సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 24, 2009

పెదవే పలికిన మాటల్లోనే...

పొద్దున్నే "అమ్మ" గుర్తుకొచ్చింది...ఈ పాట కూడా గురుకొచ్చింది ... అమ్మ మీద చాలానే మంచి పాటలు ఉన్నాయి కానీ కొత్త పాటల్లో ఇది నాకు నచ్చుతుంది. "నానీ" చిత్రం లోని పాట. Tom Hanks నటించిన "Big" చిత్రకధను భారతీకరించి తీసిన సినిమా ఇది. ఇలాంటి కాపీ సినిమాలు చూడలేను. అందుకే చూడలేదు కానీ సినిమాలో ఈ పాట మాత్రం బావుంటుంది.



పాడినది: ఉన్ని కృష్ణన్, సాధనా సర్గమ్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వేలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ..
పొత్తిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కోంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను
ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో .... బజ్జో లాలి జో
బజ్జో లాలి జో.. ..

utube link:
http://www.youtube.com/watch?v=జ౩క్ల౫క్వ్మ్క్ష్త్మ్




14 comments:

మాలా కుమార్ said...

బాగుందండి పాట .

SRRao said...

తృష్ణ గారూ !
అమ్మ అనేది ఒక కమ్మని భావన. మంచి పాట అందించారు. ధన్యవాదాలు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

సెల్లుకొన్నప్పటి నుంచి అమ్మ నెంబరుకి ఇది అసైన్‌టోన్.

veera murthy (satya) said...

ఈ పాట అమ్మ మీద వ్రాసింది కాదు ....
సినిమా కథ ని సప్పొర్త్ చెయడం కోసం వ్రాసింది....
ఒక స్త్రీ అమ్మ లాగ ఇంకా భార్య లాగ ఒకేసారి ఎలా మెలుగుతుందో తెలిపే సాహిత్యమిది....
కాని స్పష్టత చెడింది...

ఒక విషయం పై ఒక సమ్యం లో ఒకే రకమైన భావన ఉంటే దాన్ని స్పష్టత అంతారు...
కాలనికి సంబంధం లేకుండా స్పష్టత ఉంటే దాన్ని పవిత్రత అంటారు....
అవి రెండూ ఇందులో లేవు ...

స్వామి కార్యం లో స్వకార్యం, జారత్వం తో సమానం.

ఇలాంటి సహిత్యలూ, వెకిలి ప్రయత్నాలు.

(అందుకే ఈ సినిమా తల్లుల మన్ననలనీ పొంద లేక పొయింది)

తప్పుగా మాట్లడితే పెద్దలు క్షమించండి...

--సత్య

తృష్ణ said...

సత్యగారూ,
నేను ఈ సినిమాను చూడలేను. ఈ టపా సినిమా గురించీ కాదు.
"అమ్మ" గురించిన రాసిన వాక్యాలు బాగుంటాయని మాత్రమే రాసాను.గమనించగలరు...

ideas and opinions expressed in this blog are not meant for criticism అని బ్లాగ్లో రాయటం జరిగింది. కాబట్టి నేను మీ వ్యాఖ్యకు సమాధానంగా వాదన కానీ, చర్చ గానీ చేయటం లేదు...
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

చైతన్య, that's nice. మా మరిది ఫోన్లో కూడా చాలా రోజులు రింగ్ టోన్ గా ఉండేదీ పాట. అది విన్నాకే అసలీ పాట నాకు తెలిసింది.

వేణూశ్రీకాంత్ said...

ఈ పాట పల్లవి చాలా బాగుంటుందండీ.

తృష్ణ said...

మాలా కుమార్ గారూ, ఎస్.ఆర్.రావుగారూ ధన్యవాదాలు.

తృష్ణ said...

వేణూగారూ, అవునండీ..పల్లవి,మొదటి చెరణం బాగుంటాయి. పాట సాహిత్యం సగం రాసి వదిలేయటం ఎందుకు అని మొత్తం పాట రాసేసాను...
నిజానికి అమ్మ మీద ఇంకా గొప్ప పాటలు చాలానే ఉన్నాయి...సమయానికి పొద్దున్న గుర్తొచ్చేసరికీ టపాయించేసాను...:)

NAM blogsapien :) said...

adbhutamaina paata :)

గీతాచార్య said...

The only thing that is worth considered in this movie is this song.

A very nice song to get touch into with again.

అమ్మ గురించి సందర్భం వచ్చింది కనుక ఈ టపాలు మీకు నచ్చవచ్చని నా అనుమానం... :-)

http://dheerasameereyamunaateere.blogspot.com/2009/03/blog-post_30.html

తృష్ణ said...

@ బ్లాగు బేవార్స్ ,
@ Geetaacharya,

thankyou..

veera murthy (satya) said...

మా బలమూ- బలహీనత మా స్పందననే!
ఇబ్బంది పెట్టుంటే మన్నిచండి....
వాదాలంటే నాకు చచ్చేంత భయము!
ప్రతిస్పందనకి ధన్య 'వాదాలు '!

తృష్ణ said...

సత్యగారూ, మీరన్నది కరక్టే.బ్లాగర్లందరి బలమూ,బలహీనత ఈ స్పందనలేనండీ. నచ్చగానే రాయటం, స్పందనని తెలపాలని అనుకోవటం మంచిది. ఏవైనా తప్పులుంటే సరిచేయటం కూడా మంచిదే. కాని నచ్చకపోతే మాత్రం నేనైతే సాధారణంగా మౌనంగా వెళ్పోతాను. ఒకరు రాసే విమర్శను నేను తట్టుకోలేనప్పుడు..నాకు కూడా ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు లేదని నేననుకుంటాను.

ఇబ్బందేమీ లేదండీ.మీరు రాసినదానికి నేనూ నా అభిప్రాయాన్ని చెప్పాను.అంతేనండి. నాకూ చర్చలు,వాదనలు అంతే చాలా భయమేనండీ..:)