సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, June 9, 2011

ఒక స్వాప్నికుడు నిష్క్రమించాడు !


ఒక స్వాప్నికుడు నిష్క్రమించాడు
ఒక కుంచె వెలవెలబోయింది
రంగులే రక్తంగా బ్రతికిన
ఓ సంపూర్ణజీవితపు వెలుగు ఆరింది
మరో పర్వం ముగిసిపోయింది !

ఎం.ఎఫ్.హుసేన్ గురించి ఇప్పుడే చూసిన వార్త ఈ వాక్యాలు రాయించింది. ప్రత్యేకమైన అభిమానం ఎంతమాత్రం లేదు. మిగతా విషయాలెలా ఉన్నా... ఒక చిత్రకారుడిగా గౌరవం ఉంది.
అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

బాపూచిత్రాలను చూసిన కళ్ళతో ఈయన చిత్రాలనెలా చూస్తున్నారండీ బాబూ? :(

తృష్ణ said...

@చిలమకూరు విజయమోహన్: బాపూ బాపూ నే నండీ. ఆయనకు తిరుగులేదు. ఆయనను మించి ఎవరినీ అభిమానించిందీ లేదు.True !

నేను హుసేన్ అభిమానిని కాదని టపాలో రాసానండి. గమనించాగలరు !

హుసేన్ ఏ రకమైన భావాలు కలిగిన మనిషైనా, నాకతను పూర్తిగా తెలియకపోయినా, హుసేన్ మరణించాడు అనగానే ఆ మనిషి ఆలోచనలు అతనితో అంతమైపోయాయి కదా అనే భావన కలిగింది. మనిషి మరణించాకా తప్పైనా ఒప్పైనా తన ఆలోచనలను, ఐడియాలజీనీ చెప్పి ప్రపంచాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉండదు కదా...ఇక ఎవరేమనుకున్నా ఊపిరిలేని మనిషి తన తరఫున సంజాయిషీలూ, నిరూపణలూ ఇచ్చుకోలేడుగా !
ఇలాటి భావాలే ఈ టపాకు కారణం.

నా విచారం "మరణం" అనే అంశం పట్ల...ఆ మరణం ఒక వివాదస్పద మనిషిదైనందుకు కలిగిన ఆలోచనల పట్ల :))

SHANKAR.S said...

బాపు వలన చిత్రకళ మీద కలిగిన అభిమానం , గౌరవం వలన ఏ చిత్రకారుడు మరణించినా మనసుకు అయ్యో అనిపిస్తుంది.

తృష్ణ said...

shankar.s: Thank you.