ఋతుపవనాలు వచ్చేసాయి వచ్చేసాయి...అని తెగ చెప్పేస్తున్నారు వార్తల్లో. వర్షాలు కూడా అలానే మొదలైపోయాయి. ఇప్పుడే ఓ అరగంట జల్లు కురిసింది. "వాన" అంటే ఇష్టం లేనివారు అరుదుగా కనిపిస్తారు. నాకూ ఇష్టమే. కానీ వానా కాలం అంటేనే భయం. గృహిణి అవతారం ఎత్తాకా మాత్రం ఎందుకనో ఇదివరకూలా ఆస్వాదించలేకపోతున్నాను. వర్షాకాలం వచ్చేసిందంటే "బాబోయ్ వర్షం.." అని భయమేస్తోంది.
ఒకప్పుడు వర్షమంటే..
కాగితం పడవలు చేసి సందంతా నిండిన వాననీటిలో వెసి ఆడుకోవటం...
చిన్నగదిలో కిటికీ గూటిలోకెక్కి సన్నటి జల్లు మీద పడుతూంటే పుస్తకం చదువుకోవటం...
ఎప్పుడెప్పుడు వర్షంలో తడుద్దామా అని ఆత్రుత..
ఆ తర్వాత..
బాల్కనీలో ఉయ్యాలలో ఊగుతూ వేడి వేడి కాఫీ తాగటం..
ఊయ్యాల ఊగుతూనే మంచి మ్యూజిక్ వినటం..
వర్షం పడినప్పుడల్లా వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు వేసుకోవటం..
వానవల్ల కాలేజీకి శెలవు దొరికితే ఆనందంతో గంతులెయ్యటం..
ఇంకా తరువాత..
హాల్లోంచి వర్షం చూస్తూ మంచి బొమ్మ వేసుకోవటం..
గుమ్మంలో కుర్చీ వేసుకుని వాన పడుతున్నంతసేపు చూస్తూ కూచోవటం..
మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందా అని ఎదురుచూడటం..
కాలం గడిచే కొద్దీ మన అభిప్రాయాల్లో, ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలానే వర్షం గురించిన అభిప్రాయాలు కూడా మారిపోయాయి.
ఇప్పుడు వర్షమంటే..
అమ్మో మళ్ళీ వచ్చేసింది వాన... ఆరేసిన బట్టలు ఆరతాయా?
ఆరీ ఆరని తడిపొడీ బట్టలతో ఇల్లంతా కంపు కంపు ! మయదారి వాన..
పొద్దున్నే మొదలయ్యిందివాళ వాన..పనమ్మాయి వస్తుందో రాదో...రాకపోతే చచ్చానే..
వర్షం వల్ల స్కూల్ వాన్ రాకపోతే పిల్లని స్కూలుకి ఎలా దింపాలో?
ఇవాళ ముఖ్యమైన పని మీద వెళ్దాం అనుకున్నాను...మొదలైపోయింది వాన..ఎలా వెళ్ళేది?
వాన వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఇంకా పెరిగిపోతాయి..తను ఇంటికి ఎప్పుడొస్తారో...
వేసంకాలమే నయం ఎండలు భరించాలే తప్ప అన్ని పళ్ళు దొరుకుతాయి...
వాన వాన వాన...వీధంతా కాలవలా ఉంది. దీన్ని దాటుకుని బయటకు వెళ్లటం ఎలా?
ఇలా సాగిపోతాయి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు కుర్చీ వేసుకుని కూచుని వర్షాన్ని చూస్తూ ఆనందించాలని అనిపించదు. పనులాగిపోతాయని భయం వేస్తుంది. అప్పుడప్పుడు వస్తేనే వాన బావుంటుంది. రోజూ వచ్చేస్తే ఏం బావుంటుంది? ఎప్పుడెప్పుడు వర్షాకాలం అయిపోతుందా అనే అనిపిస్తుంది. కానీ నాకు వర్షం ఇష్టమే. కానీ వానాకాలం అంటేనే భయం.
ఎప్పుడెప్పుడా అని మేం ఎదురుచూస్తూంటే, ఇంకా వర్షాలు మొదలవ్వకుండానే నీ గోలేంటమ్మా चुप रहो ! అంటారా? సరే నేను गायब అయితే..!!
