సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, December 25, 2009
నా రూప పుట్టినరోజు...
ఆ రోజు నా కింకా గుర్తు....నేను 10th క్లాస్ చదువుతున్నాను.మేము కొత్తగా కట్టిన క్వార్టర్స్ లో 2nd ఫ్లోర్లో దిగాం. పొద్దున్నే నేను మెట్లు దిగి స్కుల్కెళ్తున్నాను. 1st ఫ్లోర్ దగ్గర "నువ్వేక్లాస్" అడిగిందో అమ్మాయి. చెప్పాను. "నువ్వు..?" అడిగాను. "9th.." అంది. ఆ తర్వాత నుంచి తనకు అక్కలు లేరని అలాగే పిలుస్తానని నన్ను "అక్కా" అని పిలిచేది. డిసెంబర్లో తన పుట్టినరోజు వచ్చింది. ఏ సంవత్సరం? అంటే చెప్పింది..."అదేమిటి మనకి నాలుగు నెలలే తేడా..నన్ను అక్కా అని పిలవకు. పేరు పెట్టే పిలువు.." అన్నాను. "వద్దు.నాకిలాగే అలవాటైంది...అక్కా అనే పిలుస్తాను." అంది. తనే "రూప". నా ప్రాణ స్నేహితురాలు. ఇవాళ తన పుట్టిన రోజు.
"స్నేహం" టపాలో రాసిన స్కూల్ ఫ్రెండ్ మాధవి తరువాత నాకు దగ్గరైన స్నేహితురాలు. "కూరల మార్కెట్" టపా లో గుర్తు చేసుకున్న కాలేజీ ఫ్రెండ్ ఎంత సన్నిహితమో..అంతకన్నా ఎక్కువ సన్నిహితమైన స్నేహితురాలు. మేము Friends for life అంతే...! తన గురించి "యాస్మిన్" టపాలో కూడా రాసాను. తనే కాక వాళ్ళమ్మగారితో కూడా నాకు స్నేహమే. ఆంటీ కి నేనంటే చాలా ఇష్టం ఉండేది. ఇంట్లో ఏది చేసినా నాకు తెచ్చి ఇచ్చేవారు, లేదా తనతో పంపేవారు. నన్ను చూసి పనులు నేర్చుకొమ్మని రూపని కోప్పడుతూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు టెక్నికల్ సైడ్ కావటంతో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి వాళ్ళకు. ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో తిరిగి వచ్చారు. తెలుగు మాట్లాడటం,రాయటం తప్ప చదవటం పెద్దగా రాదు తనకి. హిందీ,ఒరియా,బెంగాలీ,ఇంగ్లీష్,మరాఠీ ఐదు భాషలూ బాగా మాట్లాడేది. బాగా రాసేది కూడా. మాకిద్దరికీ "షటిల్ ఆడటం" చాలా ఇష్టం. మా క్వార్టర్స్ లో ఉన్న కోర్ట్ లో మేమిద్దరం రోజూ సాయంత్రాలు షటిల్ ఆడుకునేవాళ్ళం.
తన గురించి చెప్పాలంటే నేను మళ్ళీ అలాంటి స్నేహశీలిని మళ్ళీ నా జీవితంలో చూడలేదు. అందరికీ ఎక్కడో అక్కడ ఎవరో ఒకరితో చిన్నావైనా గొడవలు వస్తూంటాయి. నేనే నా మిగతా స్నేహితులతో చిలిపి తగాదాలకి పోయిన రోజులు ఉన్నాయి. కానీ రూప కి పరిచయమైన ప్రతి వ్యక్తీతో సత్సంబంధాలే. ఎక్కదికి వెళ్ళినా తోకల్లాగ బోలెడు మంది స్నేహితులను పోగేసుకునివచ్చేది. నేను అనేదాన్ని...వాళ్ళందరు తరువాత. ముందు నేనే....అని. "అయ్యో అక్కా....నాకెప్పటికీ నువ్వే ముందు..ఆ తర్వాతే అందరూ.." అందరూ అనేది. మా ఇద్దరికీ ఒక్కసారి కూడా ఏ మనస్పర్ర్ధ రాలేదు. ఇప్పటికీ అలానే ఉన్నాం. మూడేళ్ళ తరువాత వాళ్ళు శోలాపూర్ వెళ్పోయారు. అక్కడ తను ఇంజినీరింగ్ చేసింది. దూరపు బంధువుల్లో ఇంజినీర్ ఒకతను రూప గురించి, తన గుణాల గురించీ విని ఇష్టపడి కావాలని అడిగి పెళ్ళి చేసుకున్నాడు. భార్యను ప్రాణంలా చూసుకోవటం అంటే అతన్ని చూసి తెలుసుకోవాల్సిందే.
