సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, December 6, 2009

ట్రాఫిక్ సిగ్నల్


మధుర్ భండార్కర్ తీసిన, కునాల్ నటించిన "ట్రాఫిక్ సిగ్నల్" గురించి కాదు నేను రాయబోయేది... నిత్యం మనం ప్రయాణీంచే రోడ్డు మీద మనకెదురయ్యే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి...అక్కడ మనకు ఎదురయ్యే, మనల్ని వ్యాకులపరిచే వతావరణం గురించి..!దాదాపు పది పన్నేండేళ్ళక్రితం నేను ఓ పదిరోజులకని ఈ ఊరు వచ్చినప్పుడు మా అన్నయ్య బండి మీద వెళ్తూ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మొదటిసారి లోనయ్యాను ఈ వ్యాకులతకి.

చిరిగిన బట్టలతో దీనంగా, చింపిరి జుట్టుతో, జాలిగొలిపేలాంటి చూపులతో అడుక్కుంటున్న పిల్లలని, వృధ్ధులని...చూసి మొదట చేతికందిన చిల్లర లెఖ్ఖపెట్టకుండా ఇచ్చేసాను. కానీ ప్రతి చోటా ఇదే దృశ్యం. ఇలాంటివారే మరి కొందరు. అప్పుడర్ధమైంది ఇదొక వృత్తిగా మారిందని. గుళ్ళు, సినిమాహాల్స్, ఎక్కువ జనసందోహం ఉండే ప్రాంతాలు, పర్యాటక స్థలాలు మొదలైన ప్రదేశాలతో పాటూ అడుక్కోవటానికి దొరికిన సులువైన,కొత్త ప్రదేశాలు ఈ "ట్రాఫిక్ సిగ్నల్స్". అప్పటి నుంచీ ఈ ఊరొచ్చిన ప్రతిసారీ, ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో చాలా చోట్ల చూస్తూనే ఉన్నాను. ఆ వ్యాకులతను అనుభవిస్తూనే ఉన్నాను. ఒకే రోడ్డులో మళ్ళీ మళ్ళీ వెళ్తూంటే అదే మనుషులు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు..అదే రీతిలో అడుక్కుంటూ..!! ఆఖరికి మొన్న బస్సులో వెళ్తూంటే ఒక సిగ్నల్ దగ్గర ఆగిన బస్సు కిటికీ లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను తాకింది..ఏదో ఆలోచనలో మునిగి ఉన్న నేను అద్దిరిపడ్డాను...చూస్తే ఒకతను...చేయి చాచి డబ్బులు అడుగుతున్నాడు...ఆటోల్లోకే కాదు...బస్సుల్లోకి కూడా చేతులు దూర్చేస్తున్నారే? అని ఆశ్చర్యపోయాను.

విచిత్రమేమిటంటే..ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండేవాళ్ళందరూ మామూలుగా ఉండరు. అతి దరిద్రంగా, అతి బాధాకరంగా, చూడగానే మనసు ద్రవించిపోయే వేషాల్లో ఉంటారు. ఎంతో కొంత ఇచ్చి ముందర కళ్ళ ముందు నుంచి పంపేయాలి బాబోయ్...అనిపించేలా ! అలా కావాలనే ఉంటారేమో వాళ్ళు...అనిపిస్తుంది నాకు. బక్కచిక్కిన ఒక మగవాడిని భుజాన వేసుకున్న ఒక స్త్రీ, గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడిని వీపుక్కట్టుకున్న స్త్రీలు, కళ్ళు,కాళ్ళు లేక మరో మనిషి ఆసరాతో నిలబడి అడుక్కునేవాళ్ళు కొందరు, ఆటో ఆగగానే లోపలికి చేతులు పెట్టేసి డబ్బులు ఇచ్చేదాకా భయపేట్టేసేవాళ్ళు కొందరు, ఆకలి ఆకలి అని కడుపు చూపించి బెదిరించే రౌడి రకపు పిల్లలు కొందరు..ఇలా ఎన్నో రకాల జనాలను చూసి చూసి జుగుప్స కలుగుతుంది. భయం కలుగుతుంది. బాధ కలుగుతుంది. వేదన పెరుగుతుంది.

