పైన ఫోటోలోని పుస్తకాలు చాలా అపురూపమైన పుస్తకాలు. నాన్న కలక్షన్ లోవి. వాటిల్లో మొదట కనబడుతున్న బొమ్మల కథలు అనే లావుపాటి పుస్తకం లో మొట్టమొదటి పాత రోజుల్లో పత్రికలలో పడిన బాపురమణల రచనలు, కార్టూన్లు అన్నీ ఉంటాయి. ఆ ఫోటోలోని అన్ని పుస్తకాల్లో ఉన్న బాపూ బొమ్మలే మూడొంతులు దాకా ఇటీవలి బాపూ బొమ్మల కొలువులో ఉన్నాయి. అయినా వీలయినన్ని ఫోటోలు అపురూపంగా ఫోటోలు తీసుకుని వచ్చాను. ఇంట్లో ఉన్నవే అయినా, నా కెమెరాతో ఆ ఒరిజినల్ బొమ్మల ఫోటోలు తీసుకోవటం ఒక అలౌకిక ఆనందం.
కాసంత కలాపోసన , మూడొచ్చినప్పుడు బొమ్మలేసే చీమంత ఆర్టిస్ట్ పనితనం చిటికెడు ఉండటం వల్ల చిత్రకారుడిగా బాపూ పై అభిమానం పాళ్ళు మరింత ఎక్కువనే ఉండటం వల్ల గేలరీలో తీసిన ఫోటోలను కొన్ని కేటగిరీల్లోకి విభజించాను. ( ఆసక్తి ఉంటే "క్రియేటివ్ వర్క్స్" లేబుల్ లో నా ఫ్యాబ్రిక్ పైంటింగ్ వర్క్స్ , చిన్నప్పుడు వేసిన బొమ్మలు గట్రా చూడచ్చు.) నాలుగైదు కలిపి తీసుకున్నవాటిని కట్ చేసి సింగిల్ ఫోటోలుగా మార్చుకున్నాను. నేను చేసుకున్న విభాగాలేమిటంటే,
* గేట్లోంచి మొదలు లోపలిదాకా ఇరుపక్కలా పెట్టిన చిత్రాలు, లోపల గేలరీలో గుండ్రని స్థంభాలకు కూడా కట్టిన బేనర్ల తాలూకూ ఫోటోలు
* వంశీ కోసం వేసిన చిత్రాలు
* దేవుళ్ళ తాలూకూ చిత్రాలు
* పత్రికలకూ, నవలలకూ, కథలకూ వేసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు
* రకరకాల సుందరీమణులు, మిగిలినవి
ఇలా చేసుకున్న విభాగాల్లో ఆయా చిత్రాలను ఎడిట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా అవ్వలేదు..:) ఇలా ఫోటోలు తీసుకోనివ్వటం ఒక వరమైతే, తీసుకునేందుకు మంచి కెమేరా ఉండటం నా అదృష్టం అనుకున్నా. తీసుకుంటున్నంత సేపూ ఓ సందర్భంలో ఆ కెమేరా నాకు బహుకరించిన నాన్నకు బోలెడు థాంక్సులు చెప్పేసుకున్నా. సరే ఇప్పుడు బ్లాగ్ లో ఏవి పెట్టాలి? అన్న ప్రశ్న చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆ కుంచె నుంచి రూపుదిద్దుకున్న ప్రతీ బొమ్మా ఒక అపురూపమే. అందువల్ల ఏవి పెడితే మిగతా బొమ్మలకి కోపాలొస్తాయో అని భయం.
సరే మరి చూడనివాళ్లకి బొమ్మల కొలువు చూపించెయ్యనా? ముందుగా గేట్లోంచి వేళ్దాం.. క్రిందివన్నీ బేనర్ల తాలూకూ ఫోటోలే.
తదుపరి టపాలో వంశీ కోసం వేసిన చిత్రాలు చూద్దాం. సరేనా?
15 comments:
wow wow... తృష్ణ గారూ చూడలేకపోయామే అన్న బాధను మీరు చాలావరకు తీరుస్తున్నారు. waiting for next post!
తెలుగుదనం అంటే ఇదే అనిపించేలా ఉన్నాయి చిత్రాలన్నీ..
రామకృష్ణ
బాగుంది. Will wait for the next post.
thanks alot trushna.
bloggers andaru cheppinde nenu malli cheputhunnanu.
