(అమావస్య చంద్రుడు నుంచి వయోలిన్ కాన్సర్ట్ బిట్)
ఇవాళ ఇళయరాజా పుట్టినరోజు అని తెలిసి ఆయనపై నా ఉడతాభిమానం చూపెట్టుకుందాం అని దురద పుట్టింది. "మణిరత్నం" పుట్టినరోజూ ఇవాళే. ఇద్దరు నాకు ఇష్టమైన కళాకారులే. కానీ నేను ఎక్కువ పాటల మనిషిని కనుక ఇళయరాజానే ఎక్కువ తలుచుకుందామని నిర్ణయించేసుకున్నా ! ఇళయరాజా స్వరపరిచిన ఒకప్పటి "How to name it", 'Nothing but wind" కేసెట్ అరిగిపోయేదాకా వినటానికీ, మొన్నటి The music MEssiah" అబ్బురంగా వినటానికీ కారణం నాన్న .
"How to name it" లో నాకు బాగా నచ్చిన ఒక బిట్:
"Nothing but wind" నాకు బాగా నచ్చిన ఒక బిట్:
అయితే, అసలు "ఇళయరాజా సినిమాపాటల పిచ్చి" నాకు ఎక్కించింది మాత్రం మా అన్నయ్యే. ఇళయరాజా తెలుగు సినిమాలకి చేసిన హిట్ సాంగ్స్ అన్నీ నాకు రికార్డ్ చేసి ఇచ్చేవాడు. "నాయకుడు" సినిమాలో "నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు" పాట అదే ట్యూన్లో వేరు వేరు సాహిత్యాలతో సినిమాలో చాలా చోట్ల వస్తూ ఉంటుంది. కొన్న కేసెట్లో ఒక వర్షనే ఉండేది. అన్ని కావాలి ఎలారా? అని అడిగితే అన్నయ్య నాకోసం అన్ని వర్షన్స్ సంపాదించి రికార్డ్ చేసి పంపించాడు. కాకినాడ వెళ్ళినప్పుడు, ఉత్తరాల్లోనూ కూడా ఇళయరాజా గొప్పతన్నాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉండేవాడు. "స్వర్ణకమలం" వచ్చినప్పుడూ "శివ పూజకు" పాట మొత్తం సాహిత్యం ఎంత బావుందో చూడు, దీనికి ఇళయ్ సంగీతం కూడా ఎంత బాగా చేసాడో విను.. అంటూ ఉత్తరం రాసాడు.
ఇళయరాజా పాటల్లో ఏవి మంచివి, ఏవి గొప్పవి అని చెప్పటం చాలా కష్టం. 'ఇళయరాజా' అనగానే నాకు గబుక్కున గుర్తొచ్చే పాటలు:
సుందరమో సుమధురమో (అమావస్య చంద్రుడు)
పూమాల వాడెనుగా పుజ సేయకే(సింధు భైరవి)
ఇలాగే ఇలగే సరాగమాడితే(వయసు పిలిచింది)
జాబిల్లి కోసం ఆకాశమల్లె(మంచి మనుషులు)
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది(నిరీక్షణ)
మల్లెపూల చల్లగాలి(మౌనరాగం)(ఇదే "చీనీకమ్" సినిమాలో వాడుకున్నారు మళ్ళీ)
ఇళయరాజా స్వయంగా పాడిన 'కలయా నిజమా'(కూలీ నం.వన్)
ఇళయరాజా స్వయంగా పాడిన పాటలు తమిళం అర్ధం కాకపోయినా కొన్ని వింటానికి బాగున్నాయని రికార్డ్ చేసుకున్నాను. పెక్యూలియర్ ఉండే ఆ గొంతు కూడా నాకు నచ్చుతుంది.