బాధ ఎందుకు అంటే వాళ్ళకు డబ్బులు వేసి ప్రోత్సహించనూ లేము, అలా అని ఇవ్వకుండా మనసుని ఇబ్బంది పెట్టనూలేము. మనం వృధాచేసే వాటిల్లో ఈ ఒకటి రెండు రూపాయలే ఎంత? అని వేసేస్తూ ఉంటాము.కానీ ఇలా కొన్ని వందల ఒక్క రూపాయిలు అడుక్కునేవాళ్ళకు ఆదాయాన్ని పెంచుతున్నాయి. సోమరితనాన్ని పెంచుతున్నాయి. మరిన్ని దొంగ వేషాలు వెయ్యటానికి పురిగొల్పుతున్నాయి.ఎందుకిలా? అని ప్రశ్నించుకుంటూనే ఉన్నాను...జనాలను భయపెట్టి, బాధపెట్టి డబ్బులు అడుక్కునే ఈ పధ్ధతి ఏమిటి? ఎవరూ దీని గురించి పట్టించుకోరా? అనుకుంటూంటాను.

ఏదో హడావుడిలోనో, రకరకాల ఆలోచనలతో పరధ్యానంగానో, పని వత్తిడిలో హడావిడిగానో ప్రయాణిస్తూ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన ప్రజలకు, ఉన్న వేదననో, లేని వేదననో పెంచేలాగ కనిపించే అడుక్కునే వాళ్ళ వేషభాషలు మరింత కంగారుకు,చికాకుకూ గురి చేస్తాయి. చేస్తున్నాయి. మన ఈ వ్యాకులత, చికాకే వాళ్ళకు డబ్బు ఆర్జించి పెడుతోంది. కొందరు అడుక్కునే పిల్లలను చిన్నవయసు నుంచే మరింత సోమరిగా తయారు చేస్తోంది. సులువుగా డబ్బు సంపాదించే మార్గం ఇదేనని వాళ్ళను నమ్మేలా చేస్తోంది. కానీ ఇది మారాలి. అన్ని చోట్లా మారటం అసంభవం కాబట్టి కనీసం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళనైనా డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగితే ఎంతో బాగుంటుంది.

సిటీల్లో బెగ్గర్స్ ను కంట్రోల్ చేసే "స్పెషల్ డిపార్ట్మెంట్" ఒకటి ఉందని, దానికి ఒక "ఐ.ఏ.యస్.ఆఫీసరు" ఇంచార్జ్ ఉంటారని తెలుసు కానీ దాని పేరూ వివరాలూ నాకు తెలియవు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కలగజేసుకుని ఈ "ట్రాఫిక్ సిగ్నల్" దగ్గరకు బెగ్గర్స్ ను రానీయకుండా అదుపు చేయగలిగితే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ మధ్యన "Times of india" లో మిలియనీర్ బెగ్గర్స్ అంటు ఒక ఆర్టికల్ పడింది. అది దాచి దాని మీద రాద్దామనుకునే లోపూ ఆ పేపర్ మాయమైపోయింది ఇంట్లో. ఈ లోపూ మొన్న బస్సులో వెళ్తూంటే జరిగిన సంఘటన ఈ టపాకు మూలమైంది. ఈ టాపిక్ కు రిలేటెడ్ రెండు ఆర్టికల్స్ నెట్ లో దొరికాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవవచ్చు --
http://timesofindia.indiatimes.com/india/Beggar-in-India-is-a-millionaire-in-Bangladesh/articleshow/3256583.cms

http://www.indianofficer.com/forums/current-issues/5887-beggary-india.html

17 comments:

అడ్డ గాడిద (The Ass) said...

Excellent topic. The concerned authorities must take action.

మురళి said...

This is a serious problem. But the solution is in our hands. Let us stop encouraging such people..the problem will be solved automatically.. good post..

veera murthy (satya) said...

అడుక్కుతినే వాళ్ళని...ఏ మాత్రమూ సప్పోర్ట్ చే యకూదడు...
వాల్లూ ఎక్కువగా ఆడవాళ్ళనే టార్గేట్ చేస్తారు...జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు.... నాకు తెలిసి 2 సం|| ల క్రితం శంకర్మఠ్ ఆలయం , నల్లకుంటదగ్గర ఒక బిచ్చగాది ఆదాయం. రోజుకు 600 /-....

నిజమైన ఆర్తులు,అర్హులూ , వేరే వుంటారు....
సంపాదనలో 10% దానానికి ఉపయోగించ మంటుంది శాస్త్రం...

అది అపాత్ర దానం కాకూడదు...

కాస్త సమ్యమనం పాటిస్తే వారే వేరే దారి చూసుకుంటారు...ఇది ప్రయొగాత్మకంగా ముంబైలో నిరూపించ బడింది..

మంచి టోపిక్ ఎంచు కున్నారు...

జయ said...

