ఎంత ఆనందం
ఎంత తన్మయత్వం
ఎంత మధురానుభూతి
ఎంత తాదాత్మ్యం
ఆహా ఏమి నా భాగ్యం
ఆన్ని బొమ్మలు చూడగలిగిన నా జన్మ ధన్యం !!
ఈ చివరాఖరు రోజైనా వెళ్ళి బాపు బొమ్మల కొలువు చూడగలిగాను.
మనసరా..
కనులారా..
తృప్తిగా !!
మూడు బస్సులు మారి దాదాపు ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసి మండుటెండలో నడిచి నడిచి డస్సిపోయా !
అయినా కలిగిన ఆనందం ముందర ఈ కష్టం ఏపాటి?
"ఎండలో కాకిలా తిరిగి వస్తున్నావా? పిచ్చిదానా" అని అమ్మ మందలిస్తూంటే చెవులకు వినబడతాయా?
తెలుగువాళ్ళు ధన్యులు "బాపూ" మనవాడైనందుకు.
అయినా ఏమిటో అలా ఊరి చివర పెడితే ఎలా వెళ్ళేది? నాలుగు చక్రాలున్నవాళ్ళు తప్ప రెండు కాళ్ళతో నడిచే సామాన్యులు ఎలా వెళ్తారు?
ఏమో ప్రదర్శకుల సాధక బాధకాలు ఎవరికి ఎరుక?
వళ్ళంతా కళ్ళు చేసుకుని ప్రతి బొమ్మా చూశేసి...ప్రతి బొమ్మా ఆబగా ఫోతోలు తీసేసుకున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రదర్శకులకు ధన్యవాదాలు.
ఎంత అలసిపోయినా ఈ నాలుగు వాక్యాలైనా రాసి ఆనందం పంచుకోకపోతే ఇవాళ రాయకపోతే నాకు నిద్ర పట్టదు మరి..:)
ఫోటోలన్నీ ఎడిట్ చేసాకా రేపు వీలైతే మరిన్ని ఫోటోలు పెడతాను..!!
9 comments:
అవును. ఇది మాత్రం మహా భాగ్యమే. ఆ అదృష్టం నేనూ దక్కించుకో గలిగాను. అన్ని బొమ్మలూ పెట్టండి.
బాపు గారి బొమ్మల కొలువుకి వెళ్ళొచ్చారా ? అందుకేనా అంత ఆనందం ? కనుల పండువు జరిగిందన్నమాట. అదృష్టవంతులే. మీరు మూడు బస్సులు మారి వెళ్ళారు. నేను వెళ్ళాలంటే నిజానికి రెండు బస్సులు మారి వెళ్తే చాలును. ఈ రోజు నేను, మా ఆవిడా వెళ్దామనే అనుకున్నాం. కానీ, వయసు సహకరించ లేదు.
పోనీ లెండి, తక్కిన ఫొటోలు రేపు పెడతానన్నారు కదా, వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
తృష్ణ గారూ !
నిజంగానే ఏమి మీ / మా భాగ్యము...!
You are so luckey !
తృష్ణ గారు,
చాలా బాగుంది. నిజంగానే.. ఇలాంటివి ఏమి చూడాలన్నా దూరం తలచుకుంటే 'వద్దు లే ' అనిపించేస్తుంది. ఇలాగ ఏదో చూసిన వారు చెప్పే విషయాలు విని/చూసి ఆనందిన్చేయటమే..
వ్యాఖ్య రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న ఎండదెబ్బ ప్రభావం బాగానే కనబడుతోంది..:) కాస్త ఓపిక రాగానే తప్పక మాంఛి మాంఛి ఫోటోలన్నీ పెట్టేస్తాను..:) కొద్దిగా వైట్ చెయ్యండేం !!
పంతుల జోగారావు గారూ, మీ కథకు బాపు వేసిన బొమ్మ కూడా బొమ్మలకొలువులో ఉంది.
తృష్ణగారు మీరు చాలా అద్రుష్టవంతులు..మా ఆఫీస్ దగ్గరే ఈ బొమ్మల కొలువు పెట్టారు..వెళ్దాం అని అనుకుంటుండగానే ఎదో ఒక పని..మీ మనోనేత్రంలో అన్ని బొమ్మలు పెట్టండి..చూసి ఆనందిస్తా..
ఓ మూడేళ్ళ క్రితం అనుకుంటా మా వూళ్ళో కూడా బాపూ బొమ్మల కొలువు(ఎగ్జిబిషన్ కమ్ సేల్) పెట్టారు.. నేనూ వుల్లాసంగా, వుత్సాహంగా వెళ్ళాను.. అంతా బానే వుంది..కాని ఓ చిన్న బొమ్మా కొందాం అన్నా రేటు మనకి అందుబాటులో లేదు..చిన్న కలర్ ప్రింట్లున్న పేపర్ మీద వేసిన బొమ్మలైనా కొందాం అనుకున్నా, మరీ అంత చిన్నవి కొన్లేక తిరిగి వచ్చేసా.. అప్పుడు ఫొటోలు తియ్యనివ్వలేదనుకుంటా
Post a Comment