖ్తర్ . కాలేజీ రోజుల్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం సాహసవంతమైన రోడ్ ట్రిప్ కు Spain బయల్దేరుతారు ముగ్గురు స్నేహితులు ఇర్ఫాన్,కబీర్,అర్జున్. ఈ సినిమాలో చూపెట్టిన Spain అందాలు Spain టూరిజంను పెంచుతాయనటం అతిశయోక్తి కాదు.

'నలభై తర్వాత రిటైరై జీవితాన్ని ఆస్వాదిస్తాను' అని అర్జున్ అన్నప్పుడు , 'నలభై తర్వాత నువ్వు జీవించే ఉంటావని నమ్మకం ఏమిటి? ఈ క్షణాన్ని జీవించటం నేర్చుకో ' అంటుంది లైలా. లైలా మాటల వల్ల,స్నేహం వల్ల జీవితాన్ని కొత్త కోణంలోంచి చూడటం మొదలు పెడతాడు అర్జున్. అనుకోకుండా జరిగిన నిశ్చితార్ధం వల్ల నటాషా తో పెళ్లి కుదుర్చుకున్న కబీర్ నెమ్మదిగా తమ ఇద్దరి మధ్యన ఉన్న వైరుధ్యాలను తెలుసుకుంటాడు. విభిన్న దృక్పదాల మధ్యన తమ వైవాహిక జీవితం సుఖమయంగా ఉండదన్న సత్యాన్ని గ్రహించి పెళ్లిని రద్దు చేసుకోవటానికి నిర్ణయింఛుకుంటాడు కబీర్. ఒక బంధం బలపడటానికి , జీవితాంతం నిలవటానికి ఇద్దరి మధ్యన "నమ్మకం" ఎంత ముఖ్యమైనదో చెప్తుంది వీరిద్దరి కథ. జీవితంలో ఒక్కసారన్నా తండ్రిని కలుసుకోవాలన్న ఆరాటాన్ని తీర్చుకుని, తల్లి ఎందుకు తనని తండ్రి నుంచి దూరంగా ఉంచిందో అర్ధం చేసుకుంటాడు ఇర్ఫాన్.
మొదటి సినిమా 'dil chahta hai' తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ "ఫరాన్ అఖ్తర్", తానూ మంచి నటుడిని కుడా అని "rock on " సినిమాలో నటన ద్వారా నిరూపించుకున్నాడు. తన మొదటి సినిమా " सॊचा ना था" తో తన సత్తా చూపెట్టిన abhay Deol ,చెప్పుకోదగ్గ సినిమాల్లేకపోయినా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గని హ్రితిక్ రోషన్.... ఈ ముగ్గురి నటన సినిమాకు ఊపిరి. కత్రినా పాత్ర కూడా గుర్తుండిపోతుంది. కత్రినాలో కుడా ఒక మంచి నటిని మళ్లీ ఈ సినిమాలో చూస్తాము. దీప్తి నావెల్ ను చాలా రోజుల తరువాత స్క్రీన్ మీద చూశాకా 'కథ ' మొదలైన పాత సినిమాలు గుర్తుకొచ్చాయి. నసీరుద్దీన్ పాత్ర చిన్నదైనా కీలకమైనది. "మనస్ఫూర్తిగా మనసుతో చెప్పగలిగినప్పుడు మాత్రమే క్షమాపణ చెప్పు" అన్న అర్జున్ డైలాగ్ చాలా నచ్చింది నాకు. సినిమాలో వాడుకున్న జావేద్ అఖ్తర్ పొయిట్రీ నాకు భలే నచ్చేసింది.ముఖ్యంగా టపా మొదట్లో రాసినదీ,సినిమా ఆఖరులో వచ్చిన కవితా చాలా బాగున్నాయి.