తల్లితండృలు దూరంగా ఉండి, పిల్లల్ని అడుక్కు రావటానికి పంపుతారు. అది మరీ ఘోరం అనిపిస్తుంది. పిల్లలకి గాంధీ వేషాలేసి పంపుతారు. సెంటిమెంట్ తో డబ్బులు వసూలు చేస్తారు. కష్టపడకుండా సంపాదననిచ్చేది, యాచకవృత్తి. దానికన్నా రోడ్లమీద ఎంతో మంచి బొమ్మలేసి డబ్బులు సంపాదించే వారు నయం. ఈ సమస్యను అరికట్టటం మాత్రం కష్టమే అనిపిస్తుంది.

శేఖర్ పెద్దగోపు said...

ఆఫీసులు వదిలే టైమింగ్లో హైటెక్ సిటీ దగ్గర సిగ్నల్స్ రెండు మూడు సార్లు మారితేగానీ మనం సిగ్నల్ దాటి పోలేము. సో అక్కడ చాలా సేపు బండిపై వెయిట్ చెయ్యాల్సిఉంటుంది. ఇక చూస్కోండి...చిన్న చిన్న పిల్లలు అడుక్కోడానికి వచ్చేసి తెగ విసిగిస్తుంటారు. ఆ రూట్లో వచ్చిన ప్రతీవారికి ఇది అనుభవమే అయివుంటుంది. మురళీగారన్నట్టు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను ఎంకరేజ్ చెయ్యకూడదు. అదే ఈ సమస్యకి పరిష్కారం. మంచి టాపిక్ మీద రాసారు టపా.

Padmarpita said...

Interesting and useful topic...good post!

సుజాత వేల్పూరి said...

దీని గురించి ఒకసారి ఒక దినపత్రికలో ఒక ఆర్టికిల్ వచ్చింది.వీళ్ళలో చాలామంది పనికి ఒళ్ళు వంగక అడుకునేవారేట! disabled వాళ్లని మినహాయించండి. హైటెక్ సిటీ దగ్గర చెప్పక్కర్లేదు. శిల్పారామం ముందు కళాకృతులు తయారు చేసి అమ్మే జైపూర్ పనివాళ్ళు పిల్లల్ని ఊరికే ఉంచడం దేనికని ఆరేళ్ళ పిల్లదానికి ఆర్నెల్ల చంటిపిల్లాడిని అప్పగించి పంపిస్తారు.

నిజంగానే ఇలాంటివాళ్లను ఎంకరేజ్ చేయకూడదనిపిస్తుంది. కానీ వృద్ధులు,అంగవైకల్యం కలవాళ్ళు కనపడితే హృదయం కరగక మానదు.

అందరికంటే సీరియస్ గా అసలు పనిష్ చేయవలసింది నెలల పిల్లల్ని చంకలో వేసుకుని వాళ్ల పాలకోసం అంటూ యాచించేవారిని.

నిజమో కాదో కానీ ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వారు కొంతమంది వడ్డీ వ్యాపారం కూడా చేసే స్థాయిలో సంపాదిస్తారట.

తృష్ణ said...

"ఆ" గారూ, (ఎన్నిసార్లు వేడినా మీరు పేరు మార్చరా?)
సంబంధిత అధికారులు కూడా సహకరిస్తే తప్ప తీరని సమస్యండీ ఇది.ధన్యవాదాలు.

@మురళి: నిజమేనండీ. కాని కొందరమే మానేస్తాం...అందరినీ ఆపలేము. అసలు వాళ్ళను సిగ్నల్స్ దగ్గరకు రానివ్వకపోవటం అనేది అధికారులవల్లే అవుతుంది అని నా అభిప్రాయమండీ.

తృష్ణ said...

@సత్య: బాగా చెప్పారు. సమిష్ఠి కృషి ఎంతైనా అవసరమేనండీ..
ధన్యవాదాలు.

@జయ: మీరు చెప్పినది నిజమేనండీ. రోడ్డు మీద ఏవో ఒకటి అమ్ముకునే ముసలివాళ్ళ దగ్గర కూడా నేను అందుకే కొంటూంటానండీ. ఆ వయసులో కూడా జీవనం కోసం వారు పడే తాపత్రయాన్ని చూసి మనం నేర్చుకోవలసినదెంతో ఉందండి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@శేఖర్: ఈ రెండు మూడు సిగ్నల్స్ ఉండే చోటల్లో చాలా ఇబ్బందికరంగా,చిరాకుగా ఉంటోందండీ ఆగేవాళ్ళ పరిస్థితి...
ధన్యవాదాలు.

@పద్మార్పిత: బహుకాల దర్శనం..?
ధన్యవాదాలు.

తృష్ణ said...

