
మానవ మస్తిష్కం....
అణుబాంబును తయారు చేయగలిగింది.
చందమామపై అడుగులేయించింది.
తలరాతలను మార్చగలిగింది.
ప్రాణాలను పోయగలిగింది.
ఎన్నో వింతలను సృష్టించగలిగింది....కానీ...
ఈ మానవ మస్తిష్కం....
తనలోని మూర్ఖత్వాన్ని అణగార్చలేకపోతోంది...
తనలోని కౄరత్వాన్ని జయించలేకపోతోంది....
తనలో విచక్షణను పెంచలేకపోతోంది...
సమైక్యతాభావాన్ని బ్రతికించలేకపోతోంది...
ఎందుచేత...??
ఈ మానవ మస్తిష్కానికి....
చరిత్రపుటల్లో గడిచి నిలిచిన వందల ఉద్యమాలు ఏం నేర్పనేలేదా?
శాంతిమార్గాన్ని బోధించిన గంధీమహాత్ముని బోధలసారం అర్ధమైందింతేనా?
సామాన్యమానవుడికి కలుగుతున్న నష్టాన్ని గమనించనేలేదా?
వృత్తుల్లో, పనుల్లో, జీవనాల్లో స్థంభించిపోయిన నిశ్శబ్దపు హాహాకారాలు వినబడవా?
ఎంతో చెమట నిండి ఉన్న, ఏ పాపం ఎరుగని అమాయకుల ఆస్తి నష్టం కనపడదా?
ఎందుచేత...??
అసలు సమస్యకు పరిష్కారం ఆత్మహత్యలు కాదని తెలియదా ఈ మానవ మష్తిష్కానికి?
భగవంతుడు ప్రసాదించిన అందమైన జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకిలేదని తెలియదా?
చావే సమస్యలకు పరిష్కారమైతే ప్రపంచ జనాభా ఈపాటికి సగమై ఉండేదేమో కదా..?!
మానవ మష్తిష్కాంలో ఈ కల్లోలం...అస్థిమితం ఎందుచేత?
ఎందుచేత...??
......................................................................
గడిచిన వారాంతంలో జరుగుతున్న ఘటనలతో ఏ రాజకీయాలూ తెలియని ఒక సామాన్యవ్యక్తిగా నా మనసులో చెలరేగిన భావాలివి...ఎగసిన భావోద్వేగాలివి...అందులో మిగిలిన ప్రశ్నలివి....
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవైనా... అవి నాలో మిగిల్చిన వేదన అనంతం...
12 comments:
ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుందండీ..అదేంటంటే 'మనిషి ఆకాశంలో పక్షి లాగా ఎగరటం నేర్చుకున్నాడు...నీటిలో చేపలాగ ఈదటం కూడా నేర్చుకున్నాడు...కానీ భూమి మీద మాత్రం మనిషిలాగా బ్రతకటం మర్చిపొయాడు' అని.
ఈ ఉద్యమ ప్రభావం ప్రత్యక్షంగా చూసే, మా కాలేజ్ లో జరిగిన సంఘటన తట్టుకోలేక నా బాధని కూడా 'భయం భయం' గా వ్యక్తీకరించాను. ఏ సంబంధం లేని వాళ్ళు ఎప్పుడూ బలవుతూనే ఉంటారు. ముఖ్యంగా విద్యార్ధుల మీద రాజకీయాల ప్రభావం తగ్గక పోతే ఇవే పరిణామాలు చూడాల్సి ఉంటుంది.
తృష్ణ గారూ, కొట్టుకోడానికి తిట్టుకోడానికి కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఇన్ని కారణాలు వెతుక్కున్న మనిషి కలిసి ఉండడానికి ఉన్న ఒకే ఒక కారణాన్ని మరిచిపోతున్నాడు. అదేంటో తెలుసా మనమంతా ముందు మనుషులం, తరువాత భారతీయులం. ఇవి శాశ్వతం, మిగతా అన్నీ మనిషి సృష్టించుకున్నవే.
వేషము మార్చెను, భాషను మార్చెను
మోసము నేర్చెను, తలలే మార్చెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
ఏనాడో చెప్పారు కదండీ పింగళివారు
హ్మ్. నిజమే కదా...
మహా మహా నాయకులే ఏమీ చెయ్యలేకపోయారు. సామాన్యులం. మనల్ని మనం రక్షించుకోగలిగితే గొప్పే..
తృష్ణ గారు ఈ టపా చదివాక శ్రీ శ్రీ గారు చెప్పిన
మనదీ ఒక బ్రతుకేనా
కుక్కలా వలె నక్కల వలె ,
మనదీ ఓకే అబ్రతుకేణా
సందులలో పందుల వలె
అన్న మాటలు గుర్తుకోచ్చయండి
చావే సమస్యలకు పరిష్కారమైతే ప్రపంచ జనాభా ఈపాటికి సగమై ఉండేదేమో కదా..?!
కాదు కాదు నశించి పోయి ఉండేది.....
www.tholiadugu.blogspot.com
తయారుచెసుకున్న అవసరాలు తప్పని సరైనప్పుడు
పరిస్తితుల పరిణామాలు పరైయవసానాలైనపుడు
పరిస్తితులకి ప్రరిష్కారాలకి అసహాయత అడ్డొచ్చినప్పుడు..
అలొచనలకి అవేదనకి పొంతన కుదరనప్పుడు..
విపత్కర భవిష్యత్తుని చుసే స్థైర్యం లేనప్పుడు..
అనుభవం లేని భొదనల సారం ఆనందం ఇవ్వదని తెలిసిపోయి నప్పుడు
"పొందలేని సుఖాన్ని", పంచడానికి ముందుకు రావలసి నప్పుడు
"ధైర్యాని కి, తెగింపుకి ,మధ్య తేడా తెలిసిపోయినప్పుడు"
చివరి శ్వాస నిరాశ తో నిష్క్రమిస్తుంది ...
ఒక జీవతం ఆత్మార్పణం పేరుతో ఆగిపొతుంది...
కర్కషకాలం మాత్రం కనికరం లేకుండా సా గి పొతుంది..
ఈ మాటలు రాస్తుంటే ఎవ్వరితో సంభంధం లేని నా కన్నీరు కూడా ఆగడం లేదు...
వ్యాఖ్యలు రాసిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు..
కార్తీక్ గారూ, మరీ అంత ఇమోషనల్ అయిపోకండీ...!! ఇంతకన్నా మీకేం చెప్పాలో తెలీట్లేదు...
నాకు అప్పుడప్పుడు కర్మ వేదాంతం గుర్తొస్తుంది ఏమి చేయలేనప్పుడు.. మనసు కు శాంతి కావలంటే ఆ వేదాంతం గుర్తు చేసుకోండి. ఏమి చెయ్యగలం :-(
""కార్తీక్ గారూ, మరీ అంత ఇమోషనల్ అయిపోకండీ...!! ఇంతకన్నా మీకేం చెప్పాలో తెలీట్లేదు...""
bahushaa , SATHYA gaaru ekkuvagaa emotional ayyaranukuntaaaNU ....?
@sekhar,
@Jaya,
@swarnamallika,
@sameera,
@sri lalita,
@karthik,
@satya,
@bhavana,
@stavapriya
thankyou one and all for your comments.
Post a Comment