9 comments:
నిజమే తృష్ణ గారూ,
అమ్మాయిలుగా ఉన్నప్పటి ఆనందాలు అన్నీ అమ్మ అవగానే బాధ్యతలై భయపెడ్తాయి. మనం వర్షంలో బయట తిరిగీ, ఐస్ క్రీం తినీ అనందించాము. పిల్లలు బయటకి వెళ్తానంటే అమ్మో వద్దు మళ్ళీ ఏ జలుబో పట్టుకుంటే నా వల్ల కాదు తల్లీ అంటాం ప్రేమతో.
హిల్ స్టేషన్స్ కూడా అంతేనండీ సైట్ సీయింగ్ కి బానే ఉంటుంది.ఇల్లాలై అక్కడ నిత్యం ఉండాలంటే ఎన్ని సమస్యలో.
శ్రీరాగ
మీరు అర్జెంట్ గా గాయబ్ అయిపోండి. వర్షం ఎంత బాగుంటుంది? మరీ వారాల తరబడి పట్టుకోక రెండు మూడు రోజుల పాటు ఏకధాటిగా వాన కురుస్తే నాకు బాగానే ఉంటుంది. కానీ పాపం బస్తీల్లో కొద్దిపాటి వర్షం పడ్డా ఇల్లంతా కురిసే వాళ్ళు, డ్రైనేజ్ పొంగి ఇంట్లోకి నీళ్ళొచ్చేవాళ్లను తల్చుకుంటే అయ్యో అనిపిస్తుంది.
బట్టలు ఆరవనీ,స్కూలు వాన్ రాదని,పనులు పాడవుతాయనీ..అబ్బే ఇవన్నీ నాకసలు సమస్యలే కావు.
మంచి ఫోటోలతో పోస్ట్ పెట్టి....చుప్ అని గాయబ్ అయితే ఎలాగండి?:)
హ్హహ్హహ్హా! భలె రాసారండీ :)) నాకు బోలెడు ఇష్టం! కాలేజి నించి వస్తున్నప్పుడు వర్షం కురుస్తుంటే...కావాలని ఆటోలో రాకుండా నడిచి వచ్చేదాన్ని అలా తడుస్తు...అమ్మ మామూలుగా తిట్టేది కాదు :)) జలుబు చేసినా డోంట్ కేర్! కాని మీరు చెప్పినవి చూస్తుంటే అదే అనిపిస్తోంది ;) ఇంకా నాకైతే అనుభవంలోకి రాలేదుగాని వచ్చే సూచనలు భవిష్యత్తులో మెండుగా ఉన్నాయ్ :))))))
శ్రీరాగ గారూ, హిల్ స్టేషన్స్ అంగతి ఏమో కానీ మా అమ్మాయిని మాత్రం హాయిగా వర్షంలో తడవనిస్తానండి. దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి:
https://profiles.google.com/trishnaventa/buzz#105619739024237568961/posts/MAmUhBJxGCe
వాన అప్పుడప్పుడు వస్తే సంతోషమే కానీ రోజూ వస్తే రోజువారీ పనులకు అంతరాయం అన్నదే నా అభిప్రాయం అండి.
@సుజాత: గాయబ్ అయిపోయి మళ్ళీ వచ్చేసా...::))) క్రితం జన్మలో(అంటే పెళ్ళి కాని క్రితం అన్నమాట) అనందించినట్లు ఇప్పుడైతే వర్షాన్ని ఆస్వాదించలేకపోతున్నానండి !
@పద్మార్పిత: హలో పద్మగారు....బాగున్నారా? ఫోటోలు నచ్చినందుకు సంతోషం !!
@ఇందు: అవునా?? అలా రాకూడదనే కోరుకుంటాను..:))
heloo trishnagaru. i am new here. naa peru poornima. ippudu mee blog chaduvutunte nannu nenu choosukunnattu anipinchindi. nijamekada chinnappudu vaanallo enta enjoy chesevaallamo. eppudu balcony lonchi choosi santoshimchadame. ippadiki vaana lo tadavalanna sarada naakundi. anduke vaana paddappudu maa ammayeni teesukuraavadaaniki school ki velli daaniki godugu patti nenu koncham koncham tadustoo untaanu. kaani chinnappudu enta tadisina jalubu chesedi kaadu. ippudu rendu chinukulu talameeda padagaane tummulu modalu.
@poornima: :)
Thanks for the visit.
thats truu Trushnagaaru... with age, out thinking will change..
while studying i wish for rain in the morning to bunk school / college :) but now, i think of work load and leave count if it rains in the morning...
Post a Comment