రూపా ,నేనూ ఇద్దరం ఒకేలాంటి వాళ్ళం. మా ఇష్టాలూ, అభిరుచులూ, అలవాట్లు, ఆసక్తులు అన్నీ ఒకటే. తనకి తెలుగు పుస్తకాలు చదవటం రాదు, తెలుగు పాత పాటలు,సినిమాలు తెలీవు అంతే. ఇద్దరం కలిసి గ్రీటింగ్స్, పైంటింగ్స్, వేసుకునేవాళ్ళం. తను ఆయిల్ పైంటింగ్స్ చాలా బాగా వేస్తుంది. ముగ్గులు,గోరింటాకులూ పెట్టేవాళ్ళం. నేను కవితలు రాసినా, కొత్తగా ఏదన్నా పాట నేర్చుకున్నా తనే మొదటి ప్రేక్షకురాలు. ఒకరి పుట్టిన రోజులకొకరం అర్ధరాత్రి పన్నేండు దాకా కూర్చుని గోరింటాకులు పెట్టి, విషెస్ చెప్పి నిద్రోయేవాళ్ళం. మా అడ్డా మా "మెట్లు". పైకి వెళ్ళేవళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నవ్వుతూ,పలకరిస్తు వెళ్పోతూ ఉండేవాళ్ళు.మామటుకు మేము రోజూ కాసేపు ఆ మెట్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుని కానీ ఇళ్ళకు కదిలేవాళ్ళం కాదు. పెళ్ళయ్యాకా తను జాబ్ చేసింది, Mtech దిస్టింక్షన్లో పాసయ్యింది. మళ్ళీ కొన్నాళ్ళు లెక్చరర్గా చేసింది. కానీ బాబు పుట్టాకా ఆ ముచ్చట్లు, ఆ చిన్ననాటి అల్లర్లు మిస్సవ్వకుడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో జాబ్ మనేసింది. రాను రానూ ఉత్తరాలూ, మైల్స్ తగ్గిపోయినా, భర్తల ఉద్యోగాల రీత్యా మేం ఎంత దూరాల్లో ఉన్నా ఫోన్ల ద్వారా మేమెప్పుడూ కనెక్టెడే.
కష్ట సుఖాల్ని పంచుకోవటం, ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవటం, ఎంత దూరంలో ఉన్నా టచ్ లో ఉండటం, ఒకరిపట్ల ఒకరికున్న అభిమానాల్ని నిలబెట్టుకోవటం, మాలాగే పెరుగుతున్న మా పిల్లల్ని చూసుకుని మురిసిపోవటం....ఇదే మేమిద్దరం. అర్ధరాత్రి నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకని పొద్దున్నే చేసి "B'day విషేస్" చెప్పాను నా రూపకి. ".....15,16 ఏళ్ళ వయసు నుంచీ ఈ వయసుకి చేరాం..." అన్నాను...తను నవ్వింది....!!
(బ్లాగ్మిత్రులకి...పునద్దర్శనం మళ్ళీ సొమవారం..ప్రస్తుతం ఒక పుణ్య క్షేత్ర దర్శనార్ధం ప్రయాణం..)
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
తృష్ణ గారూ !
మీ స్నేహాల కబుర్లు, మీ స్నేహశీలత చూస్తుంటే ముచ్చటేస్తోంది.
మీకు అభినందనలు. మీ రూప గారికి శుభాభినందనలు.
మీ రూప గారికి మా తరపున కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు, అంతటి మంచి మిత్రు రాలిని సంపాదించుకుని, అంత మంచి మిత్రురాలిగా వున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు.
:) Happy Birthday to ur friend.
అంత అందమైన స్నేహాన్ని పంచుకుంటున్న మీ ఇద్దరికీ అభినందనలు... మీ రూపగారికి నా తరాఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
మా శుభాకాంక్షలు కూడా అందజేయండి.
మై విషెస్ టూ.
ఎస్.ఆర్.రావు గారూ, నా స్నేహితుల కబుర్లు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ.ఇక స్నేహశిలత గురించి నా టపాలు చదివేవారికే తెలవాలి..మరి..
భావనగారూ, థాంక్స్ అండీ...రూపకు మళ్ళీ ఫోన్ చేసి టపా గురించి చెప్పాను...అప్పటికప్పుడు అనుకుని రాసానే చదువు అని..
సుజ్జి గారూ, చాలా థాంక్స్ అండీ..చెప్తాను రూపకు..
వేణూ గారూ,its lucky to have such a good friend..ధన్యవాదాలండీ.. .
కెక్యూబ్ వర్మగారూ, చాలా థాంక్స్ అండీ..చెప్తాను రూపకు..
@"A":thankyou verymuch for the wishes..
My heartful wishes to you both. Nice to hear such things
@ G : thankyou..
నాకేంటో ఆనంద్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది, ఎందుకబ్బా??
@kottapali: :) :)
Post a Comment