"అవతారం" తమిళ్ సినిమాలోని ఈ పాట ఏ రాగమో కానీ నాకు భలే నచ్చుతుంది:
'నాయకుడు' తమిళ సినిమాలో ఇళయ్ పాడిన ఈ పాటలో ముఖ్యంగా నాకు నచ్చేది బీట్ కు సరిపోయేలా ఇళయరాజా గొంతులోని హుషారు :
ఇళయరాజా స్వయంగా పాడిన కొన్ని తమిళ్ పాటలు క్రింద లింక్‌లో డౌలోడ్ చేస్కోవచ్చు:
http://www.freedownloadpond.com/ilayaraja-collection-%E2%80%93-2/
***** ***** *****
ఇంక ఇళయరాజా స్వరపరిచిన సినిమాల్లో అన్ని పాటలూ బావుండి, వినీ వినీ జీర్ణించేసుకున్న పాటల కేసెట్ల తాలూకు తెలుగు సినిమా పేర్లు:
స్వాతిముత్యం
మౌనరాగం
మౌనగీతం
సితార
అభినందనపల్లవి అనుపల్లవి
స్వర్ణకమలం
స్వాతిముత్యం
ఓ పాపా లాలి
శ్రీకనకమహా లక్ష్మి డాన్స్ ట్రూప్
రుద్రవీణ
ప్రేమించు పెళ్ళాడు
ప్రేమ
సింధు భైరవి
దళపతి
కిల్లర్
ఆదిత్య 369
గుణ
సూర్య ఐపిఎస్
అల్లుడుగారు
శృతిలయలు
ఘర్షణ
మహర్షి
నాయకుడు
ఆరాధనమంత్రిగారి వియ్యంకుడు
కొండవీటి దొంగ
రాక్షసుడు
అంజలి
ఆఖరిపోరాటం
డాన్స్ మాస్టర్
అభిలాష
బొబ్ల్లిలి రాజా
చైతన్య
గీతాంజలి
లేడీస్ టైలర్
రుద్రనేత్ర
శివ
ఇంద్రుడు చంద్రుడు
మరణ మృదంగం
అన్వేషణ
కోకిలఆత్మ బంధువు
చెట్టుకింద ప్లీడర్
cheeni kum
paa
ఇంకేమన్నా మర్చిపోతే గుర్తుచేయండి..:)))
9 comments:
పాత పాటను మళ్ళీ పాడుకొమ్మంది అన్నట్టు గత ఏడాది ఇళయరాజా పుట్టినరోజు పోస్ట్ ఇది.
http://blogavadgeetha.blogspot.com/2010/06/blog-post_3360.html
చాలా బావుంది తృష్ణగారూ. గుర్తు చెయ్యమన్నారు కదా అని మరికొన్ని మంచి సినిమాలు గుర్తు చేస్తున్నాను. 1. సాగర సంగమం ( జాతీయ అవార్డ్) 2. జగదేక వీరుడు- అతిలోక సుందరి 3. సీతకోక చిలుక 4. ఏప్రిల్ ఒకటి విడుదల 5. మంచి మనసులు ( జాబిల్లి కోసం నాకు బాగా గుర్తున్న పాట) 6. రాజ్ కుమార్ ( రాముడు అనుకోలేదు) 7. టిక్ టిక్ టిక్ ( ఓ నటన మయూరి వయ్యారీ) 8. నిరీక్షణ (యమునా ఎందుకే నువ్వు, చుక్కల్లే తోచావే) 9. గురు ( పేరు చెప్పనా నీ రూపు చెప్పనా) 10. వసంతకోకిల 11. కొత్త జీవితాలు మొదలైనవి.. ఎన్ని రాస్తే సరిపోతుంది.. ఈ మధ్యన ఎందుకో ఇంత గొప్పగా అనిపించడం లేదు ఆయన పాటలు.
మీరు మర్చి పోయినవి నాకు గుర్తొచ్చినవి ఇంకొన్ని సినిమాలు...
ఏప్రిల్ 1 విడుదల
రాక్షసుడు
మైఖేల్ మదనకామరాజు
చంటి
ఓ పాప లాలి
సంకీర్తన
ఆలాపన
ఆత్మ బంధువు
నిర్ణయం
ఒకరాధ ఇద్దరు కృష్ణులు
etc etc... lot more
కామెంట్ రాద్దామని మొదలెడితే ఇళయరాజా గురించి చాలా వస్తాయి. unending... so. నా quotation ఒకటుంది. అదిమాత్రం చెపుతా. "ప్రతిఒక్కరు ప్రతిరోజు ఒక్క ఇళయరాజా పాట అయినా వినాలి". ఇంతకన్నా ఇంకేం చెప్పక్కరలేదు
Happy Birthday to our Beloved Music Maestro
@shankar.s: Thanks for the link.
@ప్రసీద: చాలా థాంక్స్ అండి.
జాబిల్లి కోసం పాట రాసాను. :)
Actually, నేను రాసినవి అన్ని పాటలూ బాగున్న సినిమాల లిస్ట్.(నేను ఎక్కువగా విన్నవన్న మాట:))
ఇందాకానే "జగదేక వీరుడు..", "నిరీక్షణ" గుర్తొచ్చాయి నాకు. మీరు రాసిన "సీతాకోకచిలక", "సాగర సంగమం" వీటిని అన్ని పాటలూ బాగున్న లిస్ట్ లో రాస్కోవచ్చు.
