సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, August 10, 2010

భరణిగారి "ఆటగదరా శివా !!"



బెడ్ రెస్ట్ లో ఉండటం వల్ల ఇతరత్రా ఇబ్బందుల సంగతి ఎలా ఉన్నా, ఒక ఉపయోగం ఉంది. ప్రశాంతంగా ఆటంకం లేకుండా పుస్తకాలు చదువుకోగలగటం. (దానివల్ల కళ్ళకు కూడా కొన్నాళ్ళు ఇబ్బంది కలిగింది.అది వేరే సంగతి..:)) ఇటీవలి అలా చదివిన వాటిల్లో ఒకటి తనికెళ్ళ భరణిగారి "ఆటగదరా శివా !!"

భరణిగారు రాసిన "నాలోన శివుడు కలడు" పాటల గురించి రాసినప్పుడు, ఆయన "ఆటగదరా శివా !!" (1999) అన్న శివతత్వాలు కూడా రాసారని తెలిసింది. అనుకోకుండా అది నాన్నగారి పుస్తకాల్లో ఈమధ్య దొరికింది. ఎంతో సరళమైన భాషలో, అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఉన్న శివతత్వాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఆట్ట మీది "బాపూగారి బొమ్మ", అట్ట వెనుక "వేటూరిగారి మాట(స్వదస్తూరీలో)" రెండూ ఎంతో ఆకట్టుకుంటాయి.

పుస్తకంలో నాకు బాగా నచ్చిన తత్వాలు కొన్ని ...

ఆటగదరా నీకు
మూడు కన్నులవాడ
ఆటగద
మాపైన సీతకన్ను.

***
ఆటగద బతుకంత
కాలకూటముగ్రక్కు
శుధ్ధి జేతువు గదా
తులసినీళ్ళు.

***
ఆటగదరా నీకు
అన్నపూర్ణప్రియా
ఆకలికి భిక్షాట
నాట నీకు.

***
ఆటగద అందాని
కజ్ఞాన మిచ్చేవు
జ్ఞాని కొసగేవు
వికృతరూపము.

***
ఆటగద మనవాడు
ఆటగద పైవాడు
అందరిని కలిపేది
వల్లకాడు.

***
ఆటగద సొంతాలు
ఆటగద పంతాలు
ఆటగద అంతాలు
ఆట నీకు.
***

ఆసక్తిగలవారు july10th/2010 hindu న్యూస్ పేపర్ లో వచ్చిన
తనికెళ్ళ భరణిగారి interview ఇక్కడ చూడచ్చు.

10 comments:

హరే కృష్ణ said...

చాలా బావుంది
thanks for sharing

జయ said...

హమ్మయ్యా... ఇప్పటికి మా అసలైన తృష్ణ వచ్చేసినందుకు చాలా సంతోషం గా ఉంది. ఇంక తృష్ణ రాసిన తత్వాల సంగతి చెప్పేదేముంది. అవికూడా బాగున్నాయి.
ఆటగద మనవాడు
ఆటగద పైవాడు
అందరిని కలిపేది
వల్లకాడు....ఇది నాకు చాలా నచ్చింది.

Afsar said...

bharani gaari iteevali kavitwame oka shock naaku.

mallee meeru ivi koodaa parichayam chesi, aa shock inkaasta teevram ayyettu chesaaru.

baagumdi nijamgaa...

afsar
www.afsartelugu.blogspot.com

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

వ్యాఖ్యలేమి రాయాలో అర్థంకావట్లేదు, చాలాచాలా బావుంది. చదువుతుంటే "ఆదిభిక్షువు వాడినేమి కోరేది" గుర్తొచ్చింది. "అన్నపూర్ణప్రియా
ఆకలికి భిక్షాట
నాట నీకు."

మనసు పలికే said...

చాలా చాలా బాగుంది తృష్ణ గారు..! సుబ్రహ్మణ్య చైతన్య గారు చెప్పినట్లుగా, నాక్కూడా ఆది భిక్షువాడి నేది కోరేదీ పాట గుర్తొచ్చింది చదువుతున్నంత సేపూ.. తనికెళ్ల భరణి గారు ఇంత బాగా రాస్తారని నాకు తెలియదు..:(

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

శివుడి తలమీద నెలవంక బదులుగా నెమలీక హహహహ. శివకేశవ ఏకత్వం :)

Bhãskar Rãmarãju said...

సానా బాగుంది....

అడ్డ గాడిద (The Ass) said...

One of the few blogs I liked most. Thanks that you are back. Nice post

మాలా కుమార్ said...

బాగుంది . తిరిగి బ్లాగ్ లో కలుస్తునందుకు సంతోషం గావుంది .

Sky said...

నమస్తే,

భరణీ గారితో నాకున్న అనుబంధాన్ని పంచుకుందామని ఈ టపా చూడగానే అనిపించింది.

ఆటకదరా శివా పుస్తకం నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు మొదటిసారి చదివాను. హాసం పత్రికలో వారు రాసిన ఎందరో మహానుభావులు శీర్షిక ఒక్కటి కూడా వదలకుండా చదివాను.

గత సంవత్సరం పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగు వారి స్టాల్ కి వచ్చి మా అందరితో ముచ్చటించారు. ఆ తర్వాత డిసెంబర్ 31 న మాకు ఫోన్ చేసి మరీ వారింటికి ఆహ్వానించారు. శివతాత్వాలను వారు పాడి మాకు వినిపించారు- వారు రాసిన "నాలోన శివుడు కలడు" పాడినప్పుడు ఒంట్లో ఏదో తెలియని వైబ్రేషన్స్. ఆ లింక్ ఇక్కడ ఇస్థున్నాను- విని ఆనందించండి.

http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=AD000128

తిరిగి వస్తుంటే వారు రాసిన ఆతకదరా శివా, ఎందరో మహానుభావులు, పరికిణీ పుస్తకాలు సంతకం చేశి ఆశిర్వదించి మాకు ఇచ్చారు. ఒక ముఖ్య విషాయమై నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు వారికి ఫోన్ చేస్తె ఓ తండ్రిలా మంచి సలహా ఇచ్చి ఓ పెద్ద ఇబ్బంది నుండి నన్ను తప్పించారు.

సినిమాల్లో భరణిగారి నటనకన్నా వారి ఇంటిలో కనపడ్డ పదివేల పుస్తకాలు వారి పాందితీ ప్రకర్ష ఏమిటో తెలియజేస్తాయి.

ఎందరో మహానుభావులు- అందులో భరణి గారు ఒక్కరు

-సతీష్ యనమండ్ర