సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, December 11, 2009

సిరి సిరి మువ్వల్లె... Shreya Ghoshal

ఓ వారంరోజులు మా పనమ్మాయి "శెలవు" ప్రకటించింది. చేసేదేముంది..? "पिया का घर है..रानी हू मै...रानी हू घर की..." పాడుకుంటూ బాల్కని లో అంట్లు తోమటం మొదలెట్టాను. Fm radio..లేనిదే మనకి పనులు జరగవు కాబట్టీ అది తడవకుండా దాన్ని కాస్త ఎత్తు మీద పెట్టుకున్నా..! "ఏమిటి మేడమ్ము గారు Fm వింటూ అంట్లు తోముకుంటున్నారా...?" అని ఓ జాలి లుక్కిచ్చేసి అయ్యగారు వెళ్పోయారు. ఇక్కడ "అంట్లు తోమటానికీ -- శ్రేయ"కీ లింక్ ఏమిటా అని ఆశ్చర్యపొతున్నారా? అక్కడికే వస్తున్నా...రేడియో లో "సిరి సిరి మువ్వల్లే..చిరుగాలి చినుకల్లే...’ అని మధురంగా పాట మొదలైంది...ఆహా...అని మైమరచిపోయా...! ఇన్నాళ్ళూ శ్రేయ గురించి బ్లాగ్ లో రాయలేదే అని గుర్తొచ్చింది. పనులవ్వగానే వెంఠనే సిస్టం దగ్గరికి చేరా...ఇలా ఈ టపా అయ్యిందా ఆవేశం..!!

పాతికేళ్ళ వయసు. ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నేషనల్ అవార్డులు, తమిళ్,కన్నడ భాషల్లో రెండు south ఫిల్మ్ ఫెర్ లు, నాలుగు IIFA అవార్డ్ లు, ఇంకా ముడు జీ సినీ అవార్డులు, ముడు స్టార్ స్క్రీన్ అవార్డ్ లు, ఇంకా...చాలా ప్రాంతీయ అవార్డు లు...ఇవీ ఆ అమ్మాయి అచీవ్మెంట్స్..!! ముచ్చటేయటం లేదూ..
Zee TV లో Sonu nigam "Sa Re Ga Ma Pa" ప్రోగ్రామ్ host చేసే టైం లో ప్రతి ఎపిసోద్ ను తప్పక చూసేదాన్ని. Sonu మీద, హిందీ పాటల మీద ఇష్టం తో. అప్పటికి Sonu ప్లేబాక్ సింగర్ గా ఇంకా నిలదొక్కుకోలేదు. అయినా ఆ గొంతు విని ఇంట్లో అంతా అభిమానులం అయిపోయాం. అప్పుడు ఒక పిల్లల special episodeలో గెలిచింది "శ్రేయ ఘోషాల్".


శ్రేయ వాయిస్ నచ్చేసి నా సినిమాలో అవకాశం ఇస్తానని "ఇస్మైల్ దర్బార్" అనౌన్స్ చేసేసారు. ఇక తరువాత ఒక్కొక్కటే తన్నుకుంటూ వచ్చేసాయి అవకాశాలు. ప్రతిభకు పరిచయం అవసరం లేదు కదా. హిందీ లోనే కాక మాతృభాష బెంగాలీ తరువాత కన్నడ,తమిళ్,మలయాళ,మరాఠీ,పంజాబీ,తెలుగు మొదలైన భాషల్లో పాటలు పాడింది శ్రేయ.

శ్రేయ ఘోషాల్ పాడిన హిందీ పాటల్లో నాకు చాలా బాగా నచ్చినవి --
* Jadoo hai nashaa hai...(jism)
* Agar tum mil jaavo...(zeher)
* Bairi piyaa badaa bedardii.... (Devdas)
* Dhola re dhola re...( with kavita krishnamurty -- Devdas)

నాలుగూ అద్భుతమైన పాటలు నా దృష్టిలో. వింటూంటే ఏవో లోకాల్లో విహరిస్తున్నట్లే..అంత నచ్చేసింది నాకు శ్రేయ గొంతు.

హిందీ సింగర్స ను తెప్పించి తెలుగు పాటలు పాడించే ప్రయోగాలు ఎప్పటి నించో పరిశ్రమలో ఉన్నా, ఇటీవల మరీ ఎక్కువైయ్యాయి. వాళ్ల అసలు గొంతులు గొప్పవే అయినా భాష రాకపోవటం వల్ల, కొందరి పాటలు విని, ఎందుకిలా తెలుగు పాటలు పాడి ఉన్న పేరు చెడగొట్టుకుంటారు? అనుకున్న సందర్భాలు కోకొల్లలు. చాలా తక్కువ మంది తెలుగులో కూడా బాగా పాడారు అనిపించుకున్నరు. వాళ్ళలో నాకు తెలిసీ "శ్రేయ" ఒకర్తి. కొన్ని పదాలు తను కూడా సరిగ్గా పలకకపోవటమ్ విన్నాను కాని అది రికార్డింగ్ చేసేవాళ్ళు సరి చేయకపోవటమ్ వల్ల అని నేననుకుంటాను.