@సుజాత:మూడొంతులు మంది ఒళ్ళు వంగక చెసే పనేనండీ ఇది...disabled వాళ్లకు,ముసలివాళ్ళకూ నేనూ తప్పక సాయం చెస్తానండీ. మిగిలిన ఎవ్వరికీ దానం ఇవ్వను.
ఒకటి,రెండు వారాల క్రితం "టైమ్స్ ఆఫ్ ఇండియా"లో మిల్లియనేర్స్ గా మారిన కొందరు బెగ్గర్స్ గురించిన ఆర్టికల్ పడిందండీ..అది దొరకక ఈ టపాకు జతపరచటం కుదరలేదు.
ధన్యవాదాలు.

అడ్డ గాడిద (The Ass) said...

Ma amma pettina peru (eppudu adda gadida ani antuntundi. asale videsham lo unnanu. sentiment andi...

miku ibbandaithe comment pettatam maneyyali. kastha ardham chesukogalaru. :)

తృష్ణ said...

@"A": అమ్మ సెంటిమెంట్ చెప్తే ఇంకేమటాం..? adjust అవుతాం...:):) అలాగే కానిండీ.

సమీరా వైఙ్ఞానిక్ said...

Heyyyyy మీ బ్లాగ్ చాలా బాగుంది. భలే రాస్తున్నారు. మీరు చెప్పింది నిజమే... ఆఫీసు నుంచీ తిరిగొస్తుంటే చాలా ఇబ్బమ్దిగా ఉంది. ఏం కష్టం రా బాబూ, వీళ్ళ కన్నా మా బ్రహ్మిణిలే నయం అనిపిస్తుంటుంది. ప్చ్

హరే కృష్ణ said...

Mumbai lo picturisation antha sion circle daggara konkana sen acting chaala bavuntundi

prabandhchowdary.pudota said...

namasthe thrushna gaaru,
modatigaa sankranthi subhaakaankshalu...nenu regular ga chadhuvuthunna,chadhavalanukuntunna blog meedhi...meeru rase anni post lu chadhuvudhamani eppudo anukunnanu..annee chadhavataniki try chesthunnnau....inkaa chadhavavalasinavi chaala vunnay....

nenoka chinna mata adagalanukuntunnanu....ninna mee blog chusthunte NAA SWAAMI PUTTINAROJU ani meereu raasina post chadhivaanu...meeru sathya sai baba ni..(ikkada emi rayalo ardham kavadam ledhandi...swami ga,or in some other form like adyaathmika guruvugaa..) accept chesthunnaru..

Meeru emi anukokapothe,meeru ayanani endhuku accept chesaro cheppagalara...meekemi abyantharam lekapothene andi...meeru aa post ki comment mode thisesaru...andhuvalla ee post dhvaaraa aduguthunnanu...ila endhuku aduguthunnanante andi...mee post lu chhala varaku naku istam... asalu actual gaa mee post lu,inkontha mandhi post lu chuse nenu kooda rasukovaali ani fix ayyanu... meeru cheppedhi emaina convincing gaa vuntundhemo ani...sathya sai baba ni asalu antha mandhi endhuku kolusthunnaro ardham chesukuvaalani.....oka chinna prayathnam...

తృష్ణ said...

@ prabandhchowdary.pudota:నా బ్లాగ్ చదువుతున్నందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ కేవలం నా భావాలను, కొన్ని అనుభవాలనూ మరికొందరితో పమ్చుకోవటానికేనండీ. నా అభిప్రాయాలను మరొకరు ఒప్పుకోవాలని నేననుకోను. వాటిపై చర్చలకూ, విమర్శలకూ కూడా నేను అవకాశం ఇవ్వను.
స్వామి గురించిన నమ్మకం మా కుటుంబంలో తాతగారి కాలంనాటి నుంచీ వస్తున్నది. కానీ నాకు కొన్ని వ్యక్తిగత అనుభవాలయ్యాకే నేనూ ప్రభావితమయ్యింది. ఎవరికైనా దేని గురించైనా అనుభవపూర్వకంగా తెలవాలే తప్ప ఒకరు చెప్తే నమ్మేది, అనుసరించేది సరిగ్గా ఉండదు. అందువల్ల నేను నమ్మేది కరక్ట్ అని నేను చెప్పను. నా నమ్మకం ఇది అని మాత్రం చెబుతానండి.

మనం నడిచే దారి ఏదైనా చేరాల్సిన గమ్యం ఒక్కటే. ఆ దారి ఏది అనేది ఎవరికి వారు నిర్ణయించికోవాల్సినదేనండీ.