అబ్బా...నిజంగా...చాలా థాంక్స్ అండి. రేఖాచిత్రం బ్లాగ్ లో సురేఖ గారు బొమ్మలకొలువు ఆహ్వాన పత్రిక పెట్టిన దగ్గరినుండి చూస్తున్నా..ఎవరైనా వెళ్లివచ్చి ఫోటో లు పెట్టక పోతారా..అన్నిటిని ఒక్కసారన్నా చూసి నేను తరించకపోతానా అని..
మీరు వెళ్లివచ్చి పోస్ట్ రాసినప్పటినుండి చూస్తున్నా..ఫోటో లు పెట్టకపోతారా అని..
మొత్తానికి కొన్ని ఫోటో లు పెట్టారు..ధన్యవాదాలు..కష్టం అనుకోకుండా..మిగతా ఫొటోలన్ని కూడా పెడితే చూసి తరించగలం...
తృష్ణ గారూ మీరు ఫోటోలు తీసిన తీరు చూస్తే ఆన్ లైన్ లో శాశ్వత బాపు బొమ్మల కొలువుగా ఈ బ్లాగ్ నిలిచిపోయేలా ఉంది. బావుంది...బావుంది.
తృష్ణగారూ !
చాలా చాలా కృతజ్ణతలు....ఇప్పుడు చూపిన వాటికి, ఇకముందు చూపబోయే వాటికి ముందరే ( వీలు కుదరక వ్యాఖ్య రాయలేకపోతే... )
వ్యాఖ్య రాసిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు.
తృష్ణ గారూ - మీకు బోలెడు థాంకులు...
ఓ నిమిషం వీళ్ళు చుసోచ్చారే అని కుల్లుకున్నా...మీరు మా కోసం(నేను ఇలా ఫిక్స్ అయ్యాను..) తీసిన ఫోటోలు చూసి ఆనందపడిపోతున్నా..
ఎంత మంచోరో..:))
@కిరణ్: Thank you.అలానే ఫిక్స్ అయిపొండి. నేను చూడనివాళ్ల కోసమే ఈ ఫోటోలు పెడుతున్నది. ఏదో సరదా కోసం అయితే పది ఫోటోలు పెట్టేసి ఊరుకుందునండీ. మూడవరోజన్నా వేళ్టానా ళేదా అని తెగ ఫీలయిపోయాను నేను..అలాంటిది చూడలేనివాళ్ళు ఎలా అనుకుని ఉంటారో అని...వాళ్ళ కోసమే ఈ సిరీస్.. !!
తృష్ణ గారు, కొలువులోని బొమ్మలన్నిటినీ ఫోటోలు భలే తీసారు. నేను కూడా వెళ్లాను బొమ్మల కొలువుకి. జీవితంలో మరచిపోలేని అనుభూతి. అవన్నీ అలా చూస్తూ ఉంటే రెప్ప వాల్చకుండా, కాలు కదలకుండా అలా చూస్తుండిపోవాలనిపించింది. కానీ సమయానికి మన ఫీలింగ్స్ తో సంబంధం లేదు కదా..:(
ఫోటోలన్నీ బ్లాగులో పదిలపరచడం అభినందనీయం. ధన్యవాదాలు:))
చక్కటి బొమ్మలతో మీరు మరొసారి, బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు.
దయచేసి మొదటి బొమ్మలోని రెండొవ పుస్తకం పేరు వివరాలు తెలుపగలరా?
( ఆ ఒక్క పుస్తకం తప్ప, మిగతావి అన్ని నా సేకరణలొ వున్నాయి.)
శ్రీనివాస్ గారూ, అది శ్రీ ఆండాళ్ "తిరుప్పావై" కి బాపు వేసిన బొమ్మలున్న పుస్తకం అండీ. ఆ పుస్తకం తాలూకూ వివరాలు, ఎక్కడ దొరుకుతుందో క్రింద ఉన్న లింక్ లో ఉన్నాయి చూడండి.
http://yabaluri.org/TRIVENI/CDWEB/
bookreviewsjul99.htm
ధన్యవాదాలు.
వెనువెంటనే నా ప్రశ్నకు బదులు ఇచ్చినందుకు మరో సారి ధన్యవాదాలు.
బహుశా ఇది పుస్తకం Tiruppayai by Mullapudi..Art by Bapu - Emesco publications old edition అయ్యి వుంటుంది. నా దగ్గర new edition వుంది.
New version book is availble online at
http://www.archive.org/details/Tiruppavai-MullapudiBapu
Post a Comment