ఇక తెలుగులో పాడిన పాటల్లో నాకు నచ్చినవి...

* ఇంతకూ నువ్వెవరూ...(స్నీహితుడా)
* తలచి తలచి చూస్తే... (7 G బృందావన్ కాలనీ )
* నువ్వేం మాయ చేసావో కానీ... (ఒక్కడు )
* ప్రేమించే ప్రేమవా ..(నువ్వు నేను ప్రేమ)
* నువ్వే నా శ్వాసా... (ఒకరికిఒకరు)
*వెళ్ళిపోతే ఎలా.... (duet with కీరవాణి-- ఒకరికిఒకరు )
* ప్రతిదినం నీ దర్శనం... (అనుమానాస్పదం -- duet with unni krishnan)
*ఆనందమా ఆరాటమా ..(duet with shankar mahadevan)
* సిరిసిరిమువ్వల్లే చిరుగాలికి చినుకల్లే (పెళ్ళైన కొత్తలో)


నేను Fm లో విని ఈ టపాకు కారణమైన ఈ పాట ఇక్కడ వినండి...




పాడింది: Shreya Ghoshal
సినిమా: పెళ్ళైన కొత్తలో
సంగీతం: అగస్త్య
రచన: వెన్నెలకంటి



సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, కురిసింది గుండెల్లో, వెన్నెలమ్మా...
చిన్నరి పాపల్లే, చిరునవ్వుల సిరిమల్లె, సరిగమలే పాడింది, కూనలమ్మా...
ఎద లోతులో అలజడి రేగె నాలో... మరి మరి ఎందుకో నిలిచెను ప్రేమ నాలో...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

కలలో ఒక రూపమే... కనులకు తెర తీసే... వెలిగించని దీపమే... తొలి జిలుగులు కురిసే...
అయినా మరి ఎందుకో తడబడినది మనసు... ఇది ఎమో ఏమిటో, అది ఎవరికి తెలుసు...
ఒక వింతగ పులకింతగ తొలి తలపే మది చాటుగా సడి చేసినదెందుకు...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

ఎదలో రసవీణలే... సరిగమలే పలికే... ఎదురై విరి వానలే... మధురిమలే చిలికే...
మాటాడే మౌనమే... కలకలములు రేపే ... వెంటాడే స్నేహమే... కలవరములు చూపే...
ఇది ఏమిటో, కథ ఏమిటో... తెలియని ఓ అనుమానమే... తెర తీసినదెందుకో...

సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, కురిసింది గుండెల్లో, వెన్నెలమ్మా...
చిన్నరి పాపల్లే, చిరునవ్వుల సిరిమల్లె, సరిగమలే పాడింది, కూనలమ్మా...
ఎద లోతులో అలజడి రేగె నాలో... మరి మరి ఎందుకో నిలిచెను ప్రేమ నాలో...
సిరి సిరి మువ్వల్లె, చిరుగాలి చినుకల్లె, చిరునవ్వుల పిలుపల్లె...

isn't it a lovely song...!!

18 comments:

రాధిక(నాని ) said...

తలచి తలచి చూస్తే,ప్రతిదినం నీదర్శనం నాకు ఇష్టమైన పాటలే కాని అవి శ్రేయా ఘోషల్ పాడిందనితెలియదు. మంచిటపా అండి.ఇదివరకు పాటలు కాసెట్ కొనుక్కొని వినేవాళ్లము .పాట రాసినవారు,పాడినవారు ఎవరో తెలిసేది. ఈ ఎంపి3వచ్చాక ఏమి తెలియుటలేదు .

గీతాచార్య said...

నందమా ఆరాటమా (duet with shankar mahadevan)

Oh what a song it is...

పట్టుకో పట్టుకో చెయ్యి దాటనివ్వకా ఇకనైనా... mesmerizing in that piece

మురళి said...

మిగిలిన పరభాషా గాయకులతో పోలిస్తే ఉచ్చారణ విషయంలో ఈ అమ్మాయి తీసుకునే శ్రద్ధ వంద రెట్లు మెరుగు.. అన్నట్టు మీరు 'బాణం' లో 'మోగిందీ జేగంటా..' పాట వినలేదా??

శేఖర్ పెద్దగోపు said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం...తెలుగు పాటల్లో భాషని ఖూనీ చేయకుండా పాడే అతికొద్ది మంది పరభాషా గాయకుల్లో శ్రేయ ఒకరు. ఈవిడ వాయిస్ కి చెవే కాదు మెడ* కోసుకోమన్నా కోసుకుంటాను నేను...అంతిష్టం ఆమె వాయిస్...

*Conditions Apply.

:)

జయ said...

మంచి సింగర్ గురించి చెప్పారు. Congratulations for 150 posts. All the best. Keep it up.

Raj said...

I like her song in kannada film "Mungaru Male" ( VAANA in telugu)...