'లా టమాటినా ఫెస్టివల్' సీన్ షూట్ చెయ్యటానికి కోసం బోలెడు టన్నుల టమాటాలు పోర్చుగల్ నుండి తెప్పించారుట.డీప్ సీ డైవింగ్, స్కై డైవింగ్, బుల్ రన్ మూడు కుడా చాలా సాహసోపేతంగా, ఉత్సాహభరితంగా ఉన్నాయి. సినిమా కొద్దిగా స్లోగా ఉన్న మాట వాస్తవమే కానీ కొత్తసినిమాల్లోని స్పీడ్ కి అలవాటు పడిపోయిన మనకి డిటైల్డ్ షాట్స్ బోర్ గా అనిపిస్తాయి అంతే. కొన్ని పాత సినిమాలు చూసేప్పుడు ఏమిటి వీళ్ళు డైలాగ్స్ ఇంత స్లోగా చెప్తున్నారు.షాట్స్ ఇంత స్లోగా ఉన్నాయి అనిపిస్తుంది. అది కొత్త సినిమాల్లో ఉన్న స్పీడ్ ప్రభావం. పాతలన్నిమ్తిలో నాకు "సెనోరిటా' పాట బాగా నచ్చింది . అ పాటని ముగ్గురు హీరోలు సొంత వాయిసెస్ లో పాట్టం స్పెషాలిటి. సినిమా మొత్తం ఆవరించి ఉన్న 'లైవ్లీనెస్ ' నాకు బాగా నచ్చింది. సినిమా చివరలో దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ గురించిన సీన్ చాలా బాగుంది. కబీర్ ప్రాక్టికల్ జోక్స్, ఇర్ఫాన్ డైలాగ్స్ అన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
సినిమాలో వెస్ట్రన్ ప్రభావం మాత్రం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. సినిమాను ఫారినర్స్ కోసం తీశారా అన్నట్లు భారతీయ విలువలను అతిక్రమించిన సన్నివేశాలను నా సాంప్రదాయపు మనసు ఒప్పలేదు. ప్రస్తుత ప్రపంచం , జీవన విధానం అలానే ఉన్నాయేమో..కానీ సున్నితమయిన మానవ సంబంధాలను ప్రభావవంతంగా తెరకెక్కించిన తరువాత ఇలాంటి సన్నివేశాలు అవసరమా అనిపించాయి. ఏదేమైనా మొత్తం మీద నన్ను ఎ మాత్రం నిరాశపరచలేదు సినిమా. చూసి ఇరవై నాలుగ్గంటలైనా ఇంకా సినిమా మత్తులోనే ఊగిసలాడుతున్న..!! ఔను నిజం..జీవితం మళ్ళీ దొరకదు.. !
7 comments:
తృష్ణ గారు, పోయిన మంగళవారం ఈ మూవీ చూడడం జరిగింది. నాకు చాలా బాగ నచ్హింది. any way Good Review :)
nice review
This movie perfectly resembles to yours blogs caption .
Nice Review
This exactly resembles to yours blogs caption.
Hola Senorita,
I too liked this movie. However, it could have been better. Hritik wasnt like Aamir in DCH. Thense, the density lacked. :O
@విరిబోణి: థాంక్స్ అండీ.
@ఎన్.రాంబాబు: ధన్యవాదాలు.
@sujata:Donde has astado?సెనోరీటా..:))పాట భలే ఉందికదండి!
ఎందుకు ఈ సినిమాని 'దిల్ చాహ్తా హై"తో కంపేర్ చేస్తున్నారో తెలియట్లేదండీ.. ముగ్గురు స్నేహితులు ఉన్నారు కానీ రెండూ themes లో difference ఉంది.. i liked hrithik and everything in the film..maybe iam biased with Javed's poetry and hrithik :))
నాకు జిందగీ సినిమా ఎంత నచ్చిందంటే విపరీతంగా, పిచ్చి పిచ్చిగా ఇలాంటి విశేషణాలు సరిపోవు. ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్ కేరక్టర్ నాకు విపరీతంగా నచ్చేసింది. (నా ప్రొఫెషన్ స్క్రీన్ మీద షేర్ చేసుకున్నందుకేమో). సినిమాలో అన్నిటికన్నా టమాటినో తర్వాత కత్రినా, హృతిక్ లాంగ్ వాక్ లో మాట్లాడుకునే మాటలు. మొదటి సారి కొడుకుని కలిసినప్పుడు నసీరుద్దీన్ ఎక్స్ ప్రేషన్స్ ఒకటా రెండా సినిమాలో ఆసాంతం మనసుని టచ్ చేసే సీన్లు బోలెడు. ఫ్రెండ్స్ లాంగ్ టూర్ కి వెళ్ళడం, ముగ్గురు స్నేహితులు కావడం వంటివి దిల్ చాహ్ తా హై ని గుర్తుచేసినా ఆ సినిమా వేరు,ఈ సినిమా వేరు. మొదటి ప్రయత్నం లోనే ఇంత చక్కగా తెరకెక్కించి జోయా అన్నకు తగ్గ చెల్లెలు అనిపించింది.
శంకర్ గారూ, ఇది జోయా మొదటి ప్రయత్నం కాదు..రెండవది. "లక్ బై చాన్స్" మొదటిది. ఫరాన్,కొంకణా ఉన్న ఈ సినిమా కూడా నాకు బాగా నచ్చింది.ఫరాన్,కొంకణా ఇద్దరూ బాగా చేస్తారు.
Thanks.
Post a Comment