సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, June 13, 2011

ప్రముఖ నాట్యాచార్యులు స్వర్గీయ డా.నటరాజ రామకృష్ణ గారి రేడియో ఇంటర్వ్యూ


మరుగున పడిన రెండువేల ఏళ్ళ చరిత్ర గల "ఆంధ్ర నాట్యాన్ని", ఏడొందలఏళ్ళ చరిత్ర గల కాకతీయులనాటి వీరరస ప్రధానమైన "పేరిణి శివతాండవాన్ని" వెలికి తీసి, మళ్లీప్రచారంలోకి తీసుకువచ్చి తిరిగి జీవం పోసిన ఘనత ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ నాట్యా చార్యులు డా. నటరాజ రామకృష్ణ గారిది. ఇవే కాక మరుగున పడిన మరిన్ని ప్రాచీన నృత్యరీతులను మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావటానికి ఆయన చేసిన కృషి అపూర్వమైనది. నృత్యం పట్ల అత్యంత అంకితభావం ఉన్న అంత గొప్ప కళాకారులు తెలుగువారవ్వటం మనకు గర్వకారణం.

1983లో ఉగాది నాడు వారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి "ప్రత్యేక జనరంజని" కార్యక్రమాన్ని రూపొందించే సదవకాశం మా నాన్నగారికి వచ్చింది. క్రితంవారంలో డా.రామకృష్ణ గారి ఆకస్మిక మృతి పట్ల విచారపడుతూ, ఆనాటి ఇంటర్వ్యూ విశేషాలను మా నాన్నగారు తలుచుకున్నారు. "ఆ రికార్డింగ్ ఉంది. కేసెట్ అన్నయ్యతో పంపిస్తాను నీ బ్లాగ్లో పెట్టమని" చెప్పారు నాన్న. ఆయన కోరిక మేరకు ఈ ఇంటర్వ్యును ఈ టపాలో పెడుతున్నాను. ఆసక్తి గలవారు క్రింద ఉన్న రెండు లింక్స్ లోనూ ఆనాటి కార్యక్రమాన్ని వినవచ్చు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినది మా నాన్నగారు శ్రీ ఎస్.బి.శ్రీరామ్మూర్తిగారు. అసలు నాట్యం లో ఏమేమి ప్రధానపాత్ర వహిస్తాయి, భారత దేశంలోని రకరకాల నాట్య రీతులు మొదలైన విశేషాలను గురించి రామకృష్ణ గారు ఈ ఇంటర్వ్యూ లో చెప్పారు.


కార్యక్రమం నిడివి తగ్గించటం కోసం మధ్యలో వేసిన పాటలు చాలావరకూ ఎడిట్ చేసాను. క్రింద ఉన్న లింక్స్ లోని రెండు భాగాల్లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చు..

1983 ఉగాదినాటి "ప్రత్యేక జనరంజని" మొదటి భాగం,రెండవ భాగం:

 

5 comments:

ramesh said...

డా. నటరాజ రామకృష్ణ గారి నృత్య పరిచయ ప్రసంగం, నృత్యాన్ని ఎలా చూడాలి, ఆనందించాలి అని తెలియని నాలాంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉండేలా ఉంది.

మీ నాన్న గారికి, మీ అన్నయ్య గారికి, మీకు, ఎన్నెన్నో ధన్యవాదాలండి.

SHANKAR.S said...

అరటిపండు వలిచినట్టు చెప్పడం అంటే ఇదీ. ఇన్నాళ్ళూ నృత్యమన్నా, నాట్యం అన్నా ఒకటే అనుకునే వాడిని. నిజంగా ఒక గొప్ప నాట్య కళాకారుడు తన కళని చెవులకు సైతం చూపించగలడు అని నిరూపించిన ఈ మహానుభావుడు తెలుగువాడిగా పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. ఇంత మంచి కార్యక్రమాన్ని మీ ద్వారా మాకు అందించిన మీ నాన్నారికి నాతరపున థాంక్స్ అని చెప్పండి.

Ennela said...

సో నైస్ ఆఫ్ యూ తృష్ణ గారూ, సింప్లీ సూపర్బ్..

HalleY said...

Thanks for this post

తృష్ణ said...

@HalleY: thanks for the visit :)