Here are the lyrics...
"ivanu gelayanalla gelati nau modale alla
ivanu iniya nalla tumba saniha bandiha nalla"

Krishna said...

nice post. many interesting things to know abt shreya ghosal.thanks for sharing ur feelings .

నిషిగంధ said...

నాక్కూడా ఈ అమ్మాయి పాటలంటే సూపరిష్టమండి.. ZTV Sa Re Ga Ma Pa నించి ఆ అమ్మాయికి నేను ఎసి ని.. ఇప్పటికీ ఆ కాంపిటీషన్ వీడియోలు చూస్తుంటాను.. అసలు 'భైరి పియా..' పాటలో 'ఇష్ష్.." అని భలే అంటుంది కదా! అలానే తెలుగు పాటల్లో కూడా మిగతా పరభాషా గాయక/గాయనిలతో పోలిస్తే ఉఛ్చారణా దోషాలు చాలా తక్కువ! తెలుగులో నాకు బాగా నచ్చిన ఇంకో పాట సీతయ్యలోని 'సిగ్గేస్తుంది నిను చూస్తుంటే '.. భాష తెలియకపోయినా అవసరమైన చోటల్లా గొంతులో రొమాన్స్ పలికించిన తీరు అద్భుతం!

సంతోష్ said...

"preminche premava" song chala chala baaguntundi.
shreya telugu first song "nuvvem maya chesavo gaani(okkadu)" kooda...

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఆమెపాడిన పాటల్లో నాకుబాగా నచ్చేది 'రాఘవేంద్ర'లో "నమ్మిన నామది మంత్రాలయమేరా..."
వాళ్లనాన్న ఇంతకుముందు అణువిద్యుత్తుసంస్థలో పనిచేసేవారట. అవకాశాలకోసం వాలెంటరీ రిటైర్మెంటు తీసుకున్నారట. మాసీనియర్ కొలీగ్స్ కొద్దిమందికి బాగాదగ్గరి పరిచయం

సుభద్ర said...

good one ...
శ్రేయా కి మ౦చి భవిష్యత్తు ఉ౦ది..బాగా రాశారు..ఎక్కడ అ౦ట్లు..ఎక్కడ శ్రేయా అ౦తా చిత్ర౦ కదు!!నేను ఒక్కడులో శ్రేయా గొ0తు విని ఎవరా!!అని చుశాను..తరువాత తన గొ౦తు నాకు గుర్తు ఉ౦డిపొయి౦ది.

Hima bindu said...

chala bagundhi

తృష్ణ said...

@రాధిక: నిజమేనండీ. ఎంపి౩ లు,డౌన్లోడ్ లు వచ్చాకా పాటల వివరాలు మరుగునపడిపోతున్నాయి. ఐవరకు కేసెట్స్ ఒక్కటే ఉండేవి కాబట్టి విన్నప్పుడు వివరాలు చూస్తూండేవాళ్ళం...అవి గుర్తుండేవి కూడా..

@గీతాచార్య: వీలైతే ఈ పోస్ట్ చూడండి..
http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_18.html

ఈ పాట చాలా రోజులు నా రింగ్టోన్ గా ఉంది...:)
superb lyrics..i even liked this movie..

తృష్ణ said...

@మురళి: నేనా సినిమా చూడలేదండీ...గూగ్లమ్మనడిగి వెతికి వింటాను పాటను..

@శేఖర్: మెడ కోసుకోను (అమ్మో భయం..) కానీండి... నాక్కూడా ఈ అమ్మాయి గొంతు చాలా ఇష్టం.

తృష్ణ said...

@జయ: మీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియట్లేదండీ...టపాల సంఖ్య కూడా చూసి అభినందనలు తెలుపుతున్నారు....మీకెంతో ఋణపదడిపోతున్నాను...

@రాజ్: ఆ పాటకే అనుకుంటానండీ తనకి "సౌత్ ఫిల్మ్ ఫేర్" వచ్చింది ఓసారి..

తృష్ణ said...

@కృష్ణ: ధన్యవాదాలు...


@నిషిగంధ: "ఆ అమ్మాయికి నేను ఎసి ని.." నేను కుడా ఇలానే అనాలేమోనండీ....సీతయ్య లో పాట వినలేదండీ..వింటాను...
"ఇష్..." నిజంగా సూపరండీ...నాకూ ఇష్టమే...ఇష్...:)

@సంతోష్: నాకు నేను లిస్ట్ లో రాసిన శ్రేయ అన్ని పాటలూ బాగా నచ్చుతాయండీ..

తృష్ణ said...

@చైతన్య: అవును ఆయన భాభా అటోమిక్ రీసెర్చ్ సెంటర్ లో ఇంజనీర్ గా చేసారని చదివానెక్కడో.
"రాఘవేంద్ర"లో పాట తెలీదు. వినాలయితే..

@సుభద్ర: సంసారం సాగరం అన్నారందుకేనండీ మరి...

@చిన్ని: థాంక్స్ అండీ...

వేణూశ్రీకాంత్ said...

One of the best singers. others quote చేసినవి మీరు చెప్పినవి అన్ని పాటలు నాకు చాలా ఇష్టమైనవే...