"వసంత కొకిల" మర్చిపోయా..! అయిన దాంట్లో కథగా కల్పనగా పాట, స్మిత పాట రెండే కదా. మీరు రాసిన మిగిలినవన్నీ సింగిల్స్ లిస్ట్ లోకొచ్చేస్తాయి. anyways, ఇంకొన్ని మంచి పాటలు గుర్తు చేసినందుకు మరోసారి చాలా థాంక్స్.
@R Satyakiran: yeah...for రాక్షసుడు, నిర్ణయం, ఏప్రిల్ 1 విడుదల, సంకీర్తన,. మిగిలినవి నే రాసాను లిస్ట్‌లో.
చంటి,ఒక రాధా ఇద్దరు కృష్ణులు, మైఖేల్ మదన కామరాజు ల్లో అన్నిపాటలూ బాగుండవు కదా..!
మీ కొటేషన్ బాగుంది. వినేద్దాం..:)
మంచి పాటలు గుర్తుచేసినందుకు మీక్కూడా థాంక్స్.
ఇళయరాజా స్వరకల్పనలోని ఇన్ స్ట్ర్రుమెంటల్ బిట్లు మొదటే ఇవ్వటం బాగుంది. ‘నథింగ్ బట్ విండ్’లో నాకు బాగా నచ్చిన బిట్ ‘గీతాంజలి’ సినిమాలో ఓ సన్నివేశంలో నేపథ్యంగా ఉపయోగించారు. దీనిలో హరిప్రసాద్ చౌరసియా వేణుగానం అమృత తుల్యమే. ఇళయరాజా స్వరజాల మహిమ అది!
‘స్వర్ణకమలం’లో శివపూజకు చివురించిన, కొత్తగా రెక్కలొచ్చెనా, అన్నిటికీ మించి- అందెల రవమిది పదములదా- పాటలు ఎంతో బాగుంటాయి. ఇళయరాజా మధురగీతాల్లో ‘ఆదిత్య 369’లోని ‘సుర మోదము..’ పాట నాకు ప్రత్యేకించి ఇష్టం!
@వేణు: అవునండి... నాగార్జున చెట్ల దగ్గర ఎన్లైటెన్ అయ్యే సీన్..కదా.. "గీతాంజలి" సినిమా మొదటిసారి చూస్తూంటే ఇదేదో విన్నట్లుందే అని ఆలోచించి ఆలోచించి సినిమా అయ్యే టైంకి గుర్తుపట్టేసా..:) "హౌ టూ నేమ్ ఇట్" లోని ఇంకో బిట్ ను "వీడు" అనే సినిమా నేపధ్యసంగీతంగా వాడుకున్నారు. తన బాణీలనే మళ్ళీ మళ్ళీ రకరాకాలుగా కొద్ది కొద్ది మార్పులతో తానే చాలాచోట్ల ఇళయ్ వాడుకున్నారు. థాంక్స్ అండీ.
Good compilation trishnaa garu.
I think we will not find a single person in Andhra and Tamail Nadu, who is not a fan of Ilayaraja. His greatness can be seen not just in his works, but the effect he has on others. It is not an exaggeration to say that he has inspired a whole generation of music directors. I saw many of today's music directors saying in interviews that they are here today because of the inspiration they had by listening to Ilayaraja since their childhood. Ex: DSP, KM, RP, Chakri and many others.
BTW, మీ లిస్టులో ఒక అచ్చుతప్పు ఎమైనా పడిందా అని అనుమానంగా ఉందండీ. కొందవీటి దొంగ తరువాతది రక్షకుడా? రాక్షసుడా? నాకు తెలిసిన నాగర్జున-రహ్మాన్ ల "సోనియా సొనియా" రక్షకుడు కాకుండా పాతది ఇంకేమైనా ఉందా?
@సోమశేఖర్: అవునండి నేనూ విన్నాను కొన్ని ఇంటర్వ్యూల్లో. అచ్చుతప్పే..హడావుడిలో పొరపాటు. అందుకే పైన ఎవరో "రాక్షసుడు" చెప్తే రాసా కదా అనుకుని.. మర్చిపోయానేమో అనుకున్నా కానీ చెక్ చెయ్యలేదు..:)))
థాంక్యూ.
Post a Comment